రష్మికకు వింత పరిస్థితి.. ఒకేరోజు ఆ రెండు సినిమాలు రిలీజ్ | Rakshit Shetty And Vijay Devarakonda Movies Release Same Day - Sakshi
Sakshi News home page

Rashmika: రష్మికకు వింత పరిస్థితి.. ఒకేరోజు ఆ రెండు సినిమాలు

Published Thu, Aug 31 2023 7:05 PM | Last Updated on Thu, Aug 31 2023 8:26 PM

Rakshit Shetty And Vijay Devarakonda Movies Release Same Day - Sakshi

యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'ఖుషి' రిలీజ్‌కి రెడీ అయిపోయింది. కొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. 'లైగర్'తో దెబ్బతిన్న విజయ్.. ఈ మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇకపోతే రష్మిక మాజీ బాయ్‌ఫ్రెండ్ మూవీ కూడా ఇదేరోజు థియేటర్లలోకి రాబోతుంది. దీంతో ఇప్పుడు రష్మిక పరిస్థితి ఏంటా అని ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

'కిరిక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో రష్మిక హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీ చేస్తున్నప్పుడే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. నిశ్చాతార్థం చేసుకుని వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారు. ఏమైందో ఏమో గానీ కొన్నాళ్లకు ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్ చేసుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

(ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..)

తెలుగులో రష్మిక ఎన్ని సినిమాలు చేసినా... వాటిలో 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే వీటిలో హీరో విజయ్ దేవరకొండతో నెక్స్ట్ లెవల్ కెమిస్ట్రీ వర్కౌట్ చేసింది. అప్పటినుంచి వీళ్లిద్దరూ లవర్స్ అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. బయట కూడా వీళ్లిద్దరూ ప్రేమికులు అనేలా కనిపిస్తుంటారు. వీళ్ల రిలేషన్ ఏంటనేది ఇప్పటికీ మిస్టరీనే.

అయితే రష్మిక రూమర్ బాయ్‌ఫ్రెండ్ విజయ్ నటించిన 'ఖుషి' సినిమా సెప్టెంబరు 1న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండగా, మరోవైపు రష్మిక మాజీ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగర దాచే ఎల్లో' అనే ప్రేమకథా సినిమా కూడా సెప్టెంబరు 1నే థియేటర్లలోకి రాబోతుంది. రక్షిత్ శెట్టి చిత్రం కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజ్ కానుంది. మరి ఈ రెండింటిలో రష్మిక.. ఏ మూవీ చూస్తుందో అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement