విష్ణు ఫైట్స్ అదుర్స్ | Grand Premiere for Vishnu Manchu's Dynamite | Sakshi

విష్ణు ఫైట్స్ అదుర్స్

Published Mon, Aug 31 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

విష్ణు ఫైట్స్ అదుర్స్

విష్ణు ఫైట్స్ అదుర్స్

 డిఫరెంట్ స్టోరి, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టయిల్, డిఫరెంట్ క్యారెక్టర్... ఇలా చాలా డిఫరెంట్‌గా రూపొందిన చిత్రం ‘డైనమైట్’. మంచు విష్ణు హీరోగా నటించి, అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ప్రీ ప్రమోషనల్ టూర్’లో భాగంగా రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజ్, వరంగల్  వెయ్యి స్తంభాల గుడిని, అక్కడి ఏషియన్ శ్రీదేవి సినీ మాల్‌ను సందర్శించింది ‘డైనమైట్’ చిత్రబృందం. విష్ణు, చిత్రదర్శకుడు దేవా కట్టా, కథానాయిక ప్రణీత తదితర చిత్రబృందం ఈ ప్రమోషనల్ టూర్‌లో పాల్గొని, ప్రేక్షకులతో ఈ చిత్రవిశేషాలను పంచుకున్నారు. వెయ్యి స్తంభాల గుడిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
 
 విదేశాల్లో క్రేజ్
 ‘డైనమైట్’ చిత్రానికి విదేశాల్లో మంచి క్రేజ్ నెలకొందని యూఎస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సీఈవో రాజ్. కె అన్నారు. యూఎస్, యూకే, యూఏఈ, నేపాల్‌లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. విదేశాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్న థియేటర్ అధినేతలు, ప్రేక్షకులు ‘డైనమైట్’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రాజ్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి, కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ఉందని కూడా అన్నారు.
 
 3న ప్రివ్యూ
 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే సినీ ప్రముఖులకు చూపించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. 3న హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో ప్రివ్యూ షో ఏర్పాటు చేశారు. ఈ చిత్రవిజయం పట్ల విష్ణు తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఫైట్ మాస్టర్ విజయన్ సమకూర్చిన ఫైట్స్ ఈ చిత్రానికి ఓ హైలైట్‌గా నిలుస్తాయని ఈ సందర్భంగా చిత్రబృందం పేర్కొన్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విష్ణు నటన, ఫైట్స్ అన్నీ బాగుంటాయని కూడా తెలిపారు. కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ సాధించే చిత్రం అవుతుందని కూడా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement