సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాత మరో క్రేజ్ ప్రాజెక్ట్ రానుంది. ఇప్పటికే ఆయన అడవి శేషు హీరోగా ‘మేజర్’ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన యువ హీరో నవిన్ పోలిశెట్టి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీని నిర్మించనున్నట్లు తాజా సమాచారం. పూర్తి ఎంటర్టైన్‌మెంట్‌తో ప్లాన్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరుగినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
ఇక పూర్తి తారాగాణాన్ని నిర్ణయించాకే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. కాగా ఆయన నటించిన శ్రీమంతుడుతోనే మహేశ్ నిర్మాతగా మారారు. అయితే ఇందులో స్టీపింగ్ పార్టనర్‌గా ఉన్న ఆయన ‘మేజర్’తో నిర్మాతగా పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ మూవీని సోనీ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు. ఆయన స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీని జూలై 2వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి:
‘ఆదిపురుష్’ డైరెక్టర్ కండీషన్
పూజను మిస్సయ్యా.. బాధగా ఉంది :పూజా హెగ్డే
ప్రభాస్‌కు పోటీగా మహేశ్ ‘రామాయణం’.. సీతగా స్టార్ హీరోయిన్!
Comments
Please login to add a commentAdd a comment