కాకినాడ: అరియానా, విరియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై తాను నిర్మించిన ‘డైనమైట్’ చిత్రాన్ని లవ్, యూక్షన్ మిళితమైన పాటు కథాంశంతో రూపొందించినట్టు హీరో మంచు విష్ణు పేర్కొన్నారు. ఆ చిత్రం బృందం శుక్రవారం స్థానిక జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా వచ్చిన బృందం జనరల్ ఆస్పత్రిలో ఉన్న చరకా ఆడిటోరియంలో చిత్రం టీజర్‌ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా దర్శకుడు దేవా కట్టా, హీరో విష్ణు, హీరోయిన్ ప్రణీత వైద్య విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. విద్యార్థులు సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
స్టంట్ మాస్టర్ విజయన్ ఆధ్వర్యంలో తీసిన పోరాట దృశ్యాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని విష్ణు అన్నారు. తాను నటించిన ‘సూర్యం’ తరువాత యాక్షన్ సీన్స్ అంతగా ఏ సినిమాలోనూ లేవన్నారు. హాలీవుడ్ చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ స్థాయి పాత్రలు మనం కూడా చేయగలం అని చెప్పడానికే ‘డైనమైట్’ తీశానన్నారు.
ఈ సినిమా కోసం మంచు విష్ణు ఏడు కిలోల బరువు పెరగడంతోపాటు జిమ్‌లో చేసిన ఎక్సర్‌సైజ్‌ల గురించి దర్శకుడు దేవా కట్టా వివరించారు. టీజర్‌ని ఆవిష్కరించిన విష్ణు అనంతరం జీఎస్‌ఎల్ వైద్య కళాశాల మెంటర్, ఎంసీఐ సభ్యుడు డాక్టర్ గన్ని భాస్కరరావుతో తన తండ్రి మోహన్‌బాబుకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఆయనను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
చేయగలం అని చెప్పడానికే ‘డైనమైట్’
Published Sat, Aug 29 2015 3:35 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement