35 ఏళ్లు వచ్చాయి.. ఇంకా సింగిల్‌గా ఉంటానా?: విజయ్‌ దేవరకొండ | Vijay Deverakonda Says he is Not Single | Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: ఒకరి ప్రేమ పొందితే ఎలా ఉంటుందో నాకు తెలుసు.. నా లవ్‌ అలాంటిది!

Published Thu, Nov 21 2024 9:51 PM | Last Updated on Thu, Nov 21 2024 9:51 PM

Vijay Deverakonda Says he is Not Single

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సాహిబా అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లో నటించాడు. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో కోటికి పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ సాంగ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్‌ తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ బయటపెట్టాడు. తాను సింగిల్‌ కాదని ఒప్పేసుకున్నాడు. విజయ్‌ మాట్లాడుతూ.. నాకు 35 ఏళ్లు వచ్చాయి. ఇంకా సింగిల్‌గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారు.

ప్రేమ గురించి తెలుసు
ప్రేమ విషయానికి వస్తే.. ఒకరి ప్రేమ పొందితే ఎలా ఉంటుందో తెలుసు.. ఒకర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసు. షరతుల్లేని ప్రేమ గురించి నాకు తెలియదు. నా ప్రేమ మాత్రం అంచనాలతోనే ఉంటుంది. నాది అన్‌కండిషనల్‌ లవ్‌ కాదు అని తెలిపాడు. విజయ్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. అతడు రష్మిక కోసమే చెప్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రష్మికతో లవ్‌!
కాగా విజయ్‌-రష్మిక చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ అది బయటకు చెప్పడానికి మాత్రం ఇష్టపడటం లేదు. అయితే పండగలు, వెకేషన్స్‌ అప్పుడు మాత్రం ఒకే చోట ఫోటోలు దిగి వాటిని నెట్టింట్లో వదిలి తాము కలిసే ఉన్నట్లు హింట్లిస్తుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement