collections record
-
చైనాలో 'మహారాజా' రెండు రోజుల కలెక్షన్స్.. భారీ రికార్డ్
భారతీయ సినిమాలు చైనాలో కూడా ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విజయ సేతుపతి నటించిన మహారాజా చిత్రం కూడా చైనాలో సత్తా చాటుతుంది. నవంబర్ 29న సుమారు 40 వేలకు పైగా థీయేటర్స్లలో ఈ చిత్రం విడుదలైంది. కరోనా తర్వాత చైనాలో విడుదలైన భారతీయన సినిమాలలో మహారాజా మాత్రమే అక్కడ రానిస్తుంది. మహారాజా చైనా రోజువారీ బాక్స్ ఆఫీస్ ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో నిలిచింది.చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. చైనాలోని ప్రముఖ చలనచిత్ర సమీక్ష వెబ్సైట్లలో ఒకటైన డౌబన్‌లో మహారాజా సినిమాకు 8.7/10 రేటింగ్‌ను ఇచ్చింది. ఇటీవలి కాలంలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిందని అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే, ఫైనల్‌గా చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.'మహారాజ' చిత్రాన్ని నితిలన్ సామినాథన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో దుమ్మురేపుతుంది. -
గుంటూరు కారం కలెక్షన్స్.. ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసిన మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం తొలి వారంలో రూ. 212 కోట్లు వసూల్ చేసినట్లు అఫీషియల్‌గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రాంతీయ భాషలో మాత్రమే విడుదలైన గుంటూరు కారం చిత్రం కలెక్షన్స్ పరంగా అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. రిజనల్ ఫిల్మ్ పరంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. మహేశ్ బాబు కెరీర్లో రూ.200+ గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా రూ. 100 కోట్ల క్లబ్లో మహేశ్ బాబు చిత్రాలు ఐదు ఉన్నాయి. టాలీవుడ్లో ఈ రికార్డ్ మహేశ్ పేరుతో మాత్రమే ఉంది. ఈ సినిమా మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 sets the BOX-OFFICE ablaze!! 🔥🕺#GunturKaaram grosses over a SMASHING 𝟐𝟏𝟐 𝐂𝐑 Worldwide in it’s 1st Week ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 (Highest for a regional cinema)💥💥 Watch #BlockbusterGunturKaaram at… pic.twitter.com/KyXpMsIwHf — Haarika & Hassine Creations (@haarikahassine) January 19, 2024 -
రూ.500కోట్ల క్లబ్లో సలార్.. మరో వంద కోట్లు వస్తే
ప్రభాస్ నటించిన సలార్ కలెక్షన్స్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో షారుక్ ఖాన్ డంకీ చిత్రాన్ని తట్టుకుని అక్కడ కూడా భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. సినిమా విడుదలయ్యి ఇప్పటికి మొదటి వారం పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్‌ను సలార్ అందుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే సలార్ రూ.1000 కోట్ల టార్గెట్‌ను కూడా రీచ్ అవుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వంద కోట్లు వస్తే సేఫ్ మార్క్ ప్రపంచవ్యాప్తంగా సలార్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 400 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్‌ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే సలార్ ఖాతాలో రూ. 500 కోట్లు వచ్చేశాయి. మరో రూ. 100 కోట్లు సలార్‌కు వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్- ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం సలార్.. రెండు పార్టులుగా రానున్న ఈ చిత్రం డిసెంబర్ 22న మొదటి భాగం విడుదలైంది. ఈ మూవీలో ప్రభాస్ మాస్ యాక్షన్ సీన్స్‌తో పాటు భారీ ఎలివేషన్స్ అభిమానులను మెప్పిస్తున్నాయి. దీని కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్‌తో థియేటర్లకు వెళ్తున్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
2023 టాలీవుడ్లో టాప్-10 కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు
కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. మరో వారంలో 2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పేసి కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెట్టేస్తాము. ఇలాంటి సమయంలో గడిచిపోయిన సంవత్సరంలో మనమేం సాధించాం..? ఏం నష్టపోయాం..? అనే లెక్కలు వేసుకోవడం సహజం. సినిమా అనేది అందరినీ ఎంటర్టైన్ చేసే విభాగం.. అందుకే ఈ పరిశ్రమపై ప్రేక్షకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలున్నా కేవలం బాలీవుడ్‌కు మాత్రమే అందరూ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అక్కడి చిత్రాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ నటించిన వారికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. దీంతో మిగిలిన చిత్ర పరిశ్రమల పేర్లు కూడా అందరికీ తెలిసేవి కావు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బాలీవుడ్‌కు పోటీగా టాలీవుడ్ చిత్రపరిశ్రమ మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా 2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్-10లో ఉన్న చిత్రాల గురించి ఒకసారి చూద్దాం. కేవలం ఈ కలెక్షన్స్ వివరాలు టాలీవుడ్ పరిధి అంటే రెండు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గమనించగలరు. 1. 'వాల్తేరు వీరయ్య' మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో రవితేజ కీ రోల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్లో రూ. 160 కోట్ల రాబట్టి 2023లో విడుదలైన చిత్రాల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ పరంగా టాప్-1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 2. ఆదిపురుష్- ప్రభాస్ రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. 'ఆదిపురుష్'. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 393 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 133 కోట్లు రాబట్టింది. టాలీవుడ్లో 'వాల్తేరు వీరయ్య' కంటే కలెక్షన్స్ పరంగా 'ఆదిపురుష్' వెనకపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో ఉన్నా కూడా టాలీవుడ్లో మాత్రం రెండో స్థానానికి పరిమితం అయింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 3. వీరసింహా రెడ్డి - బాలకృష్ణ 2023 సంక్రాంతి బరిలో 'వీరసింహా రెడ్డి'తో బాలకృష్ణ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'కు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఈ రేసులో మెగాస్టారే పైచేయి సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 134 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 97 కోట్లు రాబట్టి మూడో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 4. భగవంత్ కేసరి- బాలకృష్ణ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో బాలయ్య రెండు హిట్ సినిమాలను అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 85 కోట్లు రాబట్టి నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 5. 'బ్రో'- సాయిధరమ్ తేజ్,పవన్ కల్యాణ్ సాయిధరమ్ తేజ్ ప్రధాన కథానాయకుడిగా పవన్ కల్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దీనిని డైరెక్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 114 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 82 కోట్లు రాబట్టి ఐదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 6. దసరా- నాని నాని పాన్ ఇండియా హీరోగా దసరా చిత్రంతో పరిచయం అయ్యాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కీర్తి సురేశ్ ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. నానికి ఇది తొలి పాన్ ఇండియా చిత్రంకావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 118 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 76 కోట్లు రాబట్టి ఆరో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 7. జైలర్- రజనీకాంత్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 604 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 68 కోట్లు రాబట్టి ఏడో స్థానం దక్కించుకుంది. రజనీకాంత్ కెరియర్లో ఆల్‌టైమ్ హిట్‌గా జైలర్ నిలిచింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 8.'బేబీ'- ఆనంద్ దేవరకొండ 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ప్రేమ కథా చిత్రం 'బేబీ' . సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్‌ను భారీగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 81 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 64 కోట్లు రాబట్టి ఎనిమిదో స్థానం దక్కించుకుంది. 9. విరూపాక్ష- సాయిధరమ్ తేజ్ సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' . శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్గా నటించింది. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతినిచ్చిన ఈ సినిమా సాయిధరమ్ తేజ్‌కు బిగ్గెస్ట్ను ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 89 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 63 కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 10. సలార్- ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా సలార్ ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతానికి (డిసెంబర్ 23) టాలీవుడ్లో రూ. 101కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన టాప్ టెన్ లస్ట్‌లో మూడో స్థానానికి సలార్ చేరుకున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద సలార్ కలెక్షన్స్ దూకుడు భారీగానే కొనసాగుతుంది. దీంతో సలార్ కలెక్షన్స్ క్లోజింగ్ అయ్యే సరికి టాప్-1 లోకి కూడా రావచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ డిజిటల్ రైట్స్‌ను సుమారు రూ.160 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలను ప్రముఖ సినీ ట్రేడ్ వర్గాల ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. -
సలార్ ముందు ఎన్నో భారీ రికార్డ్స్.. ఢీ కొట్టగలడా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. నేడు (డిసెంబర్ 22) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సలార్ అర్ధరాత్రి నుంచే థియేటర్లోకి వచ్చేశాడు. దీంతో అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్టుకోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సలార్‌కు వస్తున్న టాక్ చూస్తుంటే ప్రభాస్ భారీ హిట్ట్ కొట్టాడని తెలుస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో సలార్‌కు పాజిటివ్ టాక్ వస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సలార్ ఈ రికార్డ్స్ కొట్టగలడా..? ఈ ఏడాదిలో విజయ్,షారుక్ ఖాన్,రణబీర్ కపూర్ చిత్రాలు భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ స్టార్ హీరోల చిత్రాలు విడుదలైన మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్ చేశారు. నేడు విడుదలైన సలార్ ఆ రికార్డ్స్‌ను దాటగలుగుతాడా అని చర్చ జరుగుతుంది. దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి. ఆ తర్వాత షారుఖ్ "జవాన్" మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 129.6 కోట్లు వసూలు చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'యానిమల్' చిత్రం కూడా మొదటిరోజు రూ. 116 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ. 223 కోట్ల గ్రాస్‌గా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తాజాగా విడుదలైన సలార్ మొదటిరోజు కలెక్షన్స్ పరంగా ఏ రికార్డ్ కొట్టగలుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. కానీ సలార్ మొదటిరోజు కలెక్షన్స్ రూ. 150 కోట్లు దాటుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ. 600 కోట్లు సేఫ్ మార్క్ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సలార్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 350 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్‌ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సలార్‌కు రూ.150 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని టాక్ ఉంది. (ఇదీ చదవండి: Salaar X Review: ‘సలార్’మూవీ ట్విటర్ రివ్యూ) ఇదే నిజమైతే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రూ.250 కోట్లు మేర గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. ఇక సౌత్ ఇండియాలో మిగిలిన రాష్ట్రాల్లో రూ.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. హిందీ వర్షన్ హక్కులు మాత్రం రూ.75 కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్. ఏదేమైనా సలార్ ఫుల్ రన్లో టార్గెట్ రూ. 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సలార్‌కు వస్తున్న టాక్ చూస్తుంటే చాలా రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం అని తెలుస్తోంది. -
థియేటర్లలో మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తున్న సినిమాలు ఇవే..
హారర్ చిత్రాలంటే వెన్నులోంచి టెర్రర్ పుట్టాల్సిందే. అలా క్షణ క్షణం భయపడుతూ హారర్ చిత్రాలు చూడటంలో చాలామందికి ఓ కిక్ దొరుకుతుంది. ఆ భయమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడలా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, వసూళ్లు రాబట్టడానికి కొందరు హారర్ చిత్రాలు చేస్తున్నారు. ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం. భ్రమ యుగంలో... సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో రకాల సినిమాల్లో నటించారు మమ్ముట్టి. ఈ ప్రయాణంలో ΄పొలిటికల్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్.. ఇలా ఎన్నో జానర్స్‌ను టచ్ చేశారాయన. తాజాగా ‘భ్రమ యుగం’ అనే హారర్ ఫిల్మ్‌లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథతో రాహుల్ సదా శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. హారర్ రాజా లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో సాగే చిత్రాలు చేస్తున్నప్పటికీ ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లోనే నటిస్తారు ప్రభాస్. అయితే తొలిసారి ప్రభాస్ హ్యూమర్‌తో కూడిన హారర్ అంశాలు ఉండే ఓ సినిమాలో నటిస్తున్నారు. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’, ‘వింటేజ్ కింగ్’, ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీ రోల్లో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టైటిల్, రిలీజ్‌లపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రముఖి తిరిగొస్తే.. హారర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ‘చంద్రముఖి’ని అంత సులభంగా మర్చిపోలేరు. వెంకటపతి రాజుగా రజనీకాంత్, చంద్రముఖిగా జ్యోతిక వెండితెరపై ప్రదర్శించిన నటన అలాంటిది. ఇప్పుడు ‘చంద్రముఖి’ మళ్లీ వస్తోంది. కానీ రజనీ, జ్యోతికలు రావడం లేదు. ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా రూ΄పొందిన ‘చంద్రముఖి 2’లో రజనీ, జ్యోతికల స్థానాల్లో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే ‘చంద్రముఖి 2’ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. భైరవకోనలో ఏం జరిగింది? ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ప్రేక్షకులను భయపెడుతూ, కథలో వీలైనప్పుడు నవ్వించారు దర్శకుడు వీఐ ఆనంద్. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ఊరుపేరు భైరవకోన’. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో హారర్ అండ్ సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. భైరవకోన అనే ఊర్లో జరిగే కొన్ని కల్పిత ఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం సాగనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మంత్రం.. తంత్రం.. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న తెలుగు కథానాయికల్లో అనన్య నాగళ్ల ఒకరు. అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న ఈ బిజీ అమ్మాయి లిస్ట్‌లో ‘తంత్ర’ అనే ఓ హారర్ ఫిల్మ్ కూడా ఉంది. తాంత్రిక శాస్త్రం, పురాణ గాధల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ చిత్రదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి పేర్కొన్నారు. ధనుష్ (దివంగత నటుడు శ్రీహరి తమ్ముడు కొడుకు) నటుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ మంచి దెయ్యం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’.. ఇలా హీరోయిన్ నందితా శ్వేతకు హారర్ జానర్లో నటించిన అనుభవం ఉంది. ఈ క్రమంలో నందితా శ్వేత చేసిన మరో హారర్ ఫిల్మ్ ‘ఓఎమ్‌జీ’. ‘ఓ మంచి ఘోస్ట్’ ఉపశీర్షిక. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ఈ సినిమాలో ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరి.. మంచి దెయ్యంగా నందితా శ్వేత ఏ రేంజ్లో భయపెడతారో చూడాలి. కేరాఫ్ దెయ్యం గ్రామాల్లో ఒకప్పుడు మాతంగులుగా జీవించిన వారి జీవితాల ఆధారంగా రూ΄పొందుతున్న హారర్ ఫిల్మ్ ‘భయం కేరాఫ్ దెయ్యం’. ఈ చిత్రంలో ఓ మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా రవిబాబు, తాంత్రికుడిగా సత్యప్రకాష్ నటిస్తున్నారు. సీవీఎమ్ వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూ΄పొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తంతిరం హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథాచిత్రం ‘తంతిరం’. భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితం అవుతుందనేది ఈ సినిమా కథాంశం. మెహర్ దీపక్ దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ కేరళలో జరి గింది. శ్రీకాంత్, ప్రియాంక లీడ్ రోల్స్ చేశారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు.. హారర్ జానర్లో ప్రేక్షకులను భయ పెట్టే మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
జీఎస్టీ వసూళ్లు @ రూ.1.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడో నెల మేలో కూడా రూ. 1.50 లక్షల కోట్లు దాటాయి. సమీక్షా నెల్లో (2022 మే నెలతో పోల్చి) 12 శాతం వృద్ధితో రూ. 1.57 లక్షల కోట్లకు పైగా వసూళ్లు నమోదయినట్లు గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగున్నట్లు ఈ ఫలితాలు పేర్కొంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్చిలో వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లుకాగా, ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో (2017 జూలైలో ప్రారంభమైన తర్వాత ఎన్నడూ లేనంతగా) రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. ఇక రూ.1.4 లక్షలకోట్ల పైన వసూళ్లు వరుసగా 14వ నెల. తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► మొత్తం వసూళ్లు రూ.1,57,090 కోట్లు. ► సెంట్రల్ జీఎస్టీ రూ.28,411 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.35,828 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.81,363 కోట్లు. ► సెస్ రూ.11,489 కోట్లు. -
జపాన్ లో బాహుబలి -2 రికార్డును తుడిచేసిన RRR
-
జీఎస్టీ వసూళ్లు హైజంప్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఏకంగా 56 శాతం ఎగసి రూ. 1.44 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి. ఆర్థిక రికవరీ, సమర్థవంతమైన ఎగవేత వ్యతిరేక చర్యలు ఇందుకు దోహద పడినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గతేడాది(2021) జూన్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 92,800 కోట్లుగా నమోదయ్యాయి. వెరసి 2022 మార్చి నుంచి వరుసగా నాలుగో నెలలోనూ రూ. 1.4 లక్షల కోట్ల మార్క్‌ను దాటినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. జీఎస్టీని ప్రవేశపెట్టాక ఈ స్థాయి వసూళ్లు ఇది ఐదోసారని వెల్లడించింది. కాగా.. జూన్ నెల వసూళ్లు కీలక స్థాయికి నిదర్శనమంటూ జీఎస్టీ డే వేడుకల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 55 శాతం అప్: గతేడాది జూన్‌తో పోలిస్తే గత నెలలో వస్తు దిగుమతుల ఆదాయం 55% పురోగమించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సర్వీసుల తో కలిపి దేశీ లావాదేవీల ఆదాయం 56% ఎగసినట్లు తెలిపింది. 2022 మే నెలలో 7.3 కోట్ల ఈవే బిల్స్ నమోదుకాగా.. ఏప్రిల్‌లో 7.4 కోట్ల బిల్స్ జారీ అయ్యాయి. ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.41 లక్షల కోట్లుకాగా, ఏప్రిల్‌లో రూ. 1.68 లక్షల కోట్లకు చేరాయి. -
పుష్ప ఖాతాలో మరో రికార్డ్.. అక్కడ రూ. 100 కోట్ల కలెక్షన్లు
Pushpa Movie Hindi Version Earns 100 Crores In India: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం భారీ హిట్ కొట్టింది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకపోయింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్ లో తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. అయితే తాజాగా పుష్ప మరో రికార్డును సొంతం చేసుకుంది. హిందీలో ఈ మూవీ రూ. 100 కోట్లు కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. సినిమాకు ముందు నుంచే భారీ హైప్ రావడం అందుకు తగినట్లు సుకుమార్ టేకింగ్, బన్నీ, రష్మిక మందన్నా, సమంత స్పెషల్ సాంగ్ ప్రతీ ఒక్కరూ మూవీ విజయం సాధించేలా చేశాయి. అలాగే పుష్ప సాంగ్స్, డైలాగ్స్, మ్యానరిజంపై వచ్చిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా మరింత పాపులర్ అయింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్లలో మంచి స్పందన రావడం ఈ చిత్రానికే చూశానని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఇటీవల ట్వీట్ చేశారంటే పుష్ప ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థమవుతుంది. మొన్నటి వరకూ తెలుగు, మలయాళంలో అభిమానులు ఉన్న బన్నీకి పుష్పతో నార్త్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. -
ఆనాటి నుంచి పన్నెండు మెట్ల కిన్నెర పాట వరకు.. సూపర్ సక్సెస్
‘సారంగదరియా’.. ‘రాములో రాములా’.. ‘నాది నక్కిలీసు గొలుసు’.. ‘గున్నా గున్నా మామిడి’... జనం పాటలు జోరు మీదున్నాయి. వెండితెరపై మోత మోగిస్తున్నాయి. పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్య వంటి వారిని వెతికి మరీ సినిమాలకు పదాలిమ్మంటున్నాయి. కల్పించే పాటకు అంగీకారం డౌట్. జానపదానిది గ్యారంటీ సక్సెస్‌రేట్. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకూ జానపదం ఝల్లుమంటూనే ఉంది. ఘల్లుమంటూనే ఉంది. సండే స్పెషల్... జానపదం జనం నాల్కల మీద ఉంటుంది. అందుకే వెండితెర మీద కనపడి వినిపించగానే కనెక్ట్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. జానపద గీతం ఆర్గానిక్‌గా పుడుతుంది. తరాలపాటు నిలిచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సినిమాల్లోకి రాగానే ఆ శక్తితో సూపర్‌హిట్ అవుతూ ఉంటుంది. సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి. సన్నివేశాలకు తగినట్టు పాటలు కడతారు. ఆ అన్ని సన్నివేశాలకు జానపదాలు సూట్ కావు. కాని కుదిరే సన్నివేశాలలో జానపదాలు పెట్టడానికి నిర్మాత దర్శకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆ పాటలు తెర మీద మొక్కజొన్నల్ని పండిస్తాయి. భుజం మీద కడవలతో మెరుస్తాయి. మావ మావ మావా... ‘మంచి మనసులు’ సినిమాలో ‘మావ మావ మావా’ పాట కలెక్షన్ల దుమారం రేపింది. అయితే జానపద గీతాల్లో శృంగారం వాచ్యంగా, అవసరంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ పాటను కొందరు అశ్లీలంగా భావించారు కూడా. కాని సామాన్య ప్రేక్షకుడు ఉత్సాహపడ్డాడు. కేరింతలు కొట్టాడు. తెలుగు సినిమాల్లో కొసరాజు జానపద గీతాలను రసాత్మకంగా ప్రవేశపెట్టారు. జానపదం అంటే కొసరాజు వైపు చూడాల్సి వచ్చేది. ‘పెద్దమనుషులు’ సినిమా కోసం ‘నందామయా గురుడ నందామయా’, ‘శివశివమూర్తివి గణనాథ’... జానపదాల నుంచి ఇచ్చారు. ‘జేబులో బొమ్మ జేజేలా బొమ్మ’ (రాజు–పేద), ‘ఏరువాక సాగారో’, ‘ఒలియ ఒలి పొలియ పొలి’... (రోజులు మారాయి), ‘రామన్న రాముడు కోదండ రాముడు’ (లవకుశ).. ఇవన్నీ కొసరాజు కలం చివర నుంచి సిఖను అంటించుకున్నాయి. మరోవైపు పింగళి వంటి పెద్దలు జానపదం నుంచి తీసుకుని ‘కాశీకి పోయాను రామా హరే’ సరదా గీతాలను ఇచ్చారు. ఆరుద్ర ‘అత్తా ఒకింటి కోడలు’ సినిమాలో ‘తడికో తడిక’ అంటూ తడికను అడ్డం పెట్టుకుని జానపదులు చేసే సంవాదాన్ని పాట చేశారు. కొనకళ్ల వెంకటరత్నం ‘అదృష్టవంతులు’ సినిమాలో ‘మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో’తో భవిష్యత్ ముఖ్యమంత్రి జయలలితకు ఒక అచ్చతెలుగు హిట్ పాట ఇచ్చారు. పట్నంలో షాలిబండ కలర్, బ్లాక్ అండ్ వైట్ సంధికాలపు సినిమాలు వచ్చే సరికి ఈ దూకుడు తగ్గింది. సినారె కొన్ని జానపద వరుసలను పాటలకు వాడి మెరిపించారు. ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే’ (అమ్మమాట), ‘మాయ చేసి పోతివిరో నాగులు’ (జీవితం)... తదితరాలు జానపదాల రెక్కలను రేకులను తొడుక్కున్నాయి. అప్పుడే ‘అమాయకుడు’ సినిమాలో ఏ.వేణుగోపాల్ రాసిన జానపద వరుస ‘పట్నంలో షాలిబండ’ తెలంగాణ పదాలతో చమ్కాయించింది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో ‘వచ్చే వచ్చే వానజల్లు యాల్మది యాల’, ‘మంగమ్మగారి మనవడు’లో ‘నోమో నోమన్నలాల’... ఆ మట్టినెత్తావులను కొనసాగించాయి. ఆ తర్వాత తొంభైలలో కూడా అడపా దడపా ఈ పాటలు వినిపించాయి. ‘మొండి మొగుడు పెంకిపెళ్లాం’లో సాహితి రాసిన ‘లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగ’ పాట హిట్ అయ్యింది. ‘తమ్ముడు’ సినిమాలో ‘తాటిచెట్టు ఎక్కలేవు.. తాటికల్లు తెంపలేవు’, ‘ఖుషి’లో ‘బైబైయ్యే బంగారు రమణమ్మ’ వంటి జానపదాలు సందర్భానుసారం వినిపిస్తాయి. ‘కాలేజ్’ సినిమాలో ‘మాయదారి మైసమ్మో’ కుర్రకారును గెంతులేయించింది. జానపద బాణీలను తీసుకుని మలిచిన విప్లవ గీతాలు కూడా ఈకాలంలో వచ్చాయి. ‘నాంపల్లి టేషను కాడ రాజలింగో’, ‘హే లిగజిగిడి లంబాణి’, ‘ఎర్రజెండెర్రజెండెన్నీయలో’, ‘బండెనక బండి కట్టి’, ‘జంజంబల్ మర్రి వేయికాళ్ల జెర్రి’... ఇవన్నీ జనం నోళ్లలో నేటికీ నానుతున్నాయి. గాజులోళ్లమే పిల్లా మేము ఆర్.పి.పట్నాయక్ వంటి సంగీత దర్శకుల హయాంలో ఉత్తరాంధ్ర జానపదాలు వినిపించడం మొదలెట్టాయి. ‘నువ్వు–నేను’లో ‘గాజులోళ్లమే పిల్లా మేము’ పెద్ద హిట్ అయ్యింది. ‘మగధీర’లో ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ లైన్లు మెరిసి మాస్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇది చాలారోజుల తర్వాత తిరిగి ‘పలాసా’ సినిమాతో మళ్లీ ఉత్తరాంధ్ర జానపదాల వైపు అందరూ చూస్తున్నారు. నాది నక్కిలీసు గొలుసు గత ఐదారేళ్లుగా మళ్లీ జానపదాలు ఊపు మీదున్నాయి. పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సందర్భం వస్తే జానపదాన్ని వదలడం లేదు. ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా కదిరి నర్సింహుడా’ హల్చల్ చేసింది. ‘కృష్ణార్జున యుద్ధం’లో పెంచలదాసు రాసి పాడిన ‘దారి చూడు దమ్ము చూడు’ పెద్ద హిట్ అయ్యింది. ‘రాజా ది గ్రేట్’లో ‘గున్నా గున్నా మామిడి’, ‘పలాసా’లో ‘నాది నెక్కిలీసు గొలుసు’, ‘బావొచ్చాడోలమ్మ’, ‘శ్రీకారం’ లో ‘వస్తానంటివో పోతానంటివో’ హిట్ అయ్యాయి. శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో ‘సారంగ దరియా’ పాట ఆ సినిమా రిలీజ్ కాక ముందే పెద్ద హిట్ అయ్యింది. ‘అల వైకుంఠపురంలో’ నుంచి ‘రాములో రాములా’, ‘రంగస్థలం’లో ‘ఆగట్టునుంటావా’... ఇవన్నీ కొత్త సినిమా సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. రాబోయే ‘వరుడు కావలెను’ లో ‘దిగు దిగు దిగు నాగ’, ‘భీమ్లా నాయక్’లో మొగిలయ్య సాకీ ఇవన్నీ జానపదం శక్తిని, అవసరాన్ని చూపుతున్నాయి.తెలుగు పల్లెల్లో, తెలుగు సినిమాల్లో జానపదం జెండా ఎగురుతూనే ఉండాలి. -
ఏప్రిల్‌లో జీఎస్టీ రికార్డుల మోత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత ఎన్నడూ లేనంత అధికంగా ఏప్రిల్ నెలలో మొత్తం రూ. 1,41,384 కోట్ల వసూళ్లు జరిగాయి. అయితే మార్చిలో 1.24 లక్షల కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన జీఎస్టీ డేటాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.27,837 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.35,621 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ కింద రూ.68,481 కోట్లు వసూలు అయ్యాయి. కాగా రూ .9,445 కోట్లు సెస్ రూపంలో వసూలు చేశారు. మార్చిలో వసూలైన రూ.1.24 లక్షల కోట్లతో పోలిస్తే ఏప్రిల్‌లో జీఎస్టీ వసూలు 14% ఎక్కువగా జరిగింది. వాస్తవానికి, ఏప్రిల్‌లో పాక్షిక లాక్‌డౌన్‌తో, జీఎస్టీ తగ్గుతుందని కేంద్రం ఊహించింది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూలు 1.15 నుంచి 1.20 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండవచ్చని శుక్రవారం ఎస్బీఐ నివేదిక పేర్కొంది. దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణంగా జీఎస్టీ వసూలు ఎక్కువగా ఉంటుంది. -
అఅఆ వసూళ్లు బాహుబలి–2 కంటే ఎక్కువ!
‘‘అమర్ అక్బర్ ఆంటోనీ (అఅఆ) సాధించిన వసూళ్లను ఇప్పటి లెక్కలకు అన్వయిస్తే ‘బాహుబలి 2’ వసూళ్ల కంటే ఎక్కువ’’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్, వినోద్ ఖన్నా ముఖ్య పాత్రల్లో దర్శకుడు మన్మోహన్ దేశాయ్ తెరకెక్కించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ సినిమా విడుదలై మే 27కి 43 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. బచ్చన్, రిషీ, వినోద్ ఖన్నా కెరీర్లలో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది. 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమితాబ్ ఓ ఆశ్చర్యకరమైన పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ‘‘మన్మోహన్ దేశాయ్ ఈ కథను నాకు చెప్పడానికి వచ్చినప్పుడే ఈ టైటిల్ (అమర్ అక్బర్ ఆంటోనీ) చెప్పారు. కానీ అప్పటి సినిమాలకు పెడుతున్న స్టయిల్లో లేదు. వర్కౌట్ అవుతుందా? అని సందేహించాను కూడా. కట్ చేస్తే సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ రోజుల్లో సుమారు ఏడు కోట్ల 25 లక్షల వరకూ ఈ సినిమా వసూలు చేసింది. ఒకవేళ ప్రస్తుత లెక్కలతో పోలిస్తే ‘బాహుబలి 2’ని దాటేస్తుందని ట్రేడ్ చెబుతోంది. ‘‘అఅఆ’ సినిమా ముంబైలో 25 థియేటర్స్‌లో దాదాపు 25 వారాల పాటు ఆడింది. ఇంకా ఆడుతోంది’’ అని అప్పట్లో బయ్యర్లు నాతో అన్నారు. ఇప్పుడు అలాంటివి జరగడం లేదు. ఆ రోజులు పోయాయి’’ అన్నారు అమితాబ్. -
ఒకే ఏడాది రూ.750 కోట్ల వసూళ్లు
జయాపజయాలతో ప్రమేయం లేకుండా వరుస సినిమాలు చేసుకుపోయే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ 2019కి గానూ ఓ రికార్డ్ సాధించాడు. బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హీరోగా చరిత్ర సృష్టించాడు. కేసరితో 2019ని మొదలుపెట్టి.. మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూస్ వంటి సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసాడు అక్షయ్. ఈ సినిమాలన్నీ కలిపి దాదాపు 750 కోట్లు వసూలు చేశాయి. ఒకే ఏడాది 750 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేసి చూపించాడు. చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! 2020లోనూ ఇదే హవాను కొనసాగించడానికి నాలుగు సినిమాలతో సిద్ధంగా ఉన్నాడు అక్షయ్. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్, రోహిత్ శెట్టి సూర్వ వంశీ, పృథ్వీరాజ్ చిత్రాలతో పాటు మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి: '79 ఏళ్ల వయసులో ఏడుగురిని చిత్తు చేసింది' -
రికార్డ్ సృష్టించిన ‘నే జా’
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైనీస్ యానిమేటెడ్ సినిమా నే జా చరిత్ర సృష్టిస్తోంది. బాక్సాఫీస్ ముందుగా కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా గత చిత్రాల రికార్డ్లను తిరగరాస్తూ దూసుకుపోతోంది. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నే జా ఇప్పటి వరకు 2.4 బిలియన్ యాన్స్ (2 వేల 4 వందల కోట్లకు పైగా) వసూళ్లు చేసినట్టుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. చైనీస్ యానిమేటెడ్ సినిమాల చరిత్రలో ఇవే అత్యధిక వసూళ్లు కావటం విశేషం. ఇన్నాళ్లు 2016లో రిలీజ్ అయిన జుటోపియా పేరిట ఉన్న రికార్డ్‌ను నే జా చెరిపేసింది. భారతీయ ఇతిహాసాల్లోని పాత్రలను పోలిన క్యారెక్టర్స్‌తో రూపొందించిన ఈ సినిమాకు జోజి దర్శకుడు. ఇప్పటికీ మంచి వసూళ్ల ను సాధిస్తూ దూసుకుపోతున్న ఈ యాక్షన్ అడ్వంచరస్ 3డీ యానిమేషన్ మూవీ ఫుల్ రన్లో 4.4 బిలియన్ యాన్ (4 వేల 420 కోట్లకు పైగా) కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. యానిమేషన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన నే జా ఓవరాల్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ మూడో స్థానంలో నిలవటం విశేషం. -
వసూళ్లు పెరిగాయి
ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. గత శుక్రవారం విడుదలైన మా సినిమా మంచి విజయం సాధించింది అంటున్నారు నారాయణమూర్తి. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘క్యాడర్ వర్సెస్ లీడర్’ అనే కా¯ð ్సప్ట్‌తో తెరకెక్కిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండోరోజు కంటే మూడోరోజు వసూళ్లు పెరిగాయి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూసి కుటుంబ కథా చిత్రం అంటున్నారు. సినిమా బాగుందంటూ ప్రేక్షకులు ఫోన్‌చేసి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రజా ప్రతినిధుల ఫిరాయింపులను అడ్డుకోవాలని చూపించిన పాయింట్‌ను జనం అభినందిస్తున్నారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’అన్నారు. -
వసూళ్లు పెరిగాయి
ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. గత శుక్రవారం విడుదలైన మా సినిమా మంచి విజయం సాధించింది అంటున్నారు నారాయణమూర్తి. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘క్యాడర్ వర్సెస్ లీడర్’ అనే కా¯ð ్సప్ట్‌తో తెరకెక్కిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండోరోజు కంటే మూడోరోజు వసూళ్లు పెరిగాయి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూసి కుటుంబ కథా చిత్రం అంటున్నారు. సినిమా బాగుందంటూ ప్రేక్షకులు ఫోన్‌చేసి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రజా ప్రతినిధుల ఫిరాయింపులను అడ్డుకోవాలని చూపించిన పాయింట్‌ను జనం అభినందిస్తున్నారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’అన్నారు. -
రూ.200 కోట్లను కొల్లగొట్టిన ‘యూరీ’
పాకిస్థాన్‌కు ధీటైన సమాధానం చెప్పి.. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది సర్జికల్ స్ట్రైక్. భారత ఆర్మీ విజయవంతంగా చేపట్టిన ఈ చర్య ఆధారంగా.. యూరీ ది సర్జికల్ స్ట్రైక్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాలీవుడ్లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలై నాలుగు వారాలు అవుతున్నా.. వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికి ఈ చిత్రం రెండు వందల కోట్లను కొల్లగొట్టింది. ఈ చిత్రాన్ని వీక్షించిన యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. దేశ భక్తిని పెంపొందించేలా తెరకెక్కిన ఈ చిత్రానికి పలు రాష్ట్రాలు జీఎస్టీ నుంచి మినహాయింపును ఇచ్చాయి. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. #UriTheSurgicalStrike biz at a glance... Week 1: ₹ 71.26 cr Week 2: ₹ 62.77 cr Week 3: ₹ 37.02 cr Week 4: ₹ 29.02 cr Total: ₹ 200.07 cr India biz. BLOCKBUSTER. — taran adarsh (@taran_adarsh) February 8, 2019 -
మణికర్ణిక మూడు రోజుల వసూళ్లు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. తొలిరోజు ఆశించిన వసూళ్లు లేకున్నా మెల్లగా పుంజుకున్న మణికర్ణిక రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో ఝాన్సీ లక్ష్మీభాయిగా ప్రేక్షకులను అలరించడంతో వసూళ్లు జోరందుకున్నాయి. మరోవైపు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన థాకరే బయోపిక్ మహారాష్ట్రలో విజయవంతంగా నడుస్తున్నా థియేటర్ల వద్ద మణికర్ణిక జోరు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఢిల్లీ, ఎన్సీఆర్, యూపీ, పంజాబ్, రాజస్ధాన్‌లలో మణికర్ణిక భారీ వసూళ్లను రాబడుతోందని విడుదలైన మూడు రోజుల్లో హిందీ, తమిళ్, తెలుగు వెర్షన్లు కలిపి భారత్‌లో ఈ సినిమా మొత్తం 42.55 కోట్లను రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో నిర్మించిన మణికర్ణిక దేశవ్యాప్తంగా 3000 స్క్రీన్లపై ప్రదర్శింపబడుతోంది. ఈ మూవీ మున్ముందు బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
రూ 200 కోట్ల క్లబ్లో కేజీఎఫ్
బెంగళూర్ : ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్లు రాబట్టిన తొలి కన్నడ మూవీగా యష్, శ్రీనిధి శెట్టిల కేజీఎఫ్ రికార్డు నెలకొల్పింది. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ మెరుగైన వసూళ్లు సాధించింది. షారుక్ ఖాన్ జీరో, రణ్వీర్ సింగ్‌ల సింబా సినిమాలను తట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్ రూ 40 కోట్లు వసూలు చేయడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. కేజీఎఫ్ సంచలన విజయం కన్నడ చిత్ర పరిశ్రమ భారీ కలలకు రెక్కలు తొడిగిందని, భారత్‌తో పాటు ఓవర్సీస్లోనూ సినిమా భారీ వసూళ్లు రాబట్టిందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కేజీఎఫ్ అనూహ్య విజయం హీరో యష్‌కు ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. -
బాగీ 2 వసూళ్ల సునామీ
సాక్షి, ముంబయి : టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాగీ 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ 2018లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిరోజు రూ 25.10 కోట్లు వసూలు చేసిన బాగీ 2..శనివారం రెండవ రోజు రూ 20.40 కోట్లను రాబట్టి నిలకడగా దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లో భారత్‌లో మొత్తం రూ 45.50 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాగీ 2 వసూళ్లు పద్మావత్, పాడ్‌మన్, రైడ్, సోను కి టిటు కి స్వీటీ చిత్రాల ఓపెనింగ్స్‌ను అధిగమించాయి. పద్మావత్ తొలిరోజు రూ 19 కోట్లు రాబట్టగా రూ 25.10 కోట్లు వసూలు చేసిన బాగి 2 భారీ మార్జిన్‌తో భన్సాలీ మూవీని క్రాస్ చేసింది. మూవీలో టైగర్ ష్రాఫ్ నటనను ప్రశంసిస్తూ బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు ట్వీట్ చేశారు. -
రూ . 300 కోట్ల దిశగా టైగర్
సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా అలరించిన టైగర్ జిందా హై బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. 2012లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ఏక్ థా టైగర్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన టైగర్ జిందా హై వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ 285 కోట్లు పైగా వసూలు చేసి రూ 300 కోట్ల క్లబ్లో చేరేందుకు ఉరకలేస్తోంది. సల్మాన్ గత చిత్రాలు భజరంగిభాయ్‌జాన్ (రూ 320 కోట్లు) సుల్తాన్ (రూ 300 కోట్లు) వసూళ్లను టైగర్ సులభంగా అధిగమిస్తుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మరోవైపు సినిమాకు వసూళ్లు భారీగా దక్కినా ఈ మూవీ ఏక్ థా టైగర్‌లా ఆకట్టుకోదని, కేవలం ఫ్యాన్స్‌ను అలరించేలా ఉందని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. ఇక టైగర్ సక్సెస్‌తో ఊపుమీదున్న సల్మాన్ రేస్ 3 షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. -
బజరంగీ.. కలెక్షన్ల సునామీ
ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించిన బాలీవుడ్ సినిమా బజరంగీ భాయీజాన్ రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లోని అనేక రికార్డులను అది బద్దలు కొట్టింది. భారతదేశంలో ఇప్పటివరకు రూ. 102.60 కోట్ల నెట్ వసూళ్లు, అలాగే ఓవర్సీస్లో కూడా 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. వందకోట్ల వసూళ్లు అత్యంత తక్కువ సమయంలో సాధించిన తొలి బాలీవుడ్ సినిమా ఇదేనని దీని గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ ఇరోస్ ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. అలాగే, విడుదలైన మూడోరోజు ఈ సినిమా సాధించిన రూ. 38.75 కోట్లు కూడా ఒకరోజు హిందీ సినిమాలు సాధించిన అత్యధిక కలెక్షన్ అని చెప్పింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,900 స్క్రీన్లలో విడుదలైన బజరంగీ భాయీజాన్ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటిలోకీ దీనికే అత్యధిక వసూళ్లు వస్తాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దబాంగ్, బాడీగార్డ్ రికార్డులు దాటిందని, ఇక దబాంగ్ 2, ఏక్ థా టైగర్, కిక్ సినిమాల వసూళ్లను దాటాల్సి ఉందని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్, రాక్‌లైన్ వెంకటేశ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.