Dynamite
-
Telangana Liberation Day 2022: మందు పాతరలు.. చివరి అస్త్రం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన సైన్య విభాగం బొల్లారం చేరకుండా చివరి ప్రయత్నంగా నిజాం సైన్యం మందుపాతర్లను ప్రయోగించింది. షోలాపూర్–హైదరాబాద్ రహదారి మీదుగా వస్తున్న మేజర్ జనరల్ చౌదురీ నేతృత్వంలోని సైనిక బృందాన్ని హతమార్చేందుకు నిజాం సైన్యం సికింద్రాబాద్‌కు 20 మైళ్ల దూరంలో పెద్ద సంఖ్యలో మందుపాతర్లను అమర్చింది. అదే సమయంలో భారత సైన్యానికి పట్టుబడ్డ కొందరు నిజాం సైనికులు ఈ విషయాన్ని వెల్లడించారు. వాటిని తొలగించాల్సిందిగా భారత సైన్యం ఆదేశించింది. కానీ, వాటిని జాగ్రత్తగా వెలికితీసే విధానంపై అవగాహన లేకపోవడంతో ఆ సైనికులు చేతులెత్తేశారు. దీంతో భారత సైన్యంలోని నిపుణులు ఐదు గంటలు కష్టపడి వాటిని గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఈ మందుపాతర్ల వ్యవహారం వల్ల భారత సైన్యం ఐదు గంటలు ఆలస్యంగా బొల్లారం చేరుకుంది. సాయంత్రం నాలుగున్నరకు సికింద్రాబాద్ శివార్లలో నిజాం సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఎడ్రూస్ ఎదురేగి చౌదురీ బృందానికి స్వాగతం పలికాడు. నిజాం సేనల లొంగుబాటు పత్రాన్ని సమర్పించాడు. ఇండియన్ ఆర్మీని తోడ్కొని భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ భవనానికి తీసుకెళ్లాడు. 20 మంది భారత సైనికులు మృతి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన ఆపరేషన్‌లో భారత సైన్యం 20 మంది జవాన్లను కోల్పోయింది. అతి తక్కువ ప్రాణనష్టంతో గొప్ప విజయాన్ని సాధించినట్టయింది. 600 మంది నిజాం సైనికులు, 1,000 మందికిపైగా రజాకార్లు ఈ ఆపరేషన్ పోలోలో మరణించినట్లు అప్పట్లో లెక్కలు తేల్చారు. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) కృత్రిమ వరదలకు కుట్ర భారత సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో మూసీ నదిలో రజాకార్లు కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా చేసే హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ధ్వంసం చేసి మూసీలోకి భారీగా వరద వచ్చేలా చేశారు. నదిలో వరద నిండుగా ఉంటే భారత సైన్యం ముందుకు రాలేదన్నది వారి ఆలోచన. కానీ, ఈ ప్రతిబంధకాలను విజయవంతంగా అధిగమించి భారత సైన్యం నగరంలోకి చొచ్చుకొచ్చింది. రజాకార్ల దుశ్చర్యతో హైదరాబాద్‌ను కొంతకాలం పాటు తాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. (క్లిక్: జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్) -
BTS Butter Music Video: గంటలో రికార్డులు బద్ధలు!
'బీటీఎస్'... వరల్డ్ వైడ్‌గా పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ బ్యాండ్. ఇండియాలోనూ ఈ గ్రూప్‌కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏడుగురు సౌత్ కొరియన్ బాయ్స్‌తో ఉండే ఈ గుంపు.. పాప్ ప్రపంచంలో ఓ ప్రభంజనం. కొరియా నుంచి మొదలై జపాన్, అమెరికా.. ఇలా వరుస దేశాల్లో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ.. ఇంటర్నేషనల్ సెన్సేషన్‌గా మారింది. వీళ్ల ఆల్బమ్స్ మిలియన్ల కొద్దీ కాపీల్ని అమ్ముడు పోతుంటాయి. రీసెంట్గా ట్విట్టర్, యూట్యూబ్‌లతో అదిరిపోయే రికార్డులతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది బీటీఎస్. బీటీఎస్ లేటెస్ట్ ఆల్బమ్ ‘బటర్’ శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయిన కాసేపటికే రికార్డుల మోత మొదలైంది. సాంగ్ లాంచ్ లైవ్‌ను 3.89 మిలియన్ల మంది యూట్యూబ్ ప్రీమియర్‌లో వీక్షించగా, కేవలం పదమూడు నిమిషాల్లోనే కోటి మంది యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌ను చూశారు. 54 నిమిషాల్లో రెండు కోట్ల మంది వీక్షించడం కూడా యూట్యూబ్‌లో ఓ రికార్డే. ఇది వరకు ఈ రికార్డు బీటీఎస్ వాళ్ల ‘డైనమైట్’ ఆల్బమ్ పేరిటే ఉండేది. ఇక నాలుగు గంటల్లో యూట్యూబ్‌లో 37 మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతోంది బటర్. ఇది బీటీఎస్కి రెండో ఇంగ్లీష్ సింగిల్ ఆల్బమ్. ఇంకోవైపు వరల్డ్‌వైడ్‌గా బటర్‌కి సంబంధించిన హ్యాష్‌ట్యాగులు ట్విట్టర్లో టాప్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. -
చర్చిని డైనమైట్‌తో పేల్చేసిన చైనా
-
చర్చిని డైనమైట్‌తో పేల్చేసిన చైనా
హాంకాంగ్ : దేశంలోని ప్రముఖ ఎవలంజికల్ చర్చిను చైనా ప్రభుత్వం డైనమైట్ బాంబుతో నేలకూల్చింది. దీంతో పలు క్రిస్టియన్ సంఘాలు చైనా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. మత స్వేచ్ఛ, మానవ హక్కులపై చైనా ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని అన్నాయి. షాంగ్జీ ప్రావిన్సులో గల ది గోల్డెన్ ల్యాంప్‌స్టాండ్ చర్చి అత్యంత పురాతనమైనది. అధ్యాత్మిక జీవనాన్ని నియంత్రించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా చర్చిలను నేలకూల్చుతోంది. అయితే, చర్చిల వరుస కూల్చివేతల వెనుక చైనా ప్రభుత్వ భయాందోళనలు ఉన్నట్లు తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల సంస్కృతికి చెందిన క్రైస్తవ మత వ్యాప్తి దేశంలో జరిగితే భవిష్యత్‌లో కమ్యూనిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ కారణాన్ని పైకి చూపకుండా అధ్యాత్మికతపై నియంత్రణ పేరుతో క్రైస్తవ మతాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు చైనా ప్రభుత్వం యత్నిస్తోంది. -
విష్ణు లవ్ స్టోరీ!
‘డైనమైట్’ వంటి న్యూ డెమైన్షన్ థ్రిల్లర్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వ చ్చిన మంచు విష్ణు ఇప్పుడు ప్రేమలో మరో కోణాన్ని ఆవిష్కరించనున్నారు. విష్ణు హీరోగా నటిస్తున్న ఓ ప్రేమకథా చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. సోనారిక కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి ‘జెమిని’ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘ఇది మంచి లవ్, యాక్షన్ ఎంటర్టైనర్. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం. ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి. హైదరాబాద్, వైజాగ్ల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతాం’ అని చెప్పారు. కార్తీక్‌రెడ్డి చెప్పిన కథ చాలా కొత్తగా ఉందనీ, కచ్చితంగా అందరినీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా: విజయ్ సి.కుమార్, నిర్వహణ:సోమా విజయ్‌ప్రకాశ్. -
డైనమైట్ టీమ్‌తో చిట్‌చాట్
-
మరోసారి జెండా పాతేశాడు
తెలుగు సినిమాకు ఇది వెరీ గుడ్ 'వీకెండ్' అని చెప్పొచ్చు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకోవటంతో ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే మూడు సినిమాల్లో ఎక్కువగా కలిసొచ్చింది మాత్రం విశాల్‌కే. డైనమైట్, భలే భలే మొగాడివోయ్ సినిమాలు స్ట్రయిట్ తెలుగు సినిమాలు కావటంతో తెలుగు మార్కెట్ మీద తమ పట్టు చూపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాగా తెరకెక్కిన విశాల్ జయసూర్య కూడా ఈ రెండు సినిమాలకు పోటిగా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుండటంతో విశాల్ ఆనందంలో తేలిపోతున్నాడు. క్రైం పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జయసూర్య తమిళ తో పాటు తెలుగులో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. విశాల్ కు బాగా కలిసొచ్చిన యాక్షన్ జానర్ లో, మల్లన ఫేం సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కింది. గత కొంత కాలంగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న విశాల్ మరోసారి తన డెసిషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగులో మార్కెట్ కోసం నానా తంటాలు పడుతుంటే విశాల్ మాత్రం టాలీవుడ్లో ఈజీగా హిట్ కొట్టేస్తున్నాడు. -
డైనమైట్ .. భలే.. భలే... కొత్త సినిమాలు గురూ!
కొత్త సినిమాలు గురూ! ఈ యాక్షన్ సినిమా చూస్తూ కళ్లు తిప్పామంటే పళ్లు రాలతాయి... అంత స్పీడులో బ్రేకుల్లేకుండా పరుగెడుతుంది ఈ స్క్రీన్ ప్లే. ఇంకొక కామెడీ సినిమా చూస్తూ పళ్లు బిగపట్టకపోతే కళ్లూడతాయి నవ్వుతో... అంతగా బ్రేకు ఇవ్వకుండా మరీ గిలిగింతలు పెడుతుందీ స్టోరీ లైన్. మొత్తానికి ఈ వారం సినిమా స్కోపు డబులైంది. ఆకట్టుకున్న ఈ సినిమాలు డబ్బులు తెస్తాయి. ఈ శ్రావణంలో మన సినిమాకి మంచి రోజులూ, మంచి సినిమాకి వెలుగు జిగేళ్లూ ప్రాప్తమయ్యాయి. క్లాసూ మాసూ తేడా లేకుండా... దేవ కట్టా, మారుతి కట్టలు తెంచుకుని మరీ గంతులేశారు. డైనమైట్ యాక్షన్ బిట్లు భలే భలేగా ఆకట్టుకున్నాయి. భలే భలే కామెడీ బిట్లు డైనమైట్లా పేలాయి. దర్శకుడు శ్రీను వైట్ల తరహా వినోదభరిత సినిమాలకూ, రచయిత కోన వెంకట్ బాక్సాఫీస్ మంత్రమైన స్క్రీన్‌ప్లే విధానానికీ తెలుగు సినిమా బందీగా మారి కొన్నేళ్ళయింది. ఈ మధ్యే అడపాదడపా కొన్ని ఫ్యామిలీ కథలు, కొన్ని హార్రర్ - కామెడీలు అందుకు భిన్నంగా అలరిస్తున్నాయి. అయితే, వీటిలోనూ వినోదం కామనే. ఇప్పుడున్న ఈ ట్రెండ్లకు భిన్నంగా పూర్తి ఛేజింగ్ ఫార్ములా యాక్షన్ సినిమా తీస్తే? అలా వచ్చిందే - ‘డైనమైట్’. వైవిధ్యాన్ని ఆశ్రయించారు నట, నిర్మాత విష్ణు. ఇంతకీ కథేంటి? శివాజీ కృష్ణ (మంచు విష్ణు) డిజిటల్ మార్కెటింగ్ చేసే వ్యక్తి. అన్యాయం ఎదురైతే, ఎదిరించి పోరాడే తత్త్వమున్న మనిషి. ఆ క్రమంలో అతను అనుకోకుండా అనామిక (ప్రణీత)కు దగ్గరవుతాడు. ఆమె ‘చానల్ 24’ సి.ఇ.ఓ రంగనాథ్ (పరుచూరి వెంకటేశ్వరరావు) కూతురు. హీరో, హీరోయిన్లు ప్రేమలో పడీ పడగానే కథలో కుదుపు. దుండగులు కొందరు హీరోయిన్ను కిడ్నాప్ చేస్తారు. నేరస్థులను వెంటాడే క్రమంలో హీరోయిన్ తండ్రి ఇంటికి వెళతాడు హీరో. ఆయన దగ్గరున్న కీలకమైన వీడియో తాలూకు మెమొరీ కార్డ్ కోసం దుండగులు హీరోయిన్ను కిడ్నాప్ చేశారన్నమాట. అక్కడ జరిగిన కాల్పులు, ప్రతికాల్పుల్లో ఆయన చనిపోతాడు. దీని వెనక ఎవరో పెద్దలున్నారని హీరోకూ అర్థమైపోతుంది. కథ ముదిరి, పాకానపడుతుంది. కిడ్నాప్ చేసిన దుండగుల నుంచి హీరోయిన్ను హీరో తప్పిస్తాడు. అలాగే, దుండగులు తెచ్చిన వీడియో టేప్ మెమొరీకార్డ్ను కూడా సాధిస్తాడు. అయితే, ఆ కార్డ్ ఓపెన్ కాదు. అందులో ఏముందన్న సస్పెన్స్ కొనసాగుతుంది. కథ అక్కడ నుంచి కేంద్రంలో ఉన్న కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రిషిదేవ్ (జె.డి. చక్రవర్తి) దాకా వెళుతుంది. హీరో - హీరోయిన్లను చంపడానికి కూడా మంత్రి వెనకాడడు. ఇంతకీ ఆ కార్డ్‌లోని వీడియోలో ఉన్నదేమిటి, మంత్రికీ దానికీ సంబంధం ఏమిటీ అన్నది ఈ కాన్స్పిరసీ థ్రిల్లర్ మిగతాపార్ట. తమిళ కథ... తెలుగు యాక్షన్... ‘ఢీ’, ‘దేనికైనా రెఢీ’ లాంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు సాధించిన హీరో విష్ణు ఈసారి ట్రాక్ మార్చి, ఇలా యాక్షన్ బాట పట్టారు. రొటీన్‌కు భిన్నమైన ప్రయత్నం కాబట్టి అభినందించాలి. తమిళ చిత్రం ‘అరిమ నంబి’, దర్శక - రచయిత ఆనంద్ శంకర్ దానికి రాసుకున్న కథ - ఈ ‘డైనమైట్’కు ఆధారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు కొన్ని కొత్త సీన్లు కలుపుకొని, దర్శకుడు కొత్తగా వండి వడ్డించారు. ‘ప్రస్థానం’ ద్వారా చాలా పేరు తెచ్చుకున్న దేవ కట్ట ఈ కథను స్టయిలిష్‌గా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నించారు. యాక్షన్ ప్రధాన చిత్రం కాబట్టి స్టంట్ మాస్టర్ విజయన్ దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా సినిమా మొత్తాన్నీ తన చేతుల మీదుగా నడిపించారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న హీరో విష్ణు చేత థ్రిల్స్ బాగా చేయించారు. విష్ణు కూడా యాక్షన్ సన్నివేశాలకు బిలీవబుల్‌గా ఉన్నారు. డ్యాన్స్‌లకు పడిన కష్టమూ తక్కువేమీ కాదు. ప్రణీత అందంగా కనిపిస్తూ, యాక్షన్ సీన్లూ కష్టపడి చేశారు. జె.డితో విలనీ వెరైటీగా అనిపిస్తుంది. సందర్భం, సంభావ్యతల పని లేకుండా, మాస్ కోసం సినిమాలో ప్రత్యేక నృత్యగీతం పెట్టారు. హీరో, హీరోయిన్ల మధ్య కలర్‌ఫుల్ డ్యూయెట్లూ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాలకు కీలకం. ఆ పని చిన్నా బాగా చేశారు. కెమేరా వర్క్ కూడా భేష్. రెండు గంటల 22 నిమిషాల ఈ సినిమా హీరోయిన్ కిడ్నాప్ నుంచి పట్టాల మీద కెక్కి, వేగంగా నడుస్తుంటుంది. జనం ఆ మూడ్‌లో లీనమైపోతారు. ఫలితంగా, లోటుపాట్లేమైనా ఉన్నా గుర్తించే తీరిక, గుర్తుపెట్టుకొనే ఓపిక ఉండవు. ఆఖరి దాకా టెంపోలో సాగడంతో సినిమా ఎంతసేపటిగా చూస్తున్నామనే ఫీలింగే రాదు. అది సినిమాకు శ్రీరామరక్ష. యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకూ, మాస్కూ నచ్చే విషయం. వెరసి, సమష్టి కృషితో తెరపై ఇది అవుటండ్ అవుట్ యాక్షన్ దట్టించిన డైనమైట్. దర్శకుడు దేవ కట్ట భలే.. భలే తెలుగు తెరపై అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం కామన్. వాళ్ళకు విలన్ నుంచి ఇబ్బందులు ఎదురవడం కూడా కామనే. కొన్నిసార్లు... ఆ ప్రేమకూ, పెళ్ళికీ అడ్డంకి హీరోయిన్ తండ్రే కావడం మరీ కామన్. ఈ ఫార్ములా కథకు మతిమరుపనే పాయింట్‌తో కాస్తంత కొత్తదనం చేరిస్తే? దర్శకుడు మారుతి రాసుకున్న ‘భలే.. భలే మగాడివోయ్’ కథ అలాంటిదే! ఈ కథేంటి? శ్రీమతి, శ్రీఆంజనేయు లు (నరేశ్ - సితార) దంపతుల బిడ్డ లక్కరాజు అలియాస్ లక్కీ(నాని). మనవాడు మైండ్ ఆబ్సెంట్కి యూత్ ఐకాన్. మరో సైంటిస్ట్ పాండురంగారావు (మురళీశర్మ). ఆయన కూతురు కూచిపూడి డ్యాన్సర్ నందన (‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్యా త్రిపాఠీ). లక్కీని అల్లుడిగా చేసుకుందామనుకున్న టైమ్‌లో ఆయనకు ఈ ‘మతిమరపు మేళం’ సంగతి అర్థమై, పెళ్ళి కుదరదంటాడు. ఇంతలో పరధ్యానంలో చేసిన ప్రతి పొరపాటునూ ఏదో ఒక సామాజిక సేవకూ, మంచి పనికీ లింక్ చేస్తూ, హీరోయిన్ ప్రేమను పొందుతాడు హీరో. కూతురు ప్రేమిస్తున్నది తాను వద్దనుకున్న సంబంధం తాలూకు కుర్రాడినే అని తెలియక హీరోయిన్ తండ్రి కూడా ఓ.కే. అనేస్తాడు. ఇంతలో అసలు సంగతి హీరోకు అర్థమైపోతుంది. ఇక, అక్కడ నుంచి అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కలసి హీరో ఆడే నాటకం. మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ అజయ్ (నటుడు అజయ్) ఎలాగైనా హీరోయిన్ను పెళ్ళి చేసుకోవాలని చూస్తుంటాడు. ఈ మొత్తం ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ తరహా ఎపిసోడ్ ఏయే మలుపులు తిరిగింది, చివరకు హీరో - హీరోయిన్ల ప్రేమ ఎలా సక్సెసైందన్నది మిగతా సినిమా. నేచురల్ యాక్టింగ్ ఆ మధ్య ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్న తరహా ప్రయత్నం చేసిన హీరో నాని ఈసారి ‘మతిమరపు’ పాయింట్‌తో జనం ముందుకొచ్చారు. కామెడీ పండించడానికి మంచి స్కోపున్న విషయమిది. దాన్ని దర్శకుడు బాగానే వాడుకున్నారు. సహజంగా ప్రవర్తించినట్లుండే నాని తరహా నటన ఈ పాత్రకు మరో ప్లస్. కథాంశం చాలా చిన్నది కాబట్టి, ఎక్కువగా సీన్లు రాసుకొని, వాటితో నడిపించడం మీదే దర్శక - రచయితలు ఆధారపడ్డారు. ఆ పరిస్థితుల్లో నాని వినోదంతో సినిమాను ముందుకు నడిపే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. లావణ్యా త్రిపాఠీ చూడడానికి బాగుంది. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ మంచి క్యారెక్టర్ యాక్టర్‌నని ఋజువు చేసుకున్నాడు. అజయ్ విలనీ సరేసరి. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మలయాళ మ్యూజిక్ డెరైక్టర్ గోపీ సుందర్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) సంగీతం సినిమాకు మరో బలం. త్యాగరాయ కీర్తన ‘ఎందరో మహానుభావులు...’ను అనుకరిస్తూ, కథకూ, హీరో క్యారెక్టరైజేషన్‌కూ తగ్గట్లుగా సాహిత్యం మార్చుకొని, అదే ట్యూన్లో చేసిన ప్రయోగం బాగుంది (రచన రామజోగయ్య శాస్త్రి). రిచ్ ఫ్రేమింగ్స్తో నిజార్ షఫీ కెమేరా వర్క్ భేష్. ‘ముద్ర’కు దూరంగా.. ఫ్యామిలీస్‌కి దగ్గరగా.. హీరోకున్న మతిమరపు పాయింట్‌ను టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే చైల్డ్‌హుడ్ ఎపిసోడ్‌లోనే దర్శకుడు చెప్పేశారు. కానీ, ప్రేక్షకులు మర్చిపోతారనో ఏమో, ఫస్టాఫ్‌లో గంటకు పైగా అలాంటి సంఘటనలతో నడిపారు. అయితే, అవన్నీ వినోదం నింపే ఎపిసోడ్సే. చివరకొచ్చేసరికి అల్లుడే మామను జయించి, ఒప్పించినట్లు కాకుండా, మామే అల్లుడిని చాలాకాలంగా గమనిస్తూ, ఓ.కె. చెప్పినట్లు చూపడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. మొత్తం మీద, ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ లాంటి చిత్రాలతో ఒక ముద్ర వేయడమే కాకుండా, తెలియకుండానే తన మీద ఒక రకం ముద్ర వేయించుకున్న దర్శకుడు మారుతికి ఈ సినిమా ఒక పెద్ద రిలీఫ్. రెండర్థాల మాటలతో పని లేకుండా, క్లీన్ ఎంటర్టైనర్ను కూడా అందించగలనని ‘భలే.. భలే.. మగాడివోయ్’తో ఆయన ప్రూవ్ చేసుకున్నట్లయింది. తీరిక, ఓపిక తగ్గిన నవతరం ప్రేక్షకులు కోరుకుంటున్నదీ కాసేపు నవ్వుకోవడమే కాబట్టి, ఫ్యామిలీస్ ఈ సినిమా చూసి ‘భలే భలే.. సినిమావోయ్’ అంటే ఆశ్చర్యం లేదు. దర్శకుడు మారుతి తెర వెనుక ముచ్చట్లు ►‘డైనమైట్’ చిత్రం ఏడాది క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘అరిమ నంబి’కి రీమేక్. తమిళ సినిమా విడుదలైన నాలుగు రోజులకే దాని గురించి తెలిసి, రీమేక్ రైట్స్‌కి పోటీ ఎదురైంది. తమిళ నిర్మాత ఎస్. థానుకి, మోహన్‌బాబుకి మధ్య అనుబంధం వల్ల విష్ణుకు రైట్స్ దక్కాయి. ► ఈ చిత్రానికి మొదట ‘ఎదురీత’ అని టైటిల్ పెడదామనుకున్నారు. కానీ, హీరో క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, ‘డైనమైట్’ టైటిల్ పెట్టాలన్నది విష్ణు ఆలోచన. యూనిట్ మొత్తానికి నచ్చడంతో చివరికి దాన్నే ఫైనలైజ్ చేశారు. ► తమిళ ఒరిజినల్‌కి ‘డ్రవ్ు్స’ శివమణి సంగీత దర్శకుడు. మ్యూజిక్ డెరైక్టర్‌గా అదే ఆయన తొలి సినిమా. తెలుగులో పాటలు అచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిన్నా అందించారు. ► షూటింగ్‌కి ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేశారు. ఎక్కడెక్కడ తీయాలో లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని న్యాచురల్ లొకేషప్స్లో, సెట్స్ వేసి తీశారు. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. 65 రోజుల్లో పూర్తి చేసేశారు. ► మొత్తం ఏడు ‘రెడ్ కెమెరా’లు వాడారు. యాక్షన్ సీక్వెన్సెస్‌కి ఐదు, టాకీకి రెండు. ► చేజింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ విష్ణు డూప్ లేకుండా చేశారు. విష్ణు సినిమాకు ఫైట్ మాస్టర్ విజయన్ పనిచేయడం ఇదే మొదటిసారి. ఫైట్స్ టైవ్‌ులో విష్ణుకి చిన్న గాయాలయ్యాయి. వాటి తాలూకు మచ్చలు ఈ సినిమాకి సంబంధించిన తీపి గుర్తులంటారు విష్ణు. ►‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడు మారుతి డెరైక్టర్ కాక ముందు ‘బిబా సీడ్స్’ కంపెనీకి ప్రోమో చేసిచ్చారు. అప్పుడే మొక్కల పెంపకం నేపథ్యం కథ ఆలోచనొచ్చింది. అదే ఈ సినిమాకి వాడారు. ►మారుతికి కూడా ఏదైనా ఒక పనిలో పడితే మిగతా విషయాలు మర్చిపోతూంటాడు. ఆ మతిమరుపు డోస్ పెంచి హీరో క్యారెక్టైరె జేషన్ డిజైన్ చేస్తూ స్టోరీ లైన్ అల్లుకున్నారు. ఫస్ట్‌హాఫ్ రెడీ కాగానే నానీకి వినిపిస్తే ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ►‘మరోచరిత్ర’లోని భలే భలే మగాడివోయ్ పాట మారుతికిష్టం. నాలుగేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పటికి కథ లేదు. ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అని పెట్టారు. ►ఈ సినిమాలో నాని ఉపయోగించే మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ ‘భలే భలే మగాడి వోయ్’ పాట. దాన్ని ఇలా రింగ్‌టోన్ పెట్టాలని అనుకోలేదు. ఎడిటింగ్ టైమ్‌లో తీసుకున్న డెసిషన్ ఇది. ►‘హల్లో హల్లో’ అనే పాట మినహా ఈ సినిమా మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరించారు. ‘హల్లో హలో’్ల పాట మాత్రం గోవాలో తీశారు. వర్కింగ్ డేస్ 50 రోజులు ►హీరోయిన్ ఫాదర్ పాత్రకు ‘మిర్చి’ సంపత్ లేదా మురళీ శర్మ అనుకున్నారు. ఫ్రెష్ ఫీల్ ఉంటుందని శర్మను ఎంపికచేశారు. మహేశ్‌బాబు ‘అతిథి’లో విలన్‌గా పరిచయమయ్యారు. ►ఓ రోజు టీవీలో ‘నాయిగళ్ జాగిరతై’ తమిళ సినిమా చూస్తున్నారు మారుతి. ఆ విజువల్స్ బాగా నచ్చాయి. కెమేరామ్యాన్ నిజార్ షఫీకదే తొలి సినిమా. ఆయన్ని ఈ సినిమాకు పెట్టారు. -
డైనమైట్ రివ్యూ
చిత్రం : డైనమైట్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : మంచు విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి దర్శకత్వం : దేవాకట్ట నిర్మాత : మంచు విష్ణు సంగీతం : అచ్చు నిడివి : 142 నిమిషాలు విడుదల : 04-09-15 యాక్షన్ స్టార్ ఇమేజ్ కోసం మంచు విష్ణు చేసిన ప్రయత్నమే డైనమైట్. తమిళ్లో ఘనవిజయం సాధించిన 'అరిమనంబి' రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను చిన్నపాటి స్క్రీన్‌ప్లే మార్పులతో తెలుగు ప్రేక్షకులకు అందించాడు డైరెక్టర్ దేవాకట్ట. ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి విష్ణు ప్రయత్నం ఎంత వరకు వర్క్అవుట్ అయ్యిందో రివ్యూలో చూద్దాం. కథ: అనుకోకుండా కలిసిన శివాజీ ( విష్ణు ) అనామిక ( ప్రణీత )లు తొలి పరిచయంలోనే దగ్గరవుతారు. ఈ ఇద్దరు డేట్ కు వెళ్లిన సమయంలో అనామిక కిడ్నాప్ అవుతుంది. ఈ కిడ్నాప్ కు సంబంధించి శివాజీ పోలీసులకు సమాచారం అందించినా ఎటువంటి ఆధారాలు దొరక్కపోవటంతో, అతనే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అలా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అనామిక ఓ మెమరీకార్డ్ మూలంగా చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుందని తెలుసుకుంటాడు. అసలు ఆ మెమరీకార్డ్ లో ఏముంది.? అనామికను కిడ్నాప్ చేసింది ఎవరు ? ఈ సమస్య నుంచి అనామికను శివాజీ ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ ? నటన: ఈ సినిమా కోసం సరికొత్త లుక్ ట్రై చేసిన మంచు విష్ణు ఆకట్టుకున్నాడు. పర్ఫామెన్స్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాడు. ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ స్క్రీన్ మీద చూడని చాలా రిస్కీ స్టంట్స్‌ను విష్ణు డూప్ లేకుండా చేశాడు. తెర మీద ఈ సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి. చాలా రోజులుగా విష్ణు కోరుకుంటున్న యాక్షన్ ఇమేజ్ ఈ సినిమాతో సాధించాడు. కేవలం యాక్షన్ సీన్స్ లో మాత్రమే కాదు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది ప్రణీత. యాక్టింగ్ పరంగా ఎలా ఉన్నా గ్లామర్ తో మాత్రం అలరించింది. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన పాత్రలోనే కనిపించిన సీనియర్ స్టార్ జెడీ చక్రవర్తి మరోసారి బెస్ట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా మెమరీ కార్డ్ లో ఉన్న సన్నివేశాలు చూసే సమయంలో జెడీ పర్ఫామెన్స్ అమేజింగ్ అనిపిస్తుంది. ఇతర పాత్రల్లో రాజా రవీంద్ర, నాగిరెడ్డి, ప్రవీణ్, పరుచూరి వెంకటేశ్వరరావులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. సాంకేతిక నిపుణులు: ఆటోనగర్ సూర్య లాంటి భారీ డిజాస్టర్ తరువాత గ్యారెంటీ హిట్ కొట్టాల్సిన సమయంలో దేవాకట్ట కరెక్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఎమోషనల్ డ్రామాలు మాత్రమే డీల్ చేసిన దేవ ఈ సినిమాతో యాక్షన్ థ్రిల్లర్లు కూడా ఈజీగా డీల్ చేయగలడని ప్రూవ్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే దేవాకట్ట కెరీర్ లోనే బెస్ట్. థ్రిల్లర్ సినిమాలకు ప్రాణం లాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో చిన్నా మంచి మార్కులు సాధించాడు. సతీష్ సినిమాటోగ్రఫి, విజయన్ ఫైట్స్ సూపర్బ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. విశ్లేషణ : యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు టైట్ స్క్రీన్‌ప్లే తో ఈ మూవీ ప్రతీ ఆడియన్ ను థియేటర్ లో కదలకుండా కూర్చోబెట్టగలదు. విలన్ ఎవరు అన్న విషయం రివీల్ అయ్యే వరకు నడిచే మైండ్ గేమ్, ఆ తరువాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. తొలి భాగంలో కొన్నిసన్నివేశాలు ఇబ్బంది పెట్టినా, రెండో భాగం మాత్రం చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. విష్ణు కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫిలిం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఓవరాల్‌గా మంచి ప్రయత్నం, యాక్షన్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్ - సతీష్ రెడ్డి, సాక్షి ఇంటర్ నెట్ డెస్క్ -
మేకింగ్ ఆఫ్ డైనమైట్
-
ఆ సీన్ కట్ చేయమన్నారు..
నాన్న నమ్మకం, అమ్మ అభిమానం, అక్కయ్య అభిరుచి, తమ్ముడి తెగువ..శ్రీమతి శ్రద్ధ... ఇద్దరు బంగారు బిడ్డల గారం... అన్నీ కలబోసిన డైనమైట్ విష్ణు!ఒక హీరోలో ఎక్సెంట్రిసిజమ్ చూసే ఈ కాలంలో ఒక బ్యాలెన్స్డ్ బ్రిలియన్స్ విష్ణులో కనబడుతుంది. చేసినవన్నీ మాస్, యాక్షన్ సినిమాలే అయినా ఎక్కడో ఒక తెలియని నాజూకు నిజాయితీ, అణకువగా ఉన్న అందం కనబడతాయి. మైట్ అంటే ఇంగ్లీషులో పవర్ అని! దమ్ముంటే ఫైట్ చేయొచ్చు... మైట్ ఉంటే ఫైట్ గెలవొచ్చు. ‘ఢీ’ అంటాడు... దేనికైనా రె‘డీ’ అంటాడు. డైనమిక్‌గా ఉంటాడు... డైనమైట్లా తెగబడతాడు. దేవా కట్టా, విష్ణు సత్తాతో వస్తుంది ‘డైనమైట్’ ‘డి’ ఫర్ డిసిప్లిన్ అని మీ నాన్నగారు అంటారు. ‘డి’ ఫర్ ‘డైనమైట్’ అంటున్నారు? అఫ్కోర్స్ డి ఫర్ డిసిప్లిన్ అంటూ నాన్ననే ఫాలో అవుతాను. ఇప్పుడు సినిమా చేశాను కాబట్టి, డి ఫర్ డైనమైట్ అనాలి. ఇది మంచి స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్. నమ్మినవాళ్ల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి వెనకాడని హీరో కథ. ఆ పాయింట్ నన్ను ఎగ్జయిట్ చేసింది. రియల్ లైఫ్‌లో కూడా నమ్మినవాళ్ల కోసం మీరు ఎంతదాకా అయినా వెళతారట కదా? అది నాన్నగారు నేర్పించింది. నమ్మినవాళ్ల కోసం నాన్నగారు ఎంత ప్రాబ్లమ్ అయినా వాళ్లను సపోర్ట్ చేస్తారు. ‘అవుట్ ఆఫ్ ది వే’ వెళతారు. చిన్నప్పట్నుంచీ నాన్నగార్ని చూశాం కాబట్టి, ‘ప్రాబ్లమ్ అవుతుందా.. అయితే ఏంటి? మనవాళ్ల కోసం ఏదైనా సరే చేయాల్సిందే’ అనే అభిప్రాయం బలపడింది. నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, సహాయనటుడిగా.. వాట్ నాట్... మోహన్‌బాబుగారు ఏదైనా చేయగలరు. మరి మీకు ప్రెజర్‌గా ఉంటుందేమో? ప్రెజర్ హండ్రెడ్ పర్సంట్ ఉంది. ప్రతి ఒక్కరూ ఆయనతో పోల్చి, ‘విష్ణు వాళ్ల నాన్నలా డైలాగ్స్ చెప్పగలుగుతాడా? లేదు? వాళ్ల నాన్నలా నటిస్తాడా? లేదు’ అంటారు. అంత గ్రేట్ యాక్టర్‌తో పోల్చడం సరికాదు. నేను, మనోజ్ ఇంకా చిన్నవాళ్లమే. మేం మంచి నటులమో కాదో కాలం నిర్ణయిస్తుంది. ఆయనతో మిమ్మల్ని పోల్చినప్పుడు మీకెలా అనిపిస్తుంటుంది? ఫ్రస్ట్రేషన్‌గా... ఒక్క విషయం ఓపెన్‌గా చెప్పాలంటే.. నాన్నగారిలా నేను డైలాగ్స్ చెబితే ‘మిమిక్రీ ఆర్టిస్ట్‌నో.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌నో’ అవుతాను. అప్పుడు నా సొంత స్టయిల్ నాకుండదు కదా. నటుడిగా మీ రియల్ పొటెన్షియల్ ఇంకా బయటికి రాలేదేమో అంటే ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటాను. ఏదైనా సినిమా సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల నాకు ఈ మధ్యకాలంలో మూడు మంచి సినిమాలు వచ్చాయి. అవి ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ఆ మూడు సినిమాలు 40, 50 కోట్లు కలెక్ట్ చేయలేదు కానీ, నేను పెట్టిన డబ్బుకి రెట్టింపు వచ్చింది. మార్కెట్ పెరిగింది.. ఈసారైనా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుని ‘అనుక్షణం’ చేశాను. జనరల్‌గా నా సినిమాలు ఏడు వందల నుంచి ఎనిమిది వందల థియేటర్లలో విడుదలవుతాయి. కానీ, ఈ చిత్రాన్ని 70 థియేటర్లలోనే విడుదల చేశాను. అది ప్రయోగాత్మక చిత్రం కాబట్టి, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్న ఏరియాల్లోనే విడుదల చేశాను. అది కూడా డబ్బు తెచ్చిపెట్టింది. నటుడిగా కూడా సంతృప్తినిచ్చింది. ఇప్పుడు ట్వంటీ ప్లస్, ఫార్టీ ప్లస్ హీరోలు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మీలా మిడిల్ బాస్కెట్లో ఉన్న హీరోలు ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది? నాకిప్పుడు 32 సంవత్సరాలు. ఓ 48, 50 ఇయర్స్ వచ్చేవరకూ నా బాడీని ఫిట్‌గా పెట్టుకోవాలి. ఆ వయసులో కాలేజ్ స్టూడెంట్ రోల్ వస్తే, దానికి సూట్ కావాలి. ఆమిర్ ఖాన్‌గారు ‘3 ఇడియట్స్’ చేసినప్పుడు యాభయ్యో, యాభై రెండేళ్లో ఉంటాయ్. కానీ, ఆ సినిమాలో ఆయన కాలేజ్ స్టూడెంట్‌గా చేస్తే మనం అంగీకరించాం. ఆమిర్ అలా ఫిట్‌గా ఉన్నారు కాబట్టే, సూట్ అయ్యారు. నేను ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడానికి పూర్తిగా ట్రై చేస్తా. మీరు చేసే సినిమాల కథలను మీ నాన్నగారికి చెప్పి ఆయన సలహా తీసుకుంటారా? ప్రతి కథ చెబుతాను. ఆయన ‘సలీమ్’ చేయొద్దన్నారు. కానీ, నేను మొండిగా చేశాను. ఆయన ‘దేనికైనా రెడీ’ బ్రహ్మాండంగా ఉంటుంది. చేయమన్నారు. చేశాను. అది పెద్ద హిట్టయిన విషయం తెలిసిందే. నాన్నగారి జడ్జిమెంట్‌ని గుడ్డిగా నమ్ముతాను. మీరు నటించి, నిర్మించే సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ కావట? అది నిజమే. బడ్జెట్ హద్దులు దాటకపోవడానికి కారణం ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాను. ‘డైనమైట్’ని తీసుకుందాం. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్‌గా విజయన్ని తీసుకున్నాను. ‘మాస్టర్ లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకోండి. ఆ తర్వాత కొంత రిహార్సల్ చేద్దాం’ అని చెప్పాను. వంద రూపాయలవుతుందని ఆయన తొంభై రూపాయల్లోనే చేశారు. ‘డైనమైట్’ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. టాటూలు వేసుకున్నారు. ఆ స్థాయిలో శ్రమపడేంత అర్హత ఈ కథకు ఉందా? ఉంది. ఫైట్ మాస్టర్ విజయన్ ఏమన్నారంటే ‘షూటింగ్ ఆరంభించే నాలుగైదు నెలల ముందే లెగ్స్ ఫ్రీ చేసుకోవాలి. ఇంకా ఫిట్‌గా ఉండాలి. టఫ్‌గా ఉంటుంది’ అన్నారు. ‘‘బ్రదర్ నువ్వు చొక్కా విప్పి, బాడీ చూపించి వీడు కొడతాడు అని నిరూపించుకోవాల్సిన అవసరంలేదు. టీ షర్ట్‌లో కనిపించినా ‘వీడు కొడతాడు రా’ అనేట్లుగా ఫిజిక్ ఉండాలి’’ అని దేవా కట్టా అన్నారు. అందుకే ఫిజికల్ ఫిట్నెస్ కోసం వర్కవుట్ చేశా. మార్షల్ ఆర్ట్స్‌లో ‘ఊషూ’ నేర్చుకున్నాను. మోహన్‌బాబుగారి అబ్బాయిగా ‘ఇంత టఫ్ ఫైట్ చేయనని, ఇలాంటి డ్యాన్సులు చేయను’ అని చెప్పే స్కోప్ ఉంది కదా? నా టెక్నీషియన్స్‌ని నేను ఒబే చేయకుండా నా ఇష్టానుసారం నేను చేసుకుంటే ఉపయోగం ఏం ఉంటుంది? కొత్తవాళ్లను పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు. విజయన్ మాస్టర్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఆయన చెప్పినట్లు చేశాను. మిమ్మల్ని పూర్తిగా వాడుకునే స్వేచ్ఛ ఇచ్చానంటారు? నేనా ఫ్రీడమ్ ఇవ్వకపోతే నా పొటెన్షియల్ ఎలా బయటకు వస్తుంది? దేవా కట్టా, విజయన్ మాస్టర్ని అడిగితే నేనెంత ఫ్రీడమ్ ఇచ్చానో తెలుస్తుంది. ఓకే.. మనోజ్ కరెంటు తీగలాంటి అబ్బాయి.. మరి మీరు? ఏమో నా గురించి నేనేం చెప్పగలను? వేరే వాళ్లు చెబితే బాగుంటుంది. మీ మిసెస్ విరానికా మీ సినిమాల గురించి ఏమంటారు? విన్నీ బెస్ట్ క్రిటిక్. సినిమా చూడగానే ‘భయంగా ఉంది.. సినిమా అంత లేదు’ అని చెప్పేస్తుంది. నేను చేసిన వాటిలో విన్నీ ఇబ్బందిపడిన సినిమా ‘రౌడీ’. అందులో ‘నీ మీద ఒట్టు...’ పాట చూసి చాలా సిగ్గుపడిపోయింది. ‘ఈ పాటను పిల్లలకు ఎలా చూపిస్తాం’ అంది. యాక్చువల్‌గా ఆ పాటలో హీరోయిన్ని కిస్ చేయడం వంటివి ఉండవు. కానీ, నేనిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి అలా చెప్పింది. ఒక నటుడిగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెంచిన చిత్రం ‘రౌడీ’. ఎందుకలా అంటున్నారు? ‘నీ మీద ఒట్టు...’ పాటలో నా ఎక్స్‌ప్రెషన్స్‌ని రామూగారు చాలా బాగా క్యాప్చర్ చేశారు. కేవలం నా ఎక్స్ప్రెషన్స్ వల్ల ఆ పాట సెన్సువస్గా ఉంటుంది. ఆ పాటలో హీరోయిన్ నడుము పట్టుకుని, ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. దాన్ని కట్ చేయమని సెన్సార్ బోర్డ్ వారు అన్నారు. ‘ఏం.. నా ఎక్స్ప్రెషన్ వల్గర్‌గా ఉందా?’ అంటే లేదన్నారు. మరెందుకు? కట్ చేయాలంటే... వాళ్లు చెప్పలేకపోయారు. ఆ ఎక్స్ప్రెషన్ అంత ఎఫెక్టివ్‌గా ఉంది. ఆ రోజు నటుడిగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. రొమాంటిక్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్‌లో నటించినప్పుడు మీ విన్నీ ఏమీ అనరా? ఏమీ అనదు. నన్ను గాలికి వదిలేసింది. నీ ఇష్టం ఎక్కడైనా తిరుగు.. ఇంటికి రా అంటుంది. నన్ను అంత ట్రస్ట్ చేయడం ఆ అమ్మాయి తప్పు. తర్వాత తర్వాత తెలుస్తుంది (అక్కడే ఉన్న విన్నీని చూసి, కన్ను గీటుతూ). మీ నాన్నగారికి మీరు, మనోజ్ కన్నా లక్ష్మీప్రసన్న అంటేనే ఇష్టం అనుకుంటా కదా? మరి.. మీ అమ్మగారికి..? నా చిన్నప్పుడు అమ్మకి నేనే ఫేవరెట్. నేను కొంచెం పెద్దయ్యాక మనోజ్ చిన్నవాడు కదా అని ఆమెకు ఫేవరెట్ అయ్యాడు. అమ్మకి మనోజ్ పెట్. మా అక్క ఎంత అల్లరి చేసినా, దబాయించినా మా నాన్నగారికి కోపం రాదు. మా అక్క చేసిన అల్లరిలో పది శాతం నేను, మనోజ్ చేసి ఉంటే మమ్మల్ని తలకిందులుగా వేలాడదీసి వాయించేసేవారు. మరి.. అక్క ఏం చేసినా ఎందుకు ఊరుకున్నారో? ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్లు పుట్టాక అర్థమవుతోంది. మీరు కూడా మనోజ్‌ని చాలా ప్యాంపర్ చేస్తారేమో? బాధ్యతలు మోయడానికి మనం ఉన్నాం కదా.. చిన్నోడు ఎందుకులే అనిపిస్తుంది. నాకు ఓ 90ఏళ్లు వయసొచ్చినప్పుడు మనోజ్ కూడా ఓల్డ్ అవుతాడు. అప్పుడు కూడా మనోజ్ చిన్నోడనే అనుకుంటాను. ఫైనల్లీ... విరానికా మీ ఇంట్లోవాళ్లతో బాగా కలిసిపోయారు. అందువల్ల జాయింట్ ఫ్యామిలీగా ఉండటానికి కుదిరింది. మరి.. మనోజ్ వైఫ్ ప్రణతి సంగతేంటి? ఆ అమ్మాయి విరానికా ఫ్రెండ్ కాబట్టి, మా ఇంటి పద్ధతులు బాగా తెలుసు. చక్కగా అడ్జస్ట్ అవుతోంది. డైనమైట్ వర్కవుట్స్... డైట్ జనవరిలో షూటింగ్ కాబట్టి, డిసెంబర్లో బ్యాంకాక్ వెళి,్ల ఫైట్ మాస్టర్ విజయన్ ఫైట్స్ నేర్చుకోమన్నారు. నవంబర్‌లో ఇక్కడే ప్రాక్టీస్ మొదలుపెడితే, ఎవరో ఒకరు కథలు చెబుతామంటూ వచ్చేవారు. ఇలా అయితే ప్రాక్టీస్ సాగదనిపించి సంపత్ అని ఇక్కడి ట్రైనర్‌ని తీసుకుని, బ్యాంకాక్ వెళ్లాను. ఉదయం నాలుగున్నరకు నిద్రలేచి ఓ రెండు గంటలు జిమ్ చేసేవాణ్ణి. ఆ తర్వాత తొమ్మిది గంటల ప్రాంతంలో మార్షల్ ఆర్ట్స్ చేసేవాణ్ణి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాణ్ణి. సాయంత్రం ఆరుగంటల నుంచి ఓ గంట సేపు జిమ్ చేసేవాణ్ణి. డిసెంబర్ 26 తర్వాత నేను ఇండియా వచ్చేశాను. నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన మేరకు లాస్ వేగాస్ నుంచి ఓ ట్రైనర్‌ని పిలిపించుకున్నాను. ‘డైనమైట్’ షూటింగ్ మొదలుపెట్టినప్పట్నుంచి పూర్తయ్యేవరకు ఆయన నాతో పాటే ఉన్నారు. హీరోకి దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విజయన్ మాస్టర్ అన్నీ తీసుకున్నారు. అయినప్పటికీ ఓ ఫైట్ చేస్తున్నప్పుడు నా కుడి చేయి బొటనవేలు ఫ్రాక్చర్ అయ్యింది. మూడో టేక్‌కి ఆయన ఓకే అంటే, ఇంకోసారి చేస్తానంటూ చేశాను. అప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో నాన్నగారు ‘ఫైట్ మాస్టర్ టేక్ ఓకే అన్న తర్వాత మళ్లీ చేయొద్దు’ అని క్లాస్ తీసుకున్నారు. ఈ సినిమాకి చేసినంత వర్కవుట్ ఇప్పటివరకూ ఏ సినిమాకీ చేయలేదు. నేను చిరుతిండి ఎక్కువగా తింటాను. అది బ్యాడ్ హ్యాబిట్. ట్రైనర్స్‌కి మోహన్‌బాబుగారు, విష్ణు ఎవరైనా సరే ఒకటే. ‘ఇంత దూరం వచ్చింది మీ ఫిట్నెస్ కోసమే’ అంటూ పక్కనే ఉండి కంట్రోల్ చేస్తుంటారు. ఈ సినిమా చేసినన్ని రోజులూ ఉదయం ప్రొటీన్ షేక్ తాగేవాణ్ణి. పది ఎగ్ వైట్స్ తినేవాణ్ణి. నాలుగు బాదంపప్పులు తినేవాణ్ణి. పది గంటలకు ఒక ఫ్రూట్, లంచ్‌కి చికెన్ లేక ఫిష్ తీసుకునేవాణ్ణి. సాయంత్రం నాలుగు గంటలకు ఫ్రూట్స్ లేదా నట్స్ తీనేవాణ్ణి. డిన్నర్ కూడా లైట్‌గా తీసుకునేవాణ్ణి. - డి.జి. భవాని -
విష్ణు ఫైట్స్ అదుర్స్
డిఫరెంట్ స్టోరి, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టయిల్, డిఫరెంట్ క్యారెక్టర్... ఇలా చాలా డిఫరెంట్‌గా రూపొందిన చిత్రం ‘డైనమైట్’. మంచు విష్ణు హీరోగా నటించి, అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ప్రీ ప్రమోషనల్ టూర్’లో భాగంగా రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్, వరంగల్ వెయ్యి స్తంభాల గుడిని, అక్కడి ఏషియన్ శ్రీదేవి సినీ మాల్‌ను సందర్శించింది ‘డైనమైట్’ చిత్రబృందం. విష్ణు, చిత్రదర్శకుడు దేవా కట్టా, కథానాయిక ప్రణీత తదితర చిత్రబృందం ఈ ప్రమోషనల్ టూర్లో పాల్గొని, ప్రేక్షకులతో ఈ చిత్రవిశేషాలను పంచుకున్నారు. వెయ్యి స్తంభాల గుడిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. విదేశాల్లో క్రేజ్ ‘డైనమైట్’ చిత్రానికి విదేశాల్లో మంచి క్రేజ్ నెలకొందని యూఎస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సీఈవో రాజ్. కె అన్నారు. యూఎస్, యూకే, యూఏఈ, నేపాల్‌లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. విదేశాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్న థియేటర్ అధినేతలు, ప్రేక్షకులు ‘డైనమైట్’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రాజ్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి, కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ఉందని కూడా అన్నారు. 3న ప్రివ్యూ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే సినీ ప్రముఖులకు చూపించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. 3న హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో ప్రివ్యూ షో ఏర్పాటు చేశారు. ఈ చిత్రవిజయం పట్ల విష్ణు తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఫైట్ మాస్టర్ విజయన్ సమకూర్చిన ఫైట్స్ ఈ చిత్రానికి ఓ హైలైట్‌గా నిలుస్తాయని ఈ సందర్భంగా చిత్రబృందం పేర్కొన్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో విష్ణు నటన, ఫైట్స్ అన్నీ బాగుంటాయని కూడా తెలిపారు. కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ సాధించే చిత్రం అవుతుందని కూడా చెప్పారు. -
ఓరుగల్లులో ‘డైనమైట్’
థియేటర్లో విష్ణు, ప్రణీతల సందడి ‘చారిత్రాత్మక ఓరుగల్లుకు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ప్రసిద్ధి గాంచిన వేయిస్తంబాల దేవాలయాన్ని చూడాలని ఎంతో ఆశగా ఉండేది. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు కోరిక తీరింది’ అని హీరో మంచు విష్ణువర్దన్ అన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన విడుదల కానున్న ‘డైనమైట్’ సినిమా సందర్భంగా శనివారం హన్మకొండలోని శ్రీదేవి ఏషియన్‌మాల్‌కు హీరోయిన్ ప్రణీత, సినీ రచయిత బీవీఎస్ రవితో కలిసి వచ్చారు. విష్ణువర్దన్ వెంట మోహన్‌బాబు సన్నిహితుడు గజేంద్రనాయుడు ఉన్నారు. అనంతరం చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్థంభాల దేవాలయాన్ని సందర్శించారు. శ్రీరుద్రేశ్వరుని సన్నిధిలో లఘసహస్రనామార్చనలు నిర్వహించారు. ఆలయనాట్యమండపంలో మంచు విష్ణుకు తీర్ధప్రసాదాలు శేషవస్త్రాలు మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయశిల్పకళ విశేషాలను గంగు ఉపేంద్రశర్మ వివరించారు. -
ఆ అందాలు తనివి తీరనివి
కాకినాడ : గోదావరి అందాలు తనను అబ్బురపరుస్తున్నాయని సినీ హీరోయిన్ ప్రణీత అన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై దేవా కట్టా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా సొంతంగా రూపొందించిన ‘డైనమైట్’ చిత్రంలో ఆమె హీరోయిన్. ఆ చిత్రం ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాలకు వచ్చిన బృందంలో ఆమె కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గోదావరి తీరం సినిమా షూటింగ్‌లకు ఎంతో అనువైన ప్రాంతమని, ఈ పరిసరాల్లోని దృశ్యాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని అన్నారు. ‘అత్తారింటికి దారేది, రభస’లతోపాటు ఇంతవరకు తెలుగులో ఆరు సినిమాలు చేశానన్నారు. ‘డైనమైట్’ వంటి యాక్షన్ థ్రిల్లర్‌లో మొదటిసారిగా నటించానన్నారు. ఈ సినిమా షూటింగ్లో కొన్ని సందర్భాలలో గాయాలైనా ప్రివ్యూ చూశాక ఆ వాటన్నింటినీ మరిచిపోయానని చెప్పారు. ప్రస్తుతం పేరు పెట్టని మరో చిత్రం షూటింగ్లో ఉందన్నారు. ‘బాహుబలి’ వంటి సినిమాల్లో నటించాలని ఉందని, ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధమేనని చెప్పారు. -
చేయగలం అని చెప్పడానికే ‘డైనమైట్’
కాకినాడ: అరియానా, విరియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై తాను నిర్మించిన ‘డైనమైట్’ చిత్రాన్ని లవ్, యూక్షన్ మిళితమైన పాటు కథాంశంతో రూపొందించినట్టు హీరో మంచు విష్ణు పేర్కొన్నారు. ఆ చిత్రం బృందం శుక్రవారం స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాలలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా వచ్చిన బృందం జనరల్ ఆస్పత్రిలో ఉన్న చరకా ఆడిటోరియంలో చిత్రం టీజర్‌ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా దర్శకుడు దేవా కట్టా, హీరో విష్ణు, హీరోయిన్ ప్రణీత వైద్య విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. విద్యార్థులు సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. స్టంట్ మాస్టర్ విజయన్ ఆధ్వర్యంలో తీసిన పోరాట దృశ్యాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని విష్ణు అన్నారు. తాను నటించిన ‘సూర్యం’ తరువాత యాక్షన్ సీన్స్ అంతగా ఏ సినిమాలోనూ లేవన్నారు. హాలీవుడ్ చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ స్థాయి పాత్రలు మనం కూడా చేయగలం అని చెప్పడానికే ‘డైనమైట్’ తీశానన్నారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు ఏడు కిలోల బరువు పెరగడంతోపాటు జిమ్‌లో చేసిన ఎక్సర్సైజ్ల గురించి దర్శకుడు దేవా కట్టా వివరించారు. టీజర్‌ని ఆవిష్కరించిన విష్ణు అనంతరం జీఎస్ఎల్ వైద్య కళాశాల మెంటర్, ఎంసీఐ సభ్యుడు డాక్టర్ గన్ని భాస్కరరావుతో తన తండ్రి మోహన్‌బాబుకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఆయనను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. -
‘డైనమైట్’ చిత్రబృందం సందడి
-
డిఫరెంట్ డైనమైట్
విష్ణు సినిమాల్లో యాక్షన్ సీన్స్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంటాయి. హాలీవుడ్ చిత్రాల ప్రభావంతోనో ఏమో చాలా స్టయిలిష్‌గా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయిస్తుంటారాయన. తాజాగా విష్ణు ‘డైనమైట్’ కోసం నెక్ట్స్ లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించనున్నారు. లుక్ వైజ్ కూడా చాలా వెరైటీగా కనిపించనున్నారు. చెవి పోగు, చేతి పొడవునా టాటూతో విష్ణు డిఫరెంట్ లుక్‌తో స్టిల్స్‌లో కనిపిస్తున్నారు. ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం ఆయన రెండే రెండు టీ షర్ట్స్‌లో కనబడతారట! ఒకటి బ్లాక్, ఇంకొకటి రెడ్. కథానుగుణంగానే ఈ రెండు కాస్ట్యూమ్స్‌లో విష్ణు ఉంటారట. ఇందులో విష్ణు సరసన ప్రణీత తొలిసారిగా నటిస్తున్నారు. విష్ణు హై ఎనర్జిటిక్ యాక్టర్ అని ప్రణీత కితాబులిస్తున్నారు. దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై అరియానా-వివియానా సమర్పణలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. -
డైనమైట్ లాంటివి ఎప్పుడో కానీ దొరకవు
‘‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్.. ఇదే నేను నమ్మిన సిద్ధాంతం’’ అంటున్నారు ప్రణీత. మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నానంటున్నారీ కన్నడ భామ. దేవా కట్టా దర్శకత్వంలో విష్ణు సరసన ఆమె నటించిన ‘డైనమైట్’ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రణీతతో జరిపిన ఇంటర్వ్యూ... ‘డైనమైట్’లో రిస్కీ ఫైట్స్ చేశారట..? మామూలుగా యాక్షన్ సినిమాలంటే హీరోయిన్ని విలన్ తోసేయగానే ఫ్రేమ్ నుంచి అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోపై యాక్షన్ సీన్స్ తీస్తారు. ఈ చిత్రంలో ప్రతి యాక్షన్ ఎపిసోడ్లో హీరోయిన్ ఉంటుంది. అది నాకు నచ్చింది. ఇలాంటి పాత్రలు ఎప్పుడో కానీ రావు. ఆ యాక్షన్ సీన్స్‌లో మీకు దెబ్బలేమైనా తగిలాయా? బాగా తగిలాయి. ఒకసారి మోకాళ్లయితే నీలం రంగులోకి మారిపోయాయి. విలన్ నన్ను వెంటాడుతుంటే నేను కూరగాయల బండి మీద నుంచి దూకాలి. అప్పుడు మోకాలికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఓ ఫైట్ తీస్తున్నప్పుడు గోరుకి ఘోరమైన దెబ్బ తగిలింది. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి దెబ్బలు కామన్. ఈ సీన్స్ తీసే ముందు చాలా రిహార్శల్ చేశాం. కానీ, ఎంత రిహార్శల్స్ చేసినా సీన్స్ తీసేటప్పుడు అనుకోకుండా దెబ్బలు తగులుతుంటాయి. ఇంతకూ ఈ చిత్రంలో మీ పాత్ర? మోడ్రన్ అమ్మాయిని. ఇప్పుడు సిటీ అమ్మాయిలు ఎలా ఉంటారో అలాంటి అమ్మాయిని. ఆ అమ్మాయిని హీరో ఓ సందర్భంలో కలుస్తాడు. అప్పట్నుంచీ ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తాం. ఆ ట్రావెల్ ఎందుకు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాతో సోలో హీరోయిన్గా మీకు ప్రమోషన్ లభిస్తుందనుకుంటున్నారా? లభిస్తుందనే అనుకుంటున్నాను. సోలో హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అనే విషయాన్ని పక్కన పెడితే ఇంత మంచి సినిమాలో చేసినందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కథలో నా పాత్రక్కూడా ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలో ఫైట్స్ జరిగేదంతా హీరోయిన్ కోసమే. కథలో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం ఉంటుంది. ఎలాగూ ఈ చిత్రంలో చిన్న చిన్న ఫైట్స్ చేశారు కాబట్టి, ఇక పూర్తి స్థాయి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలొస్తే చేస్తారన్న మాట? యాక్చువల్‌గా నాకు ఫైట్స్ చేసే సీన్ లేదు. అందుకే, డూప్‌తో చేయిస్తే బాగుంటుందనుకున్నాను. కానీ, విజయన్ మాస్టర్ ‘నువ్వు చేయగలవ్’ అంటూ చేయించారు. యాక్షన్ అంటే ఏదో భారీగా చేయలేదు. విలన్ తోసేసినప్పుడు పడిపోవడం కూడా యాక్షనే. అలా పడటం మామూలు విషయం కాదు. ఒకవేళ ఈ సినిమాలో నేను చేసిన చిన్న చిన్న యాక్షన్ సీన్స్‌ని బాగా రిసీవ్ చేసుకుంటే, అప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ మూవీ గురించి ఆలోచిస్తా. ‘డైనమైట్’లో మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏది? కొన్ని టేబుల్స్ వరుసగా ఉంటాయి. విష్ణు నన్ను కాపాడటానికి తోస్తారు. అప్పుడు నేను టేబుల్ కింద నుంచి దూసుకుంటూ ముందుకెళ్లాలి. ఆ సీన్‌కి ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. ఈ చిత్రం షూటింగ్ చేసినప్పుడు ఉదయం నిద్ర లేవగానే, ‘ఈరోజు బిల్డింగ్ నుంచి దూకడమా? పరిగెత్తడమా? ఏం చేయమని చెబుతారో’ అనుకుంటూ షూటింగ్‌కి రెడీ అయ్యి వెళ్లేదాన్ని. చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండేది. హీరో విష్ణు గురించి చెప్పండి? విష్ణు చాలా డిఫరెంట్. ఆయన ఆలోచనలన్నీ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయి. ఎక్కువ హాలీవుడ్ చిత్రాలు చూస్తారు. ముఖ్యంగా ఫిట్నెస్ అయితే ఎక్స్లెంట్. ఆయనతో పాటు ట్రైనర్ కూడా ఉండేవారు. ఈ సినిమాలోని పాత్ర కోసం విష్ణు చాలా వర్కవుట్స్ చేశారు. నేను కూడా తన నుంచి కొన్ని టిప్స్ తీసుకున్నాను. దేవా కట్టా దర్శకత్వంలో సినిమా చేయడం ఎలా అనిపించింది? దేవా కట్టా ఆలోచనలు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఇది తమిళ చిత్రానికి రీమేక్. తెలుగుకి తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే చేశారు. అలాగే, మన నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. సెకండ్ లీడ్ రోల్స్‌పై మీ అభిప్రాయం? మెయిన్, సెకండ్ లీడ్ రోల్స్ గురించి నేనెలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వను. నాకిచ్చిన పాత్రను నేను చక్కగా క్యారీ చేయగలనా? లేదా అని చూసుకుంటాను. ఈ మధ్య సూర్యగారు చేసిన ‘రాక్షసుడు’లో నాది చాలా చిన్న పాత్ర. కానీ, థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు నా పాత్ర గుర్తుండిపోతుంది. అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాను. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా? చేస్తాను. హీరో ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడు హీరోయిన్‌కి కూడా ప్రాధాన్యం ఉంటే బాగుంటుంది. ‘డైనమైట్’ అలాంటి చిత్రమే. ఇందులో నా పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది కాబట్టే, నేనీ చిత్రం గురించి ఇంతగా మాట్లాడగలుగుతున్నాను. తెలుగు బాగా మాట్లాడుతున్నారు... త్వరలో మీ పాత్రకు డబ్బింగ్ చెప్పేస్తారా? నా స్టాఫ్‌కి తెలుగు తప్ప వేరే తెలియదు. వాళ్లతో మాట్లాడటంవల్ల నాక్కూడా తెలుగు వచ్చేసింది. డబ్బింగ్ గురించి భవిష్యత్తులో ఆలోచిస్తాను. -
స్టన్నింగ్ డైనమైట్
జనరల్‌గా యాక్షన్ సీన్స్ అంటే మాస్‌ను ఎట్రాక్ట్ చేసే విధంగానే డీల్ చేస్తూంటారు. కానీ ‘డైనమైట్’లో యాక్షన్ పార్ట్ స్టన్నింగ్‌గా ఉంటుందని సీనియర్ మోస్ట్ స్టంట్ డెరైక్టర్ విజయన్ చెబుతున్నారు. మంచు విష్ణు ఎంతో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరీ ఈ సన్నివేశాలు చేశాడనీ, తాను ఇప్పటివరకూ పనిచేసిన వారిలో మంచు విష్ణు టాప్ మోస్ట్ యాక్షన్ హీరో అనీ విజయన్ ప్రశసించారు. విష్ణు ఎనర్జీ లెవల్స్ చూసి ఆశ్చర్యపోయానని, ఓ సన్నివేశంలో చెయ్యి విరిగిపోయినా బెస్ట్ అవుట్‌పుట్ వచ్చేవరకూ నటించాడని విజయన్ తెలిపారు. మంచు విష్ణు, ప్రణీత జంటగా అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ‘డైనమైట్’ చిత్రం ఈ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ తర్వాత దేవా క ట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. -
కుర్రాడు డైనమైట్
ఆ కుర్రాడు మామూలోడు కాదు. డైనమైట్ లాంటివాడు. అంత శక్తిమంతమైన కుర్రాడి కళ్లెదుట అన్యాయం జరిగితే ఊరుకుంటాడా? అవినీతిపరులను రప్ఫాడించేస్తాడు. ఇంకా ఈ కుర్రాడు అన్యాయాలను అరికట్టడానికి ఎలాంటి రిస్కులు తీసుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డైనమైట్’. దేవా కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. ప్రణీత కథానాయిక. ఇందులో కొత్త రకం హెయిర్ స్టయిల్, చెవి పోగు, చేతికి టాటూతో టోటల్‌గా విష్ణు ఓ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో రిస్కీ ఫైట్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని, ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కథ, మాటలు, పాటలు, ఫైట్స్.. ఇలా అన్నీ బాగా కుదిరాయని విష్ణు తెలిపారు. -
హెవీ యాక్షన్‌తో...
‘‘హెవీ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ‘డైనమైట్’. సౌండ్ మిక్సింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ సినిమా తుది దశలో ఉంది. జూలై 3న సినిమా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూలై 17 లేదా 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని మంచు విష్ణు తెలిపారు. దేవ కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘డైనమైట్’. ఇందులో ప్రణీత కథానాయిక. దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ -‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. అన్ని సన్నివే శాలు బాగా వచ్చాయి’’ అని చెప్పారు. విష్ణు డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఈ చిత్రానికి హైలైట్ అని రచయిత బీవీయస్ రవి అన్నారు. -
డేరింగ్... డాషింగ్... డైనమైట్
‘‘మోహన్‌బాబు కుటుంబం అంటే నా కుటుంబమే. తండ్రి మోహన్‌బాబు అడుగుజాడల్లో నడుస్తూ, మనిషిలో ఉండేది గెలుపోటములు కాదు.. వ్యక్తిత్వం అనే సిద్ధాంతంతో ముందుకెళుతున్నాడు విష్ణు. తనతో ‘ఎర్రబస్సు’ చేశాను. నా ఆరోగ్యం కుదుటపడ్డాక విష్ణుతో మరో చిత్రం చేయాలనుకుంటున్నా’’ అని దర్శకర త్న దాసరి నారాయణరావు అన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం‘ డైనమైట్’. దేవా కట్టా దర్శకుడు. అచ్చు స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించి, మోహన్‌బాబు సతీమణి నిర్మలకు అందించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ- ‘‘నేను 35 ఏళ్ల క్రితం ై‘డెనమైట్’ పేరుతో సినిమా తీయాలనుకున్నాను. కానీ కుదర్లేదు. ఇప్పుడు అదే పేరుతో విష్ణు సినిమా తీసినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా కోసం విష్ణు ప్రతి ఫ్రేములోనూ కష్టపడ్డాడు. అతని కష్టం రేపు తెరపై కనిపిస్తుంది. దేవా కట్టా ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు’’ అని మోహన్‌బాబు అన్నారు. మంచు మనోజ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి. విజయన్ ఫైట్స్‌ను చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఈ పాత్ర చాలా డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. -
బరిలోకి దిగితే...
డైనమైట్ లాంటి కుర్రాడు బరిలోకి దిగితే ఇక అతనికి ఎదురేముంది...? ఆ కుర్రాడు ఎవరితో, దేని కోసం యుద్ధం చేశాడు...? అనేది తెలియా లంటే ‘డైనమైట్’ చూడాల్సిందే. మంచు విష్ణు హీరోగా నటిస్తూ, 24 ఫ్రేమ్స్ పతాక ంపై దేవా కట్టా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత కథానాయిక. జేడీ చక్రవర్తి ప్రతినాయకునిగా నటించారు. ఇటీవల విష్ణు, ప్రణీత, 100 మంది డ్యాన్సర్లు పాల్గొనగా ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో ఓ పాట చిత్రీకరించారు. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో విష్ణు, జేడీ, రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా చిత్రీకరించిన ఫైట్ హైలైటని దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. -
డిఫరెంట్ డైనమైట్
చెవి పోగు,90 చేతి పొడవునా టాటూ, కొత్త హెయిర్ స్టయిల్.. ఇలా తాజా చిత్రంలో మంచు విష్ణు సరికొత్తగా కనిపించనున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయన హీరోగా నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘డైనమైట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నానని విష్ణు చెబుతూ - ‘‘నా పాత్ర లుక్, కథానుగుణంగా ‘డైనమైట్’ అయితే బాగుంటుందని దాన్నే ఖరారు చేశాం. ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ ఉన్నాయి. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉంది. అన్ని వర్గాలవారినీ అలరించే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దేవా కట్టా తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.