రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్ | Rakshit Shetty Interesting Comments On Rashmika Mandanna Deepfake Controversy Viral Video - Sakshi
Sakshi News home page

Rashmika Rakshit Shetty: ఆ జాగ్రత్తలు తీసుకోవాలి.. రక్షిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published Thu, Nov 16 2023 7:12 PM | Last Updated on Thu, Nov 16 2023 7:24 PM

Rakshit Shetty Comments On Rashmika Controversy Video - Sakshi

ప్రస్తుతం సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోల రచ్చ ఎక్కువైంది. కొన్నిరోజుల ముందు రష్మిక, తాజాగా కరీన్ కపూర్.. దీని బారిన పడ్డారు. అయితే ఈ విషయమై బాధితులు మాత్రమే కాదు చాలామంది హీరోహీరోయిన్లు స్పందిస్తున్నారు. తాజాగా రష్మిక జరిగిన దానిపై ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ రష్మిక గురించి రక్షిత్ ఏమన్నాడు?

(ఇదీ చదవండి: హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!)

కన్నడలో 'కిరిక్ పార్టీ' సినిమాతో రష్మిక హీరోయిన్‌గా పరిచయమైంది. ఇదే మూవీలో హీరోగా చేసిన రక్షిత్ శెట్టి.. షూటింగ్ టైంలో ఆమెలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. కారణమేంటో తెలీదు గానీ పెళ్లి చేసుకోలేదు. ఎవరి కెరీర్ పరంగా వాళ్లు బిజీలో ఉన్నారు. రక్షిత్ కొత్త మూవీ 'సప్త సాగరాలు దాటి సైడ్-బి'.. నవంబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో.. రష్మిక ఫేక్ వీడియో ఘటనపై రెస్పాండ్ అయ్యాడు.

'నిజానికి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరముంది. ఎలాంటి సాఫ్ట్‌వేర్ తయారు చేసినప్పటికీ దానికి ఓ లైసెన్స్ ఉండాలి. అలాంటి రూల్స్ వచ్చినప్పుడే ఇలాంటి వాటిని అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్‌వేర్స్‌ని చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటిని అరికట్టకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువవ్వొచ్చు. అయితే రష్మిక కెరీర్ కోసం ఎన్నో డ్రీమ్స్ అనుకున్న అమ్మాయి' అని రక్షిత్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. టెన్షన్‌లో ఆ కంటెస్టెంట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement