
రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సప్త సాగరాలు దాటి’. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. మనసుకు హత్తుకునే ప్రేమకథగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర కలెక్షన్లు వసూలు చేయలేకపోయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.
చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడటం ఆసమయంలో అతను పడే వేదనను ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు. అదే సమయంలో ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చేందుకు అతడి ప్రేయసి పడే కష్టాన్ని కూడా బాగా ఎమోషనల్‌గా చూపించారు. పార్ట్-1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
మొదటి భాగానికి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పార్ట్ రిలీజ్‌పై మేకర్స్ ప్రకటన ఇచ్చారు. 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీటీమ్ రిలీజ్ డేట్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసింది. నవంబర్ 17న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించగా.. పవిత్ర లోకేశ్, అవినాష్, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment