Mahesh Babu Ready To Shoot For 'Guntur Kaaram' Movie Spot - Sakshi
Sakshi News home page

Guntur Kaaram Movie: ట్రెండింగ్‌లో మహేశ్‌ బాబు ఫోటో

Published Thu, Aug 17 2023 9:46 AM | Last Updated on Thu, Aug 17 2023 10:31 AM

Mahesh Babu Ready To Guntur Kaaram Movie Spot - Sakshi

టాలీవుడ్‌ హీరో ప్రిన్స్‌ మహేష్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు.  సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి ఇటీవలే వెకేషన్​కు వెళ్లిన ఆయన.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు.

(ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్‌ వైరల్‌ కామెంట్స్‌)

తాజాగ  ఆయన జిమ్​లో వర్కౌట్స్​ చేస్తూ కనిపించారు. ఆ ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేశారు. కొత్త సినిమా కోసమే మహేశ్‌ ఇదంతా చేస్తున్నారని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట  ట్రెండ్​ అవుతోంది. నేటి నుంచి గుంటూరు కారం సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుందట. శుక్రవారం ఆగష్టు 18 నుంచి మహేశ్​ బాబు కూడా సెట్స్​లోకి రానున్నట్లు సమాచారం.

అతడు, ఖలేజ' తర్వాత త్రివిక్రమ్- మహేశ్​ చేస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం' కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు బర్త్​డే సందర్భంగా రిలీజైన ​ పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. షూటింగ​ విషయంలో చాలా ఆలస్యం అవుతుందని ఫ్యాన్స్‌ నిరుత్సాహంగా ఉంటున్న సమయంలో మహేశ్‌ చేసిన ఈ పోస్ట్‌తో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ముందుగా అనుకున్నట్లే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement