భారత్‌లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు - వివరాలు | Year End RoundUp 2023: Top Five Best Electric Scooters Launched In India 2023, See More Details Inside - Sakshi
Sakshi News home page

Year End RoundUp 2023: భారత్‌లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు - వివరాలు

Published Sun, Dec 24 2023 6:52 PM | Last Updated on Sun, Dec 24 2023 7:22 PM

Top Five Best Electric Scooters in India 2023 - Sakshi

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 2022 కంటే 2023లో విపరీతంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన వాహనాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ కథనంలో ఈ సంవత్సరం మార్కెట్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం.

ఓలా ఎస్1 ఎక్స్
ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలై ఉత్తమ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'ఓలా ఎస్1 ఎక్స్'. రూ.89999 ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి డ్యూయెల్ టోన్ డిజైన్, సింగిల్ పీస్ సీటుతో, ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్, డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్​లైట్​ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 91 కిమీ, 151 కిమీ రేంజ్ అందిస్తాయి. 

ఏథర్ 450ఎస్
బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఈ ఏడాది '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. మంచి స్పోర్టివ్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్​స్క్రీన్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్, 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. 2.9 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్).

రివర్ ఇండీ ( River Indie)
దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ'లో డ్యూయెల్​ పాడ్​ హెడ్​లైట్​ సెటప్​, సింగిల్ పీస్ సీటు, 42 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులోని 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 120 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.25 లక్షలు.

సింపుల్ డాట్ 1
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో డిసెంబర్ 15న 'డాట్ వన్' (Dot One) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది.  మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీతో 151 కిమీ రేంజ్(సింగిల్ ఛార్జ్) అందిస్తుంది.

టీవీఎస్ ఎక్స్
రూ. 2.50 లక్షల ధర వద్ద ఈ ఏడాది విడుదలైన టీవీఎస్ ఎక్స్.. మార్కెట్లో లాంచ్ అయిన ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులో వర్టికల్లీ స్టేక్​డ్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ క్లస్టర్​, వైడ్ హ్యాండిల్ బార్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, 10.25 ఇంచెస్ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇందులోని 3.8 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 140 కిమీ రేంజ్ అందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement