Viral: Venky Kudumula As Assistant Director For Mahesh Babu And Trivikram Movie - Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌: అసిస్టెంట్‌గా యంగ్‌ డైరెక్టర్‌!

Published Wed, May 5 2021 9:07 AM | Last Updated on Wed, May 5 2021 10:58 AM

Venky Kudumula Turns Assistant Director For Trivikram Movie - Sakshi

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసి, ‘ఛలో’తో దర్శకుడిగా మారారు వెంకీ కుడుముల. ఆ తర్వాత ‘భీష్మ’ వంటి హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు మళ్లీ గురువు దగ్గర ఓ సినిమాకి దర్శకత్వ శాఖలో చేయనున్నారట వెంకీ. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకే వెంకీ పని చేయనున్నారట. రెండు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఓ దర్శకుడు... మళ్లీ దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పని చేయడం ఏంటీ అనుకోవచ్చు.

త్రివిక్రమ్‌ దగ్గర సీనియర్‌ కో–డైరెక్టర్‌గా చేస్తూ వచ్చిన సత్యం ఇటీవల కరోనాతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో చేయమని వెంకీని చిత్రనిర్మాత రాధాకృష్ణ కోరారట. వెంకీ ‘భీష్మ’కు నిర్మాత ఆయనే. పైగా తన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రానికి ఇంకా టైమ్‌ ఉండటం, కరోనా పరిస్థితుల్లో చిత్రీకరణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడంతో వెంకీ కూడా ఈ సినిమాకి ప్రస్తుతం స్క్రిప్ట్‌పరమైన చర్చల్లో పాల్గొంటున్నారని సమాచారం.

చదవండి: కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్‌.. కారణం ఇదేనట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement