
పుష్ప చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మక మందన్న.. 'యానిమల్' చిత్రంతో ఒక్కసారిగా ఆమె గ్రాఫ్ నార్త్ ఇండియాలో పెరిగింది. సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన యానిమల్ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందులో గీతాంజలిగా ఆమె ఒక బలమైన పాత్రలోనే కనిపించింది. ఈ సినిమాతో ఆమెకు మరిన్నీ బాలీవుడ్ చిత్రాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన సహ నటులు అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. ముఖ్యంగా అమితాబ్ సర్ చాలా సరదాగా ఉంటారని ఆమె చెప్పింది. షూటింగ్ సమయంలో ఎవరైన ఆయనకు కనిపిస్తే వయసులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారని తెలిపింది. రణబీర్ కపూర్ చాలా స్పోర్టీవ్‌గా ఉంటాడని చెప్పిన రష్మిక జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని ఆయన ఇచ్చారని చెప్పుకొచ్చింది.
విజయ్ దేవరకొండతో తనకు ఉన్న అనుబంధాన్ని రష్మిక ఇలా చెప్పింది. ' కెరీర్‌లో నేను ఎంతో కష్టపడే వచ్చాను. నేను చేసే ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. నేను ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటే ఆ సమయంలో తప్పకుండా అతని సలహా తీసుకుంటాను. అది నాకు ఎంతో అవసరం కూడా.. ఆ సమయంలో నాకు ఏది మంచో, ఏది చెడో వివరిస్తాడు. వ్యక్తిగతంగా నా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్ చేసిన వ్యక్తి విజయ్.' అని రష్మిక తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరగనుందని, వీరి వివాహ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ ఫిబ్రవరిలో ఎవరితోనూ తన నిశ్చితార్థం లేదని. తన పెళ్లి గురించిన పుకార్లు తరచూ వస్తూనే.. వినిపిస్తూనే ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో విజయ్ బిజీగా ఉంటే.. మరోవైపు రష్మక కూడా బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న 'ఛావా' చిత్రంలో విక్కీ కౌశల్‌తో కలసి నటిస్తుంది.ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితాధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్‌తో ‘పుష్ప 2’లో కూడా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment