సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన ప్యాన్స్‌కి షాకింగ్ న్యూస్ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు. అతడు, ఖలేజా లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. మహేశ్‌బాబు మాస్ యాక్షన్, డ్యాన్స్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో నెక్లెస్ పాటతో పాటు కుర్చి సాంగ్ ఉండాలని ముందే నిర్ణయించుకున్నామని మహేశ్ అన్నారు.
(చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్.. అసలు విషయం బయటపెట్టిన సూపర్ స్టార్)
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ మరిన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ‘గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్ సాంగ్స్ ఉండాలని నేను, త్రివిక్రమ్ ముందుగానే అనుకున్నాం. ఈ మూవీ తర్వాత తెలుగులో సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు. బహుశా ఇదే నా చివరి తెలుగు చిత్రం కావొచ్చు. అందుకే మాస్ సాంగ్స్ ఉండాలనుకున్నాం.
ఈ మూవీలోనే నా డ్యాన్స్ అంతా చూపించాలనుకున్నాను. కుర్చి సాంగ్.. నా కెరీర్ బెస్ట్ కావాలని శేఖర్ మాస్టర్‌తో చెప్పాను. ఆయన అలాంటి స్టెప్పులే కంపోజ్ చేశాడు. శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేయడానికి మొదట్లో టెన్షన్ పడ్డాను. నెక్లెస్ పాట షూటింగ్ అయితే ముందే పూర్తి చేశాం. ఆ తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. కుర్చి సాంగ్ రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు(డిసెంబర్ 22)పూర్తి చేశాం. చాలా అద్భుతంగా అనిపించింది. నా కెరీర్ బెస్ట్ సాంగ్ ఇదే’ అని మహేశ్ అన్నారు. ప్రస్తుతం మహేశ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో ‘ఇదే ఆఖరి సినిమా కావచ్చు అంటే ఆయన ఇకపై తెలుగు సినిమాలు చేయరా’ అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మహేశ్ చెప్పింది నిజమే!
మహేశ్‌బాబు మరో రెండు,మూడేళ్ల వరకు తెరపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే తన తదుపరి సినిమా రాజమౌళితో చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు రాజమౌళి. ఈ సినిమా రిలీజ్‌కి దాదాపు రెండేళ్లు పట్టొచ్చు. ఆ తర్వాత మహేశ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం గ్యారెంటీ.
దీంతో మహేశ్ బాబు తదుపరి ఎలాంటి చిత్రం చేసినా.. అది పాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉన్న చిత్రాలే చేయాలి. తెలుగు సినిమాల మాదిరి ఆ చిత్రాల్లో మాస్ సాంగ్స్, డ్యాన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అది దృష్టిలో పెట్టుకోనే.. గుంటూరుకారంలో తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులను నచ్చే సాంగ్స్, స్టెప్పులు ఉండేలా మహేశ్ జాగ్రత్త పడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment