విష్ణు లవ్ స్టోరీ! | Vishnu's Love Story | Sakshi
Sakshi News home page

విష్ణు లవ్ స్టోరీ!

Published Thu, Sep 10 2015 11:25 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

విష్ణు లవ్ స్టోరీ! - Sakshi

విష్ణు లవ్ స్టోరీ!

 ‘డైనమైట్’ వంటి న్యూ డెమైన్షన్ థ్రిల్లర్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వ చ్చిన  మంచు విష్ణు ఇప్పుడు ప్రేమలో మరో కోణాన్ని ఆవిష్కరించనున్నారు. విష్ణు హీరోగా నటిస్తున్న ఓ ప్రేమకథా చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై  జి.కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. సోనారిక కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి ‘జెమిని’ కిరణ్  కెమెరా స్విచాన్ చేయగా, సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘ఇది మంచి లవ్,  యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం. ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్  ప్రారంభించి. హైదరాబాద్, వైజాగ్‌ల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతాం’ అని చెప్పారు. కార్తీక్‌రెడ్డి చెప్పిన కథ చాలా కొత్తగా ఉందనీ, కచ్చితంగా అందరినీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా: విజయ్ సి.కుమార్, నిర్వహణ:సోమా విజయ్‌ప్రకాశ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement