రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే కాస్త నెగటివ్ టాక్ రావడంతో అభిమానుల్లో నిరాశ ఎదురైంది. దీంతో కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం అనుకున్నంతగా రాబట్టలేదని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ)
'గేమ్ ఛేంజర్' (Game Changer)చిత్రం సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్‌లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్ ఛేంజర్ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.
గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్ నందన్ పాత్రలతో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రకు ఆయన 100 శాతం న్యాయం చేశారు. ఎవరైనా సరే చరణ్ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు. ఇప్పటికే అప్పన్న పాత్రకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు శంకర్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ, అంజలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై సాయి దుర్గాతేజ్, ఉపాసన కూడా చరణ్ నటనకు ఫిదా అయ్యారు. ఆయన్ను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)
ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా వచ్చిన తొలి చిత్రం గేమ్ ఛేంజర్. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ (VVR) చిత్రంతో సోలోగా బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాడు. ఇందులో కూడా హీరోయిన్ కియారా అద్వానీ కావడం విశేషం. అయితే, అప్పట్లో మొదటిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 34 కోట్ల నెట్ సాధించింది. గ్రాస్ పరంగా రూ. 68 కోట్ల వరకు ఓపెనింగ్‌ను క్రియేట్ చేసింది. అయితే, 2022లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం మాత్రం రూ. 133 కోట్ల నెట్ రాబట్టింది. కానీ, గ్రాస్ పరంగా రూ. 232 కోట్లతో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment