యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. కన్నప్ప కొత్త డేట్‌ ఇదే.. | Manchu Vishnu Meet UP Cm Yogi Adityanath, Announced Kannappa New Release Date | Sakshi
Sakshi News home page

'కన్నప్ప' కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మంచు విష్ణు

Published Wed, Apr 9 2025 2:09 PM | Last Updated on Wed, Apr 9 2025 3:05 PM

Manchu Vishnu Meet UP Cm Yogi Adityanath, Announced Kannappa New Release Date

హీరో మంచు విష్ణు, ఆయన తండ్రి మోహన్‌బాబు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. బుధవారం నాడు యోగిని కలిసి ఆయనకు శ్రీరాముని జ్ఞాపికను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా కన్నప్ప సినిమా జూన్‌ 27న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి వెంట కన్నప్ప కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా ఉన్నారు.

ఈ విషయాన్ని విష్ణు (Manchu Vishnu) ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడించాడు. నా ఫేవరెట్‌ హీరో యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)గారిని కలిశాను. ఆయన మా కన్నప్ప సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు రమేశ్‌ గొరిజాలా వేసిన పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చాం. కన్నప్ప.. జూన్‌ 27న వస్తోంది అని ట్వీట్‌ చేశాడు.

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌, కాజల్‌ అగర్వాల్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 25న రిలీజ్‌ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయంటూ సినిమాను వాయిదా వేశారు. ఏప్రిల్‌ 25న తన సినిమా భైరవం రిలీజ్‌ అవుతుందన్న భయంతోనే విష్ణు కన్నప్పను వాయిదా వేశాడని మనోజ్‌ ఆరోపించాడు. ఇంతలో విష్ణు.. కన్నప్ప జూన్‌లో రానుందని ప్రకటించాడు.

 

 

చదవండి: నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement