కేఏ పాల్‌ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు? | KA Paul With Actor Naveen Polishetty Video Viral | Sakshi
Sakshi News home page

Navin Polishetty: అనుకోకుండా కేఏ పాల్‌ని కలిసి.. ఆ పని చేసి!

Published Mon, Aug 28 2023 2:50 PM | Last Updated on Mon, Aug 28 2023 3:22 PM

KA Paul With Actor Naveen Polishetty Video Viral - Sakshi

నవీన్ పొలిశెట్టి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా పరిచయం ఎందుకంటే 'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. ఆ తర్వాత ఇతడు హీరోగా నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హీరో నవీన్ పొలిశెట్టి.. ప్రముఖ నాయకుడు కేఏ పాల్‌ని కలవడం ఆసక్తికరంగా అనిపించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?)

నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలి అనుకునే ఓ మధ్య వయసు లేడీ.. ఓ కుర్రాడితో ట్రావెల్ అయితే చివరకు ఏం జరిగిందనేదే స్టోరీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ని జోరుగా చేస్తున్న నవీన్.. తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నీ తిరిగేస్తున్నాడు. అలా ఆదివారం వైజాగ్‌లో సందడి చేశాడు.

అయితే వైజాగ్ బీచ్ రోడ్‌లో వెళ్తుండగా అనుకోకుండా అక్కడే ఓ కారులో కేఏ పాల్ కూడా షికారుకి వచ్చారు. దీంతో మరో కారులో ఉన్న నవీన్ పొలిశెట్టి.. ఆయనకు హాయ్ చెప్పగా, తిరిగి కేఏ పాల్ కూడా పలకరించారు. అలా కాసేపు దూరం నుంచే మాట్లాడుకున్న ఈ ఇద్దరికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లిద్దరితో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేయండని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement