రష్మిక, శ్రీలీలకు పోటీగా మరో కన్నడ బ్యూటీ? | Sapta Sagaradaache Yello Dache Heroine Rukmini Vasanth Interesting Details - Sakshi
Sakshi News home page

Rukmini Vasanth: 'సప్త సాగరాలు దాటి' హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Published Sat, Sep 23 2023 7:57 PM | Last Updated on Sat, Sep 23 2023 8:55 PM

Sapta Sagaradaache Yello Dache Heroine Rukmini Vasanth Details - Sakshi

ప్రతివారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ వారం మాత్రం తెలుగు చిత్రాలు ఏం లేవు. 'సప్త సాగరాలు దాటి' అనే డబ్బింగ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజైంది. కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమా.. ఇక్కడ మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో మిగతా విషయాలు సంగతి కాస్త అలా పక్కనబెడితే హీరోయిన్ మాత్రం యాక్టింగ్‌తో తన మార్క్ చూపించింది. మూవీ చూసిన ప్రతిఒక్కరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇంతకీ ఎవరు ఈమె?

ఆమె ఫుల్ డీటైల్స్
'సప్త సాగరాలు దాటి' సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమ్మాయి పేరు రుక్మిణి వసంత్. బెంగళూరులోనే పుట్టి పెరిగింది. లండన్‌లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసింది. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్.. అశోక చక్ర సొంతం చేసుకున్నారు. ఇకపోతే రుక్మిణి.. 2019లో 'బీర్బల్' మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఓ మూడేళ్ల ఎక్కడా కనిపించలేదు. 

(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ)

ఎందుకంత స్పెషల్?
ఈ ఏడాది మాత్రం 'భగీర', 'సప్త సాగరాలు దాటి' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. త్వరలో 'బాణదారియల్లీ' అనే కన్నడ చిత్రంతో థియేటర్లలోకి రాబోతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈమెకు ఉన్నదల్లా మూడు సినిమాల అనుభవం. కానీ 'సప్త సాగరాలు దాటి' మూవీలో హీరో రక్షిత్ శెట్టిని కొన్ని సీన్స్‌లో డామినేట్ చేసిందంటేనే ఈమె యాక్టింగ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఈమెకి క్లోజప్ షాట్స్ చాలా ఉన్నాయి. ఆయా సన్నివేశాల్లో జస్ట్ కళ్లు, నవ్వుతో అందరినీ మాయ చేసినంత పనిచేసింది.

వాళ్లిద్దరికీ పోటీ?
ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ల పేరు చెప్పమంటే.. రష్మిక, శ్రీలీల అని అంటారు. వీళ్లిద్దరూ కన్నడలోనే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో అడుగుపెట్టారు. 'సప్త సాగరాలు దాటి'తో రుక్మిణి వసంత్.. తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ఒకవేళ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసి, హిట్ కొడితే మాత్రం రష్మిక, శ్రీలీలకు పోటీ తప్పకపోవచ్చు! ఇదంతా జరగడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటివరకు వెయిట్ అండ్ సీ!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement