నో చెప్పిన చెర్రీ‌.. మహేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌! | Ram Charan Rejects Venky Kudumula Story But Is Mahesh Babu Accept it | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌ నో చెప్పిన కథకు మహేష్‌ ఓకే?

Published Fri, Dec 4 2020 2:51 PM | Last Updated on Fri, Dec 4 2020 5:13 PM

Ram Charan Rejects Venky Kudumula Story But Is Mahesh Babu Accept it - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన తదుపరి చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచానాలే నెలకొన్నాయి. మహానటి ఫేం కీర్తి సురేష్‌ ఈ సినిమాతో తొలిసారి మహేష్‌తో జోడీ కట్టనున్నారు. గీతా గోవిందం దర్శకుడు పరుశురామ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మహేష్‌కు సంబంధించిన ఓ వార్త వినిపిస్తోంది. సర్కారు వారి పాట సినిమా అనంతరం మహేష్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. నితిన్‌, రష్మిక మందన కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ సూపర్‌ హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల ఓ సరికొత్త కథతో రామ్‌ చరణ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే అందులో తన పాత్ర నచ్చకపోవడంతో చరణ్‌ ఈ సినిమాకు నో చెప్పాడట. చదవండి: మహేష్‌కు బ్యాంక్‌ రెడీ అవుతోంది!

దీంతో వెంటనే వెంకీ సూపర్‌ స్టార్‌ మహేష్‌ వద్దకు వెళ్లి కథ వినిపించినట్లు వినికిడి. తరువాత కథ విన్న మహేష్‌ ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే వీరిద్దరి కలయికలో త్వరలోనే ఓ సినిమా వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయాలపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రామ్‌ చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం,రణం, రుధిరం) చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం వంశీ పైడిపల్లి దర్వకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. చదవండి: ఆచార్య: భారీ సెట్‌.. అన్ని కోట్ల ఖర్చా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement