గుంటూరు కారం కలెక్షన్స్‌.. ఆల్​టైమ్ రికార్డ్ సెట్‌ చేసిన మహేశ్‌ | Guntur Karam Movie Box Office Collection Creates All-Time Record | Sakshi
Sakshi News home page

Guntur Karam Movie Collection: గుంటూరు కారం కలెక్షన్స్‌.. ఆల్​టైమ్ రికార్డ్ సెట్‌ చేసిన మహేశ్‌

Published Fri, Jan 19 2024 11:21 AM | Last Updated on Fri, Jan 19 2024 11:28 AM

Guntur Karam Movie Collection All Time Record Create - Sakshi

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్‌ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం తొలి వారంలో రూ. 212 కోట్లు వసూల్‌ చేసినట్లు అఫీషియల్‌గా చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

ప్రాంతీయ భాషలో మాత్రమే విడుదలైన గుంటూరు కారం చిత్రం కలెక్షన్స్‌ పరంగా అరుదైన రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. రిజనల్‌ ఫిల్మ్ పరంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. మహేశ్ బాబు కెరీర్​లో రూ.200+ గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో మహేశ్‌ బాబు చిత్రాలు ఐదు ఉన్నాయి. టాలీవుడ్‌లో ఈ రికార్డ్‌ మహేశ్‌ పేరుతో మాత్రమే ఉంది.

ఈ సినిమా మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement