
డిఫరెంట్ డైనమైట్
చెవి పోగు,90 చేతి పొడవునా టాటూ, కొత్త హెయిర్ స్టయిల్.. ఇలా తాజా చిత్రంలో మంచు విష్ణు సరికొత్తగా కనిపించనున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయన హీరోగా నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘డైనమైట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నానని విష్ణు చెబుతూ - ‘‘నా పాత్ర లుక్, కథానుగుణంగా ‘డైనమైట్’ అయితే బాగుంటుందని దాన్నే ఖరారు చేశాం. ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ ఉన్నాయి. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉంది. అన్ని వర్గాలవారినీ అలరించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దేవా కట్టా తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.