
డిఫరెంట్ డైనమైట్
విష్ణు సినిమాల్లో యాక్షన్ సీన్స్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంటాయి. హాలీవుడ్ చిత్రాల ప్రభావంతోనో ఏమో చాలా స్టయిలిష్‌గా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయిస్తుంటారాయన. తాజాగా విష్ణు ‘డైనమైట్’ కోసం నెక్ట్స్ లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించనున్నారు. లుక్ వైజ్ కూడా చాలా వెరైటీగా కనిపించనున్నారు. చెవి పోగు, చేతి పొడవునా టాటూతో విష్ణు డిఫరెంట్ లుక్‌తో స్టిల్స్‌లో కనిపిస్తున్నారు.
ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం ఆయన రెండే రెండు టీ షర్ట్స్‌లో కనబడతారట! ఒకటి బ్లాక్, ఇంకొకటి రెడ్. కథానుగుణంగానే ఈ రెండు కాస్ట్యూమ్స్‌లో విష్ణు ఉంటారట. ఇందులో విష్ణు సరసన ప్రణీత తొలిసారిగా నటిస్తున్నారు. విష్ణు హై ఎనర్జిటిక్ యాక్టర్ అని ప్రణీత కితాబులిస్తున్నారు. దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై అరియానా-వివియానా సమర్పణలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది.