2023 కి వీడ్కోలు, న్యూ ఇయర్‌కి వెల్‌కమ్ చెప్పడానికి బంధు మిత్రులు బృందంగా ఒక చోట చేరుతుంటారు. ఏడాది మొత్తం జ్ఞాపకంగా మిగిలిపోయే ఈ రోజును ఇంట్లో ఉల్లాసభరితంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. న్యూ ఇయర్ వేడుకల అలంకరణలో మెరిసే, ఆకర్షణీయమైన వెలుగులతో ఈ రోజును అలంకరించడానికి చకచకా సిద్ధం అయిపోవచ్చు.
► బ్యానర్
ముందుగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చూపే ఒక సాధారణ బ్యానర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నలుపు, బంగారం, వెండి రంగులు ఉండే బ్యానర్‌తో ఉన్న ఈ అలంకారం అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ బ్యానర్ ను మీ ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు. దీనిని టేప్‌తో గోడలకు అతికించడం, ఆ తర్వాత తొలగించడం కూడా సులువే.
► బెలూన్స్
నూతన సంవత్సర వేడుకల అలంకరణలో బెలూన్‌లు మరో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పార్టీ మూడ్‌ను తీసుకురావడానికి ఇంట్లో బెలూన్ ఆర్చ్‌ని సృష్టించుకోవాలి. రెడీమేడ్‌గా కూడా ఈ ఆర్చ్‌లు దొరుకుతాయి. ఈ బెలూన్స్ కూడా బంగారం, తెలుపు, మెరిసే బెలూన్స్ మరింత పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి.
► కొవ్వొత్తులు
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నప్పుడు అక్కడి వాతావరణం హాయిగొలిపే అనుభూతిని ఇవ్వాలి. ఇందుకు ఫ్లేమ్‌లెస్, సెంటెడ్ క్యాండిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. అందుకని, ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవడం మంచిది. న్యూ ఇయర్‌లోకి అడుగిడే కొత్త సమయంలో ఈ కొవ్వొత్తుల వెలుగులు అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతాయి.
► ఫన్ నెక్లెస్ లు
టేబుల్‌పై కొవ్వొత్తులు ఒకటే ఉంచితే సరిపోదు. ఆ టేబుల్‌పైన పరిచే రన్నర్ పై పూసల దండలను అమర్చడం, వేలాడదీయడం పండగ సంబరాన్ని తీసుకువస్తుంది. వీటిలో కూడా బంగారం, నలుపు, వెండి పూసల దండలను ఎంచుకోవడం మంచిది.
► డిస్కో థీమ్
కొత్తసంవత్సరం అంటేనే ఒక జోష్‌తో నడవాలనుకుంటారు. న్యూ ఇయర్‌కి వెల్‌కమ్ చెప్పే సమయంలో డాన్స్ చేసే వీలుండేలా డిస్కో థీమ్‌ని అలంకరించుకోవాలి. ఇందుకు సియెర్రా వంటి కొన్ని డిస్కో బాల్స్ ఈ అలంకరణకు ఉపయోగించుకోవాలి.
► పిల్లల కోసం ప్రత్యేకం
పార్టీలో పిల్లలు ఉంటే వారి కోసం.. వారి చేత నియాన్, పేస్టెల్ బెలూన్‌లు, రంగురంగుల నాప్‌కిన్స్, కప్పులతో వారి పార్టీ ప్లేస్‌ను అలంకరించవచ్చు.
► తెల్ల బంగారం
తెలుపు, బంగారు రంగులతో పార్టీ ప్లేస్‌ను మెరిసేలా అలంకరించండి. ఇందుకు షిమ్మరీ గోల్డ్ ఫ్రింజ్ కర్టెన్లను జోడించే ముందు డోర్ ఫ్రేమ్ పై భాగంలో తెల్లటి బెలూన్‌లను బ్లో అప్ చేయచ్చు.
► స్ట్రింగ్ లైట్లు
బయటి వైపు స్ట్రింగ్ లైట్లను వేలాడదీసి, వాటిని మెరిసేలా చేయచ్చు. దీంతో బయటి వాతావరణం వెలుగులతో పండగ వాతావరణాన్ని నిండుగా కనిపంచేలా చేస్తుంది.
► పేపర్ ప్లేట్స్
రంగు రంగుల పేపర్ ప్లేట్లను వాల్ డెకార్‌గా మార్చుకోవచ్చు. గోడపైన ఉల్లాసాన్ని కలిగించే రంగులను ఆకర్షణీయంగా అలంకరించుకోవడానికి చవకైన, సరైన మార్గం అవుతుంది.
► రంగు రంగుల టిష్యూ
కొత్త కొత్త అలంకరణతో పార్టీ ప్లేస్‌ను ఉత్తేజంగా మార్చడానికి రంగురంగుల టిష్యూ పేపర్లు కూడా వాడచ్చు. పింక్, బ్లూ, వైట్ టిష్యూ పేపర్లను తీసుకొని, వాటిని ఒక్కొక్కటీ జోడిస్తూ దండలా అల్లుకోవాలి. దీనిని పార్టీ ప్లేస్‌లో వేలాడదీయాలి.
► టేబుల్ క్లాత్
పింక్ గ్లిటర్ టేబుల్ క్లాత్ పరిచి, దానిపైన బంగారు, స్టార్ మోటిఫ్‌లతో ఉల్లాసభరితమైన థీమ్‌ని తీసుకురావచ్చు. దీంతో డిన్నర్ చేసే టేబుల్ న్యూ ఇయర్ వేడుకలో మరింత ప్రత్యేకతను నింపుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment