2023 Year End RoundUp
-
2023 భారీ డిజాస్టర్ సినిమా ఇదే.. రూ. 45 కోట్ల బడ్జెట్‌కు లక్ష మాత్రమే వచ్చింది
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టాయి. నేడు ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలు కూడా దగ్గర చేర్చుకుంటున్నాయి. ఒక సినిమా కోసం నెలల పాటు కష్టపడటమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే థియేటర్ ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బే కాకుండా శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్ ఇలా పలు రకాలుగా తిరిగి పొందుతారు. అదే సినిమా బాగలేదని టాక్ వస్తే మొదటి రోజు నుంచే ఆ థియేటర్ వైపు వెళ్లరు. దీంతో నిర్మాతకు కోట్ల రూపాయల నష్టం తప్పదు. 2023లో కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ - హీరోయిన్ భూమి పెడ్నేకర్ నటించిన 'ది లేడీ కిల్లర్' నవంబర్ 3న విడుదలైంది. ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంది. బాలీవుడ్లో వీళ్లు అల్లాటప్పా యాక్టర్లు ఏమీ కాదు.. అక్కడ టాప్ రేంజ్లో వారికి గుర్తింపు ఉంది కాబట్టే ఈ సినిమా కోసం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నిర్మాతకు ఫైనల్‌గా కేవలం రూ. లక్ష మాత్రమే వచ్చింది. నమ్మలేకున్నా ఇదే నిజం. 2023లో విడుదల అయిన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. టీ-సీరీస్ వాళ్ల భాగస్వామ్యంతో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా ముంబై, ఢిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. సినిమా షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు అప్పటికే భారీగా బడ్జెట్ పెట్టేశారు. మళ్లీ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.. దీంతో సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండానే విడుదల చేశారు. సినిమాలో కథతో పాటు ఏ ఒక్క విషయం కూడ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మొదటిరోజు కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఐఎండీబీలో కూడా కేవలం 1.5 రేటింగ్‌తో 'ది లేడీ కిల్లర్' ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. అందుకు గాను నిర్మాతకు ఎంత చెల్లించారనేది తెలియదు. ఓటీటీలో కూడా ఆ చిత్రం వ్యూస్ మరీ దారుణంగా ఉన్నాయి. -
Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ
స్ట్రయిట్ చిత్రాలు 236... డబ్బింగ్ సినిమాలు 70... మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్‌గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్‌లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‌కి దక్కడం మరో ఆనందం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్ హిట్.. మోర్ ఫట్‌గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి... స్టార్ హీరోలు కొందరు ‘హిట్ హిట్ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్ రేంజ్, చిన్న రేంజ్ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్ కేసరి’తోనూ మరో హిట్ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఈ ఏడాది ఓ హిట్.. ఓ ఫట్ పడ్డాయి. ‘సలార్: సీజ్ఫైర్’తో ప్రభాస్‌కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్ మూవీ ‘దసరా’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే శౌర్యువ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ ‘హాయ్ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్ లవ్‌స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్‌బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ హిట్‌తో జోష్‌గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్‌గా కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‡హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్‌లో సక్సెస్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్‌రామ్ ‘డెవిల్’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రయిట్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’, పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’, నవీన్ చంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ల ‘మ్యాడ్’, తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్ సెల్వన్ 2’, విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్ ‘2018’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. ఫట్ అయిన ఆ చిత్రాల గురించి.. ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్‌గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపోందింది. హీరో రామ్–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్‌లో కొత్త చాప్టర్‌ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపోందిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవ్ మోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్ ‘రామబాణం’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, నిఖిల్ ‘స్పై’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, సుధీర్ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
యూట్యూబ్ షేక్.. 2023లో దుమ్ము రేపిన వీడియోలు, షార్ట్స్ ఇవే..
ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్‌లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్‌గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి. టాప్ 15 గేమింగ్ వీడియోలు 2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి. టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ఈ ఏడాది యుట్యూబ్లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి. ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు. టాప్ 15 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. టాప్ 15 మ్యూజిక్ వీడియోలు 2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి. -
Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన స్మాల్ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్‌టాక్‌తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: వెరైటీగా వీళ్లు ఏం చేస్తారంటే..
కొత్త సంవత్సరాలు మనకి కొత్త గానీ, అనాది కాలగమనానికి కాదు!. అలుపుసొలుపు లేని నిత్య చైతన్యాలాపనకి కొత్తా పాతా ఏమిటి? అన్నాడో కవి. అయినా డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆంగ్ల సంవత్సరాదికి ఆహ్వానం పలకడం.. అదో వేడుకగా జరగడం షరా మామూలు అయ్యింది. అయితే ఇక్కడ కొన్ని దేశాలు కొత్త సంవత్సరాన్ని వెరైటీగా ఆహ్వానించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. డెన్మార్క్ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యుల అందరూ కలిసి తలుపుల వద్ద పాత ప్లేట్లు, గ్లాసులను విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వలన చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని డెన్మార్క్ ప్రజల నమ్మకం. ఎవరి ఇంటి గుమ్మం వద్ద విరిగిన పాత్రలు ఎంత ఎక్కువ పేరుకుంటే.. ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని విశ్వాసం. న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రతి అమెరికా ప్రజలు టీవీలకు, ఆన్‌లైన్‌లకు అతుక్కుపోతారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో జరిగే బాల్ డ్రాప్ ఈవెంట్ అందుకు కారణం. ఇక్కడి వన్ టైమ్స్ స్క్వేర్‌పై ప్రతి సంవత్సరం అర్ధరాత్రి బాల్ డ్రాప్ ఈవెంట్‌ను వీక్షిస్తారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన బాల్‌ను 31వ తేదీన రాత్రి వన్టైమ్స్ స్కైర్ పై నుంచి 11. 59 నిమిషాలకు డ్రాప్ చేస్తారు. ఇటీవల కాలంలో బాల్ డ్రాప్‌కు ముందు సంగీతకారుల ప్రదర్శనలతో లైవ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను తొలిసారి ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్‌పేపర్ యజమాని అడాల్ఫ్ ఓచ్స్ నిర్వహించారు. 1908 న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుతూ 1907 డిసెంబర్ 31న తొలిసారి బాల్ డ్రాప్ ఈవెంట్ జరిగింది. టైమ్స్ కొత్త ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రచారం చేసేందుకు బాణాసంచాలతో న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహించారు. బంతి నిఆర్ట్క్రాఫ్ట్ స్ట్రాస్ కన్సల్టెంట్ కంపెనీ రూపొందించింది. కేందుకు డిసెంబర్ 31, 1907న మొదటిసారిగా బాల్ డ్రాప్ నిర్వహించబడింది. 1942, 1943లో యుద్ధకాల సమయాల్లో మినహా ప్రతది ఏడాది బాల్ డ్రాప్ ఈవెంట్ నిర్వహణ జరుగుతూ వస్తుంది. బాల్ డిజైన్‌ను నాలుగుసార్లు ఆధునీకరించారు. తొలినాళ్లలో బాల 5 అడుగులు( 1.5 మీ) వ్యాసం కలిగి ఉండేది. దీనిని చెక్క, ఇనుముతో తయారు చేసేవాళ్లు.ఇది దాదాపు 100 బల్బులతో ప్రకాశిస్తుంది. ప్రస్తుత బంతి 12 అడుగులు(3.7 మీ) వ్యాసం కలిగి ఉంది. దీనిలో 32,00 ఎల్ఈడీ బల్బ్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్లో నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు చాలా ప్రత్యేకమైన పనులను చేస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక లోదుస్తులు ధరిస్తారు. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఫిన్లాండ్: ఫిన్లాండ్లో ప్రజలు రాబోయే సంవత్సరంలో జరగనున్న విశేషాల గురించి ఊహిస్తారు . దీని కోసం.. వారు కరిగిన టిన్ను నీటిలో ముంచి, లోహం గట్టిపడిన తర్వాత.. లోహానికి ఆకారంగా మార్చే పక్రియను చేపడతారు. ఈ లోహం గుండె లేదా ఉంగరం ఆకారాన్ని తీసుకుంటే.. అది వివాహం జరగడానికి చిహ్నం అని అర్థం. మరోవైపు మెటల్ ఓడ రూపాన్ని తీసుకుంటే, అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారు. 12 గంటలకు.. 12 ద్రాక్షలు స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజున పాటించే సంప్రదాయం విచిత్రంగా ఉంటుంది. న్యూ ఇయర్ అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇలా చేయడానికి రీజన్ ఏమిటంటే.. 12 ద్రాక్షలు 12 నెలలు.. ద్రాక్ష రాబోయే సంవత్సరంలో ఒకొక్క ద్రాక్ష పండు ఒకొక్క నెల అదృష్టంతో ముడిపడి ఉంటుందట. స్పెయిన్‌లోని మాడ్రిడ్, బార్సిలోనాలాంటి బడా నగరాల్లో 12 ద్రాక్షను సామూహికంగా ఆరగించేందుకు ప్రధాన కూడళ్లలో భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు. -
ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే..
స్టాక్మార్కెట్లో మదుపుదారులకు ఈ ఏడాది చాలా గుర్తుండిపోతుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరమూ సూచీలు లాభాల బాటపట్టాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ 50లోని 27 షేర్లు ఆల్‌టైమ్‌హైను చేరాయి. 40కి పైగా కంపెనీలు 10-100 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసినవారికి, ఇతర పెట్టుబడిదారులకు ఐపీఓలు లిస్ట్ అయిన తొలిరోజే మంచి లాభాలను తీసుకొచ్చాయి. 2023 ప్రారంభంలో మార్కెట్లు కాస్త నష్టాల్లోకి వెళ్లినా తరువాత భారీగా రాణించాయి. అంతర్జాతీయ మాంద్యం భయాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో గతంలో నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 4, 3 శాతమే రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఏప్రిల్ నుంచి సూచీలు పుంజుకున్నాయి. ర్యాలీకి కారణాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇవ్వడం, ముడి చమురు ధరలు వేగంగా తగ్గడంతో, రెండు నెలల పాటు బాగా రాణించిన సూచీలు ప్రథమార్ధాన్ని 6 శాతం పైగా లాభాలతో ముగించాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 7.6% వృద్ధి నమోదైంది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధించడం, విదేశీ మదుపర్ల పెట్టుబడులు బలంగా కొనసాగడం, 2024లో రేట్ల కోతకు అవకాశం ఉందని అమెరికా ఫెడ్ సంకేతాలివ్వడం ఇందుకు దోహదం చేసింది. ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ.. చరిత్రలోనే తొలిసారిగా డిసెంబరు 6వ తేదీన 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటేసింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.81.90 లక్షల కోట్లు పెరిగి రూ.364 లక్షల కోట్ల ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. జూన్‌లో నిఫ్టీ సూచీ 19,000 పాయింట్లు, సెప్టెంబరులో 20,000, ఈనెల 8న 21,000 పాయింట్లకు చేరింది. డిసెంబరు 28న ఆల్‌టైం గరిష్ఠస్థాయి అయిన 21,801.45ను చేరింది. సెన్సెక్స్ జూన్‌లో 64,000 పాయింట్లను అధిగమించింది. జులైలో 67,000ను తాకింది. నవంబరు, ఈనెల 28నలో ఏకంగా 8000 పాయింట్లకుపైగా ర్యాలీ అయి 72,484.34 వద్ద జీవనకాల రికార్డు గరిష్ఠాన్ని చేరింది. ఏడాది మొత్తం మీద నిఫ్టీ 18%, సెన్సెక్స్ 19% మేర లాభాలను అందించాయి. 2024లో ఎలా ఉండబోతుందంటే.. వచ్చే ఏడాది స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడడానికి పెద్దగా అవకాశాలను ఈ ఏడాది మిగల్చలేదని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత స్థాయి నుంచి మహా అయితే 8-10% రాణించొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదించింది. ఎన్నికల ముందు ర్యాలీ కారణంగా వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు సానుకూలంగా ఉండొచ్చు. ఇదీ చదవండి: ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..? ఎన్నికల ఫలితాలు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రకటనలు వచ్చాకే స్టాక్ మార్కెట్ దిశపై ఒక అంచనాకు రాగలమని బ్రోకరేజీలు అంటున్నాయి. అదే సమయంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్‌కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Happy New Year 2024: వెల్కమ్ పార్టీ
2023 కి వీడ్కోలు, న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పడానికి బంధు మిత్రులు బృందంగా ఒక చోట చేరుతుంటారు. ఏడాది మొత్తం జ్ఞాపకంగా మిగిలిపోయే ఈ రోజును ఇంట్లో ఉల్లాసభరితంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. న్యూ ఇయర్ వేడుకల అలంకరణలో మెరిసే, ఆకర్షణీయమైన వెలుగులతో ఈ రోజును అలంకరించడానికి చకచకా సిద్ధం అయిపోవచ్చు. ► బ్యానర్ ముందుగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చూపే ఒక సాధారణ బ్యానర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నలుపు, బంగారం, వెండి రంగులు ఉండే బ్యానర్‌తో ఉన్న ఈ అలంకారం అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ బ్యానర్ ను మీ ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు. దీనిని టేప్‌తో గోడలకు అతికించడం, ఆ తర్వాత తొలగించడం కూడా సులువే. ► బెలూన్స్ నూతన సంవత్సర వేడుకల అలంకరణలో బెలూన్లు మరో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పార్టీ మూడ్‌ను తీసుకురావడానికి ఇంట్లో బెలూన్ ఆర్చ్‌ని సృష్టించుకోవాలి. రెడీమేడ్‌గా కూడా ఈ ఆర్చ్‌లు దొరుకుతాయి. ఈ బెలూన్స్ కూడా బంగారం, తెలుపు, మెరిసే బెలూన్స్ మరింత పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. ► కొవ్వొత్తులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నప్పుడు అక్కడి వాతావరణం హాయిగొలిపే అనుభూతిని ఇవ్వాలి. ఇందుకు ఫ్లేమ్‌లెస్, సెంటెడ్ క్యాండిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. అందుకని, ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవడం మంచిది. న్యూ ఇయర్లోకి అడుగిడే కొత్త సమయంలో ఈ కొవ్వొత్తుల వెలుగులు అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. ► ఫన్ నెక్లెస్ లు టేబుల్‌పై కొవ్వొత్తులు ఒకటే ఉంచితే సరిపోదు. ఆ టేబుల్‌పైన పరిచే రన్నర్ పై పూసల దండలను అమర్చడం, వేలాడదీయడం పండగ సంబరాన్ని తీసుకువస్తుంది. వీటిలో కూడా బంగారం, నలుపు, వెండి పూసల దండలను ఎంచుకోవడం మంచిది. ► డిస్కో థీమ్ కొత్తసంవత్సరం అంటేనే ఒక జోష్‌తో నడవాలనుకుంటారు. న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పే సమయంలో డాన్స్ చేసే వీలుండేలా డిస్కో థీమ్‌ని అలంకరించుకోవాలి. ఇందుకు సియెర్రా వంటి కొన్ని డిస్కో బాల్స్ ఈ అలంకరణకు ఉపయోగించుకోవాలి. ► పిల్లల కోసం ప్రత్యేకం పార్టీలో పిల్లలు ఉంటే వారి కోసం.. వారి చేత నియాన్, పేస్టెల్ బెలూన్లు, రంగురంగుల నాప్కిన్స్, కప్పులతో వారి పార్టీ ప్లేస్‌ను అలంకరించవచ్చు. ► తెల్ల బంగారం తెలుపు, బంగారు రంగులతో పార్టీ ప్లేస్‌ను మెరిసేలా అలంకరించండి. ఇందుకు షిమ్మరీ గోల్డ్ ఫ్రింజ్ కర్టెన్లను జోడించే ముందు డోర్ ఫ్రేమ్ పై భాగంలో తెల్లటి బెలూన్లను బ్లో అప్ చేయచ్చు. ► స్ట్రింగ్ లైట్లు బయటి వైపు స్ట్రింగ్ లైట్లను వేలాడదీసి, వాటిని మెరిసేలా చేయచ్చు. దీంతో బయటి వాతావరణం వెలుగులతో పండగ వాతావరణాన్ని నిండుగా కనిపంచేలా చేస్తుంది. ► పేపర్ ప్లేట్స్ రంగు రంగుల పేపర్ ప్లేట్లను వాల్ డెకార్‌గా మార్చుకోవచ్చు. గోడపైన ఉల్లాసాన్ని కలిగించే రంగులను ఆకర్షణీయంగా అలంకరించుకోవడానికి చవకైన, సరైన మార్గం అవుతుంది. ► రంగు రంగుల టిష్యూ కొత్త కొత్త అలంకరణతో పార్టీ ప్లేస్‌ను ఉత్తేజంగా మార్చడానికి రంగురంగుల టిష్యూ పేపర్లు కూడా వాడచ్చు. పింక్, బ్లూ, వైట్ టిష్యూ పేపర్లను తీసుకొని, వాటిని ఒక్కొక్కటీ జోడిస్తూ దండలా అల్లుకోవాలి. దీనిని పార్టీ ప్లేస్‌లో వేలాడదీయాలి. ► టేబుల్ క్లాత్ పింక్ గ్లిటర్ టేబుల్ క్లాత్ పరిచి, దానిపైన బంగారు, స్టార్ మోటిఫ్‌లతో ఉల్లాసభరితమైన థీమ్‌ని తీసుకురావచ్చు. దీంతో డిన్నర్ చేసే టేబుల్ న్యూ ఇయర్ వేడుకలో మరింత ప్రత్యేకతను నింపుకుంటుంది. -
ఈ కార్ల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్స్ - పూర్తి వివరాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' ఈ ఏడాది బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి కోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటి వున్నాయి. కంపెనీ అందించే ఈ బెనిఫిట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెనాల్ట్ కైగర్ కంపెనీ తన రెనాల్ట్ కైగర్ కొనుగోలుపైన రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 స్పెషల్ కస్టమర్ లాయల్టీ బోనస్‌లు, రూ.12,000 కార్పొరేట్ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపైన కంపెనీ రూ.50000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ.10,000 లాయల్టీ కస్టమర్ ప్రయోజనాల కింద తగ్గింపు ఉన్నాయి. రూ.6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఈ నెలలో కొనుగోలు చేస్తే రూ.50,000 వరకు సేవ్ అవుతుంది. ఇదీ చదవండి: 2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్ రెనాల్ట్ క్విడ్ ప్రారంభం నుంచి అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న రెనాల్ట్ క్విడ్ కొనుగోలుపైన కంపెనీ ఇప్పుడు రూ. 50000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. రూ.4.5 లక్షల ప్రారంభ ధరలో లభించే ఈ కారుని ఇప్పుడు రూ.50,000 తగ్గింపుతో ఈ నెలలో కొనుగోలు చేయవచ్చు. Note: రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ అందించే తగ్గింపులు కేవలం మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారులు సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవాలి. -
ఈ ఏడాది విచిత్రమైన ఆవిష్కరణలు ఇవే..
ప్రపంచంలో ఎప్పటికప్పుడు అనేక కొత్త సాంకేతిక ఆవిష్కరణలు సృష్టిలోకి వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని చాలా ఉపయోగకరమైనవి, వేగంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. మరికొన్ని మరింత ప్రయోగాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని ఆవిష్కరణలు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. వాటిని మనం ఎప్పటికీ ఊహించలేము. అయినా వాటితో సమాజానికి ఉపయోగం ఉంటుంది. ఇలా ఈ ఏడాది వచ్చిన కొన్ని విచిత్రమైన సాంకేతిక ఆవిష్కరణలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హైబ్రిడ్ మొబిలిటీ రోబో(హెచ్ఎంఆర్) రోబోటిక్స్‌లో హైబ్రిడ్ మొబిలిటీ రోబోను టెక్ నిపుణులు ఒక సంచలనంగా చెబుతారు. ఇది బంతిని పోలి ఉండే ఎగిరే పరికరం. బంతిలాగా అన్నివైపులా కదులుతూ ఉంటుంది. అది వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి లేదా నిటారుగా ఉన్న నిర్మాణాలు ఎదురైతే పైకి కిందకు ఎగురుతూ ముందుకు సాగిపోతుంది. హ్యూమని ఏఐ పిన్ హ్యూమని ఏఐ పిన్ను మొదటిసారిగా ఏప్రిల్ 2023లో జరిగిన టెడ్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించారు. ఇది రోజువారి ఫోన్కాల్లు చేయడం, రోజువారి కార్యకలాపాలను విశ్లేషించడం, ఆహార పదార్థాలను స్కాన్ చేయడం వంటి కొన్ని అంశాలను ప్రదర్శించారు. ఈ పరికరం సెప్టెంబరు 2023లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మరోసారి దర్శణమిచ్చింది. ఎయిర్‌బ్యాగ్ జీన్స్ స్వీడిష్ కంపెనీ మోసైకిల్ ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌ను తయారుచేసింది. మోటార్‌సైకిల్ ఢీకొనేటప్పుడు ఈ జీన్స్ ధరిస్తే కొంత ప్రమాదాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది. అందులో ఉండే సెన్సార్లు ప్రమాదం జరిగిన వెంటనే జీన్స్‌లో ఉన్న బ్యాగ్‌లో ఓపెన్ అయి ప్రమాదాన్ని కొంత నివారించేలా తోడ్పడతాయి. సాధారణంగా ఆ జీన్స్ ధరిస్తే మాములుగానే కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం బ్యాగ్‌లు ఓపెన్అయి కొంత లావుగా ఉంటుంది. అండర్‌వాటర్ జెట్ప్యాక్ నీటిలో అన్వేషణకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నీటిలో ప్రయాణం క్లిష్టంగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని సులువు చేసేందుకు అండర్‌వాటర్ జెట్ప్యాక్ అనే పరికరాన్ని తయారుచేశారు. దాన్ని వీపునకు ధరించి నీటిలో ప్రయాణించవచ్చు. రాకెట్ ఎలాగైతే ఆకాశంలో దూసుకుపోతుందో..ఈ పరికరం నీటిలో వర్టికల్‌గా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో.. ఫ్లైయింగ్ జెట్స్కి కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. -
2023 పాఠాలు... 2024 ఆశలు
2023 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. ఒకపక్క కృత్రిమ మేధ, మరోపక్క రాజకీయ పరివర్తన జోరుగా సాగుతున్న ఈ ఏడాది మనకు మిగిల్చిన జ్ఞాపకాలేమిటి? ప్రపంచం పట్టు తప్పిపోతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. జీపీటీ–4 రావడం ఈ ఏడాది అత్యంత కీలకమైన పరిణామం.ఇక నుంచి కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల నేపథ్యంలో 2024ను ఊహించుకుంటే, ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న ప్రత్యేక పరిస్థితులు మరిన్ని యుద్ధాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. అయితే, వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని ‘కాప్’ సమావేశాల్లో అంగీకారం కుదరడం శుభపరిణామం. చాలా దేశాల పౌరులు హ్రస్వదృష్టితో కూడిన జాతీయవాదానికీ, తాత్కాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసే నేతలకూ పగ్గాలు అప్పగించారు. కోవిడ్–19 పరిస్థితులు ప్రచండంగా ఉన్న సమయంలో టీకాల పేరుతో జాతీయ వాదం ప్రబలింది. ఇదెంత సంకుచితమైనదో ఆ తరువాత కానీ అర్థం కాలేదు. ఇది సాటి మానవుడి బాధను కూడా మరచిపోయేలా చేసింది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నా ఎవరికీ పట్టకపోవడం కూడా దీనికి మరో నిదర్శనం. అదుపులేని హింసకు కొత్త, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలూ ఆజ్యం పోస్తున్నాయి. వేగంగా వృద్ధి చెందు తున్న ఈ టెక్నాలజీలు మానవాళి నిశ్చేష్టతకూ దారితీస్తున్నాయనడంలో సందేహం లేదు. కల్పనకూ, వాస్తవానికీ తేడాలు చెరిగి... ఈ ఏడాది మార్చిలో ఓపెన్ ఏఐ జీపీటీ–4ను విడుదల చేసింది. ఇది కాస్తా రక్తమాంసాలతో కూడిన వాస్తవానికీ, కల్పనకూ మధ్య ఉన్న అంతరాన్ని చెరిపివేస్తోంది. ఈ డిజిటల్ వాస్తవాన్ని మన అనలాగ్ బుర్రలు ఎలా అర్థం చేసుకోగలవు? 2023 మొత్తమ్మీద అత్యంత కీలకమైన పరిణామం ఇదే అనడం అతిశయోక్తి కాబోదు. 2024లోనే కాదు... ఆ తరువాతి కాలంలోనూ మన జీవితాలను మార్చేసే పరిణామం. జీపీటీ–4 లాంటివి మన జియోపాలిటిక్స్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. ‘‘టెక్నాలజీ అనేది భౌగోళిక రాజకీ యాలపై ప్రభావం చూపడం కొత్త కాకపోయినా, కృత్రిమ మేధ రంగ ప్రవేశంతో పరిస్థితి సమూలంగా మారనుంది. కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది’’ అని ఓ విశ్లేషకుడు ఇటీవలే వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రస్తుతం కృత్రిమ మేధే అతిపెద్దది. దీని నియంత్రణ కేవలం కొంతమంది చేతుల్లోనే ఉంది. ఈ టెక్నాలజీ కొన్ని బహుళజాతి కంపెనీల చేతుల్లో అభివృద్ధి చెందింది. ప్రభుత్వాలకు వీటిపై అవగాహన లేదు. నియంత్రించే శక్తీ లేదు. నియంత్రించాలన్నా ప్రభుత్వాలు ఈ కంపెనీలపైనే ఆధార పడాల్సి ఉంటుంది. చైనా లాంటి దేశాలు చాలాకాలంగా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై గట్టి నియంత్రణ పాటిస్తూ వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. బహుశా చైనా ఈ కృత్రిమ మేధను ఇతరుల కంటే మెరుగ్గా నియంత్రించగలదేమో. కానీ అక్కడి ప్రభుత్వం కృత్రిమ మేధను కూడా తమ పార్టీ లక్ష్యాల సాధనకు పావుగా వాడు కున్నా ఆశ్చర్యం లేదు. అలాంటిది ఏదైనా జరిగితే అది ప్రపంచంలో అధికార అసమతౌల్యానికి దారితీయవచ్చు. ద్వైదీ భావ పరాకాష్ఠలో ప్రపంచం... మానవాళి సంక్షేమానికి అడ్డుగా నిలుస్తున్న సవాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తరుణంలో మన ఆలోచనా ధోరణులు మాత్రం అంతకంతకూ కుంచించుకుపోతున్నాయి. దేశాలకు, ప్రాంతాలకు పరి మితమైపోతున్నాయి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో బహుముఖీన అంతర్జాతీయ సహకారం, సమష్టి బాధ్యతల పంపిణీతోనే మనం ప్రస్తుత సమస్యలను ఎదుర్కోగలం. సమ న్యాయం పాటించగలం. ప్రస్తుతం ప్రభుత్వాతీత శక్తులన్నింటికీ శక్తి మంతమైన హింసాత్మక ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్దాడి దీనికో తార్కాణం. బలహీనులు, నిర్వా సితులు కూడా బలంగా దెబ్బకొట్టగలరు అనేందుకు ఇజ్రాయెల్‌పై దాడి ఒక రుజువు. ఉగ్రవాదంపై పోరు ఇప్పుడిప్పుడే అంతమయ్యేది కాదని 2023 మరోసారి నిరూపించింది. ఈ పోరు ఏకరీతిన లేదు. పైగా సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాజ్యాంగాలను పక్కనబెట్టిన అన్ని దేశాలూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, తిరుగుబాట్లను సమర్థంగా అణచివేసిన సంఘటనలు చరిత్ర మొత్తం వెతికినా కనిపించవూ అని! చిన్న రాపిడి మళ్లీ నిప్పు పుట్టించడం ఖాయం. ఫలితం తీవ్ర నష్టం, హింస. రాజకీయం ద్వారా హింసను చట్టబద్ధం చేయడం ఎంతమాత్రం తగని పని. అమాయ కులు, మహిళలు, పిల్లలను చంపివేయడాన్ని కూడా సమర్థించే లక్ష్యం ఎంతటి ఉదాత్తమైనదైనా సమర్థనీయం కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. హింసను ఆయుధంగా వాడుకోవడం ఎప్పుడూ పులి మీద స్వారీ లాంటిదే. హింస మొదలైతే అది కేవలం తాము ఉద్దేశించిన లక్ష్యాలకే పరిమితమవుతుందని అనుకోలేము. హింస అటు ఆక్రమణదారులనూ, ఇటు బాధితులనూ రాక్షసుల్లా మార్చేస్తుంది. ఈ సత్యాన్ని చాలాకాలం క్రితమే మహాత్మగాంధీ బాగా అర్థం చేసు కున్నారు. ‘అహింస’ భావన ఈ ప్రగాఢమైన అవగాహన నుంచి పుట్టిందే. గాంధీ మాటలను మనం ఎంత విస్మరిస్తామో ప్రపంచంలో అంతేస్థాయిలో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. ఒక్క సానుకూల పవనం... ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో చూసిన ఒక సానుకూల అంశం ఏదైనా ఉందీ అంటే అది దుబాయిలో ఇటీవలే ముగిసిన కాప్ సమావేశాలని చెప్పాలి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు మానవాళి జరుపుతున్న కృషిలో భాగంగా జరిగిన ఈ సమావేశాల్లో కొన్ని ఆశాజనకమైన ఒప్పందాలు, నిర్ణయాలు జరిగాయి. వీటిని సక్రమంగా అమలు చేయగలి గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సామాజిక సుస్థిరత దిశగా మళ్లే అవకాశాలు పెరుగుతాయి. వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని అందరూ అంగీకరించడం శుభపరిణామం. కృత్రిమ మేధతోపాటు వినూత్నమైన టెక్నా లజీలను అందిపుచ్చుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. 2023లో వాతావరణ మార్పుల విషయంలో జరిగిన ఒప్పందాలు, కల్పించిన ఆశ వచ్చే ఏడాదిలో సఫలీకృతమవుతాయని ఆశిద్దాం. దీన్ని పక్కనపెడితే... ప్రపంచం వచ్చే ఏడాది కూడా కొంత అసందిగ్ధ్దతను ఎదుర్కొంటుందనేందుకు కొన్ని నిదర్శనాలు కనిపి స్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేది 2024లోనే. ప్రస్తుతానికి డోనాల్డ్ ట్రంప్ పోటీ చేసే అవకాశాలు తగ్గాయి. అడ్డంకులు తొలిగి ట్రంప్ పోటీ చేసి గెలిస్తే మాత్రం అగ్రరాజ్యంలో సరికొత్త స్థానిక వాదం తలెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతోపాటు రష్యా ఉక్రెయిన్ జగడమూ వచ్చే ఏడాది మరింత ముదిరే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే విషయంలో అమెరికా కొంత అసందిగ్ధతతో వ్యవహరిస్తూండటాన్ని పుతిన్ గుర్తించక మానడు. తన దాడులను ఉధృతం చేయకుండా ఉండడు. అమెరికా ఏకకాలంలో రెండు యుద్ధాలను పర్యవేక్షిస్తూండటం, ఆ దేశంతో మనకున్న సంబంధాలపై కూడా ప్రభావం చూపనుంది. పైగా చైనాతో తనకున్న శత్రుత్వాన్ని కొంత తగ్గిగంచుకునే ప్రయ త్నాలు చేయవచ్చు. ఇప్పటికే దీనికి కొన్ని రుజువులు కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కారాదని బైడెన్ నిర్ణయించుకోవడం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే క్వాడ్ సమావేశాల వాయిదాను కూడా ఈ దృష్టితోనే చూడాల్సి ఉంటుంది. కెనెడా ఉగ్రవాది పన్నూ విషయంలో వచ్చిన అభిప్రాయబేధాలూ ఈ ధోరణికి కారణం కావచ్చు. సెప్టెంబరులో విజయవంతంగా నిర్వహించిన జీ20 సమావేశాల ప్రాభవం కాస్తా ఈ పరిణామాలతో తగ్గి పోయింది. మరోవైపు దేశంలోనూ సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. నరేంద్ర మోదీకి మరోసారి ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంది. ఈ రాజకీయ సుస్థిరత 2024లో అంతర్జాతీయ స్థాయిలో మనకు మేలు చేస్తుందని ఆశిద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
కొత్త ఏడాదిలో పెరగనున్న జీతాలు.. ఐటీ ఉద్యోగులకు పెరిగే శాలరీ ఎంతంటే?
దేశ వ్యాప్తంగా కొత్త ఏడాది ఎలా ఉండబోతుందోనని ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో వ్యాపార రంగానికి అనుబంధంగా ఉన్న అన్నీ విభాగాల నిపుణులు భవిష్యత్ గురించి విశ్లేషకుల అభిప్రాయాలు, అంచనాలు వెలుగులోకి వచ్చాయి. 2024లో తొలి ఆరు నెలల కాలంలో 39 లక్షల ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. మరి అదే సమయంలో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారి జీత భత్యాల పెరుగుదలపై ఆసక్తి మొదలైంది. ఊహించని పరిణామాలు అయితే ఉద్యోగార్ధులకు 2024 సంవత్సరంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. కంపెనీలకు ఆర్ధికపరమైన ఇబ్బందులు తప్పేలా లేవని.. వాటి నుంచి సురక్షితంగా ఉండేలా సిబ్బందికి ఇచ్చే బోనస్‌లు, ప్రమోషన్లకు ప్రభావితం చేసే ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉందని సమాచారం. పెరిగే జీతం ఎంతంటే? ఈ పరిణామాల దృష్ట్యా కంపెనీలు ఉద్యోగికి 8 శాతం నుండి 10 శాతం వరకు జీతం ఇంక్రిమెంట్లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా, కొన్ని కీలక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంకా ఎక్కువ జీతం ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇది అసమానతకు దారి తీస్తుంది అని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీఈఓ కార్తీక్ నారాయణ్ చెప్పారు. 2024లో జీతం పెంపుదల అంచనా గమనిక: ఈ గణాంకాలు బేసిక్ శాలరీ, పెరుగుదల, బోనస్‌లు, వేరియబుల్ పే లేదా ఇతర ప్రయోజనాలను కలిగి ఉండకపోవచ్చు. ఉద్యోగి అనుభవం, నైపుణ్యం ,కంపెనీ పనితీరు వంటి అంశాల ఆధారంగా ప్రతి సెక్టార్లో జీతం పెంపు ఉండకపోవచ్చని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
Zomato Orders 2023: వీళ్లు తిన్న నూడిల్స్‌తో భూమిని 22 సార్లు చుట్టిరావొచ్చు!
పాతొక రోత.. కొత్తొక వింత. పాశ్యాత్య సంస్కృతుల్ని, ఆహార సంప్రదాయాల్ని మనవాళ్లు ఇష్టపడుతుండడం కొత్త కాకపోవచ్చు. ఇప్పటికే వస్త్రధారణలో వెస్ట్రన్ కల్చర్‌ను దాటేసి పోయారు. తినే తిండిలోనూ అదే ధోరణిని కనబరుస్తున్నారు. సాక్ష్యం ఏంటంటారా?.. దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో అందుకు సమాధానాలు ఇస్తోంది. 2023 మరికొన్నిరోజుల్లో ముగియనున్న తరుణంలో ఆయా ఫుడ్ డెలివరీ సంస్థ ఏడాది మొత్తం మీద ఏ ఫుడ్ ఐటమ్‌ను ఎక్కువగా డెలివరీ చేశామని విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇటలీలో పుట్టిన పిజ్జా భారతీయులు అమితంగా ఇష్టపడే ఆహార వంటకంగా ప్రసిద్ధికెక్కుతోంది. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నివేదిక ప్రకారం.. 2023లో భోజన ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్ధాలలో బిర్యానీ, పిజ్జాలు వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి. ►తన ప్లాట్‌ఫామ్ మీద 10.09 కోట్ల బిర్యానీల కోసం ఆర్డర్ పెట్టుకుంటే, రెండో స్థానంలో ఉన్న పిజ్జాను 7.45 కోట్ల ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో తెలిపింది. ►తద్వారా ఈ ఏడాదిలో పెట్టిన బిర్యానీ ఆర్డర్లతో ఢిల్లీలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను, కోల్‌కతాలో ఉన్న ఐదు కంటే ఎక్కువ ఈడెన్ గార్డెన్ స్టేడియంలతో సమానమైన పిజ్జాలను ఫుడ్ లవర్స్ ఆర్డర్ పెట్టినట్లు పేర్కొంది. ► మూడవ స్థానంలో 4.55 కోట్ల నూడిల్స్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ లవర్స్ పెట్టిన ఆ నూడిల్స్ ఆర్డర్‌తో భూమిని 22 సార్లు చుట్టడానికి ఇది సరిపోతుందని డెలివరీ దిగ్గజం వెల్లడించింది. ►స్విగ్గీలో ఎక్కువగా కేక్‌లు ఆర్డర్ రావడంతో బెంగళూరు కేక్ కేపిటల్‌గా అవతరించింది. ఫుడ్ లవర్స్ ఈ ఏడాది అత్యధికంగా జొమాటోలో బ్రేక్ ఫాస్ట్‌ను ఆర్డర్ పెట్టుకోగా, ఢిల్లీకి చెందిన వినియోగదారులు ఎక్కువ మంది అర్ధరాత్రి ఆర్డర్ చేసుకున్నారు. ►జొమాటోకి ఈ ఏడాదిలో అత్యధికంగా బెంగళూరు నుంచి ఫుడ్ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క ఆర్డర్ ఖరీదు అక్షరాల రూ.46,273. అదే సమయంలో రూ.6.6లక్షల విలువ చేసే 1389 గిఫ్ట్ ఆర్డర్లు పెట్టారు. ఆ తర్వాత ముంబై వాసులు ఒక్కరోజే 121 ఆర్డర్లు పెట్టారు. నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో ముంబై నిలిచింది. ఈ ప్రాంతం నుంచి ఏడాది మొత్తం వరకు 3,580 ఆర్డర్లు రాగా.. రోజుకి కనీసం 9 ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో హైలెట్ చేసింది. బిర్యానీకి తిరుగులేదు వరుసగా 8వ సంవత్సరం సైతం స్విగ్గీలో ఎక్కువ బిర్యానీ ఆర్డర్ పెట్టినట్లు ఆ సంస్థ తన ఇయర్ ఎండర్ 2023 రిపోర్ట్‌లో తెలిపింది. ప్రతి సెకనుకు 2.5 బిర్యానీ ప్యాకెట్ల ఆర్డర్ ఇక దేశీయంగా ఉన్న ఫుడ్ లవర్స్ ప్రతి సెకండ్‌కు 2.5 బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్ పెట్టారు. వారిలో హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి ఏడాది మొత్తం మీద 1633 బిర్యానీ ఆర్డర్లు పెట్టాడు. దీంతో బిర్యానీని ఎక్కువగా తినే ఫుడీల జాబితాలో హైదారబాద్ వాసులు నిలిచారు. స్విగ్గీ ఆర్డర్లో ప్రతి 6వ ఆర్డర్ ఇక్కడే నుంచే రావడం గమనార్హం. 2023లో ముంబైకి చెందిన ఓ ఫుడ్ లవర్స్ రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు
కోవిడ్ పరిణామాల్లో దాదాపు అన్ని రంగాల సంస్థలు, తమ కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేశాయి. ఈకామర్స్ కొనుగోళ్లు అధికంగా జరిగాయి. లాక్డౌన్ల కారణంగా, ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న వారు సామాజిక మాధ్యమాలను, యూట్యూబ్‌లో వీడియోలను ఎక్కువగా తిలకించారు. ఆన్లైన్లోనే పాఠ్యాంశాలు బోధించే ఎడ్యుటెక్ సంస్థలకూ అమిత డిమాండ్ ఏర్పడింది. దీంతో సాంకేతిక నిపుణులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇందువల్లే అంతర్జాతీయ సంస్థలైన మెటా, గూగుల్, అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి వాటితో పాటు దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలతో పాటు చాలా స్టార్టప్ కంపెనీలు తమకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. 2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి..ఎందుకు తొలగించాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ‘లేఆఫ్స్.ఫై’ డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసిన స్టార్టప్‌లలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్‌చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్‌షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), సాప్ ల్యాబ్స్ (300), అప్‌గ్రేడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), డంజో (500), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్ట్రామార్క్ (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్‌బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), ఎంపీఎల్ (350) మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా.. ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 2,24,508 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం, కాస్ట్‌కటింగ్ వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి. -
Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!
ప్రపంచంలో 2023లో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వీటివల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ప్రపంచంలో వచ్చిన కొన్ని ప్రధాన భూకంపాల గురించి తెలుసుకుందాం..! ఫిబ్రవరి 6: టర్కీ-సిరియా భూకంపం ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ, మధ్య ప్రాంతంలో భూమి రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో కంపించింది. సిరియాలో ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 7.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూమిలోపల 95 కిమీ లోపల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ విపత్తులో అపార ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపంలో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 50,783 మంది కాగా.. సిరియాలో 8,476 మంది మృత్యువాతపడ్డారు. టర్కీ జనాభాలో 1.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని అంచనా. సుమారు 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. మార్చి 18: గుయాస్ భూకంపం, ఈక్వెడార్ దక్షిణ ఈక్వెడార్‌లో 2023 మార్చి 18న భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఎల్ ఓరో, అజువే, గుయాస్ ప్రావిన్స్‌లలో భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 446 మంది గాయపడ్డారు. 16 మంది మరణించారు. ఈక్వెడార్ జనాభాలో దాదాపు సగం మంది 8.41 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితులయ్యారు. దేశంలోని మొత్తం 24 ప్రావిన్సుల్లోని 13 ప్రావిన్సుల్లో భూమి కంపించింది. మార్చి 21: ఆఫ్ఘనిస్థాన్ భూకంపం 2023, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 1000 కిలోమీటర్ల వైశాల్యంలో భూమి కంపించింది. ఆప్ఘనిస్థాన్‌లోని 9 ప్రావిన్స్‌లలో ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితమయ్యారు. కనీసం 10 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. 665 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, క్వెట్టా, పెషావర్లలో ప్రకంపనలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో కారకోరం హైవే మూసుకుపోయింది. బునెర్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయి 40 మంది గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. సెప్టెంబరు 8: మొరాకో భూకంపం 2023 సెప్టెంబరు 8న మొరాకోలోని మరకేష్-సఫీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8-6.9 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 2,960 మంది ప్రాణాలు కోల్పోయారు. మరకేష్‌లోని చరిత్రాత్మక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్, అల్జీరియాలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. మొరాకో చరిత్రలో నమోదు చేయబడిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇది ప్రధానమైంది. 1960 అగాదిర్ భూకంపం తర్వాత దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. 2023లో టర్కీ-సిరియా భూకంపం తర్వాత ఇందులోనే అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. 1,00,000 మంది పిల్లలతో సహా మరకేష్, అట్లాస్ పర్వతాల పరిసర ప్రాంతాల్లో 2.8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అక్టోబర్ 7: హెరాత్ భూకంపం, ఆఫ్ఘనిస్తాన్ 2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడం భారీ నష్టాన్ని కలిగించింది. మొదటి రెండు భూకంపాలు అక్టోబర్ 7న హెరాత్ నగరానికి సమీపంలో సంభవించాయి. అక్టోబర్ 11, 15 తేదీల్లో అదే ప్రాంతంలో మరో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయి. ఈ భూకంపాల్లో 1,482 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,100 మందికి గాయాలయ్యాయి. 43,400 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1,14,000 మందికి మానవతా సహాయం అవసరమైందని అంచనా. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో సరైన ఆస్పత్రి సౌకర్యాలు అందలేదు. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నవంబర్ 3: నేపాల్ భూకంపం 2023 నవంబర్ 3న నేపాల్ కర్నాలీ ప్రావిన్స్‌లోని జాజర్కోట్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 375 మంది గాయపడ్డారు. పశ్చిమ నేపాల్, ఉత్తర భారతదేశం అంతటా భూప్రకంపనలు కనిపించాయి. 2015 నుంచి నేపాల్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. మరణాల్లో జాజర్కోట్ జిల్లాలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరణించిన వారిలో 78 మంది పిల్లలు కూడా ఉన్నారు. నేపాల్‌లోని పదమూడు జిల్లాల్లో దాదాపు 62,039 ఇళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో 26,550 ఇళ్లు కుప్పకూలాయి. నవంబర్ 17: మిండనావో భూకంపం, ఫిలిప్పీన్స్ 2023 నవంబర్ 17న ఫిలిప్పీన్స్ మిండనావో ద్వీపంలోని సారంగని ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 11 మంది మరణించారు. 730 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగున ఉన్న ఇండోనేషియాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 644 ఇళ్లు కూలిపోగా.. 4,248 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదీ చదవండి: Year End 2023: అన్నీ మంచి శకునములే! -
Year End 2023: అన్నీ మంచి శకునములే!
ఓజోన్ పొరకు గండి పూడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరుగుతోంది. పర్యావరణపరంగా వరుస దుర్వార్తల పరంపర నడుమ ఇలాంటి పలు సానుకూల పరిణామాలకు కూడా 2023 వేదికవడం విశేషం! బ్రెజిల్లో అమెజాన్ అడవుల క్షీణత బాగా తగ్గుముఖం పట్టడం మొదలు ఇటీవలి కాప్28 సదస్సులో కీలక పర్యావరణ తీర్మానం దాకా ముఖ్యమైన ఇలాంటి ఓ ఐదు పరిణామాలను గమనిస్తే... సంప్రదాయేతర ఇంధనోత్పత్తి పైపైకి... శిలాజ ఇంధనాలకు వీలైనంత త్వరగా స్వస్తి పలికితేనే గ్లోబల్ వారి్మంగ్ భూతాన్ని రూపుమాపడం సాధ్యమని పర్యావరణవేత్తలంతా ఎప్పటినుంచో చెబుతున్నదే. సౌర విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం ఇందుకున్న మార్గాల్లో ముఖ్యమైనది. ఈ విషయంలో 2023లో ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గ ప్రగతినే సాధించాయి. అంతర్జాతీయంగా సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ఈ ఒక్క ఏడాదే ఏకంగా 30 శాతం, అంటే 107 గిగాబైట్లకు పైగా పెరిగిందట! అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ మేరకు వెల్లడించింది. వాతావరణ కాలుష్య కారక దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న చైనాయే ఈ విషయంలోనూ అందరికంటే ముందుంది! చైనా సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గత జూన్ నాటికే మిగతా ప్రపంచ దేశాలన్నింటి ఉమ్మడి సామర్థ్యాన్ని కూడా మించిపోయిందని ఒక నివేదిక తేల్చడం విశేషం. అదే సమయంలో చైనాలో బొగ్గు ఉత్పత్తి కూడా కొద్ది నెలలుగా తారస్థాయికి చేరినా, త్వరలోనే అది బాగా దిగొస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తుండటం మరో సానుకూల పరిణామం. హాలోవీన్ వేడుక సందర్భంగా పోర్చుగల్ అక్టోబర్ 31 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు కేవలం సంప్రదాయేతర ఇంధన వనరులను మాత్రమే వినియోగించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఓజోన్ క్రమంగా కోలుకుంటోంది... అతినీల లోహిత కిరణాల వంటివాటి బారి నుంచి భూమిని కాపాడే కీలకమైన ఓజోన్ పొర కోలుకునే ప్రక్రియ 2023లో మరింతగా వేగం పుంజుకుంది. విచ్చలవిడి క్లోరోఫ్లోరో కార్బన్ల విడుదల తదితరాల కారణంగా ఓజోన్‌కు రంధ్రం పడిందని, అది నానాటికీ పెరుగుతోందని 1980ల నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరిగిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నట్టు వారు తాజాగా చెబుతున్నారు. ఇందుకోసం చేసుకున్న మాంట్రియల్ ఒప్పందం ప్రకారం క్లోరో ఫ్లోరో కార్బన్లకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కృషి ఇలాగే కొనసాగితే 2040 కల్లా ఓజోన్ పొర 1980లకు ముందునాటి స్థితికి మెరుగు పడటం ఖాయం’’ అని ఐరాస తాజా నివేదికలో హర్షం వెలిబుచి్చంది. అయితే అంటార్కిటికా మీద మాత్రం ఓజోన్‌కు పడ్డ రంధ్రం గతంతో పోలిస్తే మరింతగా విస్తరించిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెజాన్‌కు ఉద్దీపన అమెజాన్ అడవులను ప్రపంచం పాలిట ఊపిరితిత్తులుగా, ఆకుపచ్చని వలగా అభివరి్ణస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద వర్షాధారిత అడవులివి. బ్రెజిల్లో కొన్నేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా సాగుతూ వస్తున్న వాటి విచ్చలవిడి నరికివేతకు 2023లో భారీ బ్రేక్ పడింది. బ్రెజిల్ గురించే చెప్పుకోవడం ఎందుకంటే 60 శాతానికి పైగా అమెజాన్ అడవులకు ఆ దేశమే ఆలవాలం! గత జూలై నాటికే అక్కడ అడవుల నరికివేత ఏకంగా 22.3 శాతం దాకా తగ్గుముఖం పట్టిందట. గత ఆర్నెల్లలో ఇది మరింతగా తగ్గిందని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. 2030 నాటికి బ్రెజిల్లో అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని ప్రకటించిన నూతన అధ్యక్షుడు లులా డసిల్వా ఆ దిశగా గట్టి చర్యలే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోష్ పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచమంతటా దుమ్ము రేపుతున్నాయి. 2023లో వాటి అమ్మకాల్లో అంతర్జాతీయంగా విపరీతమైన పెరుగుదల నమోదైంది. అగ్ర రాజ్యం అమెరికాలోనైతే ఈవీల అమ్మకాలు ఆల్‌టైం రికార్డులు సృష్టించాయి! 2023లో అక్కడ 10 లక్షలకు పైగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. చైనాలో కూడా 2023లో మొత్తం వాహనాల అమ్మకాల్లో 19 శాతం వాటా ఈవీలదేనట! పలు యూరప్ దేశాల ప్రజలు కూడా వాటిని ఇబ్బడిముబ్బడిగా కొనేస్తున్నారు. అక్కడ 2022తో పోలిస్తే ఈవీల అమ్మకాల్లో 55 శాతానికి పైగా వృద్ధి నమోదైంది! మొత్తమ్మీద 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహన కొనుగోళ్లలో 15 శాతానికి ఈవీలేనని తేలింది. ప్రపంచ కాలుష్యంలో ఆరో వంతు వాటా రోడ్డు రవాణా వాహనాలదే. ఈ నేపథ్యంలో ఈవీలు ఎంతగా పెరిగితే ఈ కాలుష్యం అంతగా దిగొస్తుంది. శిలాజ ఇంధనాలపై తీర్మానం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానాన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఏకంగా 100కు పైగా దేశాలు దీనికి సంపూర్ణంగా మద్దతు పలకగా, ఈ దిశగా శక్తివంచన లేకుండా ప్రయతి్నంచాలని మరో 50 పై చిలుకు దేశాలు ఈ సదస్సు వేదికగా అభిప్రాయపడ్డాయి. గతంలోనూ పలు కాప్ సదస్సుల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా అవి చర్చల స్థాయిని దాటి తీర్మానం దాకా రాకుండానే వీగిపోయాయి. అందుకే ఇది చరిత్రాత్మక తీర్మానమని కాప్28 సదస్సుకు అధ్యక్షత వహించిన సుల్తాన్ అల్ జబర్ అభివరి్ణంచారు. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థలనే పునరి్నర్వచిస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. దీనికి దేశాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయన్న దానిపై భూగోళం భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టార్టప్‌లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే..
2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు మాత్రం కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో భారతదేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి, ఎందుకు తొలగించాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. Layoffs.fyi డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా బైజు సంస్థ రెండు విడతల్లో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్ తన ఆస్తులను తాకట్టుపెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసిన స్టార్టప్ కంపెనీలలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్‌చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్‌షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), SAP ల్యాబ్స్ (300), అప్‌గ్రాడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), Dunzo (300), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్ట్రామార్క్లు (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్‌బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), MPL (350) మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: రూ. 700లకే మహీంద్రా థార్! ఆనంద్ మహీంద్రా రిప్లై ఇలా.. ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 26,02,238 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి. -
భారత్‌లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 2022 కంటే 2023లో విపరీతంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన వాహనాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ కథనంలో ఈ సంవత్సరం మార్కెట్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎస్1 ఎక్స్ ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలై ఉత్తమ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'ఓలా ఎస్1 ఎక్స్'. రూ.89999 ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి డ్యూయెల్ టోన్ డిజైన్, సింగిల్ పీస్ సీటుతో, ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్, డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 91 కిమీ, 151 కిమీ రేంజ్ అందిస్తాయి. ఏథర్ 450ఎస్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఈ ఏడాది '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. మంచి స్పోర్టివ్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. 2.9 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). రివర్ ఇండీ ( River Indie) దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ'లో డ్యూయెల్ పాడ్ హెడ్‌లైట్ సెటప్, సింగిల్ పీస్ సీటు, 42 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులోని 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 120 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.25 లక్షలు. సింపుల్ డాట్ 1 బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో డిసెంబర్ 15న 'డాట్ వన్' (Dot One) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీతో 151 కిమీ రేంజ్(సింగిల్ ఛార్జ్) అందిస్తుంది. టీవీఎస్ ఎక్స్ రూ. 2.50 లక్షల ధర వద్ద ఈ ఏడాది విడుదలైన టీవీఎస్ ఎక్స్.. మార్కెట్లో లాంచ్ అయిన ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులో వర్టికల్లీ స్టేక్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, వైడ్ హ్యాండిల్ బార్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, 10.25 ఇంచెస్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇందులోని 3.8 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 140 కిమీ రేంజ్ అందిస్తుంది. -
2023 Roundup: స్టార్ డైరెక్టర్స్‌కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!
కళ్లు మూసి తెరిచేలోపు మరో ఏడాది పూర్తయిపోయింది. 2023 న్యూయర్ సెలబ్రేషన్స్ మొన్నే చేసుకున్నట్లు. ఇంతలోనే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఈ ఏడాది గడిచిపోయింది. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే 2023లో మాత్రం పలు అద్భుతమైన సినిమాలు రిలీజయ్యాయి. మూవీ లవర్స్‌తో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా చాలా సినిమాలకు ఫిదా అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో... స్టార్ డైరెక్టర్ ఈ ఏడాది తమకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో చెప్పేశారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్.. పఠాన్ (హిందీ- అమెజాన్ ప్రైమ్), సప్త సాగర ఎల్లో దాచే-రెండు భాగాలు (కన్నడ-అమెజాన్ ప్రైమ్), జవాన్ (హిందీ-నెట్‌ఫ్లిక్స్) సినిమాలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చాడు. 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. 'డాడా' (తమిళం) చిత్రం తనని బాగా మెప్పించిందని చెప్పుకొచ్చాడు. ఇది ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కొంకణ సేన్ శర్మ.. 'ద గ్రేట్ ఇండియా కిచెన్' (తమిళ-తెలుగు) సినిమా.. ఈ ఏడాది వచ్చిన వాటిలో తన ఫేవరెట్ అని చెప్పింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌కి అయితే జైలర్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), సప్త సాగర ఎల్లో దాచే సైడ్-ఏ (కన్నడ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు బాగా నచ్చాయని చెప్పాడు. మలయాళ స్టార్ డైరెక్టర్ జియో బేబీకి.. జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), B 32 ముతళ్ 44 వరే (మలయాళ) సినిమాలు బాగా నచ్చేశాయని చెప్పాడు. వీటిలో ఒకటి ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ అవినాష్ అరుణ్.. 12th ఫెయిల్ (హిందీ- హాట్‌స్టార్), రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (హిందీ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. కన్నడ దర్శకుడు హేమంత్ ఎమ్ రావు.. తమ తోటీ దర్శకులు తీసిన ఆచార్ అండ్ కో (కన్నడ-అమెజాన్ ప్రైమ్), హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (కన్నడ-జీ5) సినిమాలు బాగా నచ్చాయని అన్నాడు. ఇలా పలువురు స్టార్ దర్శకులకు నచ్చిన సినిమాలంటే కచ్చితంగా అవి బెస్ట్ మూవీస్ అయ్యింటాయ్. వీటిల్లో చాలావరకు మీరు చూసేసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే మాత్రం.. 2023 ముగిసేలోపు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయితే.. పవన్ బర్రెలాగా మారిపోయాడు: ఆర్జీవీ) -
2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్-10 జడ్జ్మెంట్స్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ ఏడాది కీలక తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్ వంటి పాలసీ నిర్ణయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు.. మోదీసర్కార్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ 10 జడ్జ్మెంట్స్ ఒకసారి చూద్దాం.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దుపై.. 2023 డిసెంబర్ 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వాదనలతో పూర్తిస్థాయిలో ఏకీభవించింది సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాదాపు 23 పిటిషన్లపై 16 రోజులపాటు ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ఆర్థికశాఖలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ డీమోనిటైజేషన్. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేస్తూ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. ఏడేళ్ల తర్వాత 2023లో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పెద్ద నోట్ల రద్దును సమర్థించింది. ఈ మేరకు 4-1 తేడాతో మెజార్టీ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ BV నాగరత్న ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకించారు. ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో.. కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని స్పష్టంచేసింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించగా.. ఎన్నికల కమిషనర్ల అప్పాయింట్మెంట్స్కు సంబంధించిన సవరణ బిల్లును.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తెచ్చింది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నేతతో కూడిన ప్యానెల్.. సీఈసీ, ఈసీలను ఎంపికే చేసేలా 1991 నాటి చట్టానికి కీలక సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు చేపట్టాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్ నివేదికతోపాటు ఆధారాలేమైనా ఉన్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. షార్ట్ సెల్లింగ్ కారణంగా మార్కెట్లు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని సెబీకి ఆదేశాలు జారీచేసింది. విద్వేషపూరిత ప్రసంగాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది సుప్రీంకోర్టు. దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంది.విద్వేష ప్రసంగాల కారణంగా దేశ లౌకికవాదం ప్రభావితం అవుతుందని.. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా..విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలంటూ సంచలనఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. వివాహ వ్యవస్థ, విడాకుల మంజూరుకు సంబంధించి ఈ ఏడాది కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారం ఉన్న డివోర్స్ కేసుల్లో ఆరు నెలల కంపల్సరీ గడువు అవసరం లేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. 6 నెలల సమయం వద్దని.. విడాకులు వెంటనే జారీచేయాలని సూచించింది సుప్రీంకోర్టు. విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. స్వలింగ సంపర్కలు వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై 2023 అక్టోబర్‌లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. LGBTQ+ కమ్యూనిటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. 21 పిటిషన్లను విచారించిన సీజేఐ జస్టిస్ DY.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. 3-2 తేడాతో తీర్పు ఇచ్చింది. స్వలింగ వివాహం చట్టం చేసే హక్కు కేవలం పార్లమెంట్‌కే ఉందని స్పష్టం చేసింది. జల్లికట్టు, కంబల. ఎద్దులబండి పందాల వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోవలేమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. 2023 మేలో ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎద్దుల బండి పోటీలను అనుమతిస్తూ.. ఆయా రాష్ట్రప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్ల దాఖలయ్యాయి. వీటిని విచారించింది సర్వోన్నత న్యాయస్థానం. సంప్రదాయ క్రీడలు మన సంస్కృతిలో భాగమని.. వాటికి అటంకం కలిగించలేమని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ జడ్జ్మెంట్స్ ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చిన సుప్రీంకోర్టు డీమోనిటైజేషన్‌పై ఏడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం సీఈసీ, ఈసీల నియామకానికి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సీజేఐ స్థానంలో కేబినెట్ మంత్రిని చేర్చిన కేంద్రప్రభుత్వం విదేశీ రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు సరికాదన్న సుప్రీం విద్వేషపూరిత ప్రసంగాలను తీవ్రమైన నేరంగా పేర్కొన్న సుప్రీంకోర్టు విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. వెంటనే విడాకులు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం నిరాకరణ 3-2 తేడాతో తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోలేమని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు -
ఆరంభం.. ముగింపు ఒకేలా! సౌతాఫ్రికా, టీమిండియాకు కన్నీళ్లు
Rewind: 2023... ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన రెండు జట్లకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడేసి.. సొంతగడ్డపై అభిమానుల మధ్య కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. వీటితో పాటు ఈ ఏడాది ప్రపంచ క్రికెట్లో చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాల గురించి తెలుసుకుందాం!! 1. ఆస్ట్రేలియా ముచ్చటగా మూడోసారి సౌతాఫ్రికా వేదికగా ఈ ఏడాది ఆరంభంలో మహిళల టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ జరిగింది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన తొమ్మిదవ ఎడిషన్‌లో సౌతాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఓటమితో టోర్నీని ఆరంభించినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే, మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా టైటిల్ గెలవాలన్న సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లింది. బెత్ మూనీ అర్ద శతకం(53)కు తోడు బౌలర్లు రాణించడంతో 19 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. కేప్‌టౌన్ వేదికగా ట్రోఫీ గెలుపొంది.. ఏకంగా మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. 2. డబ్ల్యూపీఎల్ ఆరంభం భారత మహిళా క్రికెట్లో సువర్ణాధ్యాయానికి 2023లో నాంది పలికింది బీసీసీఐ. టీ20 లీగ్ ఫార్మాట్లో వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మహిళా క్రికెటర్లను ఒక్క చోట చేర్చి ఐదు జట్లుగా విభజించి పోటీని నిర్వహించింది. ఐపీఎల్ మాదిరి వేలంలో క్రికెటర్లను కొనుగోలు చేసే అవకాశం ఫ్రాంఛైజీలకు ఇచ్చింది. ఇక ఈ చరిత్రాత్మక ఈవెంట్లో మొట్టమొదటి టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ వుమెన్ టీమ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు.. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీని ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. 3. ఆసియా కప్ విజేతగా టీమిండియా ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, తమ జట్టును అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లకు శ్రీలంకను వేదికగా నిర్ణయించింది. ఇక ఈ టోర్నలో పాకిస్తాన్ సూపర్-4 దశలోనే నిష్క్రమించగా.. టీమిండియా- శ్రీలంక ఫైనల్ చేరాయి. తుదిపోరులో రోహిత్ శర్మ సేన లంకను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సంచలన విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. 4. జనాలు లేని వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభ మ్యాచ్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ జరిగింది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది. అయితే, క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో వరల్డ్‌కప్ ఆరంభం పేలవంగా జరిగింది. ఎలాంటి హడావుడి, పెద్దగా ప్రేక్షకులు లేకుండానే తొలి మ్యాచ్ జరిగిపోయింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. 5. పసికూనలుగా వచ్చి.. సెమీస్ రేసులో నిలిచి వన్డే వరల్డ్‌కప్-2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా అడుగుపెట్టిన జట్టు అఫ్గనిస్తాన్. ఆరంభ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన అఫ్గన్.. ఆ తర్వాత జూలు విదిల్చిన సింహంలా చెలరేగింది. వరుసగా ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను ఓడించి చరిత్రాత్మక విజయాలతో సెమీస్ రేసులో తానూ ఉన్నాననే సంకేతాలు పంపింది. టాపార్డర్‌లో యువ బ్యాటర్లు రాణించడం, రషీద్ ఖాన్ నాయకత్వంలోని స్పిన్ దళ రాణించడం అఫ్గన్‌కు కలిసివచ్చింది. సెమీస్ చేరకపోయినా అద్భుత ప్రదర్శనలతో ఈసారి వరల్డ్‌కప్‌లో అఫ్గనిస్తాన్ తమదైన ముద్ర వేయగలిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కంటే మెరుగ్గా రాణించి మధుర జ్ఞాపకాలు మిగిల్చుకుంది. 6. ఒలింపిక్స్‌లో క్రికెట్ విశ్వక్రీడల్లో బ్యాటర్ల మెరుపులు.. బౌలర్ల దూకుడు చూడాలని కోరుకుంటున్న అభిమానుల కల త్వరలోనే నెరవేరనుంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ఈ ఏడాది ఆమోదం తెలిపింది. కాగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉంది. అయితే, ఆ తర్వాత మళ్లీ తిరిగి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఇక లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్లో పురుష, మహిళా జట్లు బరిలోకి దిగనున్నాయి. 7. మాక్సీ మాగ్జిమమ్ ఇన్నింగ్స్ వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ విధ్వంసకర ద్విశతకంతో చెలరేగాడు. సహచరులంతా చేతులెత్తేసిన వేళ.. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. తన చేతిలో ఏదో మంత్రదండం ఉందా అన్న అనుమానం కలిగేలా షాట్ల మీద షాట్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కండరాలు పట్టేయడంతో కదల్లేక క్రీజులో నిలబడిపోయినా మాక్సీ పట్టువీడక నభూతో అన్న చందంగా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ కమిన్స్ సహకారం అందిస్తుండగా.. 201 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 8. రికార్డుల రారాజు కిరీటంలో అరుదైన కలికితురాయి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదుతూ.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ శతకాల రికార్డుకు ఎసరుపెట్టిన కోహ్లి.. వన్డేల్లో అతడిని అధిగమించాడు. వన్డే ప్రపంచకప్-2023లో తన పుట్టినరోజు(నవంబరు 5) నాటి మ్యాచ్‌లో సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లి.. న్యూజిలాండ్‌తో సెమీస్ సందర్భంగా అతడి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో 50వ సెంచరీ నమోదు చేశాడు. 9. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా సొంతగడ్డపై వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి వరల్డ్‌కప్-2023 ఫైనల్‌కు చేరుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరంభంలో తడబడ్డా.. తమకే సాధ్యమైన రీతిలో పుంజుకుని ఏకంగా విశ్వవిజేతగా అవతరించింది. అహ్మదాబాద్‌లో లక్ష మందికి పైగా టీమిండియా అభిమానుల ప్రత్యక్షంగా చూస్తుండగా.. రోహిత్ శర్మ సేనను ఓడించి ఆరోసారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ట్రవిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చి వరల్డ్‌కప్ హీరోల జాబితాలో తన పేరునూ లిఖించుకున్నాడు. 10. ఆస్ట్రేలియాపై భారత్ తొలి టెస్టు గెలుపు భారత మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. బ్యాటర్లు, బౌలర్లు రాణించడంతో ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జయకేతనం ఎగురవేసింది హర్మన్‌ప్రీత్ బృందం. ఇక ఇంతవరకు ఇరు జట్ల మధ్య పదకొండు టెస్టులు జరుగగా.. నాలుగు ఆసీస్ గెలవగా.. ఒకటి భారత్ సొంతమైంది. ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. -
ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సినీతారలు వీళ్లే!!
మరో వారం రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. 2023కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వారిలో ప్రధానంగా వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి స్టార్ జంటలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ.. పెళ్లిబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. వరుణ్- లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మాదాపూర్‌లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) శర్వానంద్-రక్షితా రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటివాడయ్యాడు. జూన్ 2న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. శర్వానంద్ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం ఈ ఏడాది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికమెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్‌లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. భూమా మౌనిక 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) మానస్ - శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. ఈ బుల్లితెర నటుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించిన మానస్ తర్వాత సీరియల్స్‌తో పాటు యాంకరింగ్‌లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీతారలు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. మానస్ బిగ్‌బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన అతియాశెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ భామ అతియా శెట్టి- కేఎల్ రాహుల్. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. కేఎల్ రాహుల్‌తో మూడేళ్లపాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. వీరిద్దరి పెళ్లి ముంబై సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్‌శెట్టి ఫాంహౌస్‌లో జరిగింది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్‌ను టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లాడారు. అంతుకుముందే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన కుమారుడు అగస్త్య పాండ్యా సమక్షంలో నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిపెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఎంపీని పెళ్లాడిన హీరోయిన్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఈ జంట ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. చమ్కీలా అనే సినిమా షూటింగ్ పంజాబ్‌లో జరిగినప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగిన వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట బాలీవుడ్‌కు చెందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. రాజస్థాన్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఈ ఏడాది మరికొందరు సినీ తారలు కూడా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వారిలో రణ్‌దీప్ హుడా, స్వరాభాస్కర్, మసాబా గుప్తా లాంటి వారు కూడా ఉన్నారు. -
Roundup 2023: దూసుకెళ్లిన ఇస్రో
సాక్షి, న్యూఢిల్లీ : 2023కి గుడ్‌బై చెప్పే టైమ్ వచ్చేసింది. పాత జ్ఞాపకాలను తనలో దాచుకుని.. కొత్త ఏడాది వైపు వేగంగా పరుగులు తీస్తోంది టైమ్ మెషీన్. 2023లో భూమిపైనే కాదు అంతరిక్షంలోనూ సరికొత్త శిఖరాలను అందుకుంది భారత్. ఘనమైన విజయాలతో.. ఇస్రో గగన ప్రయాణంలో అత్యంత ప్రత్యేకంగా నిలిచిందీ సంవత్సరం. 2023 సంవత్సరం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకి ఒక మైలురాయి. అందని చందమామను అందుకోవడమే కాదు అనేక కీలక అచీవ్‌మెంట్స్‌ను ఖాతాలో వేసుకుంది ఇస్రో. ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఒకప్పుడు చిన్నచూపు చూసిన నాసా లాంటి సంస్థలు..కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపేలా అంతరిక్ష పరిశోధనల్లో సత్తా చాటింది. భారత ప్రభుత్వం..1969లో ఇస్రోను ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో అనేక అపజయాలు, అపహాస్యాలు చూసిందీ సంస్థ. నిధుల్లేక ప్రయోగాలు నిలిచిపోయిన ఉదంతాలెన్నో. అలాంటి పరిస్థితి నుంచి వరుస విజయాలు, కీలక మైలురాళ్లతో స్పేస్ సెక్టార్లో ఉవ్వెత్తున ఎగసింది ఇస్రో. ఈ గగన విజయంలో 2023 ఏడాది అత్యంత కీలకం. ప్రపంచ దేశాలు విస్తుపోయేలా అత్యంత క్లిష్టమైన, కీలక ప్రయోగాల్లో తనదైన స్టైల్లో సత్తా చాటింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ఉపరితలంపై ల్యాండింగ్ అనేది ఇప్పటివరకు ఎవరికి సాధ్యపడలేదు. అలాంటి చోట ఇస్రో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అంచలంచెలుగా ఒక్కో లోపాన్ని అధిగమించి విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రోకు.. 2023 బాగా కలిసొచ్చిన ఏడాదిగా చెప్పాలి. ప్రయోగాల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడంతోపాటు గొప్ప గొప్ప రికార్డులు ఇస్రో అకౌంట్లో పడ్డాయి. చంద్రయాన్ - 2 పాక్షిక విజయంతో 2019లో అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయిన ఇస్రో శాస్త్రవేత్తలు.. 2023లో సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతరిక్ష దిగ్గజాలుగా పేరొందిన దేశాలకు సైతం అందని ద్రాక్షగా మిగిలిపోయిన చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసి.. ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. అమెరికా, రష్యా, జపాన్ లాంటి దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టినా.. సౌత్ పోల్‌పై ల్యాండింగ్ చేయలేక పోయాయి. అలాంటి చోట ల్యాండింగ్ కావడం, అక్కడి విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది ఇస్రో. ఇక చంద్రయాన్ - 3 విజయయోత్సాహంలో ఉన్న ఇస్రో.. నెలల వ్యవధిలోనే మరో చరిత్రాత్మక ప్రయోగం చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్ 1ను నింగిలోకి పంపింది. ప్రస్తుతం నిర్దేశిత గమ్యం దిశగా ఆదిత్య ప్రయాణం కొనసాగుతోంది. 2023లో మొత్తం 8 ప్రయోగాలను చేపట్టింది ఇస్రో. అన్నీ ఘనవిజయాలే. అందుకే ఆరు దశాబ్దాల ఇస్రో ప్రయాణంలో 2023 ఏడాది చాలా ప్రత్యేకంగా మారింది. PSLV, GSLV, LVM3 లాంటి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న లాంచ్ వెహికల్స్ భారత్ వద్ద ఉన్నాయి. ఇక చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో నింగిలోకి పంపేందుకు సరికొత్త వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV రూపొందించింది ఇస్రో. 2022లోనే దీన్ని ప్రయోగించినా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 2023 ఫిబ్రవరిలో లోపాలను సవరించి విజయవంతం చేసింది ఇస్రో. ఇస్రో పరిశోధనలు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు సగం వనరులు ప్రైవేట్ పెట్టుబడుల నుంచే వస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా దీనిపై దృష్టిపెట్టింది. ఇన్‌స్పేస్ ద్వారా స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ వ్యక్తులకు తలుపులు తెరిచిన మోదీ సర్కార్.. ఆ దిశగా కీలక పురోగతి సాధిస్తోంది. ఇతర దేశాల శాటిలైట్లను విజయవంతంగా తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది ఇస్రో. వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇప్పటివరకు 4వేలకోట్లకుపైగా సంపాదించినట్టు కేంద్రం వెల్లడించింది. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే స్పేస్‌టెక్ స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేస్తోంది ఇస్రో. ఇప్పటికే మనవద్ద 200కి పైగా స్టార్టప్ కంపెనీలు స్పేస్ ఆధారిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2023 విజయాల స్ఫూర్తితో భవిష్యత్ లక్ష్యాలను ఘనంగా నిర్దేశించుకుంది ఇస్రో. 2025 ప్రారంభంలో గగన్‌యాన్ మిషన్ చేపట్టనుంది. మానవరూప మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిని సంబంధించి.. గగన్‌యాన్ ఫ్లైట్ టెస్ట్, క్రూ మాడ్యూల్ టెస్టులను ఇటీవలే విజయవంతంగా పూర్తిచేసింది. అలాగే వచ్చే నాలుగేళ్లలో చంద్రయాన్ -4 చేపట్టి.. చంద్రుడిపై నుంచి శిలలు భూమిపైకి తెచ్చే శాంపిల్ రిటర్న్ మిషన్‌కు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. 2035 నాటికి అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకోవడంతోపాటు 2040లో చంద్రుడిపైకి మనిషిని పంపాలని ఇస్రోకు బిగ్ టార్గెట్స్ ఇచ్చారు ప్రధాని మోదీ. మరోవైపు 2047లో ప్రతిష్టాత్మకమైన 'డీప్ సీ మిషన్' చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇస్రో. హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికి తీసేందుకు ఉద్దేశించిన ఈ మిషన్.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని పేర్కొంటున్నాయి ఇస్రో వర్గాలు. మొత్తానికి 2023 సంవత్సరం భారత అంతరిక్ష చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. ఇది మరింత ముందుకు సాగాలని.. ఇస్రో సమున్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు దేశ ప్రజలు. ఇదీచదవండి..చాట్‌జీపీటీకి పోటీగా జెమినీ -
2023 టాలీవుడ్లో టాప్-10 కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు
కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. మరో వారంలో 2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పేసి కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెట్టేస్తాము. ఇలాంటి సమయంలో గడిచిపోయిన సంవత్సరంలో మనమేం సాధించాం..? ఏం నష్టపోయాం..? అనే లెక్కలు వేసుకోవడం సహజం. సినిమా అనేది అందరినీ ఎంటర్టైన్ చేసే విభాగం.. అందుకే ఈ పరిశ్రమపై ప్రేక్షకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలున్నా కేవలం బాలీవుడ్‌కు మాత్రమే అందరూ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అక్కడి చిత్రాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ నటించిన వారికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. దీంతో మిగిలిన చిత్ర పరిశ్రమల పేర్లు కూడా అందరికీ తెలిసేవి కావు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బాలీవుడ్‌కు పోటీగా టాలీవుడ్ చిత్రపరిశ్రమ మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా 2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్-10లో ఉన్న చిత్రాల గురించి ఒకసారి చూద్దాం. కేవలం ఈ కలెక్షన్స్ వివరాలు టాలీవుడ్ పరిధి అంటే రెండు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గమనించగలరు. 1. 'వాల్తేరు వీరయ్య' మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో రవితేజ కీ రోల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్లో రూ. 160 కోట్ల రాబట్టి 2023లో విడుదలైన చిత్రాల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ పరంగా టాప్-1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 2. ఆదిపురుష్- ప్రభాస్ రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. 'ఆదిపురుష్'. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 393 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 133 కోట్లు రాబట్టింది. టాలీవుడ్లో 'వాల్తేరు వీరయ్య' కంటే కలెక్షన్స్ పరంగా 'ఆదిపురుష్' వెనకపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో ఉన్నా కూడా టాలీవుడ్లో మాత్రం రెండో స్థానానికి పరిమితం అయింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 3. వీరసింహా రెడ్డి - బాలకృష్ణ 2023 సంక్రాంతి బరిలో 'వీరసింహా రెడ్డి'తో బాలకృష్ణ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'కు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఈ రేసులో మెగాస్టారే పైచేయి సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 134 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 97 కోట్లు రాబట్టి మూడో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 4. భగవంత్ కేసరి- బాలకృష్ణ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో బాలయ్య రెండు హిట్ సినిమాలను అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 85 కోట్లు రాబట్టి నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 5. 'బ్రో'- సాయిధరమ్ తేజ్,పవన్ కల్యాణ్ సాయిధరమ్ తేజ్ ప్రధాన కథానాయకుడిగా పవన్ కల్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దీనిని డైరెక్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 114 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 82 కోట్లు రాబట్టి ఐదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 6. దసరా- నాని నాని పాన్ ఇండియా హీరోగా దసరా చిత్రంతో పరిచయం అయ్యాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కీర్తి సురేశ్ ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. నానికి ఇది తొలి పాన్ ఇండియా చిత్రంకావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 118 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 76 కోట్లు రాబట్టి ఆరో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 7. జైలర్- రజనీకాంత్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 604 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 68 కోట్లు రాబట్టి ఏడో స్థానం దక్కించుకుంది. రజనీకాంత్ కెరియర్లో ఆల్‌టైమ్ హిట్‌గా జైలర్ నిలిచింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 8.'బేబీ'- ఆనంద్ దేవరకొండ 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ప్రేమ కథా చిత్రం 'బేబీ' . సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్‌ను భారీగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 81 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 64 కోట్లు రాబట్టి ఎనిమిదో స్థానం దక్కించుకుంది. 9. విరూపాక్ష- సాయిధరమ్ తేజ్ సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' . శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్గా నటించింది. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతినిచ్చిన ఈ సినిమా సాయిధరమ్ తేజ్‌కు బిగ్గెస్ట్ను ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 89 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 63 కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 10. సలార్- ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా సలార్ ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతానికి (డిసెంబర్ 23) టాలీవుడ్లో రూ. 101కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన టాప్ టెన్ లస్ట్‌లో మూడో స్థానానికి సలార్ చేరుకున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద సలార్ కలెక్షన్స్ దూకుడు భారీగానే కొనసాగుతుంది. దీంతో సలార్ కలెక్షన్స్ క్లోజింగ్ అయ్యే సరికి టాప్-1 లోకి కూడా రావచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ డిజిటల్ రైట్స్‌ను సుమారు రూ.160 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలను ప్రముఖ సినీ ట్రేడ్ వర్గాల ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. -
2023 రౌండప్: బెడిసికొట్టిన రీమేక్.. భారీ డిజాస్టర్ చిత్రాలివే!
ఒకప్పుడు టాలీవుడ్లో రీమేకులు సర్వసాధారణం. ఇతర భాషల్లో రిలీజై సూపర్ హిట్ అయిన చిత్రాలన్నీ తెలుగులో రీమేక్ చేసేవారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునతో పాటు స్టార్ హీరోలంతా రీమేక్ చిత్రాల్లో నటించిన వారే. వాటిలో చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. కానీ ఓటీటీ రాకతో రీమేక్ చిత్రాల పని అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. అందుకే ఈ ఏడాది రీమేక్ చిత్రాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. భారీ నుంచి ఓ మోస్తరు చిత్రాలవరకు అన్ని రీమేకులు డిజాస్టర్స్‌గా నిలిచాయి. బోల్తా పడిన భోళా శంకర్ ఈ ఏడాది విడుదలై డిజాస్టర్ అయిన చిత్రాల్లో భోళా శంకర్ ముందు వరుసలో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్. అక్కడ అజిత్ ..ఇక్కడ చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళంలో ఈ కథ సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. చిరు కెరీర్లో దారుణమైన సినిమాల్లో భోళా శంకర్ ఒకటిగా నిలిచింది. భారీ నష్టాలు మిగిల్చిన ‘బ్రో’ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బ్రో’ మూవీ కూడా రీమేక. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సిత్తం చిత్రాన్ని కొద్దిగా మార్పులు చేసి బ్రోగా తెరకెక్కించాడు దర్శకుడు సముద్రఖని. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటన.. తమన్ సంగీతం ..ఏది ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. పవన్ కోసం చేసిన మార్పులు ఈ సినిమాను మరింత దెబ్బతీశాయి. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్‌గా ‘రావణాసుర’ పైకి చెప్పనప్పటికీ రావణాసుర కూడా రీమేక్ చిత్రమే. ‘విన్సీ డా’అనే బెంగాలీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్‌ని మాత్రమే తీసుకొని కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. తొలిసారి రవితేజ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన డిజాస్టర్‌గా నిలిచింది. కృష్ణవంశీ ఆశలపై నీళ్లు చల్లిన ‘రంగమార్తాండ’ చాలా కాలం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మరాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అయితే వచ్చాయి కానీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. కథ, కథనం, మేకింగ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌కి విరుద్ధంగా ఈ చిత్రం ఉండడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఆకట్టుకోలేకపోయిన ‘హంట్’ ఈ ఏడాది సుధీర్ బాబు చేసిన మరో ప్రయోగం హంట్. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ముంబై పోలీస్' అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం.. మక్కీకి మక్కీ తెరకెక్కించడం కారణంగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇవి మాత్రమే కాదు ఫిబ్రవరిలో విడుదలైన బుట్టబొమ్మ(మలయాళ మూవీ ‘కప్పేలా’ తెలుగు రీమేక్), నవంబర్‌లో రిలీజైన కోట బొమ్మాళి పీఎస్(మలయాళ సూపర్ హిట్ ‘నాయట్టు’ తెలుగు రీమేక్) చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు?
కశ్మీర్ అనే పేరు వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన ప్రదేశం కదలాడుతుంటుంది. అయితే ఇంతలోనే అక్కడ ఉగ్రవాదం నీడలు ఉన్నాయన్న వాస్తవం కూడా కళ్లముందుంటుంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది చేపడుతున్న చర్యలు తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెలకొన్న శాంతియుత పరిస్థితుల్లో కశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది(2023) దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది లోయలో మెరుగైన భద్రతా పరిస్థితికి తార్కాణంగా నిలిచిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అనడం సరైనదికాదన్నారు. ఇదిలా ఉండగా గురువారం పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీని గురించి విలేకరులు.. జితేంద్ర సింగ్‌ను అడిగినప్పుడు అలాంటి సంఘటనలను మరువలేమని, సంబంధిత ఏజెన్సీలు వాటిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కాగా పర్యాటకులు తమకు కశ్మీర్లో తగిన భద్రత ఉందని భావించినందునే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారని జితేంద్ర సింగ్ తెలియజేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
ఈ ఏడాది భారత్‌కు వెరీ బిగ్ ఇయర్
2023.. భారత్‌కు వెరీ బిగ్ ఇయర్. ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రపంచం జైకొట్టిన ఏడాది. విశ్వగురువుగా అవతరించిన ఏడాది. దేశానికి కొత్త ప్రజాస్వామ్య సౌధాన్ని అందించింది 2023. సొరంగం నుంచి యుద్ధభూమి వరకు.. భారతీయుడు కష్టంలో ఉంటే.. కేంద్రం కాపాడుతుందనే భరోసా ఇచ్చింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హెడ్‌లైన్స్, కీలక విషయాలను ఒకసారి చూద్దాం.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల కూటమి G20 శిఖరాగ్ర సదస్సుకు.. 2023 సెప్టెంబర్‌లో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ సౌత్‌కు లీడర్‌గా ఆవిర్భవించిన భారత్.. G20 అధ్యక్ష హోదాలో తన ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ అంశంతో కూడిన తీర్మానానికి ఏకాభిప్రాయం సాధించి.. విశ్వగురువుగా అవతరించింది. G20 కూటమి సందర్భంగా ఇండియా స్థానంలో మన దేశం పేరును కేంద్రం భారత్‌గా పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. 2023 జూన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు అధికారిక పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. వైట్‌హౌస్ వేదికగా ప్రధానికి అఫీషియల్ డిన్నర్ ఇచ్చారు బైడెన్ దంపతులు. ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసిందీ పర్యటన. 2023లో దేశ రాజకీయాల్లో తన సుప్రిమసీని మరింత పెంచుకుంది బీజేపీ. హిందీ హార్ట్‌ల్యాండ్‌లోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జెండా ఎగరేయడమే కాకుండా.. మిజోరంలోనూ సత్తా చాటింది. అంతకుముందు మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడంతోపాటు నాగాలాండ్, మేఘాలయలోనూ సంకీర్ణ సర్కార్‌లో చేరింది. ప్రస్తుతం సొంతంగా 12 రాష్ట్రాల్లో.. కూటమి భాగస్వామిగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారం చెలాయిస్తోంది కమలదళం. ఓవైపు బీజేపీ జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌కు మాత్రం కష్టకాలమే నడిచింది. 2023లోనూ హస్తరేఖలు మారలేదు. మోదీ ఇంటి పేరును కించపరిచిన పరువునష్టం కేసులో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిని కోల్పోవడం 2023 బిగ్ హెడ్‌లైన్స్‌లో ఒకటి. సూరత్ కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించడంతో.. మార్చి 23న లోక్‌సభ నుంచి అనర్హతకు గురయ్యారు రాహుల్. ఆగస్టు 7న ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది లోక్‌సభ సెక్రటేరియట్. 2023లో కీలకమైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి.. కర్ణాటక, తెలంగాణ విజయాలు స్వల్ప ఊరటనిచ్చాయి. 2023లో భారత రాజకీయాల్లో మరో కొత్త కూటమి ఆవిర్భవించింది. ప్రధాని మోదీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా 28 ప్రతిపక్ష పార్టీలు ఒకటయ్యాయి. ఈ కూటమికి ఇండియా నామకరణం చేశారు. I.N.D.I.A అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇక్లూజివ్ అలయెన్స్. ఇండియ కూటమి ఏర్పాటుతో యూపీఏ కాలగర్భంలో కలిసిపోయింది. 2023 ఏప్రిల్‌లో చైనాను వెనక్కి నెట్టి... జనాభాపరంగా ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని అందుకుంది భారత్. 142.86 కోట్లమందితో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. వృద్ధ జానాభాతో చైనా ఇబ్బందులు పడుతుంటే.. యువజనంతో భారత్ ముందడుగు వేస్తోందని పేర్కొంది ఐక్యరాజ్యసమితి జనాభా ఫండ్ నివేదిక. 2023 మే 28న భారత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరిగింది. దేశ సంస్కృతి సంప్రదాయాలు, ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ.. సరికొత్త ప్రజాస్వామ్య సౌధం కొలువుతీరింది. లోక్‌సభ స్పీకర్ పోడియం పక్కనే చారిత్రక సెంగోల్‌ను ప్రతిష్ఠించడం 2023కే బిగ్గెస్ట్ హైలైట్.ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో.. 41మంది నిర్మాణ కార్మికులు సొరంగంలో చిక్కుకుపోవడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. 2023 నవంబర్ 12న ఈ ప్రమాదం జరగ్గా.. అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా.. 16 రోజుల తర్వాత టన్నెల్ నుంచి కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఫైనల్ మిషన్‌ను లైవ్‌లో చూసిన ప్రధాని మోదీ.. బయటకు వచ్చిన కూలీలతో ఫోన్లో మాట్లాడారు. 2023లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన మరో అంశం.. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీపార్టీ కీలక నేతల అరెస్ట్. ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకుంది. ఈ ఇద్దరు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీయర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రెండుసార్లు సమన్లు జారీచేసింది ఈడీ. రెండు కీలక సంఘటనలకు 2023 ఏప్రిల్ నెల సాక్ష్యంగా నిలిచింది. ఏప్రిల్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, మీడియా సమక్షంలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఇద్దరినీ పాయింట్‌బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే, ఏప్రిల్ 23న ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ భద్రతాదళాలకు చిక్కాడు. బింద్రెన్వాలా 2.0గా ప్రచారం చేసుకుంటూ.. సిక్కు యువతను రాడికలిజంవైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్న అమృత్‌పాల్ కోసం నెలరోజులపాటు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పంజాబ్ పోలీసులు. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 850 మందికి పైగా గాయపడ్డారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా భావిస్తుండగా. కుట్రకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.2023లో దేశాన్ని కుదిపేసిన మరో సంఘటన మణిపూర్ అల్లర్లు. కుకీ-మైతేయీ జాతుల మధ్య వైరంతో రాష్ట్రం అట్టుడికింది. కుకీ-జోమి కమ్యూనిటీకి ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించగా.. ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నలు సంధించాయి విపక్షాలు. 2023 మాన్సూన్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాలు.. భారీ వర్షాలు వరదలతో విలవిల్లాడాయి. ఆకస్మిక వరదలు. కొండచరియలు విరిగిపడిన ఘటనలతో హిమాచల్ కకావికలమైంది. వందలమంది ప్రాణాలు కోల్పోగా..12వేలకోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా. ఇక యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని ఢిల్లీ 3రోజులపాటు వరద ముంపులో చిక్కుకుంది. 45ఏళ్ల తర్వాత డేంజర్ మార్క్ దాటి ప్రవహించింది యమునా నది. ఏడాది చివర్లో మిగ్జామ్ ఎఫెక్ట్‌తో కురిసిన భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమైంది. చివరగా డిసెంబర్ 13న దేశం ఉలిక్కిపడే ఘటన కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు లోక్‌సభలో అలజడి సృష్టించారు. పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి.. కలర్‌స్మోక్ వెదజల్లారు. పార్లమెంట్‌పై దాడి ఘటన 22వ వార్షికోత్సవం రోజు ఈ ఘటన జరగడం.. దేశాన్ని షాక్‌కు గురిచేసింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు డిమాండ్ చేశాయి ఇండియా కూటమి పార్టీలు. సభా మర్యాదను పాటించనందుకు.. అసాధారణ రీతిలో..ఉభయసభల నుంచి 143మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఢిల్లీ వేదికగా భారత్ అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు జూన్21-23 మధ్య ప్రధాని మోదీ అమెరికా స్టేట్ విజిట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కమలవికాసం ఈశాన్య భారతంలో మరింత బలం పెంచుకున్న బీజేపీ 2023లోనూ కాంగ్రెస్ పార్టీకి కష్టాలే మార్చి 23న రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం NDAకు పోటీగా కూటమి కట్టిన 28 ప్రతిపక్ష పార్టీలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ 2023 మే 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం 41 మంది కార్మికులు.. 16 రోజుల మెగా రెస్క్యూ ఆపరేషన్ ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియా అరెస్ట్ అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ ఏప్రిల్ 15న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ లైవ్ మర్డర్ ఏప్రిల్ 23న ఖలిస్థానీ నేత అమృతపాల్ సింగ్ అరెస్ట్ 2023 జూన్ 2న బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జాతుల మధ్య వైరంతో మణిపూర్‌లో మారణకాండ ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ విలవిల యమున ఉప్పొంగడంతో నీటమునిగిన ఢిల్లీ లోక్‌సభలో అలజడి సృష్టించిన ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ నుంచి 143మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ -
ఈ ముద్దుగుమ్మలు ఆడా లేరు...ఈడా లేరు!
ఈ ఏడాది కొంతమంది కథానాయికలను తెలుగు తెర మిస్సయింది. ఆ మాటకొస్తే తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాష తెరపైనా ఈ తారలు కనిపించలేదు. ఆడా లేరు.. ఈడా లేరు అన్నట్లు ఎక్కడా కనిపించకుండా ఆ నాయికలు ఏం చేస్తున్నారో చూద్దాం. ‘లవ్ స్టోరీ (2021)’, ‘శ్యామ్ సింగరాయ్ (2021)’, ‘విరాటపర్వం (2022)’ సినిమాలతో రెండేళ్లుగా తెలుగు తెరపై సందడి చేసిన సాయి పల్లవి ఈ ఏడాది మాత్రం సిల్వర్ స్క్రీన్‌కి దూరమయ్యారు. చెప్పాలంటే 2023లో నటిగా సాయిపల్లవి పూర్తిగా బ్రేక్ తీసుకున్నట్లే. ఎందుకంటే ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలేవీ తెలుగులోనే కాదు... ఇతర భాషల్లో కూడా విడుదల కాలేదు. 2022లో తమిళంలో చేసిన ‘గార్గి’ చిత్రం తర్వాత సాయి పల్లవి నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘తండేల్’, శివ కార్తికేయన్‌తో ఒక చిత్రం... సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలు ఇవే. ‘తండేల్’ షూటింగ్ జరుగుతోంది. శివ కార్తికేయన్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సో.. వచ్చే ఏడాది డబుల్ ధమాకాలా సాయి పల్లవి ఈ రెండు చిత్రాలతో థియేటర్స్‌లో సందడి చేస్తారు. హీరోయిన్గా ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’, ‘అంటే.. సుందరానికీ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, ‘బటర్ ఫ్లై’తో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఇలా.. 2022లో అనుపమా పరమేశ్వరన్ ఫుల్ ఫామ్‌లో కనిపించారు. కానీ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయలేదు. తెలుగులో అనుపమ చేస్తున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’ చిత్రం ఈ ఏడాది విడుదలకు ముస్తాబైనా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. దాంతో ఈ ఏడాది ఆమె కనిపించలేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో రవితేజ ‘ఈగల్’, తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ఉన్నాయి. ఇతర భాషల్లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. జనవరిలో ‘ఈగల్’, ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు స్క్వేర్’ విడుదలవుతాయి. చూస్తుంటే.. 2024లో అనుపమా పరమేశ్వరన్ ముచ్చటగా మూడు సార్లయినా వెండితెరపై మెరిసే అవకాశం ఉంది. గత ఏడాది రెండు తెలుగు సినిమాలు (పక్కా కమర్షియల్, థాంక్యూ), రెండు తమిళ సినిమాలు (తిరుచిత్రంబలం, సర్దార్)లతో కెరీర్లో దూకుడు పెంచినట్లుగా కనిపించారు రాశీ ఖన్నా. కానీ ఆ స్పీడ్‌కు ఈ ఏడాది స్పీడ్ బ్రేకర్ పడింది. రాశీ ఖన్నా సైన్ చేసిన హిందీ చిత్రం ‘యోధ’ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అలాగే తెలుగులో శర్వానంద్‌తో రాశీ ఖన్నా కమిట్ అయిన సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ఇలా రాశీ ఖన్నా వెండితెరపై మెరవలేకపోయారు. అయితేనేం.. తమిళంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్గా నటించిన ‘అరణ్మణై 4’, హిందీ ‘యోధ’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో.. వచ్చే ఏడాది రాశీ ఖన్నా జోరు మళ్లీ కనిపిస్తుంది. అన్నట్లు మరో మాట.. తెలుగులో ‘తెలుసుకదా’ అనే సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ ఓ హీరోగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇక గత ఏడాది ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్, తమిళంలో ‘కోబ్రా’ చిత్రంతో తెరపై కనిపించిన శ్రీనిధీ శెట్టి ఈ ఏడాది కనిపించలేదు. తెలుగులో ‘హీరో’, తమిళంలో ‘కలగ తలైవన్’ సినిమాలతో గత ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు నిధీ అగర్వాల్. కానీ ఈ ఏడాది మాత్రం స్లో అయ్యారు. ఈ ఏడాది ఆమె హీరోయిన్గా నటించిన ఏ చిత్రం ఏ భాషలో కూడా వెండితెరపైకి రాలేదు. నిధి నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. నాని ‘గ్యాంగ్‌లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ సుపరిచితురాలే. గత ఏడాది ‘ఈటీ’, ‘డాన్’ వంటి తమిళ చిత్రాలతో వెండితెరపై మెరిశారామె. అయితే ఈ యంగ్ బ్యూటీ కూడా ఈ ఏడాది వెండి తెరపై కనిపించలేదు. ప్రియాంక హీరోయిన్గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ఈ ఏడాది రిలీజ్‌కు షెడ్యూలై, ఆ తర్వాత సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. అలా ఈ ఏడాదిని మిస్ అయ్యారు ప్రియాంక. ప్రస్తుతం తెలుగులో ‘సరిపోదా శనివారం’, ‘ఓజీ’, తమిళంలో ‘బ్రదర్’ చిత్రాలు చేస్తున్నారు ప్రియాంకా అరుళ్ మోహన్. -
2023లో ఎక్కువగా ఈ కార్ల కోసమే సెర్చ్ చేశారు
టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో ఎప్పుడు ఏం కావాలన్నా గూగుల్ సెర్చ్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ ఏడాది (2023లో) ఎక్కువ మంది గూగుల్‌లో ఏ కార్ల కోసం సెర్చ్ చేశారు, ఎన్ని దేశాల్లో సెర్చ్ చేశారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 👉2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన కార్ బ్రాండ్స్ జాబితాలో ప్రధానంగా జపనీస్ కార్ల తయారీ సంస్థ 'టయోటా' అగ్రస్థానం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 64 దేశాల్లో ఈ బ్రాండ్ కార్ల కోసం శోధించినట్లు తెలుస్తోంది. 👉ఆ తరువాత స్థానంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉంది. టెస్లా బ్రాండ్ కార్లను ప్రపంచంలోని సుమారు 29 కంటే ఎక్కువ దేశాలలో సెర్చ్ చేసినట్లు సమాచారం. ఇందులో కూడా ఎక్కువ టెస్లా మోడల్ 3, మోడల్ వై, సైబర్ ట్రక్ కోసం శోధించినట్లు సమాచారం. 👉ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన కంపెనీ బీఎండబ్ల్యూ. ప్రపంచంలోని 29 కంటే ఎక్కువ దేశాలలోని ప్రజలు ఈ బ్రాండ్ కార్ల కోసం సెర్చ్ చేశారని తెలుస్తోంది. గత ఏడాది ఎక్కువ సెర్చింగ్స్ పొందిన రెండవ కంపెనీకి నిలిచిన BMW ఈ ఏడాది మూడవ స్థానంలో నిలిచింది. 👉నాలుగవ స్థానంలో నిలిచిన 'ఆడి' కార్ బ్రాండ్ కోసం 7 దేశాల్లోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు సమాచారం. గత ఏడాది మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆడి సెర్చింగ్ విషయంలో నాల్గవ స్థానంలోనే నిలిచింది. 👉ఇక చివరగా ఐదవ స్థానం పొందిన కంపెనీ మెర్సిడెస్ బెంజ్. గత ఏడాది మూడవ స్థానం పొందిన బెంజ్.. ఈ ఏడాది 5వ స్థానంలో చేరింది. కేవలం ఆరు దేశాలలో మాత్రమే ఎక్కువగా ఈ కార్లను సెర్చ్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. -
ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!) ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్‌బీర్ కపూర్ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు. కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!) -
భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే..
ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మాత్రమే కాకుండా రియర్ ఎస్టేట్ రంగం కూడా బాగా ఊపందుకుంది. 2023వ సంవత్సరంలో అపార్ట్మెంట్లకు గిరాకీ భారీగా పెరిగిందని 'జేఎల్ఎల్ ఇండియా' (JLL India) వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో మొత్తం రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. గతం కంటే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరుగుతాయని, 2023 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాలు 1,96,227 యూనిట్లు అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2022 ఇదే సమయంలో మొత్తం విక్రయాన్ని 1,61,575 యూనిట్లు మాత్రమే అని కూడా నివేదికలో వెల్లడైంది. వచ్చే ఏడాదికి అపార్ట్మెంట్ అమ్మకాలు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా భావిస్తోంది. మార్కెట్లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 2024లో కూడా సేల్స్ తారా స్థాయికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే! అపార్ట్మెంట్స్ ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో దేశంలో హోసింగ్ మార్కెట్ సజావుగా ముందుకు సాగుతుందని జేఎల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ 'సమంతక్ దాస్' తెలిపారు. రానున్న రోజుల్లో ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే
2023.. టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మిషన్ విరాట్ కోహ్లికి చాలా ప్రత్యేకం. ఈ ఏడాది విరాట్‌కు తన జీవితాంతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన ఏడాది ఇది. ఎవరికి సాధ్యం కాదనుకున్న వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లి.. తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 50 సెంచరీలు చేసిన విరాట్.. వరల్డ్‌క్రికెట్‌లో తానే కింగ్ అనే మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో విరాట్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డుతో పాటు మరిన్నో అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాదిలో కోహ్లి సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం. క్రిస్ గేల్ రికార్డు బద్దలు.. ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ కోహ్లి సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో విరాట్ రెండు అద్భుతమైన సెంచరీలతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో 7 సెంచరీలు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(6) పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్‌తో గేల్ ఆల్‌టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. తొలి ఆటగాడిగా.. ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 7000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు 229 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 7263 పరుగులు కోహ్లి చేశాడు. సచిన్ రికార్డు బ్రేక్.. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్లో 1000కుపైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్(7) ఆల్‌టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. 765 పరుగులతో.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023 విరాట్ కోహ్లి దుమ్మురేపాడు. 11 మ్యాచ్‌లు ఆడి 765 పరుగులతో టోర్నీ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా వన్డే వరల్డ్‌కప్ ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్(674)ను అధిగమించాడు. పాకిస్తాన్‌పై వరల్డ్ రికార్డు.. వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఆసియాకప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను బ్రేక్ చేశాడు. సచిన్ 321 ఇన్నింగ్స్‌లలో ఈ మైలు రాయిని అందుకోగా.. కోహ్లి కేవలం 267 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి 3.O.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. 2019-2022 ఏడాది మధ్య గడ్డు పరిస్ధితులను ఎదుర్కొన్నాడు. ఒకనొక దశలో జట్టులో కోహ్లి అవసరమా అన్న స్ధితికి దిగజారిపోయాడు. ఇటువంటి సమయంలో దెబ్బతిన్న సింహంలా కోహ్లి అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గతేడాది డిసెంబర్లో ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసిన విరాట్.. తన 1000 రోజుల నిరీక్షణకు తెరదించాడు. ఇక అప్పటినుంచి కోహ్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ఏడాదిని సెంచరీతో ఆరంభించిన కోహ్లి పరుగులు వరుద పారించాడు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 27 వన్డేలు, 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. వరుసగా 1377, 557 పరుగులు చేశాడు. ఓవరాల్ ఈ ఏడాదిలో 8 సెంచరీలు విరాట్ సాధించాడు. కాగా గతేడాది టీ20 వరల్డ్‌కప్ నుంచి ఇప్పటివరకు భారత తరపున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అదొక్కటే.. ఈ ఏడాదిలో ఇన్ని ఘనతలు సాధించిన కోహ్లికి ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్ ట్రోఫిని ముద్దాడాలన్న కోహ్లి కల మాత్రం నెరవేరలేదు. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా ఆఖరి మొట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తా పడింది. ఓటమి అనంతరం కోహ్లి కన్నీరు పెట్టుకున్నది అభిమానులు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. -
హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్ రేట్.. మహిళలపై 12 శాతం పెరిగిన నేరాలు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ గత ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ ఇయర్ ఎండింగ్ మీడియా సమావేశం శుక్రవారం జరిగింది. యానివల్ క్రైం రౌండప్ బుక్‌ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ సమావేశంలో జాయింట్, అడిషనల్ సీపీలు , డీసీపీలు పాల్గొన్నారు. నగరంలో నేరాలకు సంబంధించిన వివరాలు.. హైదరాబాద్‌లో 24,821 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 2 శాతం పెరిగిన క్రైమ్ రేట్ 9% పెరిగిన దోపిడీలు , మహిళలపై 12 % పెరిగిన నేరాలు గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 19 % పెరిగిన రేప్ కేసులు గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12 % తగ్గిన నేరాలు వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు , పొగొట్టుకున్న సొత్తులో 75 % రికవరీ హత్యలు 79 , రేప్ కేసులు 403 , కిడ్నాప్ లు 242, చీటింగ్ కేసులు 4,909 రోడ్డు ప్రమాదాలు 2,637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదు ఈ ఏడాది 63 % నేరస్తులకు శిక్షలు 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు ఈ ఏడాది 83 డ్రగ్ కేసుల్లో 241మంది అరెస్ట్ గత ఏడాది తో పోలిస్తే ఈఏడాది 11 % పెరిగిన సైబర్ నేరాలు ఈ ఏడాది ఇన్వెస్టమెంట్ స్కీమ్ ల ద్వారా 401 కోట్లు మోసాలు మల్టిలెవల్ మార్కెటింగ్ 152 కోట్లు మోసం ఆర్థిక నేరాలు 10 వేల కోట్లు కు పైగా మోసం ల్యాండ్ స్కామ్ లల్లో 245 మంది అరెస్ట్ సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన 650 మంది అరెస్ట్ పీడీ యాక్ట్ 18 మందిపై నమోదు ట్రాఫిక్ కేసులు ఇలా.. డ్రంక్ డ్రైవ్ లో 37 వేల కేసులు నమోదయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డ్రంక్ డ్రైవ్ ద్వారా రూ.91 లక్షలు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లఘించినవారి 556 డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదా ద్వారా మరణాలు 280 నమోదు కాగా.. అందులో పాదచారులు 121 మంది ఉన్నారు. మైనర్ డ్రైవింగ్స్ 1,745 కేసులు నమోదు అయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన రూ. 2.63 లక్షల మందికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ అనే మాట వినపడొద్దు.. ఈ ఏడాది మత్తు పదార్థాలు వాడిన 740 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు ఉన్నట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేస్తామని చెప్పారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకునేందుకు రెండు స్నిపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇదీ చదవండి: ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం -
ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..
కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్ మోడల్ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్ మోడల్ ఐడియాతో మార్కెట్లో లిస్ట్‌అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్ ఐపీఓల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్ఈడీఏ, సియెట్ డీఎల్ఎం, టాటా టెక్నాలజీస్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్‌లో టాప్‌లో ఇండియన్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఈడీఏ) నిలిచింది. నవంబర్‌లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడవుతోంది. పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్ టీఎల్ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ గెయిన్స్‌తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్ నిలిచింది. జులైలో ఈ కంపెనీ ఐపీగా లిస్ట్ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది. -
2023లో భారత్‌లో అడుగుపెట్టిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈవీలనే లాంచ్ చేయడానికి సుముఖత చూపుతున్నాయి. 2023లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లోటస్ ఎలెట్రా (Lotus Eletre) ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు 'లోటస్ ఎలెట్రా'. నవంబర్ 2023న అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్లు. ఈ కారు కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 265కిమీ. సింగిల్ చార్జితో 600 కిమీ ప్రయాణించే ఈ కారు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5) హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 దేశీయ మార్కెట్లో 2022లో అడుగు పెట్టినప్పటికీ 2023లో అధికారిక ధరలు వెల్లడయ్యాయి. 2023లో భారతీయ విఫణిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింగిల్ చార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉంటుంది. 2023 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (2023 Tata Nexon EV Facelift) దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే ఈ కారు ప్రారంభం నుంచి ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తోంది. సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందించే ఈ కారు ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు. ఎంజీ కామెట్ (MG Comet) ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరకు లభించే ఎంజి ఈవీ కామెట్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. రూ. 7.89 లక్షల వద్ద లభించే ఈ కారు సింగిల్ చార్జితో 230కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు టాటా టియాగో ఈవీ, సిట్రోయిన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. సిట్రోయిన్ ఈసీ3 (Citroen EC3) 'సిట్రోయెన్ సీ3'తో భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్.. ఈ ఏడాది రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ఈసీ3 విడుదల లాంచ్ చేసింది. సింగిల్ చార్జితో 320కిమనీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచేలా తయారైంది. -
2023లో మగువలు మెచ్చిన బెస్ట్ స్కూటర్లు.. ఇవే!
Best Scooters For Womens: భారతదేశంలో రోజురోజుకి లెక్కకు మించిన టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో మగవారికి నచ్చినవి, మహిళకు నచ్చినవి రెండూ ఉన్నాయి. ఈ కథనంలో మహిళలకు ఇష్టమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? వివరాలు ఏంటి అనే సమాచారం వివరంగా చూసేద్దాం.. హోండా యాక్టివా జి6 (Honda Activa G6) దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న 'హోండా యాక్టివా జి6' మగువలు మెచ్చిన టాప్ స్కూటర్లలో ఒకటని చెప్పవచ్చు. ఇది కొంత ఖరీదైన స్కూటర్ అయినప్పటికీ.. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి, ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధరలు రూ. 77,710 నుంచి రూ. 84,207 వరకు (ఎక్స్ షోరూమ్) ఉంది. టీవీఎస్ జుపీటర్ (TVS Jupiter) టీవీఎస్ కంపెనీకి చెందిన జుపీటర్ కూడా ఎక్కువ మంది మహిళకు ఇష్టమైన మోడల్. రూ. 76,738 నుంచి రూ. 91,739 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ స్కూటర్ డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగిన జుపీటర్ 7.88 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) మంచి రైడింగ్ అనుభూతిని అందించే స్కూటర్ల జాబితాలో ఒకటైన సుజుకి యాక్సెస్ 125 రూ. 82,171 రూ. 92,271 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ మంచి అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. 50 నుంచి 62 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్, 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా డియో (Honda Dio) అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలు పొందిన హోండా డియో మహిళలకు బాగా నచ్చిన మరో మోడల్. రూ. 74,231 నుంచి రూ. 81,732 మధ్య లభించే ఈ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ కలిగి 7.76 పీఎస్ పవర్, 9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ మంచి రైడింగ్ అనుభూతిని అందించే కారణంగానే కొనుగోలుదారులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! టీవీఎస్ స్కూటీ జెస్ట్ (TVS Scooty Zest) మన జాబితాలో మహిళలకు ఇష్టమైన మరో స్కూటర్ టీవీఎస్ కంపెనీకి చెందిన 'స్కూటీ జెస్ట్'. దీని ధర రూ. 71,636 నుంచి రూ. 73,313 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగి 7.81 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఈ స్కూటర్ సింపుల్ డిజైన్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
ఈ ఏడాది నిర్మాతలుగా డామినేట్ చేసిన మహారాణులు
‘అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తి కావాల్సిందే... ప్లాన్ తప్పకూడదు’ అని హుకుం జారీ చేయాలంటే చేసే పని మీద ప్రేమ, శ్రద్ధ... ఈ రెంటికీ మించి ధైర్యం, ఆత్మవిశ్వాసం లాంటివి కూడా ఉండాలి. ముఖ్యంగా ‘మేల్ డామినేటెడ్’ ఇండస్ట్రీస్‌లో ఒకటైన సినిమా పరిశ్రమలో ‘ఫీమేల్ప్రొడ్యూసర్’ రాణించాలంటే తెగువ కావాలి. అవసరమైనప్పుడు రాణిలా హుకుం జారీ చేయాలి. సున్నితంగా పనులు చక్కబెట్టడంతో పాటు కఠినంగానూ ఉండాలి. అలా రెండు రకాలుగా ఉంటూ... ‘మేం రాణిస్తాం’ అంటూ ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి వచ్చిన కొందరు ఫీమేల్ ప్రొడ్యూసర్ క్వీన్స్ గురించి తెలుసుకుందాం. హీరోయిన్గా యాభైకి పైగా సినిమాలు చేశారు సమంత. అగ్రశ్రేణి నటిగా ప్రేక్షకులు కితాబులిచ్చారు.ఇప్పుడు ‘ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన కథలను ఈ నిర్మాణ సంస్థ వేదికగా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నామని సమంత పేర్కొన్నారు. ► ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రి బాటలో నిర్మాత అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఇప్పటికే 50కి పైగా సినిమాలు నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల నిర్మాతగా ఆయనకు పేరుంది. ఇక ‘దిల్’రాజుప్రొడక్షన్స్ స్థాపించి ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ నిర్మించిన హన్షిత తొలిసారి ‘బలగం’ సినిమా నిర్మించి, బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకునిగా మారారు. ఈ ఏడాది మార్చి 3న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్నట్లు.. ‘బలగం’కి హర్షిత్ రెడ్డి మరో నిర్మాత. ఇక ఆ మధ్య రెండు చిత్రాలు ఆరంభించిన ఈ నిర్మాతలు మంగళవారం మరో చిత్రాన్ని ఆరంభించారు. ► ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర ‘మ్యాడ్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 6న రిలీజై, హిట్‌గా నిలిచింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను బాగా నవ్వించింది. తొలి చిత్రంతోనే అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నారు హారిక. ► తండ్రి నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. ఇక కూతురికి సినిమాలంటే ఫ్యాషన్. ఆ∙ఇష్టంతో ‘మంగళవారం’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలి విజయం అందుకున్నారు స్వాతీ రెడ్డి. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా గత నెల 17న విడుదలై హిట్‌గా నిలిచింది. ► మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక (నాగబాబు కుమార్తె) అటు నటన, ఇటుప్రొడక్షన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ నిర్మించిన ఆమె తొలిసారి ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా యాదు వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయమవుతుండటం విశేషం. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ► శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసుతో కలిసి విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న విడుదలైన ఈ పొలిటికల్, పోలీస్ బ్యాక్‌డ్రాప్ మూవీ హిట్‌గా నిలిచింది. ► నటిగా, గాయనిగా, నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాతగా మారి, ‘కలశ’ చిత్రాన్ని నిర్మించారు. భానుశ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొండ రాంబాబు దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. చిన్న బడ్జెట్ చిత్రమైనా కాన్సెప్ట్ బాగుందనిపించుకుంది. ► పాయల్ సరాఫ్కి సినిమా నేపథ్యం లేదు. అయితే నిర్మాత కావాలన్నది ఆమె కల. ‘భరతనాట్యం’ చిత్రంతో నిర్మాతగా మారారామె. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్యతేజ ఏలే హీరోగా, మీనాక్షీ గోస్వామి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ‘‘షూటింగ్ లొకేషన్లో అమ్మాయిలు తక్కువగా ఉంటారు. మనం అమ్మాయి అనే విషయాన్ని మరచిపోయి మన పని మనం శ్రద్ధ చేయగలిగితే సక్సెస్ గ్యారంటీ’’ అంటున్నారు పాయల్ సరాఫ్. -
2023 రౌండప్: ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాలు ఇవే!
మనకు ఏ డౌట్ వచ్చినా గూగుల్ మీదే ఆధారపడతాం.. సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలన్నా గూగులమ్మనే ఆశ్రయిస్తాం. దాదాపు అన్ని ప్రశ్నలకు వీలైనన్ని ఎక్కువ సమాధానాలిచ్చుకుంటూ పోతూనే ఉంటుందీ సెర్చ్ ఇంజన్. అలా గూగుల్‌లో ఈ ఏడాది చాలామంది కొన్ని సినిమాల గురించి తెగ వెతికేశారట. 2023లో ఇండియాలో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాలివే అంటూ గూగుల్ తాజాగా ఓ జాబితాను రిలీజ్ చేసింది. ఆ సినిమాలేంటి? అందులో సౌత్‌నుంచి ఎన్ని ఉన్నాయి? ర్యాంకులవారీగా ఓ లుక్కేయండి.. ఈ ఏడాదికిగానూ ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాలు ► 1. జవాన్ ► 2. గదర్ 2 ► 3. ఓపెన్‌హైమర్ ► 4. ఆదిపురుష్ ► 5. పఠాన్ ► 6. ది కేరళ స్టోరీ ► 7. జైలర్ ► 8. లియో ► 9. వారిసు/ వారసుడు ► 10. టైగర్ 3 ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 షోలు, వెబ్ సిరీస్‌లు.. ► 1.ఫర్జి ► 2. వెడ్నస్డే ► 3. అసుర్ ► 4. రానా నాయుడు ► 5. ద లాస్ట్ ఆఫ్ అస్ ► 6. స్కామ్ 2003 ► 7. బిగ్‌బాస్ 17 ► 8. గన్స్ అండ్ గులాబ్స్ ► 9. సెక్స్/ లైఫ్ ► 10. తాజా ఖబర్ చదవండి: Vyooham: ఓటీటీలో వ్యూహం.. అప్పటినుంచే స్ట్రీమింగ్! -
ఈ ఏడాదిలో తొలి సినిమాతోనే హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్లు
ఈ ఏడాది సినిమా డైరీ చివరి పేజీలకు చేరుకుంది. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కొత్త దర్శకులు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. ఈ ఏడాదలో ఎక్కువగా చిన్న చిత్రాలే మెప్పించాయి. ఏడాది తెరపై తొలి సినిమాతోనే విజయం సాధించిన డైరెక్టర్లు ఉన్నారు. నేడు ఓటీటీలు యుగం నడుస్తోంది. దీంతో తెలుగు సినిమాలతో పాటు పర భాష చిత్రాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. అలా సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో 2023లో పరిచయం అయిన కొత్త కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం పదండి. మారుతున్న సినీప్రియుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కథలతో వినోదాలు వడ్డించడంలో కొత్త దర్శకులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే కొత్త ప్రతిభ తెరపై మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా వారి వైపు ఓ కన్నేస్తుంటారు. అలా ఈ ఏడాది మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు ఎవరో తెలుసుకోండి. దసరా- శ్రీకాంత్ ఓదెల నేచురల్ స్టార్ నాని- కీర్తి సురేష్ జోడిగా నటించిన చిత్రం దసరా... శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2023 మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని కెరీర్‌లోని హిట్ సినిమాల లిస్ట్‌లో చేరింది. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు డైరెక్టర్ సుకుమార్ టీమ్‌లో శ్రీకాంత్ ఓదెల పనిచేశాడు. అదే సమయంలో దసరా కథను రెడీ చేసిన శ్రీకాంత్.. నిర్మాత సుధాకర్ చెరుకూరికి వినిపించడం ఆపై అది కాస్త నానికి నచ్చడం చకచక పనులు జరిగిపోయాయి. అలా మొదటి చిత్రంతోనే పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు శ్రీకాంత్. దసరా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హాయ్ నాన్న- శౌర్యువ్ నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. ఇదే ఏడాది రెండోసారి కూడా కొత్త డైరెక్టర్ శౌర్యువ్కు నాని అవకాశాన్ని కల్పించాడు. అలా భారీ అంచనాలతో నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటించగా శ్రుతి హాసన్ , బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన శౌర్యువ్.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. రాజమౌళి సినిమాలు చూస్తూనే డైరెక్షన్ విభాగంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. హాయ్ నాన్న కథ విషయానికొస్తే.. సాధారణంగా పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకుంటారు. కానీ, సింగిల్ పెరెంట్ అయితే పూర్తి బాధ్యత ఒకరే చూసుకోవాలి. ఇందులో నాని పాత్ర అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సమయానికి కూతురు దగ్గర ఉంటాడు. కథ అంతా ఇలానే సాగుతుంది. శౌర్యువ్ వద్ద ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయని. త్వరలో వాటి గురించి చెబుతానని ఆయన ప్రకటించాడు. రోమాంచమ్- జీతూ మాధవన్ (మలయాళం,తెలుగు) కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా మలయాళంలో వస్తుంటాయి. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఓటీటీల పుణ్యామాని భాషతో సంబంధం లేకుండా మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే రోమాంచమ్ సినిమా కూడా హిట్ కొట్టింది. ఈ చిత్రం ద్వారానే జీతూ మాధవన్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆయన పేరు దేశ వ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఫిబ్రవరి 3న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. కామెడీ, హారర్.. రెండూ పూర్తి భిన్నమైన నేపథ్యాలతో మంచి వినోదాన్ని పండించాడు డైరెక్టర్ జీతూ.. ఓయిజా బోర్డుతో ఆట ఆడడం వల్ల 2007లో బెంగళూరులోని ఓ ఇంట్లో ఉన్న ఏడుగురు స్నేహితులు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనేదే ఈ సినిమా సారాంశం. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. దాదా- గణేష్ కె. బాబు (తమిళ్) కోలీవుడ్‌లో కెవిన్ హీరోగా నటించిన తమిళ మూవీ దాదా.. ఈ సినిమా బిగ్ హిట్‌గా నిలిచింది. దాదాపు మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 22 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే ఏడాదిలో ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణేష్ కె. బాబు డైరెక్టర్‌గా దాదా చిత్రం ద్వారానే పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుని ఆపై వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో వారికి జన్మించిన బిడ్డ తండ్రి వద్దే ఉండిపోతాడు. సుమారు కొన్నేళ్ల తర్వాత ఆ బిడ్డ తల్లి వద్దకు ఎలా చేరిందనేది ఈ చిత్రం. తండ్రి గొప్పతనంతో రూపొందిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా దీనికి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాను డైరెక్టర్ గణేష్ కే బాబు చాలా చక్కగా తెరకెక్కించాడు. చిన్న సినిమా అయినా దాదా కథ నచ్చి తమిళంలో ఉధయనిధి స్టాలిన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అపర్ణ దాస్ హీరోయిన్గా నటించింది. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్‌కు పా..పా అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. త్వరలో విడుదల కానుంది. బాయ్స్ హాస్టల్- నితిన్ కృష్ణమూర్తి (కన్నడ,తెలుగు) కన్నడలో ఘనవిజయం సాధించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేశాయి. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడిగా ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించగా.. రిషబ్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్‌భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా సరదాగా, అల్లరిచిల్లరగా గడిపే ఓ బాయ్స్ హాస్టల్లోని కుర్రాళ్లకు ఆ హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ చావును కుర్రాళ్లు యాక్సిడెంట్‌గా మార్చే క్రమంలో ఎదురైన సంఘటనలు ఎంతో సరదాగా ఉంటాయి.