స్టన్నింగ్ డైనమైట్ | Vishnu stanning Dynamite movie | Sakshi
Sakshi News home page

స్టన్నింగ్ డైనమైట్

Published Tue, Aug 25 2015 10:28 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

స్టన్నింగ్ డైనమైట్

స్టన్నింగ్ డైనమైట్

జనరల్‌గా యాక్షన్ సీన్స్ అంటే మాస్‌ను ఎట్రాక్ట్ చేసే విధంగానే డీల్ చేస్తూంటారు. కానీ ‘డైనమైట్’లో యాక్షన్ పార్ట్ స్టన్నింగ్‌గా ఉంటుందని సీనియర్ మోస్ట్ స్టంట్ డెరైక్టర్ విజయన్ చెబుతున్నారు. మంచు విష్ణు ఎంతో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరీ ఈ సన్నివేశాలు చేశాడనీ, తాను ఇప్పటివరకూ పనిచేసిన వారిలో మంచు విష్ణు టాప్ మోస్ట్ యాక్షన్ హీరో అనీ విజయన్ ప్రశసించారు. విష్ణు ఎనర్జీ లెవల్స్ చూసి ఆశ్చర్యపోయానని, ఓ సన్నివేశంలో చెయ్యి విరిగిపోయినా బెస్ట్ అవుట్‌పుట్ వచ్చేవరకూ నటించాడని విజయన్ తెలిపారు.

మంచు విష్ణు, ప్రణీత జంటగా అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై  రూపొందిన ‘డైనమైట్’ చిత్రం ఈ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ తర్వాత దేవా క ట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement