టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టాయి. నేడు ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలు కూడా దగ్గర చేర్చుకుంటున్నాయి. ఒక సినిమా కోసం నెలల పాటు కష్టపడటమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే థియేటర్ ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బే కాకుండా శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్ ఇలా పలు రకాలుగా తిరిగి పొందుతారు. అదే సినిమా బాగలేదని టాక్ వస్తే మొదటి రోజు నుంచే ఆ థియేటర్ వైపు వెళ్లరు. దీంతో నిర్మాతకు కోట్ల రూపాయల నష్టం తప్పదు.
2023లో కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ - హీరోయిన్ భూమి పెడ్నేకర్ నటించిన 'ది లేడీ కిల్లర్' నవంబర్ 3న విడుదలైంది. ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంది. బాలీవుడ్‌లో వీళ్లు అల్లాటప్పా యాక్టర్లు ఏమీ కాదు.. అక్కడ టాప్ రేంజ్‌లో వారికి గుర్తింపు ఉంది కాబట్టే ఈ సినిమా కోసం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నిర్మాతకు ఫైనల్‌గా కేవలం రూ. లక్ష మాత్రమే వచ్చింది. నమ్మలేకున్నా ఇదే నిజం. 2023లో విడుదల అయిన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి.
ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. టీ-సీరీస్ వాళ్ల భాగస్వామ్యంతో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా ముంబై, ఢిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. సినిమా షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు అప్పటికే భారీగా బడ్జెట్ పెట్టేశారు. మళ్లీ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.. దీంతో సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండానే విడుదల చేశారు.
సినిమాలో కథతో పాటు ఏ ఒక్క విషయం కూడ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మొదటిరోజు కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఐఎండీబీలో కూడా కేవలం 1.5 రేటింగ్‌తో 'ది లేడీ కిల్లర్' ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. అందుకు గాను నిర్మాతకు ఎంత చెల్లించారనేది తెలియదు. ఓటీటీలో కూడా ఆ చిత్రం వ్యూస్ మరీ దారుణంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment