ఓటీటీలో సడెన్‍గా మాయమైన హిట్‌ సినిమా.. కారణం ఇదేనా | South India Super Hit Movie Suddenly Stops Streaming In OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో సడెన్‍గా మాయమైన హిట్‌ సినిమా.. కారణం ఇదేనా

Published Thu, Mar 21 2024 9:54 AM | Last Updated on Thu, Mar 21 2024 12:54 PM

South India Super Hit Movie Suddenly Stop In OTT Streaming - Sakshi

కన్నడ హిట్‌ సినిమా ‘సప్త సాగరాలు దాటి సైడ్‌- బీ’ ఓటీటీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తొలగించేసింది. కన్నడ నటులు రక్షిత్‌ శెట్టి, రుక్మిణీ వసంత్‌ జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది.  గతేడాది నవంబరు 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ  అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ సడెన్‌గా తొలగించింది.

‘సప్త సాగరాలు దాటి సైడ్‌- ఏ’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం కన్నడతో పాటుగా టాలీవుడ్‌లో కూడా మంచి ఆదరణ పొందింది. సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, సైడ్-బీ రెండు చిత్రాలు ఇంతవరకు అమెజాన్‌ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్‌ అయ్యాయి. అయితే సప్త సాగరాలు దాటి సైడ్‌- బీ ఓటీటీలో సడెన్‌గా మాయమైంది.  చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ అందుబాటులో లేకపోవడంతో సోషల్‌ మీడియాలో యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రైమ్ వీడియో నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

'సప్త సాగరాలు దాటి' సీక్వెల్‌  చిత్రాలకు హీరో రక్షిత్ శెట్టి నిర్మాతగానూ ఉన్నారు. ఈ రెండు చిత్రాల శాటిలైట్ హక్కులను జీ5 నెట్‍వర్క్ కూడా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని బిజినెస్‌ డీల్స్‌ వల్ల మొదట అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే, సైడ్-బీ చిత్రాన్ని మాత్రం 'జీ5' ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు టాక్‌. అందుకే సైడ్‌ -బీ చిత్రం ప్రైమ్‌ వీడియోలో తొలగించారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సప్త సాగరాలు దాటి సైడ్‌- ఏ మాత్రమే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement