కుర్రాడు డైనమైట్ | vishnu dynamite release 0n 4th september | Sakshi
Sakshi News home page

కుర్రాడు డైనమైట్

Published Mon, Aug 24 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

కుర్రాడు డైనమైట్

కుర్రాడు డైనమైట్

 ఆ కుర్రాడు మామూలోడు కాదు. డైనమైట్ లాంటివాడు. అంత శక్తిమంతమైన కుర్రాడి కళ్లెదుట అన్యాయం జరిగితే ఊరుకుంటాడా? అవినీతిపరులను రప్ఫాడించేస్తాడు. ఇంకా ఈ కుర్రాడు అన్యాయాలను అరికట్టడానికి ఎలాంటి రిస్కులు తీసుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డైనమైట్’. దేవా కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. ప్రణీత కథానాయిక. ఇందులో కొత్త రకం హెయిర్ స్టయిల్, చెవి పోగు, చేతికి టాటూతో టోటల్‌గా విష్ణు ఓ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో రిస్కీ ఫైట్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని, ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కథ, మాటలు, పాటలు, ఫైట్స్.. ఇలా అన్నీ బాగా కుదిరాయని విష్ణు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement