
బరిలోకి దిగితే...
డైనమైట్ లాంటి కుర్రాడు బరిలోకి దిగితే ఇక అతనికి ఎదురేముంది...? ఆ కుర్రాడు ఎవరితో, దేని కోసం యుద్ధం చేశాడు...? అనేది తెలియా లంటే ‘డైనమైట్’ చూడాల్సిందే. మంచు విష్ణు హీరోగా నటిస్తూ, 24 ఫ్రేమ్స్ పతాక ంపై దేవా కట్టా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత కథానాయిక. జేడీ చక్రవర్తి ప్రతినాయకునిగా నటించారు. ఇటీవల విష్ణు, ప్రణీత, 100 మంది డ్యాన్సర్లు పాల్గొనగా ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో ఓ పాట చిత్రీకరించారు. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో విష్ణు, జేడీ, రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా చిత్రీకరించిన ఫైట్ హైలైటని దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు.