ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! | Naveen Polishetty Interesting Comments On Miss Shetty Mr Polishetty - Sakshi
Sakshi News home page

Naveen Polishetty: మీకు అంతకుమించి ఏమి ఇవ్వలేం: నవీన్ పోలిశెట్టి

Published Mon, Sep 4 2023 7:29 AM

Naveen Polishetty Interesting Comments On Ms Shetty Mr Polishetty - Sakshi

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాల్లో నవీన్ పోలిశెట్ అభిమానులను కలిసి సందడి చేశారు. త్వరలోనే అమెరికాలోనూ సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో నవీన్‌ పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

నవీన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్‌కు ఎక్కువ టైం పట్టింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులే వల్ల మూవీ రిలీజ్ ఆలస్యమైంది. ఈ విషయంలో మన్నించాలని ప్రేక్షకులను కోరుతున్నా. మీరు చూపించే ప్రేమకు మంచి సినిమాను తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ సోమవారం ఉదయం నుంచి ప్రారంభవుతాయి.' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో స్టాండప్‌ కమెడియన్‌గా నవీన్‌, చెఫ్‌గా అనుష్క కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ కాగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

అమెరికాలో ప్రమోషన్స్

నవీన్ పోలిశెట్టి అమెరికాలో కూడా తన సినిమాను ప్రమోట్‌ చేసేందుకు వెళ్లనున్నారు. డల్లాస్‌లో ఈ నెల 6వ తేదీన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement