Different Style
-
లుంగీ లాంటి చీరలో బిగ్‌బాస్ స్రవంతి.. వేరే లెవల్ స్టైల్! (ఫొటోలు)
-
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: వెరైటీగా వీళ్లు ఏం చేస్తారంటే..
కొత్త సంవత్సరాలు మనకి కొత్త గానీ, అనాది కాలగమనానికి కాదు!. అలుపుసొలుపు లేని నిత్య చైతన్యాలాపనకి కొత్తా పాతా ఏమిటి? అన్నాడో కవి. అయినా డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆంగ్ల సంవత్సరాదికి ఆహ్వానం పలకడం.. అదో వేడుకగా జరగడం షరా మామూలు అయ్యింది. అయితే ఇక్కడ కొన్ని దేశాలు కొత్త సంవత్సరాన్ని వెరైటీగా ఆహ్వానించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. డెన్మార్క్ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యుల అందరూ కలిసి తలుపుల వద్ద పాత ప్లేట్లు, గ్లాసులను విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వలన చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని డెన్మార్క్ ప్రజల నమ్మకం. ఎవరి ఇంటి గుమ్మం వద్ద విరిగిన పాత్రలు ఎంత ఎక్కువ పేరుకుంటే.. ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని విశ్వాసం. న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రతి అమెరికా ప్రజలు టీవీలకు, ఆన్‌లైన్‌లకు అతుక్కుపోతారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో జరిగే బాల్ డ్రాప్ ఈవెంట్ అందుకు కారణం. ఇక్కడి వన్ టైమ్స్ స్క్వేర్‌పై ప్రతి సంవత్సరం అర్ధరాత్రి బాల్ డ్రాప్ ఈవెంట్‌ను వీక్షిస్తారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన బాల్‌ను 31వ తేదీన రాత్రి వన్టైమ్స్ స్కైర్ పై నుంచి 11. 59 నిమిషాలకు డ్రాప్ చేస్తారు. ఇటీవల కాలంలో బాల్ డ్రాప్‌కు ముందు సంగీతకారుల ప్రదర్శనలతో లైవ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను తొలిసారి ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్‌పేపర్ యజమాని అడాల్ఫ్ ఓచ్స్ నిర్వహించారు. 1908 న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుతూ 1907 డిసెంబర్ 31న తొలిసారి బాల్ డ్రాప్ ఈవెంట్ జరిగింది. టైమ్స్ కొత్త ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రచారం చేసేందుకు బాణాసంచాలతో న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహించారు. బంతి నిఆర్ట్క్రాఫ్ట్ స్ట్రాస్ కన్సల్టెంట్ కంపెనీ రూపొందించింది. కేందుకు డిసెంబర్ 31, 1907న మొదటిసారిగా బాల్ డ్రాప్ నిర్వహించబడింది. 1942, 1943లో యుద్ధకాల సమయాల్లో మినహా ప్రతది ఏడాది బాల్ డ్రాప్ ఈవెంట్ నిర్వహణ జరుగుతూ వస్తుంది. బాల్ డిజైన్‌ను నాలుగుసార్లు ఆధునీకరించారు. తొలినాళ్లలో బాల 5 అడుగులు( 1.5 మీ) వ్యాసం కలిగి ఉండేది. దీనిని చెక్క, ఇనుముతో తయారు చేసేవాళ్లు.ఇది దాదాపు 100 బల్బులతో ప్రకాశిస్తుంది. ప్రస్తుత బంతి 12 అడుగులు(3.7 మీ) వ్యాసం కలిగి ఉంది. దీనిలో 32,00 ఎల్ఈడీ బల్బ్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్లో నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు చాలా ప్రత్యేకమైన పనులను చేస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక లోదుస్తులు ధరిస్తారు. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఫిన్లాండ్: ఫిన్లాండ్లో ప్రజలు రాబోయే సంవత్సరంలో జరగనున్న విశేషాల గురించి ఊహిస్తారు . దీని కోసం.. వారు కరిగిన టిన్ను నీటిలో ముంచి, లోహం గట్టిపడిన తర్వాత.. లోహానికి ఆకారంగా మార్చే పక్రియను చేపడతారు. ఈ లోహం గుండె లేదా ఉంగరం ఆకారాన్ని తీసుకుంటే.. అది వివాహం జరగడానికి చిహ్నం అని అర్థం. మరోవైపు మెటల్ ఓడ రూపాన్ని తీసుకుంటే, అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారు. 12 గంటలకు.. 12 ద్రాక్షలు స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజున పాటించే సంప్రదాయం విచిత్రంగా ఉంటుంది. న్యూ ఇయర్ అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇలా చేయడానికి రీజన్ ఏమిటంటే.. 12 ద్రాక్షలు 12 నెలలు.. ద్రాక్ష రాబోయే సంవత్సరంలో ఒకొక్క ద్రాక్ష పండు ఒకొక్క నెల అదృష్టంతో ముడిపడి ఉంటుందట. స్పెయిన్‌లోని మాడ్రిడ్, బార్సిలోనాలాంటి బడా నగరాల్లో 12 ద్రాక్షను సామూహికంగా ఆరగించేందుకు ప్రధాన కూడళ్లలో భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు. -
ఓ తండ్రి ఆలోచన.. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్లిళ్లు
ఈ హెడ్డింగ్‌కి అర్థం తెలుసుకోవాలంటే మనం కేరళకు వెళ్లాలి. అక్కడ ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయదలిచాడు. కాని పెళ్లికి అనవసర ఖర్చు వద్దనుకున్నాడు. కట్నం ఇవ్వకూడదనుకున్నాడు. ఆ డబ్బును సద్వినియోగం చేయాలనుకున్నాడు. కూతురి పెళ్లికి ఎంత డబ్బు దాచాడో ఆ మొత్తం డబ్బును అదే ముహూర్తానికి మరో ఐదు మంది అమ్మాయిల పెళ్లికి ఖర్చు చేశాడు. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్ళిళ్లు జరిగాయి. ఈ ఆలోచన మనం చేయలేమా? అసలు పెళ్లికి ఖర్చు అవసరమా? పెళ్లి ఖర్చు అనే సామాజిక రుగ్మత నుంచి బయటపడలేమా? ఒక ఆలోచనాత్మక కథనం. ఇటీవల హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని ఒక రిసార్ట్‌లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఖర్చు.. అంటే పెళ్లి జరిపేందుకు అయిన ఖర్చు 2 కోట్లు. ఈ మొత్తంలో లాంఛనాలు లేవు. ఇచ్చిపుచ్చుకున్న ఖర్చూ లేదు. కేవలం కల్యాణ మంటపానికి, భోజనానికి, అతిథి మర్యాదలకి, సంగీత్కి, అలంకరణలకి, అట్టహాసానికి అయిన ఖర్చు అది. ఆ రెండు కోట్లతో మధ్యతరగతి పెళ్లిళ్లు 20 అయినా చేయొచ్చు. పేద పెళ్ళిళ్లు 50 అయినా చేయొచ్చు. పెళ్లి ఇద్దరు స్త్రీ, పురుషులు కలిసే సంతోషకరమైన సందర్భం. దానిని సంతోషంగా చేసుకోవాల్సిందే. ఇరువురి ఆత్మీయులు హాజరవ్వాల్సిందే. కాని ఆ పెళ్లిని ఆసరా చేసుకుని తమ సంపదను, అహాన్ని, హోదాని, పలుకుబడిని నిరూపించాలనుకున్నప్పుడే పేచీ వస్తుంది. వెండి అంచు ఉన్న శుభలేఖలు, వాటితో పాటు ఇచ్చే పట్టుచీరలు, వస్తువులు, భోజనంలో ముప్పై నలభై వంటకాలు, ఖరీదైన వినోద కార్యక్రమాలు ఇవన్నీ పెళ్లి బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తాయి. ఉన్నవారికి ఇదంతా తేలికే కావచ్చు. ఇమిటేట్ చేయాలనుకునే వారికి చిక్కొచ్చి పడుతుంది. ఇటీవల కేరళ లో అట్టహాసపు పెళ్ళిళ్లు, అందుకు పెళ్లికొడుకులు మారాము చేయడం, ఘనంగా చెప్పుకోవడానికి బైక్ దగ్గర కారు అడగడం, కట్నం దగ్గర ఆస్తులు అడగడం, అవి వీలు కాకపోతే భార్యను వేధించడం మామూలు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూరులో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కన్నూరు సమీపంలోని ఎడచ్చేరీకి చెందిన సలీమ్, రుబీనా జంట తమ కుమార్తె రమీజా పెళ్లిని వినూత్నంగా చేయాలనుకున్నారు. గల్ఫ్‌లో ఉద్యోగం చేసే సలీమ్ తన కుమార్తె పెళ్లికి డబ్బు దాచి పెట్టాడు. కాని దానిని కట్నంగా ఇవ్వడం, అట్టహాసపు పెళ్లికి ఖర్చు పెట్టడం వద్దనుకున్నాడు. ఎలాగైనా సరే కట్నం అడగని పెళ్లికొడుకుని వెతికి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అలాంటి వరుడే దొరికాడు. దాంతో అతనికి కట్నం డబ్బు మిగిలిపోయింది. దాంతో పాటు పెళ్లి అర్భాటంగా వద్దనుకున్నాడు కాబట్టి ఆ ఖర్చూ మిగిలింది. ఆ మొత్తం డబ్బుతో ఆర్థికంగా వెనుకబడిన ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకుని వారికి అబ్బాయిలను వెతికి తన కుమార్తెకు పెళ్లి జరిగిన ముహూర్తానికే వారికీ పెళ్లి జరిపించాడు. అంతే మొత్తం ఆరు పెళ్ళిళ్లు ఒకే ముహూర్తానికి జరిపించాడు. ఇందులో ఇద్దరు వధువులు హిందువులు కావడంతో వారి పెళ్లి హైందవపద్ధతిలో జరిగింది. ఈ పెళ్ళిళ్లు జరిపించడంలో సలీమ్, రుబీనా దంపతులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఐదుగురు అమ్మాయిలకు తగిన అబ్బాయిలను వెతికారు. అలాగే పెళ్లిలో సొంత కూతురితో పాటు మిగిలిన ఐదుగురికీ సమానంగా 10 సవరల బంగారం పెట్టారు. అందరికీ ఒకేరకమైన పట్టు చీరలు తెచ్చారు. ఇంత చక్కగా డబ్బును సద్వినియోగం చేయడం వల్ల ప్రశంసలు పొందారు. ఇందులో మతసామరస్యం కూడా ఉండటంతో పొగడ్తలు మరిన్ని వస్తున్నాయి. కాలం మారుతుంది. రెండు తీవ్రతలు కనిపిస్తున్నాయి. ఒకటి పెళ్లికి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం...మరొకటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం బొకేలు ఇచ్చి పుచ్చుకుని వియ్ ఆర్ మేరీడ్ అనుకోవడం. ఎవరి ఇష్టం వారిదే అయినా పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శం అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. తద్వారా ఆడపిల్లలను కనేందుకు, ఆడపిల్లలను పెంచేందుకు జంకే పరిస్థితి పోతుంది. ‘అమ్మాయి పుడితే ఖర్చు’ అనే మాట ఇంకా ఎంత కాలం? ఆ ఖర్చు పెళ్లి వల్లే కదా? దానిని తేలిక చేయలేమా? సలీం వంటి ఆలోచనలు చేయలేమా? ఆలోచించాలి అందరం. పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శాన్ని అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. -
ఇట్స్ మై స్టైల్..
లక్సెట్టిపేట(మంచిర్యాల): టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఫ్యాషన్ ప్రపంచం క్షణాల్లో కళ్ల ముందు దర్శనమిస్తోంది. యువతలో ఫ్యాషన్ అనుకరణ రోజురోజుకు పెరుగుతోంది. గ్రామాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండేందుకు యువకులు ఆరాటపడుతున్నారు. తమదైన గెటప్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే జీవన్. వినూత్న హెయిర్‌స్టైల్, స్పెషల్ అప్పియరెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ‘ఇట్స్ మై స్టైల్’ అంటున్నాడితను. మండలంలోని చందారం గ్రామానికి చెందిన జీవన్ (నిక్‌నేమ్ జీవా, లోబో) పదో తరగతి వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. చిత్రకళపై ఉన్న ఆసక్తితో చిన్నతనం లోనే ఆర్టిస్ట్ వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. ప్రస్తుతం సొంతంగా షాపు ఏర్పాటు చేసుకున్నాడు. పేయింటింగ్, ఫ్లెక్సీ ప్రింటింగ్, రేడియం స్టిక్కరింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని డిఫరెంట్ స్టైల్స్‌తో ప్రజల్లో తిరుగుతుంటాడు. ఓ టీవీ చానల్ యాంకర్ లోబోను చూసి ఆకర్షితుడయ్యాడు. తను కూడా అదే స్టైల్లో ఉండాలనుకున్నాడు. వెరైటీ డ్రెస్సెస్, హేర్‌కటింగ్ విత్ కలరింగ్, కాళ్లకు వేర్వేరు షూ, ఆకట్టుకునే బైక్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాధించుకున్నాడు. తన కళానైపుణ్యం జోడించి బైక్‌ను పూర్తిగా మోడిఫై చేసుకున్నాడు. మంచిర్యాలలోని మెన్స్ ఓ బ్యూటీపార్లర్‌లో హెయిర్‌స్టైల్‌కు మెరుగులు దిద్దుకుంటాడు. షూ, చెప్పులు ఏవి వేసుకున్నా రెండు కాళ్లకు వేర్వేరుగా ధరించడం ఈయన హాబీ. తన పేరు జీవన్ కాగా కొద్దిరోజులు జీవాగా.. ప్రస్తుతం లోబోగా మార్చుకున్నాడు. పియానో, కీబోర్డులోనూ ప్రవేశం ఉంది ఇతడికి. ఆర్కెస్ట్రా, మ్యారేజ్ ఫంక్షన్ ప్రోగ్రాంలలో పాల్గొంటుంటాడు. మ్యూజిక్ ప్రోగ్రాంలకు వెళ్లాలంటే స్టైల్‌కు గుర్తింపు ఉంటుందని అందుకే ఇలా డిఫరెంట్‌గా ఉంటున్నాన్నంటున్నాడు జీవన్. -
వామ్మో.. ప్రత్యేకమైన శైలితో బౌలింగ్
-
వామ్మో.. బౌలింగ్ స్టైల్లో బూమ్రానే మించినోడు!
కొలంబో: ఓ ప్రత్యేక శైలితో బౌలింగ్ చేసే క్రికెటర్లు ఎవరంటే గుర్తొచ్చేది.. టీమిండియా యువ సంచలనం జస్ప్రీత్ బుమ్రా.. అతని బౌలింగ్ శైలే బ్యాట్స్‌మెన్‌ను తెగ ఇబ్బంది పెట్టడం చూశాం. అయితే బుమ్రా స్టైల్‌ను మించిండు.. శ్రీలంక అండర్-19 బౌలర్ కెవిన్ కాధ్ధిగోడా. తాజాగా అండర్-19 ఆసియా కప్‌లో ఆడిన ఈ బౌలర్ గురించే ఇప్పుడంతా చర్చ. కాకపోతే బుమ్రా పేస్ బౌలర్ అయితే కాధ్ధిగోడా స్పిన్ బౌలర్. అయితే ఇతని బౌలింగ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పాల్ అడమ్స్, ఐపీఎల్ టీమ్ గుజరాత్ లయన్స్ ప్లేయర్ శివిల్ కౌశిక్‌ను గుర్తుచేస్తోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా బౌలింగ్ చేయడం చాలా కష్టమని, శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టమని తెలిపారు. శ్రీలంక-ఎ జట్టు ఆటగాడు దమిక సుదర్శన్.. కెవిన్ గురించి మాట్లాడుతూ.. ‘కెవిన్ శైలి చాలా ప్రత్యేకం. ఇలా వేయాలని అతనికి ఎవరూ సూచించలేదు. ఆ శైలి అతనికి సహజంగానే వచ్చింది. మొదట్లో బంతిని సరైన లెంగ్త్‌లో వేయడంలో ఇబ్బంది పడేవాడు. క్రమంగా దాన్ని మెరుగుపరుచుకున్నాడు’ అని తెలిపారు. మైదానంలో నేరుగా అతని శైలిని చూసిన అంపైర్ సరత్ అశోక మాట్లాడుతూ.. ‘విభిన్న శైలిలో బంతిని సరైన ప్రదేశాల్లో వేస్తున్నాడు. కెవిన్‌కు మంచి భవిష్యత్తు ఉంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే లంక నుంచి ముత్తయ్య మురళిధరన్, అజంతా మెండీస్‌లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. వారి బాటలో కెవిన్ పయనిస్తాడో లేదో చూడాలి మరి. -
విష్ణు ఫైట్స్ అదుర్స్
డిఫరెంట్ స్టోరి, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టయిల్, డిఫరెంట్ క్యారెక్టర్... ఇలా చాలా డిఫరెంట్‌గా రూపొందిన చిత్రం ‘డైనమైట్’. మంచు విష్ణు హీరోగా నటించి, అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ప్రీ ప్రమోషనల్ టూర్’లో భాగంగా రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్, వరంగల్ వెయ్యి స్తంభాల గుడిని, అక్కడి ఏషియన్ శ్రీదేవి సినీ మాల్‌ను సందర్శించింది ‘డైనమైట్’ చిత్రబృందం. విష్ణు, చిత్రదర్శకుడు దేవా కట్టా, కథానాయిక ప్రణీత తదితర చిత్రబృందం ఈ ప్రమోషనల్ టూర్లో పాల్గొని, ప్రేక్షకులతో ఈ చిత్రవిశేషాలను పంచుకున్నారు. వెయ్యి స్తంభాల గుడిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. విదేశాల్లో క్రేజ్ ‘డైనమైట్’ చిత్రానికి విదేశాల్లో మంచి క్రేజ్ నెలకొందని యూఎస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సీఈవో రాజ్. కె అన్నారు. యూఎస్, యూకే, యూఏఈ, నేపాల్‌లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. విదేశాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్న థియేటర్ అధినేతలు, ప్రేక్షకులు ‘డైనమైట్’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రాజ్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి, కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ఉందని కూడా అన్నారు. 3న ప్రివ్యూ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే సినీ ప్రముఖులకు చూపించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. 3న హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో ప్రివ్యూ షో ఏర్పాటు చేశారు. ఈ చిత్రవిజయం పట్ల విష్ణు తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఫైట్ మాస్టర్ విజయన్ సమకూర్చిన ఫైట్స్ ఈ చిత్రానికి ఓ హైలైట్‌గా నిలుస్తాయని ఈ సందర్భంగా చిత్రబృందం పేర్కొన్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో విష్ణు నటన, ఫైట్స్ అన్నీ బాగుంటాయని కూడా తెలిపారు. కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ సాధించే చిత్రం అవుతుందని కూడా చెప్పారు. -
హలో మిస్టర్... ఇదిగో ధోతీ
హలో మిస్టర్ చూశారా ఈ విడ్డూరం!! మీరు ధోతి మానేసి పెన్సిల్‌కట్, వెయిస్ట్కట్, కట్,.. కట్... అంటూ జీన్ ప్యాంట్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. అంతటితో ఆగారా..! మన ధోతి గొప్పతనమే మర్చిపోయారు. లలనామణులు అలా కాదు. మీకు ధోతిని గుర్తుచేయడమే కాకుండా.. దానిని చీరతో జతచేసి ఓ డిఫరెంట్ స్టైల్‌తో వెలిగిపోతున్నారు చూడండి. మరి, ఆడాళ్లా మజాకా..! మూలం ఇదీ... గుజరాతీ మహిళల చీరకట్టును చూశారా! ఆ కట్టును పోలినట్టుగా ఉండే ఈ స్టైల్‌కి కొంచెం వెస్టర్న్ కట్స్‌ను జోడించారు డిజైనర్లు. రాచరికమైన ఆకర్షణ ఈ కట్టులో ఉండటంతో వేడుకలలో మెరిసిపోవడం మొదలైంది. సందర్భానికి తగ్గ వేడుకకు డిజైనర్ కొత్త టచ్ ఇవ్వడంతో మరింతగా మెరిసిపోతోంది. సోనమ్ కపూర్.. ధోతి కట్టు శారీ అనగానే సోనమ్ కపూర్ కళ్లముందు దర్శనమిస్తుంది. అంతగా ఈ కట్టుకు ఆమె ప్రాచుర్యం తీసుకువచ్చింది. డిజైనర్లు అనామికా ఖన్నా, తరుణ్ తహిల్యాని, నిఖిల్ తంబి, గారంగ్.. వంటి ప్రముఖ డిజైనర్లు ధోతీకట్టులో ఎన్నో ఆకర్షణీయమైన మార్పులు తీసుకువచ్చారు. గ్లామర్... నాటి రోజుల్లో నారీమణులు ధరించిన నారచీరల కట్టు ఎలా ఉండేదో మనకు సుపరిచితమే. దానినే పోలినట్టుగా ఉండే ఈ ధోతీ స్టైల్ అతివల మనసును అమాంతం లాగేసుకుంది. సంప్రదాయ చీరకట్టుకు కాస్త గ్లామర్ టచ్ ఇవ్వడానికి టాలెంట్ గల డిజైనర్లు మగవారి ధోతి కట్టును, చీరకు జత కలిపారు. దీంట్లో ఎన్నో సృజనాత్మకమైన స్టైల్స్‌ను తీసుకువచ్చారు. ఆరు గజాల చీరను మూడు గజాలకు తగ్గించి, పెట్టీకోట్గా లెగ్గింగ్, ధోతీ ప్యాంట్స్/ఎలిఫెంట్ ప్యాంట్స్/ ఫ్లేర్డ్ ప్యాంట్స్/.. మీదకు కొంగులా ధరిస్తే చాలు ఈ చక్కని రూపం మీ సొంతం. ధోతీ శారీ టిప్స్... పండగల్లోనూ విశేషంగా నిలుస్తోన్న ఈ స్టైల్నిమీరూ ఇంట్లోనే ఫాలో అయిపోవచ్చు.రెడీ మేడ్ ధోతినీ ధరించి, నడుముభాగాన ఒకవైపు 3-4 చీరకుచ్చులను టక్ చేయాలి. కుచ్చులు మరీ పెద్దగా, అలాగని చిన్నవిగా కాకుండా కనీసం 4 ఇంచులు ఉండాలి.ఎడమవైపు కొంగు భాగాన్ని నడుము చుట్టూ తిప్పి, ఎడమ భుజం మీదకు తీసుకొచ్చి పిన్ చేయాలి.కుచ్చిళ్లు ముందు, వెనక, భుజం మీదుగా సరిగ్గా వచ్చాయో లేవో చెక్ చేసుకుంటే సరిపోతుంది. - ఎన్.ఆర్ -
ఆయన స్టైలే వేరు
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నేను హీరోగా నటిస్తున్నాననగానే సినీ పరిశ్రమలో చాలా మంది ఆశ్చర్యపోయారని నటుడు సూర్య అన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం మాస్. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. యువన్ శంకర్‌రాజా సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రం ఈ నెల 29న తెరపైకి రానుంది. మంగళవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు వెంకట్‌ప్రభు మాట్లాడుతూ బిరియానీ చిత్ర షూటింగ్ సమయంలో మాస్ చిత్ర సింగిల్ లైన్‌ను నిర్మిత జ్ఞానవేల్ రాజాకు చెప్పానన్నారు. ఆయన సూర్యకు చెప్పడం లైన్ బాగుంది వెంకట్ప్రభును ఒకసారి కలవమని చెప్పడంతో ఈ చిత్రానికి బీజం పడిందన్నారు. మాస్ చిత్రం కోసం చాలా శ్రమించానన్నారు. చాయాగ్రాహకుడు ఆర్డీ.రాజశేఖర్, సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా పనితనం చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చిందన్నారు. ఇది 200 శాతం సూర్య చిత్రం అని వెంకట్ ప్రభు పేర్కొన్నారు. పిల్లలకు బాగా నచ్చే చిత్రం : నటుడు సూర్య మాట్లాడుతూ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నాననగానే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రం అని చెప్పారు. సాధారణంగా దర్శకులు ఒక స్ట్రాంగ్ పాయింట్ పట్టుకుని చిత్రాలు రూపొందిస్తుంటారన్నారు. అలాంటిది దర్శకుడు వెంకట్‌ప్రభు స్టైల్ వేరని పేర్కొన్నారు. అది తనకు బాగా నచ్చిన విషయం అన్నారు.మాస్ హర్రర్, కథా చిత్రం కాదని, అలాగే భయపెట్టే చిత్రం కాదని, ఇదో కొత్త కోణంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రం అని స్పష్టం చేశారు. మాస్ తన కెరీర్లో కొత్త డెమైన్షన్ కథా చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని సూర్య వ్యక్తం చేశారు.