Jigarthanda DoubleX Movie
-
2023 Roundup: స్టార్ డైరెక్టర్స్‌కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!
కళ్లు మూసి తెరిచేలోపు మరో ఏడాది పూర్తయిపోయింది. 2023 న్యూయర్ సెలబ్రేషన్స్ మొన్నే చేసుకున్నట్లు. ఇంతలోనే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఈ ఏడాది గడిచిపోయింది. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే 2023లో మాత్రం పలు అద్భుతమైన సినిమాలు రిలీజయ్యాయి. మూవీ లవర్స్‌తో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా చాలా సినిమాలకు ఫిదా అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో... స్టార్ డైరెక్టర్ ఈ ఏడాది తమకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో చెప్పేశారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్.. పఠాన్ (హిందీ- అమెజాన్ ప్రైమ్), సప్త సాగర ఎల్లో దాచే-రెండు భాగాలు (కన్నడ-అమెజాన్ ప్రైమ్), జవాన్ (హిందీ-నెట్‌ఫ్లిక్స్) సినిమాలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చాడు. 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. 'డాడా' (తమిళం) చిత్రం తనని బాగా మెప్పించిందని చెప్పుకొచ్చాడు. ఇది ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కొంకణ సేన్ శర్మ.. 'ద గ్రేట్ ఇండియా కిచెన్' (తమిళ-తెలుగు) సినిమా.. ఈ ఏడాది వచ్చిన వాటిలో తన ఫేవరెట్ అని చెప్పింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌కి అయితే జైలర్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), సప్త సాగర ఎల్లో దాచే సైడ్-ఏ (కన్నడ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు బాగా నచ్చాయని చెప్పాడు. మలయాళ స్టార్ డైరెక్టర్ జియో బేబీకి.. జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), B 32 ముతళ్ 44 వరే (మలయాళ) సినిమాలు బాగా నచ్చేశాయని చెప్పాడు. వీటిలో ఒకటి ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ అవినాష్ అరుణ్.. 12th ఫెయిల్ (హిందీ- హాట్‌స్టార్), రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (హిందీ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. కన్నడ దర్శకుడు హేమంత్ ఎమ్ రావు.. తమ తోటీ దర్శకులు తీసిన ఆచార్ అండ్ కో (కన్నడ-అమెజాన్ ప్రైమ్), హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (కన్నడ-జీ5) సినిమాలు బాగా నచ్చాయని అన్నాడు. ఇలా పలువురు స్టార్ దర్శకులకు నచ్చిన సినిమాలంటే కచ్చితంగా అవి బెస్ట్ మూవీస్ అయ్యింటాయ్. వీటిల్లో చాలావరకు మీరు చూసేసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే మాత్రం.. 2023 ముగిసేలోపు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయితే.. పవన్ బర్రెలాగా మారిపోయాడు: ఆర్జీవీ) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!
మరో వీకెండ్ వచ్చేసింది. అయితే తుపాన్ ఎఫెక్ట్ వల్ల ప్రేక్షకులు బయటకెళ్లడం కష్టంగా మారింది. ఇలాంటి టైంలో థియేటర్లలో 'హాయ్ నాన్న', 'ఎక్స్ ట్రా' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో మాత్రం ఈ వీకెండ్లోనే ఏకంగా 33 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని మాత్రం చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?) ఈ వారాంతంలో రిలీజయ్యే ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. 'జిగర్ తాండ డబుల్ ఎక్స్', 'కడక్ సింగ్', 'ద ఆర్చీస్', 'అదృశ్య జలకంగళ్', 'దక్ దక్', 'కూసే మునిస్వామి వీరప్పన్' సినిమాలతో పాటు 'వధువు' అనే తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే దిగువన లిస్టులో 'స్ట్రీమింగ్' అని ఉన్నవన్నీ కూడా గురువారం రిలీజ్ అవుతాయి. మిగిలినవన్నీ కూడా శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే? ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 8th) నెట్‌ఫ్లిక్స్ జిగర్ తాండ డబుల్ ఎక్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా లీవ్ ద వరల్డ్ బిహైండ్ - ఇంగ్లీష్ చిత్రం అదృశ్య జలకంగళ్ - తెలుగు డబ్బింగ్ మూవీ దక్ దక్ - హిందీ మూవీ ద ఆర్చీస్ - హిందీ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) అనలాగ్ స్క్వాడ్ - థాయ్ సిరీస్ (స్ట్రీమింగ్) హై టైడ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) హిల్డా సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 - ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్) మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ - ఇండోనేసియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్- ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) ఫెర్మాట్స్ కూజిన్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) నాగా - అరబిక్ మూవీ (స్ట్రీమింగ్) అమెజాన్ ప్రైమ్ మస్త్ మైన్ రహనే కా - హిందీ సినిమా మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 - ఇంగ్లీష్ చిత్రం డేటింగ్ శాంటా - స్పానిష్ మూవీ సిల్వర్ అండ్ ద బుక్ ఆఫ్ డ్రీమ్స్ - జర్మన్ సినిమా టగరు పాళ్య - కన్నడ చిత్రం జాకీర్ ఖాన్: మన్ పసంద్ - హిందీ స్టాండప్ కామెడీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వధువు - తెలుగు సిరీస్ డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ - ఇంగ్లీష్ సినిమా ద మిషన్ - ఇంగ్లీష్ మూవీ (డిసెంబరు 10) హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) జీ5 కూసే మునిస్వామి వీరప్పన్ - తమిళ సినిమా కడక్ సింగ్ - హిందీ మూవీ సోనీ లివ్ చమక్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) మనోరమ మ్యాక్స్ అచనోరు వళ వెచు - మలయాళ మూవీ బుక్ మై షో ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ - ఇంగ్లీష్ సినిమా లయన్స్ గేట్ ప్లే డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ - ఇంగ్లీష్ మూవీ జియో సినిమా మిస్టర్ మాంక్స్ లాస్ట్ కేస్: ఏ మాంక్ మూవీ - ఇంగ్లీష్ మూవీ (డిసెంబరు 09) స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! - ఇంగ్లీష్ సినిమా (డిసెంబరు 10) (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు
మరోవారం వచ్చేసింది. అలానే బయట చలి చంపేస్తుంది భయ్యా! ఇలాంటి టైంలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే కచ్చితంగా సూపర్ ఉండాలి. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలు.. ప్రేక్షకుల్ని ఫుల్‌గా ఎంటర్టైన్ చేయడానికి సరంజామా సిద్ధం చేశాయి. థియేటర్లలో 'హాయ్ నాన్న', 'ఎక్స్ట్రా' మూవీస్ వస్తుండగా.. ఓటీటీల్లో మాత్రం ఈ వారం 32 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆ కారణంతో అర్జున్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?) ఇక ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. 'జిగర్ తాండ డబుల్ ఎక్స్', 'కూసే మునిస్వామి వీరప్పన్' మూవీలతో పాటు 'వధువు' సిరీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి మూడే ఉన్నప్పటికీ వీకెండ్ వచ్చేసరికి ఈ లిస్టులో మరిన్ని తెలుగు చిత్రాలు చేరే ఛాన్స్ ఉంది. అలానే 'ద ఆర్చిస్', 'కడక్ సింగ్' లాంటి హిందీ మూవీస్ కూడా ఈ వారమే ఓటీటీలోకి రానున్నాయి. ఇంతకీ ఓవరాల్ గా ఏయే సినిమా/వెబ్ సిరీస్ ఏ ఓటీటీల్లో రానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్-వెబ్ సిరీస్ (డిసెంబరు 04 నుంచి 10వ తేదీ వరకు) అమెజాన్ ప్రైమ్ డేటింగ్ శాంటా (స్పానిష్ సినిమా) - డిసెంబరు 07 మన్ పసంద్ (స్టాండప్ కామెడీ స్పెషల్) - డిసెంబరు 07 మస్త్ మైన్ రహనే కా (హిందీ మూవీ) - డిసెంబరు 08 మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - డిసెంబరు 08 యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 08 నెట్‌ఫ్లిక్స్ డ్యూ డ్రాప్ డైరీస్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 04 స్టావ్రోస్ హల్కైస్: ఫాట్ రాస్కెల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 05 బ్లడ్ కోస్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - డిసెంబరు 06 క్రిస్మస్ యాజ్ యూజ్వల్ (నార్వేజియన్ మూవీ) - డిసెంబరు 06 అనలాగ్ స్క్వాడ్ (థాయ్ సిరీస్)- డిసెంబరు 07 హై టైడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07 హిల్డా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07 ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 (ఇటాలియన్ సిరీస్) - డిసెంబరు 07 మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07 సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 07 ద ఆర్చీస్ (హిందీ మూవీ) - డిసెంబరు 07 వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07 దక్ దక్ (హిందీ మూవీ) - డిసెంబరు 07 జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 08 లీవ్ ద వరల్డ్ బిహైండ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - డిసెంబరు 08 సోనీ లివ్ చమక్ (హిందీ సిరీస్) - డిసెంబరు 07 లయన్స్ గేట్ ప్లే డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 07 బుక్ మై షో బ్లాక్ బెర్రీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 06 ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సౌండ్ ట్రాక్ #2 (కొరియన్ సిరీస్) - డిసెంబరు 06 హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07 డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08 వధువు (తెలుగు సిరీస్) - డిసెంబరు 08 ద మిషన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10 జీ5 కడక్ సింగ్ (హిందీ సినిమా) - డిసెంబరు 08 కూసే మునిస్వామి వీరప్పన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 08 జియో సినిమా స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10 (ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
వివాహం చేసుకునే అభిమానులకు గిఫ్ట్.. సాయంలో లారెన్స్ ఎవర్గ్రీన్
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్ తండ: డబుల్ ఎక్స్' దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'జిగర్ తండ'కు సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్ కామెడీ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 8 నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ చిత్రం విజయోత్సవ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కార్తీక సుబ్బరాజ్, ఎస్‌జె సూర్య, రాఘవ లారెన్స్, నవీన్ చంద్ర, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తదితరులు పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా నాకు మంచి విజయాన్ని అందించింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాలో అసలైన హీరో అని నా మనసులో ఉంది. ఈ సినిమాకి దేవుడి ఆశీస్సులు చాలా ఉన్నాయి, అదే ఈ సినిమాకు భారీ విజయాన్ని ఇచ్చింది. నా అభిమానుల ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. వారందరూ నా కుటుంబ సభ్యులే.' అని ఆయన అన్నారు. ఉచిత కళ్యాణ మండపం అభిమానులకు మరో శుభవార్తను లారెన్స్ ఇలా తెలిపాడు.. 'సినిమా విడుదలైన ప్రతిసారీ నా అభిమానులకు ఏదో ఒకటి చేయాలనుకుంటాను. అందుకే మా అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలో నిర్మించబోతున్నాను. అందులో నా అభిమానులు ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే.. నా అభిమాని ఒకరు పెళ్లి పత్రిక ఇచ్చి నన్ను పెళ్లికి ఆహ్వానించారు. అప్పుడు పెళ్లి ఎక్కడ అని అడిగాను. అప్పుడు అతను తన ఇంట్లోనే అంటూ.. సరైన వసతిలేదని తెలిపాడు. కళ్యాణమండపంలో పెళ్లి చేసుకుందామనుకుంటే అంత డబ్బు లేదని తెలిపాడు. పెళ్లి సమయంలో సంతోషంగా ఉండాల్సిన వ్యక్తి అలా బాధగా కనిపించేసరికి నాకు నచ్చలేదు. దీంతో వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే మా అమ్మ పేరుతో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలనుకున్నాను. అక్కడ వంట పాత్రలతో సహా అన్నీ ఉంటాయి. ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగానే పెళ్లి చేసుకోవచ్చు. అని లారెన్స్ తెలిపాడు. -
నా భర్త నుంచి దూరం అయ్యాను: బిచ్చగాడు-2 నటి
కోలివుడ్లో ప్రముఖ నటిగా కొనసాగుతున్న షీలా రాజ్‌కుమార్ తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.కోలివుడ్లో షీలా రాజ్‌కుమార్ చాలా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ద్రౌపది, టూలెట్, మండేలా, ఇటీవల విడుదలైన జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాల్లో ఆమె నటించింది. అరుణ్ విజయ్ నటించిన 'ఆరదు చినమ్' సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'టూ లెట్' సినిమాలో నటించింది. ఈ చిత్రం ద్వారా ఆమెకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఆ చిత్రానికి జాతీయ అవార్డు కూడా దక్కడం విషేశం. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో భారీగా అవకాశాలు వచ్చాయి. మండేలా సినిమాలో పోస్టల్ ఆఫీసర్ పాత్రలో నటించి అభిమానుల మన్ననలు పొందింది. ఆ తర్వాత తన నటనకు స్కోప్ ఉన్న మంచి పాత్రల్లో నటించడంపై దృష్టి సారిస్తోంది. ఈ ఏడాది దీపావళికి విడుదలైన కార్తీక్ సుబ్బరాజ్ జిగర్తాండ డబుల్ ఎక్స్‌లో ఎస్.జే సూర్య సరసన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించింది. శివకార్తికేయన్‌తో నమ్మ వైట్టుప్ పిళ్లై, అసురవతం, పెట్టైకలి వెబ్ సిరీస్, జ్యోతితో కనిపించిన షీలా బిచ్చగాడు 2 చిత్రంలో విజయ్ ఆంటోని చెల్లెలు రాణిగా మెప్పించింది. మోహన్ జి దర్శకత్వం వహించిన ద్రౌపది చిత్రంలో ఆమె రిచర్డ్ రిషి సరసన నటించింది. ఈ సినిమా కులాల మధ్య విభేదాలను చూపిస్తూ తెరకెక్కింది. దీంతో తమిళనాట వివాదాన్ని సృష్టించింది. పెటైకాలి అనే వెబ్ సిరీస్‌లో ఆమె జల్లికట్టు ఎద్దును పెంచే మహిళగా నటించింది. కోలీవుడ్‌లో నటన శిక్షణ పాఠశాలను నడుపుతున్న చోళన్‌తో ఆమె వివాహం జరిగింది. తాజాగా వివాహబంధానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్లు ఆమె ప్రకటించింది. తన వైవాహిక బంధాన్ని ఎందుకు వదులుకుంటుందో అనే కారణాన్ని ఆమె తెలపలేదు. చివరగా ధన్యవాదాలు చోళన్ అంటూ తన భర్త పేరు చేర్చి పోస్ట్ చేసింది.పరిశ్రమలోని వ్యక్తులు వరుసగా విడాకులు తీసుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తుండడం గమనార్హం. திருமண உறவிலிருந்து நான் வெளியேறுகிறேன் நன்றியும் அன்பும் @ChozhanV — Sheela (@sheelaActress) December 2, 2023 -
ఓటీటీలో జిగర్తాండ డబుల్ ఎక్స్.. అప్పటినుంచే స్ట్రీమింగ్
రాఘవ లారెన్స్, ఆర్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగర్తాండ డబుల్ ఎక్స్. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్తాండ (ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది)కు సీక్వెల్‌గా తెరకెక్కింది. నవంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది చిత్రం. తెలుగువారికి పెద్దగా కనెక్ట్ అవలేదు కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. లారెన్స్, సూర్య నటనకైతే నూటికి నూరు మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 8 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇంగ్లీష్‌లో కూడా త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది నెట్‌ఫ్లిక్స్. ఇది చూసిన అభిమానులు వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కథేంటంటే.. కృపాకర్ (ఎస్జే సూర్య) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకుంటాడు. అంతలోనే చేయని తప్పుకు ఓ హత్య కేసులో జైలుపాలవుతాడు. కర్నూల్లోని జిగర్ తాండ మర్డర్ క్లబ్ గ్యాంగ్‌స్టర్ సీజర్ (రాఘవ లారెన్స్)ను చంపితే కేసు నుంచి బయటపడటమే కాకుండా తిరిగి ఎస్సై ఉద్యోగం పొందగలుగుతాడు. అందుకని సీజర్‌ను చంపే ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు ఒప్పుకుంటాడు. సీజర్కు హీరో అవ్వాలన్న పిచ్చి ఉందని తెలిసి దర్శకుడిగా అతడి దగ్గర చేరతాడు. మరి కృపాకర్ అనుకున్నది జరిగిందా? హీరోగా పేరు తెచ్చుకోవాలన్న సీజర్ కల నెరవేరిందా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! Roll-camera-action!🎥 Indha Pandyaa Blockbuster paaka ellarum vaanga! 💥 Jigarthanda DoubleX is coming to Netflix on 8 December in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! Coming soon in English.#JigarthandaDoubleXOnNetflix pic.twitter.com/r1OlgnTpLY — Netflix India South (@Netflix_INSouth) December 1, 2023 చదవండి: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్ పోస్ట్ చూశారా? -
'అందంగా లేని హీరోయిన్ను తీసుకున్నారు'.. దర్శకుడి సమాధానమిదే!
రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. నవంబర్ 10న విడుదలైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ అంత అందంగా ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. తను బాగోలేకపోయినా సరే తనను సినిమాలోకి తీసుకుని ఆమె నుంచి నటన ఎలా రాబట్టుకున్నారని ప్రశ్నించాడు. అలా అనడం చాలా తప్పు ఈ ప్రశ్నకు ఖంగు తిన్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఘాటుగానే స్పందించాడు. 'ఆమె అందంగా లేదని నువ్వెలా చెప్పగలవు? నీకెందుకలా అనిపించింది? ఒకరు అందంగా లేరని అనేయడం, అలా డిసైడ్ చేసేయడం.. చాలా తప్పు' అని కౌంటరిచ్చాడు. దర్శకుడి సమాధానం విని చిత్రయూనిట్ అంతా చప్పట్లు కొట్టింది. ఇక ఈ సినిమాతో పాటు సక్సెస్ మీట్లోనూ భాగమైన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఏమీ మారలేదు 'నేను అక్కడే ఉన్నాను. అందం గురించి అతడు పిచ్చి ప్రశ్న అడిగి వదిలేయలేదు. ఏదైనా వివాదాస్పదం అయ్యే ప్రశ్నలు అడగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రశ్నలు అడిగేశాక తనకు తాను గర్వంగా ఫీలయ్యాడు. 9 ఏళ్ల క్రితం జిగర్తాండ మొదటి భాగం వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఈ హీరోయిన్‌కు ఏం తక్కువ? అంత బాగా అభినయం చేస్తోంటే ఇలా అవమానించేలా ఎలా మాట్లాడుతారో అని కామెంట్లు చేస్తున్నారు. నటనలో ఘనాపాటి కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ ఈ విజయోత్సవ సభకు హాజరు కాలేదు. ఈమె ఇటీవల వచ్చిన సిద్దార్థ్ చిత్త(చిన్నా) మూవీలోనూ నటతో మెప్పించింది. ఈమె మలయాళ నటి. 2017లో కేరాఫ్ సైరా భాను సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, తొండిముతలుమ్ దృక్షాక్షియుమ్.. తదితర హిట్ చిత్రాల్లో నటించింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో రాఘవ లారెన్స్ భార్యగా, గిరిజన యువతి మలైయారసి పాత్రలో కనిపించింది. I was there. It was not just about the ridiculous ‘beauty’ question for the reporter. There was a conscious effort from the guy to ask something controversial and he was so proud after asking this. Nothing has changed since the appalling ‘Jigarthanda’ - ‘Figuredhanda’ question 9… https://t.co/ZaVh5lEkK9 — Santhosh Narayanan (@Music_Santhosh) November 18, 2023 చదవండి: అందుకే 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీ వదులుకున్నా.. భూమికతో గొడవలు.. -
సత్తా చాటుతున్న సంచనా నటరాజన్
తమిళసినిమా: పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంటున్న నటి సంచనా నటరాజన్. అందం అంతకుమించిన అభినయం, చక్కని తమిళ వాచకం వంటి అర్హతలు కలిగిన ఈ చెన్నై వాసి నటిగా 2014లో రంగ ప్రవేశం చేశారు. అలా గత తొమ్మిదేళ్లుగా తమిళం, తెలుగు, మలయాళం, ఆంగ్లం భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. అందమైన ముఖం, ఆకాశమయమైన పరువం కలిగినా కథానాయకిగా మాత్రమే నటిస్తానని భీష్మించుకుని కూర్చోకుండా నటనకు అవకాశం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమనే ఈమె బావనే మంచి నటిగా నిలబెట్టిందని చెప్పవచ్చు. ఇక ప్రతి పని గుర్తించడంలో ముందుండే దర్శకుడు పా రంజిత్ తాను దర్శకత్వం వహించిన సార్పట్ట పరంపరై చిత్రం ద్వారా సంచనా నటరాజన్‌ను కోలీవుడ్ కు పరిచయం చేశారు. అందులో నటుడు కలైయరసన్ కు జంటగా నటించి పలువురి ప్రశంసలను అందుకున్న సంచనా నటరాజన్ తమిళ చిత్త పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఈమె బాటిల్ రాధ, పోర్ అనే తమిళ చిత్రాలతో పాటు టికీ టక అనే మలయాళ చిత్రంలోని నటిస్తున్నారు. కాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్జే. సూర్య కథానాయకులుగా నటించిన జిగర్తండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటి సంచనా నటరాజన్ కీలకపాత్రను పోషించారు. ఇందులో ఈమె నటుడు భార్యగా నటించడం విశేషం. శుక్రవారం తెర పైకి వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇందులో ఒక పాత్రగా జీవించిన నటి సంచనా నటరాజన్ కు పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. మరిన్ని వైవిధ్య భరితమైన కథా పాత్రలో నటించి పేరు తెచ్చుకుంటానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
తుస్సుమన్న కొత్త సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
ప్రతివారంలానే ఈసారి కూడా కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కాకపోతే చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ లేకపోవడంతో డబ్బింగ్ చిత్రాలే ప్రేక్షకులకు దిక్కయ్యాయి. అలా తాజాగా కార్తీ 'జపాన్'తో పాటు 'జిగర్ తాండ డబుల్ ఎక్స్' అనే రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటికి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అందుకు తగ్గట్లే తొలిరోజు కలెక్షన్స్ కూడా దారుణంగా వచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ) 'ఆవారా', 'యుగానికొక్కడు'. 'ఖైదీ' లాంటి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కార్తీ తాజాగా 'జపాన్' సినిమాతో వచ్చాడు. అయితే దొంగ-పోలీస్ కథతో తీసిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిలైంది. రివ్యూలు అన్ని అలానే వచ్చాయి. దీంతో తొలిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.కోటి మాత్రమే వచ్చిందట. తమిళంలో మాత్రం రూ.3.5 కోట్ల పైనే వసూళ్లు వచ్చినట్లు సమాచారం. అలా ఓవరాల్‌గా రూ.5 కోట్ల లోపే కలెక్షన్ వచ్చాయి. వీకెండ్ లో కాస్తోకూస్తో డబ్బులు వస్తాయి తప్పితే లాంగ్ రన్ లో నష్టాలు రావడం గ్యారంటీ! ఇకపోతే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తీసిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఇది కూడా 'జపాన్'లానే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. లారెన్స్, ఎస్జే సూర్య యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కంటెంట్ ల్యాగ్ ఉండటం సినిమాకు మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి తొలిరోజు మొత్తంగా రూ.1.75 కోట్లు మాత్రమే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇలా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన డబ్బింగ్ చిత్రాలు తుస్సుమనిపించాయి. (ఇదీ చదవండి: 'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?)