
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న ఆమెను డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి దాదాపు 14 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రన్యారావును అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్‌కు పంపించారు. ప్రస్తుతం రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇవాళ డీఆర్‌ఐ అధికారుల ముందు విచారణకు హాజరైన రన్యారావు కన్నీళ్ల పర్యంతమైంది. అసలు ఇందులోకి ఎందుకు వచ్చానో అంటూ తన న్యాయవాదులతో అన్నారు. నిద్రలో కూడా ఎయిర్‌పోర్ట్ గుర్తొస్తోందని.. అస్సలు నిద్రపట్టడం లేదని తెలిపింది. మానసికంగా కృంగిపోయానని తన లాయర్లతో రన్యా రావు చెప్పింది. విచారణ సందర్భంగా ఫుల్ ఎమోషనలైంది రన్యా రావు. మరోవైపు ఆమెపై ఇప్పటికే సీబీఐ అధికారులు కూడా కేసు నమోదు చేశారు.
కాగా.. మాణిక్య సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రన్యా రావు కేవలం మూడు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. ఈ మూవీ తెలుగు సినిమా మిర్చి రీమేక్‌గా తెరకెక్కించారు. ఆ తర్వాత పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. బంగారు అక్రమ రవాణా చేస్తుండగా మార్చి 3న దుబాయ్ నుంచి వస్తుండగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment