కొత్త సంవత్సరాలు మనకి కొత్త గానీ, అనాది కాలగమనానికి కాదు!. అలుపుసొలుపు లేని నిత్య చైతన్యాలాపనకి కొత్తా పాతా ఏమిటి? అన్నాడో కవి. అయినా డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆంగ్ల సంవత్సరాదికి ఆహ్వానం పలకడం.. అదో వేడుకగా జరగడం షరా మామూలు అయ్యింది. అయితే ఇక్కడ కొన్ని దేశాలు కొత్త సంవత్సరాన్ని వెరైటీగా ఆహ్వానించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
డెన్మార్క్ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యుల అందరూ కలిసి తలుపుల వద్ద పాత ప్లేట్లు, గ్లాసులను విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వలన చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని డెన్మార్క్ ప్రజల నమ్మకం. ఎవరి ఇంటి గుమ్మం వద్ద విరిగిన పాత్రలు ఎంత ఎక్కువ పేరుకుంటే.. ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని విశ్వాసం.
న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రతి అమెరికా ప్రజలు టీవీలకు, ఆన్‌లైన్‌లకు అతుక్కుపోతారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో జరిగే బాల్ డ్రాప్ ఈవెంట్ అందుకు కారణం. ఇక్కడి వన్ టైమ్స్ స్క్వేర్‌పై ప్రతి సంవత్సరం అర్ధరాత్రి బాల్ డ్రాప్ ఈవెంట్‌ను వీక్షిస్తారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన బాల్‌ను 31వ తేదీన రాత్రి వన్‌టైమ్స్ స్కైర్ పై నుంచి 11. 59 నిమిషాలకు డ్రాప్ చేస్తారు. ఇటీవల కాలంలో బాల్ డ్రాప్‌కు ముందు సంగీతకారుల ప్రదర్శనలతో లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను తొలిసారి ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్‌పేపర్ యజమాని అడాల్ఫ్ ఓచ్స్ నిర్వహించారు. 1908 న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెబుతూ 1907 డిసెంబర్ 31న తొలిసారి బాల్ డ్రాప్ ఈవెంట్ జరిగింది.
టైమ్స్ కొత్త ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రచారం చేసేందుకు బాణాసంచాలతో న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహించారు. బంతి నిఆర్ట్‌క్రాఫ్ట్ స్ట్రాస్ కన్సల్టెంట్ కంపెనీ రూపొందించింది. కేందుకు డిసెంబర్ 31, 1907న మొదటిసారిగా బాల్ డ్రాప్ నిర్వహించబడింది. 1942, 1943లో యుద్ధకాల సమయాల్లో మినహా ప్రతది ఏడాది బాల్ డ్రాప్ ఈవెంట్ నిర్వహణ జరుగుతూ వస్తుంది.
బాల్ డిజైన్‌ను నాలుగుసార్లు ఆధునీకరించారు. తొలినాళ్లలో బాల 5 అడుగులు( 1.5 మీ) వ్యాసం కలిగి ఉండేది. దీనిని చెక్క, ఇనుముతో తయారు చేసేవాళ్లు.ఇది దాదాపు 100 బల్బులతో ప్రకాశిస్తుంది. ప్రస్తుత బంతి 12 అడుగులు(3.7 మీ) వ్యాసం కలిగి ఉంది. దీనిలో 32,00 ఎల్‌ఈడీ బల్బ్‌లను ఉపయోగిస్తున్నారు.
బ్రెజిల్‌లో నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు చాలా ప్రత్యేకమైన పనులను చేస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక లోదుస్తులు ధరిస్తారు. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
ఫిన్లాండ్: ఫిన్లాండ్‌లో ప్రజలు రాబోయే సంవత్సరంలో జరగనున్న విశేషాల గురించి ఊహిస్తారు . దీని కోసం.. వారు కరిగిన టిన్‌ను నీటిలో ముంచి, లోహం గట్టిపడిన తర్వాత.. లోహానికి ఆకారంగా మార్చే పక్రియను చేపడతారు. ఈ లోహం గుండె లేదా ఉంగరం ఆకారాన్ని తీసుకుంటే.. అది వివాహం జరగడానికి చిహ్నం అని అర్థం. మరోవైపు మెటల్ ఓడ రూపాన్ని తీసుకుంటే, అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారు.
12 గంటలకు.. 12 ద్రాక్షలు
స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజున పాటించే సంప్రదాయం విచిత్రంగా ఉంటుంది. న్యూ ఇయర్ అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇలా చేయడానికి రీజన్ ఏమిటంటే.. 12 ద్రాక్షలు 12 నెలలు.. ద్రాక్ష రాబోయే సంవత్సరంలో ఒకొక్క ద్రాక్ష పండు ఒకొక్క నెల అదృష్టంతో ముడిపడి ఉంటుందట. స్పెయిన్‌లోని మాడ్రిడ్, బార్సిలోనాలాంటి బడా నగరాల్లో 12 ద్రాక్షను సామూహికంగా ఆరగించేందుకు ప్రధాన కూడళ్లలో భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment