![SSMB29: SS Rajamouli Bans Plastic Water Bottle On Sets](/styles/webp/s3/article_images/2025/02/16/ss-rajamouli.jpg.webp?itok=OrcfDqcR)
రాజమౌళి(SS Rajamouli )తో సినిమా అంటే నటీనటులు ఎంత ఇష్టపడతారో అంతే భయపడతారు కూడా. ఒక్కసారి ఆయనతో సినిమా కమిట్ అయితే చాలు.. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు ఆయన మాట వినాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే జక్కన్న పెట్టే కండీషన్స్ ఫాలో అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు మహేశ్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే షూటింగ్ కూడా ప్రారంభమైంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
భారీ బడ్జెట్ మూవీ కాబట్టి… ఖర్చుల దగ్గర జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అనవసరపు ఖర్చులు తగ్గించి, ఆ డబ్బంతా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో జక్కన్న ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెట్‌లో ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేదించారట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ని సెట్‌లోకి అనుమతించట్లేదట. మహేశ్‌బాబుతో సహా ప్రతి ఒక్కరు ఈ రూల్‌ని పాటించాల్సిందేనట.
నిర్మాతలకు రూ.కోటి వరకు సేఫ్
రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్‌లో రోజుకు దాదాపు రెండు వేల మంది వరకు పాల్గొంటున్నారట. అంత మందికి వాటర్ బాటిళ్లు అందించడం అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే సెట్‌లో గాజు బాటిళ్లను ఏర్పాటు చేయిస్తున్నారట. దాహం వేస్తే ప్రతి ఒక్కరు దీనితోనే నీళ్లు తాగాలట. పర్సనల్‌గా తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండొద్దని చెప్పారట.
అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడలని చెప్పారట. వీలైనంత వరకు ప్లాస్టిక్‌ని నిషేదించాలని యూనిట్‌ని ఆదేశించారట. దీని వల్ల నిర్మాతకు దాదాపు రూ. కోటి వరకు సేఫ్ అవుతుందట. ఈ నిర్ణయం కారణంగా డబ్బు ఆదా అవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లు అవుతుందని జక్కన్న ప్యామిలీ భావిస్తుందట. ఈ ఆలోచన కీరవాణి సతీమణి వల్లీకి వచ్చిందట. ఆమె చెప్పడంతోనే రాజమౌళి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేదించారట.
మహేశ్ సినిమాకు టైటిల్ కష్టాలు..
మహేశ్- రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత తాను మహేశ్‌తో సినిమా చేస్తున్నానని రాజమౌళి ప్రకటించినప్పటికీ.. కథ అప్పటికీ ఫిక్స్ కాలేదు. ఆర్‌ఆర్‌ఆర్ రిలీజైన కొద్ది రోజులకి ఈ కథపై దృష్టి పెట్టాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం జక్కన్నకు ఇంకా క్లారిటీ రాలేదట.
గతంలో గరుడ, మహారాజ్ లాంటి టైటిల్స్ వినిపించినా... ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతం షూటింగ్ చేస్తూనే టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉంది జక్కన్న టీమ్. టైటిల్ పెట్టే వరకు మీడియాకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించొద్దని రాజమౌళి ఆదేశించారట. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్‌ని ప్రారంభించారు. టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత చిన్న టీజర్‌ని రిలీజ్ చేస్తూ టైటిల్‌ని వెల్లడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.
Comments
Please login to add a commentAdd a comment