తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చితే చాలు నెత్తిన పెట్టేసుకుంటారు. అందులోని నటీనటుల్ని కూడా అభిమానిస్తారు. అలా ఈ మధ్య కాలంలో కన్నడ హీరోలు కూడా మనవాళ్లకు బాగా దగ్గరయ్యారు. వాళ్లలో హీరో రక్షిత్ శెట్టి కూడా ఒకడు. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ అని చాలామందికి తెలుసు. కానీ 'చార్లి 777' మూవీతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ హీరోకి రష్మిక మాత్రమే అంతకుముందు కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందట.
రష్మికతో బ్రేకప్
కన్నడలో రక్షిత్ శెట్టి పేరు తెలియని వాళ్లుండరు. నటుడు-దర్శకుడు-రచయిత-నిర్మాత.. ఇలా మనోడి దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి. గతంలో 'కిరిక్ పార్టీ' అనే సినిమాలో రక్షిత్ హీరోగా నటిస్తే, రష్మిక హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు వీళ్లు ప్రేమలో పడ్డారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కారణం ఏంటే తెలీదు గానీ ఈ జంట విడిపోయింది. అయితే ఇదే కాదు రక్షిత్ కి మరో లవ్‌స్టోరీ కూడా ఉంది. అక్కడ క్లోజ్ ఫ్రెండే మోసం చేశాడట.
(ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో)
రక్షిత్ ఏం చెప్పాడు?
'నా ఇంజినీరింగ్ సెకండియర్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశా. తనకి లవ్ లెటర్ ఇవ్వమని మా ఫ్రెండ్‌కి రోజూ లవ్ లెటర్స్ రాసి ఇచ్చేవాడిని. అలా రెండేళ్లు గడిచిపోయాయి కానీ అమ్మాయి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఇచ్చిన లెటర్స్‌ని నా ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యభర్తలు' అని హీరో రక్షిత్ శెట్టి తనకు జరిగిన మోసం గురించి చెప్పుకొచ్చాడు.
'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన కాలేజీ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాడు. అయితే రక్షిత్ జీవితంలోని ఈ రెండు స్టోరీలు చూసిన ఎవరికైనా సరే.. ఈ హీరో ప్రేమ అనేది అస్సలు కలిసి రావడం లేదా అనే సందేహం వస్తోంది. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment