ఫన్‌ పార్టీ | VJ Sunny Sound Party: Title logo launched by film journalists | Sakshi
Sakshi News home page

ఫన్‌ పార్టీ

Published Thu, Jun 29 2023 4:21 AM | Last Updated on Thu, Jun 29 2023 4:21 AM

VJ Sunny Sound Party: Title logo launched by film journalists - Sakshi

వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్‌ జంటగా సంజయ్‌ శేరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. దర్శకుడు వి. జయశంకర్‌ సమర్పణలో రవిపొలిశెట్టి నిర్మించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా టైటిల్‌ లోగో విడుదల పాత్రికేయుల చేతుల మీదగా జరిగింది.

ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘సౌండ్‌ పార్టీ’ చిత్రం థియేటర్స్‌లో గట్టిగా సౌండ్‌ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఫుల్‌ ఫన్‌ రైడ్‌ చిత్రం’’ అన్నారు సంజయ్‌ శేరి. ‘‘పాతిక రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ఇది మా యూనిట్‌కు, వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు రవి పొలిశెట్టి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement