ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్‌ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్‌లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్‌గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్‌సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి.
టాప్ 15 గేమింగ్ వీడియోలు
2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి.
టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్
ఈ ఏడాది యుట్యూబ్‌లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి.
ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్‌ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు.
టాప్ 15 షార్ట్స్
యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా..
టాప్ 15 మ్యూజిక్ వీడియోలు
2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment