Sapta Sagaralu Dhaati Movie
-
పాన్ ఇండియా ఫ్రాంచైజీ సినిమాలో 'రుక్మిణి వసంత్'
'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన బ్యూటీ రుక్మిణి వసంత్.. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. ఆమెకు టాలీవుడ్లో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఎమోషనల్ పాత్రలో అందర్నీ ఆకర్షించింది. ఇప్పటికే కోలీవుడ్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేసుకున్న ఈ బ్యూటీ తెలుగులో కూడా నటించేందుకు పలు ప్రాజెక్ట్‌ల స్టోరీలను వింటుంది. తాజాగా ఆమెకు ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాంతార: చాప్టర్ 1 సినిమాలో రుక్మిణి వసంత్ ఫైనల్ అయినట్లు ఇండిస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే.. మరోవైపు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో హోంబలే ఫిల్మ్స్ సంస్థ వారు చర్చలు కూడా జరిపారట. కాంతార కోసం రిషబ్ సొంత గ్రామం అయిన కెరడిలో ఒక భారీ సెట్‌ను కూడా క్రియేట్ చేశారట. అందులో రుక్మిణికి తాజాగా లుక్ టెస్ట్ కూడా జరిపారట మేకర్స్.. అందులో ఆమె సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వస్తుందని టాక్. 'సప్త సాగరాలు దాటి' సినిమా తర్వాత టాలీవుడ్ లో రుక్మిణి పేరు మరింత పాపులర్ అయ్యింది. సినిమా ఛాన్సులు క్యూ కట్టాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కోసం ఈ ముద్దుగుమ్మ పేరును పరిశీలించారట. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సినిమా విషయంలో కూడా రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. ఓ వైపు తెలుగులో ఇలా రుక్మిణి పేరు పాపులర్ అవుతుండగానే మరోవైపు కోలీవుడ్ నుంచి ఆమెకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. స్టార్ డైరెక్షర్ మురుగుదాస్- శివకార్తికేయన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో రుక్మిణి వసంత్ ఛాన్స్ పట్టేసింది. కథల ఎంపిక విషయంలో ఆమె చాలా తెలివిగా అడుగులేస్తుందని సమాచారం. View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) -
ఓటీటీలో సడెన్‌గా మాయమైన హిట్ సినిమా.. కారణం ఇదేనా
కన్నడ హిట్ సినిమా ‘సప్త సాగరాలు దాటి సైడ్- బీ’ ఓటీటీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో తొలగించేసింది. కన్నడ నటులు రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది. గతేడాది నవంబరు 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సడెన్‌గా తొలగించింది. ‘సప్త సాగరాలు దాటి సైడ్- ఏ’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం కన్నడతో పాటుగా టాలీవుడ్లో కూడా మంచి ఆదరణ పొందింది. సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, సైడ్-బీ రెండు చిత్రాలు ఇంతవరకు అమెజాన్ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే సప్త సాగరాలు దాటి సైడ్- బీ ఓటీటీలో సడెన్‌గా మాయమైంది. చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ అందుబాటులో లేకపోవడంతో సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రైమ్ వీడియో నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. 'సప్త సాగరాలు దాటి' సీక్వెల్ చిత్రాలకు హీరో రక్షిత్ శెట్టి నిర్మాతగానూ ఉన్నారు. ఈ రెండు చిత్రాల శాటిలైట్ హక్కులను జీ5 నెట్వర్క్ కూడా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని బిజినెస్ డీల్స్ వల్ల మొదట అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, సైడ్-బీ చిత్రాన్ని మాత్రం 'జీ5' ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు టాక్. అందుకే సైడ్ -బీ చిత్రం ప్రైమ్ వీడియోలో తొలగించారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సప్త సాగరాలు దాటి సైడ్- ఏ మాత్రమే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
శివరాజ్ కుమార్‌తో ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ!
"సప్త సాగరాలు దాటి" సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు. 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు. కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు సమాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. -
2023 Roundup: స్టార్ డైరెక్టర్స్‌కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!
కళ్లు మూసి తెరిచేలోపు మరో ఏడాది పూర్తయిపోయింది. 2023 న్యూయర్ సెలబ్రేషన్స్ మొన్నే చేసుకున్నట్లు. ఇంతలోనే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఈ ఏడాది గడిచిపోయింది. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే 2023లో మాత్రం పలు అద్భుతమైన సినిమాలు రిలీజయ్యాయి. మూవీ లవర్స్‌తో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా చాలా సినిమాలకు ఫిదా అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో... స్టార్ డైరెక్టర్ ఈ ఏడాది తమకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో చెప్పేశారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్.. పఠాన్ (హిందీ- అమెజాన్ ప్రైమ్), సప్త సాగర ఎల్లో దాచే-రెండు భాగాలు (కన్నడ-అమెజాన్ ప్రైమ్), జవాన్ (హిందీ-నెట్‌ఫ్లిక్స్) సినిమాలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చాడు. 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. 'డాడా' (తమిళం) చిత్రం తనని బాగా మెప్పించిందని చెప్పుకొచ్చాడు. ఇది ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కొంకణ సేన్ శర్మ.. 'ద గ్రేట్ ఇండియా కిచెన్' (తమిళ-తెలుగు) సినిమా.. ఈ ఏడాది వచ్చిన వాటిలో తన ఫేవరెట్ అని చెప్పింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌కి అయితే జైలర్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), సప్త సాగర ఎల్లో దాచే సైడ్-ఏ (కన్నడ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు బాగా నచ్చాయని చెప్పాడు. మలయాళ స్టార్ డైరెక్టర్ జియో బేబీకి.. జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), B 32 ముతళ్ 44 వరే (మలయాళ) సినిమాలు బాగా నచ్చేశాయని చెప్పాడు. వీటిలో ఒకటి ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ అవినాష్ అరుణ్.. 12th ఫెయిల్ (హిందీ- హాట్‌స్టార్), రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (హిందీ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. కన్నడ దర్శకుడు హేమంత్ ఎమ్ రావు.. తమ తోటీ దర్శకులు తీసిన ఆచార్ అండ్ కో (కన్నడ-అమెజాన్ ప్రైమ్), హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (కన్నడ-జీ5) సినిమాలు బాగా నచ్చాయని అన్నాడు. ఇలా పలువురు స్టార్ దర్శకులకు నచ్చిన సినిమాలంటే కచ్చితంగా అవి బెస్ట్ మూవీస్ అయ్యింటాయ్. వీటిల్లో చాలావరకు మీరు చూసేసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే మాత్రం.. 2023 ముగిసేలోపు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయితే.. పవన్ బర్రెలాగా మారిపోయాడు: ఆర్జీవీ) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
డార్లింగ్ ప్రభాస్ అభిమానులు చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎందుకంటే ఈ శుక్రవారమే 'సలార్' మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. పెద్దగా ప్రమోషన్ లాంటి హడావుడి ఏం లేకుండానే వస్తున్నప్పటికీ.. అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. దీన్ని ఢీకొట్టడానికి షారుక్ 'డంకీ', హాలీవుడ్ మూవీ 'ఆక్వామన్ 2' కూడా ఇదే వీకెండ్లో బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కానున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) ప్రభాస్, షారుక్ మధ్య జరిగే బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారా అనేది పక్కనబెడితే.. ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 30 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. అయితే ఓటీటీల్లో వచ్చే వాటిలో 'ఆదికేశవ', 'సప్త సాగరాలు దాటి సైడ్-బి', 'ఫలిమి' తదితర మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. అలానే పలు హిందీ, ఇంగ్లీష్ సిరీసులు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో రానుందనేది చూద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 18-24 వరకు) నెట్‌ఫ్లిక్స్ హలో ఘోస్ట్ (మాండరిన్ మూవీ) - డిసెంబరు 18 ద రోప్ కర్స్ 3 (మాండరిన్ సినిమా) - డిసెంబరు 18 సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 20 మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 20 ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) - డిసెంబరు 20 అల్హమర్ H.A (అరబిక్ మూవీ) - డిసెంబరు 21 లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 21 రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 21 ఆదికేశవ (తెలుగు మూవీ) - డిసెంబరు 22 కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) - డిసెంబరు 22 యోంగ్సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 22 కుయికో (తమిళ మూవీ) - డిసెంబరు 22 ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) - డిసెంబరు 24 పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 24 హాట్‌స్టార్ ఫలిమి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 18 BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 20 డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 20 పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 20 వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22 అమెజాన్ ప్రైమ్ మిషన్ స్టార్ట్ Ab (హిందీ సిరీస్) - డిసెంబరు 19 ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 21 డ్రై డే (హిందీ సినిమా) - డిసెంబరు 22 సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 22 సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22 జీ5 అడి (మలయాళ మూవీ) - డిసెంబరు 22 హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబరు 22 జియో సినిమా బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 21 హే కమీని (హిందీ మూవీ) - డిసెంబరు 22 బుక్ మై షో ద మిరాకిల్ క్లబ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19 లయన్స్ గేట్ ప్లే ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22 (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!) -
యాంకర్ సుమకు 'సప్తసాగరాలు దాటి' హీరో పంచ్‌లు.. పరువు పాయే!
ప్రేమకథలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలా ఓ అద్భుతమైన ప్రేమకథతో వచ్చిన సినిమా సప్తసాగరాలు దాటి. సెప్టెంబర్‌లో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాగా తాజాగా రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్ బిగా విడుదలైంది. ఇందులో హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రుక్మిణి, చైత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు ముందు వీరు ముగ్గురూ యాంకర్ సుమకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హీరో కౌంటర్లు.. కవరింగ్ చేసే పనిలో సుమ సుమ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే.. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ సుమ ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. 'సప్తసాగరాలు దాటి సైడ్ ఎ, సైడ్ బి.. కథలు ముందే రాసుకున్నారా?' అని హీరోను అడగ్గా కథ రాసింది నేను కాదు, హేమంత్ అని క్లారిటీ ఇచ్చాడు రక్షిత్ శెట్టి. 'రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా తీద్దామా? అని ఓరోజు హేమంత్ అడిగాడు. రెండు భాగాలుగా తీస్తే బాగుంటుంది అని చెప్పాను. అలా సైడ్ ఎ, సైడ్ బిగా తీశాం' అని వివరణ ఇచ్చాడు. మరి దీనికి నిర్మాత ఒప్పుకున్నాడా? అని సుమ ప్రశ్నించగా నేనే నిర్మాతను అని పంచ్ ఇచ్చాడు రక్షిత్. నాలుక్కరుచుకున్న సుమ మీరు హీరో, డైరెక్టర్, నిర్మాత, సింగర్ అని వర్ణించుకుంటూ పోవడంతో రక్షిత్ శెట్టి తాను సింగర్ కాదని చెప్పాడు. అటు సినిమా గురించి, ఇటు హీరో రక్షిత్ శెట్టి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ చేసి సుమ నాలుక్కరుచుకుంది. ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలు.. 'ఏంటి సుమ.. ఎంతో అనుభవం ఉన్నదానివి, ఇలా చేశావేంటి? ముందే ప్రిపేర్ అవ్వాల్సింది. అనవసరంగా వాళ్ల ముందు పరువు తీసుకున్నావ్' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం 'తనదసలే బిజీ షెడ్యూల్.. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సాధారణమే' అని వెనకేసుకొస్తున్నారు. చదవండి: 21 ఏళ్లకే విడాకులు.. జీవితంపై విరక్తి.. డిప్రెషన్.. చనిపోదామనుకున్నా.. -
'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ
టైటిల్: సప్త సాగరాలు దాటి సైడ్-బి నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర జే ఆచార్, అచ్యుత్ కుమార్ తదితరులు నిర్మాత: పరంవహ పిక్చర్స్ (రక్షిత్ శెట్టి) సమర్పణ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్: హేమంత్ ఎమ్ రావు సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి విడుదల తేదీ: నవంబర్ 17, 2023 ప్రేమ కథలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా ఏ భాష మూవీని అయినా సరే ఆదరిస్తారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమా ' సప్త సాగరలు దాటి'. సెప్టెంబర్ లో 'సైడ్- ఏ' పేరుతో తొలి భాగం రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని సీక్వెల్‌ను 'సప్త సాగరాలు దాటి సైడ్ - బి' పేరుతో థియేటర్స్‌లో విడుదల చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది? తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథేంటి? డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ. ఎలా ఉంది? 'సప్త సాగరాలు దాటి'.. ఈ సినిమా స్లో పాయిజన్ లాంటిది. అర్థం చేసుకుంటే నచ్చేస్తుంది. లేకపోతే ఇదేం బోరింగ్ సినిమారా బాబు అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్.. జైలు బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ కాగా.. ఇప్పుడు వచ్చిన రెండో పార్ట్ పూర్తిగా రివేంజ్ డ్రామాతో సాగే ప్రేమ కథ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను, 10 ఏళ్ల తర్వాత బయటకు రావడంతో సినిమా మొదలవుతుంది. తనకు జైల్లో పరిచయమైన ఓ వ్యక్తి మనుకి ఆశ్రయం ఇస్తాడు. అప్పటికే తన లవర్ ప్రియకి వేరే వ్యక్తితో పెళ్లి అయిపోవడంతో మను ఆమెని కలవడానికి కూడా ఇష్టపడడు. కానీ ఆమెని మర్చిపోలేడు. దీంతో దూరం నుంచి ఆమెని గమనిస్తూ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రియ ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాడు. దాదాపు ఇవే సీన్స్ ఫస్ట్ హాఫ్ అంతా వుంటాయి. అలా ఇంటర్వల్ కార్డ్ పడతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలు కాగానే అసలు స్టోరీ షురూ అవుతుంది. అప్పటివరకు హీరోయిన్ని చూస్తూ ఉన్న హీరో కాస్త ఆమె జీవితాన్ని చక్కబెడ్తాడు. మరి చివరకు మను - ప్రియ ఒక్కటయ్యారా? లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. సెప్టెంబర్ లో రిలీజ్ అయిన సప్త సాగారాలు దాటి ఫస్ట్ పార్ట్.. కథ, మ్యూజిక్ పరంగా మంచి హిట్ అనిపించుకుంది. ఇప్పుడు రిలీజ్ అయిన రెండో పార్ట్ మాత్రం చాలా స్లోగా ఉండి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఫస్ట్ హాఫ్ లో అసలు కథే ఉండదు. ఇంటర్వల్ తర్వాత కూడా కథ నెమ్మదిగా వెళ్తుంది తప్ప ఎక్కడా ఇంట్రెస్ట్ అనిపించదు. మ్యూజిక్ అయినా బాగుందా అంటే పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది తప్పితే ఇంప్రెసివ్ గా ఏం లేదు. క్లైమాక్స్ కూడా కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. అయితే సినిమాలో చిన్న చిన్న డీటైలింగ్ మాత్రం బాగుంది. తనకి డబ్బులు అవసరమై, ఇంతకుముందు పనిచేసిన ఓనర్ కొడుకు దగ్గరకు మను వెళతాడు. వాళ్ళు ఫస్ట్ తరిమేస్తారు. మళ్ళీ వెళ్తే మనుని కుక్కలా ట్రీట్ చేసి, బిస్కెట్ వేసినట్టు ఖరీదైన వాచ్ పడేస్తారు. దీంతో మనుకి కోపం వచ్చి, తనని కుక్కలా ట్రీట్ చేసిన ఓనర్ కొడుకుని కుక్కతో కరిపిస్తాడు. అలానే తను జైలుకి వెళ్ళడానికి కారణం అయిన ప్రభుని ఓ పాడుబడ్డ గోడౌన్ లో బంధించి, తను జైలులో అనుభవించిన దానిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అలానే ఫస్ట్ పార్ట్‌లో ఉన్న విలన్ రెండో భాగంలోనూ ఉంటాడు. సినిమా సముద్రం హోరుతో మొదలై అదే సముద్రం హోరుతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా సముద్రానికి సింబాలిక్ గా బ్లూ కలర్ చూపిస్తే.. ఇందులో మాత్రం రివెంజ్ కి సింబాలిక్ గా రెడ్ కలర్ ని ఎక్కువగా చూపిస్తారు. ఓవరాల్ గా చెప్పుకుంటే 'సప్త సాగరాలు దాటి సైడ్- బీ'.. ఫస్ట్ పార్ట్ అంత అయితే కనెక్ట్ కాదు. సాగదీత ఎక్కువైంది. ఎవరెలా చేశారు? హీరో రక్షిత్ శెట్టి ఎప్పటిలానే పాత్రలో జీవించాడు. ప్రియగా చేసిన రుక్మిణి వసంత్.. ఇందులో గృహిణిగా కనిపించింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో ఆమెకి నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు. ఇదే సినిమాలో వేశ్యగా, హీరోకి ప్రియురాలు సురభిగా చేసిన చైత్ర జే ఆచర్ కి మాత్రం కాస్త మంచి సీన్స్ పడ్డాయి. మిగిలిన వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పరవాలేదనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిపై ఎడిటర్ దృష్టి పెట్టుంటే బాగుండేేది. రెండున్నర గంటల సినిమా ఇది. ఓ అరగంట తగ్గించొచ్చు. కథపై ఇంకాస్త దృష్టి పెట్టి మంచి సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!
తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చితే చాలు నెత్తిన పెట్టేసుకుంటారు. అందులోని నటీనటుల్ని కూడా అభిమానిస్తారు. అలా ఈ మధ్య కాలంలో కన్నడ హీరోలు కూడా మనవాళ్లకు బాగా దగ్గరయ్యారు. వాళ్లలో హీరో రక్షిత్ శెట్టి కూడా ఒకడు. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ అని చాలామందికి తెలుసు. కానీ 'చార్లి 777' మూవీతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ హీరోకి రష్మిక మాత్రమే అంతకుముందు కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందట. రష్మికతో బ్రేకప్ కన్నడలో రక్షిత్ శెట్టి పేరు తెలియని వాళ్లుండరు. నటుడు-దర్శకుడు-రచయిత-నిర్మాత.. ఇలా మనోడి దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి. గతంలో 'కిరిక్ పార్టీ' అనే సినిమాలో రక్షిత్ హీరోగా నటిస్తే, రష్మిక హీరోయిన్గా చేసింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు వీళ్లు ప్రేమలో పడ్డారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కారణం ఏంటే తెలీదు గానీ ఈ జంట విడిపోయింది. అయితే ఇదే కాదు రక్షిత్ కి మరో లవ్‌స్టోరీ కూడా ఉంది. అక్కడ క్లోజ్ ఫ్రెండే మోసం చేశాడట. (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) రక్షిత్ ఏం చెప్పాడు? 'నా ఇంజినీరింగ్ సెకండియర్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశా. తనకి లవ్ లెటర్ ఇవ్వమని మా ఫ్రెండ్‌కి రోజూ లవ్ లెటర్స్ రాసి ఇచ్చేవాడిని. అలా రెండేళ్లు గడిచిపోయాయి కానీ అమ్మాయి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఇచ్చిన లెటర్స్‌ని నా ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యభర్తలు' అని హీరో రక్షిత్ శెట్టి తనకు జరిగిన మోసం గురించి చెప్పుకొచ్చాడు. 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన కాలేజీ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాడు. అయితే రక్షిత్ జీవితంలోని ఈ రెండు స్టోరీలు చూసిన ఎవరికైనా సరే.. ఈ హీరో ప్రేమ అనేది అస్సలు కలిసి రావడం లేదా అనే సందేహం వస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
సప్త సాగరాలు దాటి సైడ్-బి టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే
రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సప్త సాగరాలు దాటి’. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. మనసుకు హత్తుకునే ప్రేమకథగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర కలెక్షన్లు వసూలు చేయలేకపోయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడటం ఆసమయంలో అతను పడే వేదనను ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు. అదే సమయంలో ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చేందుకు అతడి ప్రేయసి పడే కష్టాన్ని కూడా బాగా ఎమోషనల్‌గా చూపించారు. పార్ట్-1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి భాగానికి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పార్ట్ రిలీజ్‌పై మేకర్స్ ప్రకటన ఇచ్చారు. 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీటీమ్ రిలీజ్ డేట్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసింది. నవంబర్ 17న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించగా.. పవిత్ర లోకేశ్, అవినాష్, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. -
థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా
కంటెంట్ బాగుంటే చాలు ఇతర పరిశ్రమలకు చెందిన సినిమాలనూ ఆదరించడంలో ముందుంటారు తెలుగు ప్రేక్షకులు. అలా ఇప్పటికే ఇతర ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరోలను తెలుగువారు ఆదరిస్తున్నారు. అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లి సినిమాలతో కన్నడ హీరో రక్షిత్ ఇప్పటికే తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ‘సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ’ సెప్టెంబర్ 22న తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. (ఇదీ చదవండి: (Salaar Release Date: ప్రభాస్ సలార్ విడుదలపై అఫిషీయల్ ప్రకటన వచ్చేసింది) ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ సినిమాను ఓటీటీలో విడదల చేయడంతో ఫ్యాన్స్ థ్రిల్‌కు గురౌతున్నారు. కథ నెమ్మదిగా సాగిన ఇదోక అద్భుతమైన ప్రేమ కథ అని మంచి టాక్ వచ్చింది. సప్త సాగరాలు దాటిన ఈ ప్రేమకథ అందరినీ కదిలించిందని ఎందరో పాజిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం కథతో పాటు అందులోని నటీనటుల భావోద్వేగాలు అని సినీ ప్రేమికులు తెలిపారు. ప్రేమలో పడిన ఓ జంట ప్రయాణమే ఈ చిత్రం. అందమైన కలలు కన్న ఆ జంట ప్రయాణాన్ని విధి ఎలా ప్రభావితం చేసింది? అనేదే కథాంశం. థియేటర్లో చూడలేకపోయిన వారు ఈ వారం సప్త సాగరాలు దాటి చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి. కన్నడలో ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్ ఏ’ కి ఈ చిత్రం అనువాదం. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి టాక్ వచ్చినా.. థియేటర్స్ సమస్య ఎదురైంది. దీంతో వారు వెంటనే ఓటీటీలోకి విడుదల చేసినట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటన మరో రేంజ్లో ఉంటుందని ఆమెను పలువురు అభినందించారు. ఇంతటి సూపర్ హిట్ కొట్టిన సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి. ఈ సినిమాను సీక్వెల్ కూడా త్వరలో రాబోతోంది. పార్ట్ వన్ను 'సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ'గా రిలీజ్ చేశారు. సీక్వెల్ 'సప్తసాగరాలు దాటి: సైడ్ బీ' అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) -
రష్మిక, శ్రీలీలకు పోటీగా మరో కన్నడ బ్యూటీ?
ప్రతివారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ వారం మాత్రం తెలుగు చిత్రాలు ఏం లేవు. 'సప్త సాగరాలు దాటి' అనే డబ్బింగ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజైంది. కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమా.. ఇక్కడ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో మిగతా విషయాలు సంగతి కాస్త అలా పక్కనబెడితే హీరోయిన్ మాత్రం యాక్టింగ్‌తో తన మార్క్ చూపించింది. మూవీ చూసిన ప్రతిఒక్కరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇంతకీ ఎవరు ఈమె? ఆమె ఫుల్ డీటైల్స్ 'సప్త సాగరాలు దాటి' సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి పేరు రుక్మిణి వసంత్. బెంగళూరులోనే పుట్టి పెరిగింది. లండన్‌లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసింది. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్.. అశోక చక్ర సొంతం చేసుకున్నారు. ఇకపోతే రుక్మిణి.. 2019లో 'బీర్బల్' మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఓ మూడేళ్ల ఎక్కడా కనిపించలేదు. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) ఎందుకంత స్పెషల్? ఈ ఏడాది మాత్రం 'భగీర', 'సప్త సాగరాలు దాటి' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. త్వరలో 'బాణదారియల్లీ' అనే కన్నడ చిత్రంతో థియేటర్లలోకి రాబోతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈమెకు ఉన్నదల్లా మూడు సినిమాల అనుభవం. కానీ 'సప్త సాగరాలు దాటి' మూవీలో హీరో రక్షిత్ శెట్టిని కొన్ని సీన్స్‌లో డామినేట్ చేసిందంటేనే ఈమె యాక్టింగ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఈమెకి క్లోజప్ షాట్స్ చాలా ఉన్నాయి. ఆయా సన్నివేశాల్లో జస్ట్ కళ్లు, నవ్వుతో అందరినీ మాయ చేసినంత పనిచేసింది. వాళ్లిద్దరికీ పోటీ? ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ల పేరు చెప్పమంటే.. రష్మిక, శ్రీలీల అని అంటారు. వీళ్లిద్దరూ కన్నడలోనే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో అడుగుపెట్టారు. 'సప్త సాగరాలు దాటి'తో రుక్మిణి వసంత్.. తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ఒకవేళ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసి, హిట్ కొడితే మాత్రం రష్మిక, శ్రీలీలకు పోటీ తప్పకపోవచ్చు! ఇదంతా జరగడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటివరకు వెయిట్ అండ్ సీ! (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) -
'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ
టైటిల్: సప్త సాగరాలు దాటి నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ తదితరులు నిర్మాత: రక్షిత్ శెట్టి దర్శకుడు: హేమంత్ ఎమ్.రావు సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: అద్వైత్ గురుమూర్తి విడుదల తేదీ: 22 సెప్టెంబరు 2023 మంచి సినిమాకు భాషతో సంబంధం లేదు. ప్రేమకథలకు అంతం లేదు. అలా ఈ మధ్య కాలంలో కన్నడలో రిలీజై సెన్సేషన్ సృష్టించిన మూవీ 'సప్త సాగర ఎల్లోదాచె'. 'చార్లి 777' చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న రక్షిత్ శెట్టి ఇందులో హీరో. ఇప్పుడు ఈ సినిమాని 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇంతకీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? మను (రక్షిత్ శెట్టి) కారు డ్రైవర్. శంకర్ గౌడ (అవినాష్) అనే బిజినెస్‌మ్యాన్ దగ్గర పనిచేస్తుంటాడు. సింగర్ కమ్ స్టూడెంట్ ప్రియ(రుక్మిణి వసంత్)తో ప్రేమలో ఉంటాడు. త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనేది వీళ్లిద్దరి ప్లాన్. ఓ రోజు శంకర్ గౌడ కొడుకు కారుతో గుద్ది ఒకరిని చంపేస్తాడు. డబ్బు ఆశ, త్వరగా బెయిల్ ఇప్పిస్తానని చెప్పడంతో ఆ నేరాన్ని.. మను తనపై వేసుకుంటాడు. జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. జైలులో మను, బయట ప్రియ ఎలాంటి కష్టాలు అనుభవించారు? చివరకు ఏమైందనేదే 'సప్త సాగరాలు దాటి' మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? ఓ తప్పటడుగు లేదా ఓ తప్పు నిర్ణయం మను అనే కుర్రాడి జీవితాన్ని తలక్రిందులు చేయడమే 'సప్త సాగరాలు దాటి' సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టోరీ లైన్ ఇదే. సాధారణంగా ప్రేమకథా సినిమాలు అనగానే ఎవరో తెలియని వ్యక్తులు చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది చూపిస్తుంటారు. కానీ ఇందులో కాస్త డిఫరెంట్. ఆల్రెడీ ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి-అమ్మాయి.. జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారనేది చక్కగా చూపించారు. ఫస్టాఫ్ విషయానికొస్తే.. ఖరీదైన కారులో మను-ప్రియ. కట్ చేస్తే డ్రైవర్‌గా మను, మధ్య తరగతి అమ్మాయి ప్రియ జీవితం ఎలా ఉంటుందో చూపించారు. మరోవైపు ప్రేమలో ఉన్న మను-ప్రియ.. త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవడం, కలిసి ఉండేందుకు ఓ ఇల్లు కోసం వెతుకులాట లాంటి సీన్స్‌తో సరదాగా వెళ్తుంటుంది. అయితే జీవితంలో సెటిల్ కావాలని కలలు కంటున్న మను.. డబ్బుకి ఆశపడి చేయని నేరాన్ని తనపై వేసుకోవడం, జైలుకెళ్లడంతో ఒక్కసారిగా స్టోరీ టర్న్ తీసుకుంటుంది. అయితే తనని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని మాటిచ్చిన ఓనర్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడంతో పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. మరి మను.. జైలు నుంచి బయటకొచ్చాడా? ప్రియని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీ చూడాల్సిందే. 'సప్త సాగరాలు దాటి' కొత్త కథేం కాదు. కానీ సినిమాగా చూస్తున్నప్పుడు మనకు అస్సలు ఆ ఫీలింగే రాదు. మరోవైపు హీరోహీరోయిన్ల యాక్టింగ్, సంగీతాన్ని వేరుచేసి చూడలేం. ఎందుకంటే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి. ఈ సినిమాలో సముద్రం చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది. హీరోయిన్‌కి సముద్రం అంటే చాలా ఇష్టం. మను-ప్రియ.. ఇద్దరూ సముద్రం పక్కనే ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ విధి మరోలా ఉంటుంది. సముద్రంలో తుపాన్‌లా వీళ్ల జీవితం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రేమంటే హగ్గులు, ముద్దులు లాంటివి ఇప్పుడు తీస్తున్న లవ్‌స్టోరీల్లో కామన్ పాయింట్. 'సప్త సాగరాలు దాటి' చిత్రంలో మాత్రం అలాంటివేం లేవు. ఓ మంచి పుస్తకం చదువుతున్నట్లో.. ఓ మంచి పాట వింటున్నంత హాయిగా ఉంది. ప్రేమకథా చిత్రం అన్నాను కదా అని మొత్తం లవ్ సీన్సే ఉంటాయని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో జైలు, అందులో ఖైదీల జీవితం ఎలా ఉంటుందనేది చాలా హృద్యంగా ఆవిష్కరించారు. కానీ ఆ సన్నివేశాలనే కొన్నిసార్లు బోర్ కొట్టిస్తాయి కూడా! ఎవరెలా చేశారు? మనుగా నటించిన రక్షిత్ శెట్టి.. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ప్రేమికుడు, ఖైదీ, పరిణితి చెందిన మనిషిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్‌ని అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాడు. ప్రియ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్.. కేవలం తన కళ్లు, నవ్వుతో మాయ చేసింది. రక్షిత్ శెట్టితో ఈమె కెమిస్ట్రీ అయితే వేరే లెవల్. నిజంగా ప్రేమికులు అనేంతలా స్క్రీన్‌పై రెచ్చిపోయారు. ప్రేమ, విరహాం, తపన.. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్‌ని అంతే అద్భుతంగా పండించారు. మిగిలిన పాత్రల్లో నటించిన పవిత్రా లోకేశ్, అచ్యుత్ తదితరులు తమ వంతుగా ఆకట్టుకునే యాక్టింగ్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'సప్త సాగరాలు దాటి'లో హీరోహీరోయిన్ అద్భుతమైన ఫెర్పార్మెన్తో అదరగొడితే మరో ముగ్గురు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. వీళ్లలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ రాజ్. ప్రేమకథకు సంగీతమే ప్రాణం. ఈ సినిమాకు ఇతడిచ్చిన పాటలు కావొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావొచ్చు మూవీకి ప్రాణం పోశాయి. మొదటి నుంచి చివర వరకు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయాయి. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి.. తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్‌కి రిచ్‌నెస్ తీసుకొచ్చాడు. దర్శకుడు విజన్‌ని స్క్రీన్‌పై అద్భుతంగా వచ్చేలా చేశాడు. చివరగా రచయిత, దర్శకుడు హేమంత్ ఎమ్.రావు గురించి చెప్పుకోవాలి. ఓ సాధారణ ప్రేమకథని అంతే నిజాయితీగా చెప్పాడు. అనవసరమైన సీన్ల జోలికి పోకుండా ఉన్నది ఉన్నట్లు ప్రెజెంట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీగా ఉంది. అక్టోబరు 20న అది రిలీజ్ కానుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్‌డెస్క్