2023 టాలీవుడ్‌లో టాప్‌-10 కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రాలు | 2023 Year RoundUp: Tollywood Top 10 Highest Box Office Collections Movies In 2023, Movies Details Inside - Sakshi
Sakshi News home page

Highest Grossing Telugu Movies: 2023 టాలీవుడ్‌లో టాప్‌-10 కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రాలు

Published Sun, Dec 24 2023 1:22 PM | Last Updated on Sun, Dec 24 2023 2:21 PM

Tollywood Top 10 Box Office Collection Movies In 2023 - Sakshi

కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. మరో వారంలో 2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పేసి కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెట్టేస్తాము. ఇలాంటి సమయంలో గడిచిపోయిన సంవత్సరంలో మనమేం సాధించాం..? ఏం నష్టపోయాం..? అనే లెక్కలు వేసుకోవడం సహజం.  సినిమా అనేది అందరినీ ఎంటర్‌టైన్‌ చేసే విభాగం.. అందుకే ఈ పరిశ్రమపై ప్రేక్షకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో  ఎన్ని చిత్ర పరిశ్రమలున్నా కేవలం బాలీవుడ్‌కు మాత్రమే అందరూ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు.

ఎందుకంటే అక్కడి చిత్రాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ నటించిన వారికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. దీంతో మిగిలిన చిత్ర పరిశ్రమల పేర్లు కూడా అందరికీ తెలిసేవి కావు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బాలీవుడ్‌కు పోటీగా టాలీవుడ్‌ చిత్రపరిశ్రమ మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. టాలీవుడ్‌ చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా 2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్‌ పరంగా టాప్‌-10లో ఉన్న చిత్రాల గురించి ఒకసారి చూద్దాం. కేవలం ఈ కలెక్షన్స్‌ వివరాలు టాలీవుడ్‌ పరిధి అంటే రెండు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గమనించగలరు.


1. 'వాల్తేరు వీరయ్య'

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో రవితేజ కీ రోల్​లో నటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. టాలీవుడ్‌లో రూ. 160 కోట్ల రాబట్టి 2023లో విడుదలైన చిత్రాల్లో  'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్‌ పరంగా టాప్‌-1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది చూసేయండి.


2. ఆదిపురుష్‌- ప్రభాస్‌
రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. 'ఆదిపురుష్‌'. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 393 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. కానీ టాలీవుడ్‌లో రూ. 133 కోట్లు రాబట్టింది. టాలీవుడ్‌లో  'వాల్తేరు వీరయ్య' కంటే కలెక్షన్స్‌ పరంగా 'ఆదిపురుష్‌' వెనకపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో ఉన్నా కూడా టాలీవుడ్‌లో మాత్రం రెండో స్థానానికి పరిమితం అయింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది చూసేయండి.


3. వీరసింహా రెడ్డి - బాలకృష్ణ
2023 సంక్రాంతి బరిలో  'వీరసింహా రెడ్డి'తో బాలకృష్ణ వచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'కు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఈ రేసులో మెగాస్టారే పైచేయి సాధించాడు.  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 134 కోట్ల  కలెక్షన్స్‌ రాబట్టింది. కానీ టాలీవుడ్‌లో రూ. 97 కోట్లు రాబట్టి మూడో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది చూసేయండి.


4. భగవంత్‌ కేసరి- బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'భగవంత్‌ కేసరి'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో బాలయ్య రెండు హిట్‌ సినిమాలను అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 115 కోట్ల  కలెక్షన్స్‌ రాబట్టింది. కానీ టాలీవుడ్‌లో రూ. 85 కోట్లు రాబట్టి నాలుగో స్థానం దక్కించుకుంది.  ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది చూసేయండి.


5. 'బ్రో'- సాయిధరమ్‌ తేజ్‌,పవన్‌ కల్యాణ్‌
సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన కథానాయకుడిగా పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దీనిని డైరెక్ట్‌ చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 114 కోట్ల  కలెక్షన్స్‌ రాబట్టింది. కానీ టాలీవుడ్‌లో రూ. 82 కోట్లు రాబట్టి ఐదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది చూసేయండి.


6. దసరా- నాని
నాని పాన్‌ ఇండియా హీరోగా దసరా చిత్రంతో పరిచయం అయ్యాడు.  నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు. కీర్తి సురేశ్‌ ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. నానికి ఇది తొలి పాన్‌ ఇండియా చిత్రంకావడంతో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఆయన సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 118 కోట్ల  కలెక్షన్స్‌ రాబట్టింది. కానీ టాలీవుడ్‌లో రూ. 76 కోట్లు రాబట్టి ఆరో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది చూసేయండి.


7. జైలర్‌- రజనీకాంత్‌
రజనీకాంత్ హీరోగా నెల్సన్‌ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 604 కోట్ల  కలెక్షన్స్‌ రాబట్టింది. కానీ టాలీవుడ్‌లో రూ. 68 కోట్లు రాబట్టి ఏడో స్థానం దక్కించుకుంది. రజనీకాంత్‌ కెరియర్‌లో ఆల్‌టైమ్‌ హిట్‌గా జైలర్‌ నిలిచింది. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది చూసేయండి.


8.'బేబీ'- ఆనంద్‌ దేవరకొండ
2023లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న  ప్రేమ కథా చిత్రం 'బేబీ' . సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్‌ను భారీగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 81 కోట్ల  కలెక్షన్స్‌ రాబట్టింది. కానీ టాలీవుడ్‌లో రూ. 64 కోట్లు రాబట్టి ఎనిమిదో స్థానం దక్కించుకుంది. 


9. విరూపాక్ష- సాయిధరమ్‌ తేజ్
సాయిధరమ్‌ తేజ్‌  హీరోగా కార్తీక్‌ దండు తెరకెక్కించిన మిస్టీక్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష' . శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో  సంయుక్తా మేనన్‌ హీరోయిన్‌గా నటించింది. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ అనుభూతినిచ్చిన ఈ సినిమా సాయిధరమ్‌ తేజ్‌కు బిగ్గెస్ట్‌ను ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 89 కోట్ల  కలెక్షన్స్‌ రాబట్టింది. కానీ టాలీవుడ్‌లో రూ. 63 కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది చూసేయండి.


10. సలార్‌- ప్రభాస్‌
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’. డిసెంబర్‌ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా సలార్‌ ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతానికి (డిసెంబర్‌ 23) టాలీవుడ్‌లో రూ. 101కోట్లు కలెక్ట్‌ చేసింది. ఈ లెక్కన టాప్‌ టెన్‌ లస్ట్‌లో మూడో స్థానానికి సలార్‌ చేరుకున్నాడు. కానీ బాక్సాఫీస్‌ వద్ద సలార్‌ కలెక్షన్స్‌ దూకుడు భారీగానే కొనసాగుతుంది. దీంతో సలార్‌ కలెక్షన్స్‌ క్లోజింగ్‌ అయ్యే సరికి టాప్‌-1 లోకి కూడా రావచ్చు అని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సలార్‌ డిజిటల్‌ రైట్స్‌ను సుమారు రూ.160 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్‌ వివరాలను ప్రముఖ సినీ ట్రేడ్‌ వర్గాల ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement