తమిళసినిమా: పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంటున్న నటి సంచనా నటరాజన్. అందం అంతకుమించిన అభినయం, చక్కని తమిళ వాచకం వంటి అర్హతలు కలిగిన ఈ చెన్నై వాసి నటిగా 2014లో రంగ ప్రవేశం చేశారు. అలా గత తొమ్మిదేళ్లుగా తమిళం, తెలుగు, మలయాళం, ఆంగ్లం భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. అందమైన ముఖం, ఆకాశమయమైన పరువం కలిగినా కథానాయకిగా మాత్రమే నటిస్తానని భీష్మించుకుని కూర్చోకుండా నటనకు అవకాశం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమనే ఈమె బావనే మంచి నటిగా నిలబెట్టిందని చెప్పవచ్చు.
ఇక ప్రతి పని గుర్తించడంలో ముందుండే దర్శకుడు పా రంజిత్ తాను దర్శకత్వం వహించిన సార్పట్ట పరంపరై చిత్రం ద్వారా సంచనా నటరాజన్‌ను కోలీవుడ్ కు పరిచయం చేశారు. అందులో నటుడు కలైయరసన్ కు జంటగా నటించి పలువురి ప్రశంసలను అందుకున్న సంచనా నటరాజన్ తమిళ చిత్త పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఈమె బాటిల్ రాధ, పోర్ అనే తమిళ చిత్రాలతో పాటు టికీ టక అనే మలయాళ చిత్రంలోని నటిస్తున్నారు.
కాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్‌జే. సూర్య కథానాయకులుగా నటించిన జిగర్తండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటి సంచనా నటరాజన్ కీలకపాత్రను పోషించారు. ఇందులో ఈమె నటుడు భార్యగా నటించడం విశేషం. శుక్రవారం తెర పైకి వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇందులో ఒక పాత్రగా జీవించిన నటి సంచనా నటరాజన్ కు పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. మరిన్ని వైవిధ్య భరితమైన కథా పాత్రలో నటించి పేరు తెచ్చుకుంటానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment