కళ్లు మూసి తెరిచేలోపు మరో ఏడాది పూర్తయిపోయింది. 2023 న్యూయర్ సెలబ్రేషన్స్ మొన్నే చేసుకున్నట్లు. ఇంతలోనే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఈ ఏడాది గడిచిపోయింది. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే 2023లో మాత్రం పలు అద్భుతమైన సినిమాలు రిలీజయ్యాయి. మూవీ లవర్స్‌తో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా చాలా సినిమాలకు ఫిదా అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో... స్టార్ డైరెక్టర్ ఈ ఏడాది తమకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో చెప్పేశారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే?
(ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!)
బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్.. పఠాన్ (హిందీ- అమెజాన్ ప్రైమ్), సప్త సాగర ఎల్లో దాచే-రెండు భాగాలు (కన్నడ-అమెజాన్ ప్రైమ్), జవాన్ (హిందీ-నెట్‍ఫ్లిక్స్) సినిమాలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చాడు.
'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. 'డాడా' (తమిళం) చిత్రం తనని బాగా మెప్పించిందని చెప్పుకొచ్చాడు. ఇది ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కొంకణ సేన్ శర్మ.. 'ద గ్రేట్ ఇండియా కిచెన్' (తమిళ-తెలుగు) సినిమా.. ఈ ఏడాది వచ్చిన వాటిలో తన ఫేవరెట్ అని చెప్పింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌కి అయితే జైలర్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), సప్త సాగర ఎల్లో దాచే సైడ్-ఏ (కన్నడ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు బాగా నచ్చాయని చెప్పాడు.
మలయాళ స్టార్ డైరెక్టర్ జియో బేబీకి.. జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), B 32 ముతళ్ 44 వరే (మలయాళ) సినిమాలు బాగా నచ్చేశాయని చెప్పాడు. వీటిలో ఒకటి ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు.
ఇక బాలీవుడ్ డైరెక్టర్ అవినాష్ అరుణ్.. 12th ఫెయిల్ (హిందీ- హాట్‌స్టార్), రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (హిందీ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు.
కన్నడ దర్శకుడు హేమంత్ ఎమ్ రావు.. తమ తోటీ దర్శకులు తీసిన ఆచార్ అండ్ కో (కన్నడ-అమెజాన్ ప్రైమ్), హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (కన్నడ-జీ5) సినిమాలు బాగా నచ్చాయని అన్నాడు.
ఇలా పలువురు స్టార్ దర్శకులకు నచ్చిన సినిమాలంటే కచ్చితంగా అవి బెస్ట్ మూవీస్ అయ్యింటాయ్. వీటిల్లో చాలావరకు మీరు చూసేసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే మాత్రం.. 2023 ముగిసేలోపు ఓ లుక్కేసేయండి.
(ఇదీ చదవండి: ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయితే.. పవన్ బర్రెలాగా మారిపోయాడు: ఆర్జీవీ)
Comments
Please login to add a commentAdd a comment