Deva katta
-
ఆలోచింపచేసేలా ‘ఏవమ్ జగత్’టీజర్
కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏవం జగత్’.దినేష్ నర్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాలోని రాధాస్ లవ్ అనే సాంగ్ విడుదల కాగా ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ఈ పాట. తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు దేవాకట్టా విడుదల చేశాడు. ప్రతి ఒక్కరిని ఆలోచింజచేసేలా ఈ టీజర్ ఉంది. . డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెరిగేలా ఉన్నాయి. నటీనటులు కూడా ఎంతో ఇంటెన్స్ తో కూడిన నటన ను కనపరిచినట్లు టీజర్ ను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని విడుదల కు సిద్దం గా ఉంది .ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
Republic Review: ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ
టైటిల్ : రిపబ్లిక్ నటీనటులు : సాయి తేజ్, ఐశ్యర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఆమని, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ తదితరులు నిర్మాణ సంస్థ : జీస్టూడియోస్, జె.బి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు : జె.భగవాన్, జె.పుల్లారావు దర్శకత్వం : దేవ్ కట్టా సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : ఎం.సుకుమార్ ఎడిటింగ్: కె.ఎల్.ప్రవీణ్ విడుదల తేది : అక్టోబర్ 1,2021 ‘ప్రస్థానం’మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు దేవ్ కట్టా. ఆ తర్వాత ఇదే సినిమాను 2019లో హిందీలో తెరకెక్కించి బాలీవుడ్లో సైతం గుర్తింపు పొందారు. అలా వైవిధ్యమైన కోణంలో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. చాలా గ్యాప్ తర్వాత తనకు అచ్చొచ్చిన పొలిటికల్ జానర్లోనే ‘రిపబ్లిక్’ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దేవ్ కట్టా. మెగా మేనల్లుడు సాయితేజ్ ఈ మూవీలో కలెక్టర్‌గా కనిపించబోతుండడంతో ‘రిపబ్లిక్’పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్ 1)థియేటర్ల ద్వారా ప్రేక్షకులను ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘రిపబ్లిక్’మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? కలెక్టర్‌గా సాయితేజ్ మెప్పించాడా?లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే 1970లో స్వచ్ఛమైన తెల్లేరు సరస్సును రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు కబ్జా చేస్తారు. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఆ సరస్సులో విషపు ఆహారాన్ని వేస్తూ చేపలను పెంచుతారు. దాని కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అయినప్పటికీ ఆంధ్ర ప్రజా పార్టీ అధినేత్రి విశాఖవాణి(రమ్యకృష్ణ) తన వ్యాపారాన్ని వదులుకోదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా ఎదుగుతూ తన కొడుకుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ఆ ప్రాంతానికి కలెక్టర్‌గా వచ్చిన పంజా అభిరామ్(సాయి తేజ్) తెల్లేరు సరస్సు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశాఖవాణితో వైర్యం పెరుగుతోంది. ఇది ఎంతవరకు దారి తీసింది? నిజాయతీపరుడైన కలెక్టర్ అభిరామ్.. అవినీతి నాయకురాలైన విశాఖ వాణికి ఎలా బుద్ది చెప్పాడు? తదనంతర పరిణామాలు ఏమిటీ? అనేదే ‘రిపబ్లిక్’ కథ. ఎవరెలా చేశారంటే? రిపబ్లిక్ మూవీ కోసం సాయితేజ్ ప్రాణంపెట్టి నటించాడు. అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్లమీద తాను నిలబడే వ్యక్తిగా, నిజాయతీ గల కలెక్టర్ అభిరామ్ పాత్రలో సాయి తేజ్ అదరగొట్టేశాడు. ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించింది. ఇక అవినీతికి పాల్పడే గ్రూప్ 1 అధికారి దశరథ్ పాత్రలో జగపతిబాబు ఎప్పటిమాదిరే పరకాయప్రవేశం చేశాడు. అద్భుత పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తప్పిపోయిన అన్నయ్యను వెత్తుకుంటూ అమెరికా నుంచి ఇండియా వచ్చిన యువతి మైరా(ఐశ్వర్య రాజేశ్) తన పాత్రకు న్యాయం చేసింది. అవినీతి ఎస్పీగా శ్రీకాంత్ అయ్యంగార్, కలెక్టర్‌గా సుబ్బరాజ్, జగపతిబాబు భార్యగా ఆమని, తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. (చదవండి: ‘బిగ్‌బాస్’ఫేమ్ శ్వేత నటించిన ‘ది రోజ్ విల్లా’ ఎలా ఉందంటే..) ఎలా ఉందంటే.. వ్యవస్థలోని లోటుపాట్లని తనదైన శైలిలో తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు దేవ్ కట్టా. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ని ఎక్కడా డీవియేట్ కాకుండా ఫెర్పెక్ట్గా చెప్పాడు. రాజ్యాంగానికి మూల స్థంభాలైన శాసన వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెరపై చక్కగా చూపించాడు. డైలాగ్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఫస్టాఫ్ కాస్త నిదానంగా సాగినట్టు అనిపించినా, హీరో కల్టెర్ అయినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. తెల్లేరు సరస్సు విషయంలో రైతుల పక్షాన ఉంటూ అభిరామ్ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. విశాఖవాణికీ, అభిరామ్‌కీ మధ్య వచ్చే డైలాగ్స్, క్లైమాక్స్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి.అయితే సాధారణ ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో లేకపోవడం సినిమాకు మైనస్. ఈ పొలిటికల్ డ్రామాకు వాణిజ్యపరమైన మెరుగులు అద్ది ఉంటే సినిమా మరోస్థాయికి వెళ్లేది. మణిశర్మ సంగీతం పర్వాలేదు. ఇందులో మూడే పాటలున్నాయి. అవికూడా తెచ్చిపెట్టినట్లుగా కాకుండా సందర్భానుసారంగా వస్తాయి. సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. మొత్తంగా చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన వారి సంగతి పక్కన పెడితే, పొలిటికల్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి ‘రిపబ్లిక్’ నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్ కథ సాయితేజ్, జగపతి బాబు, రమ్యకృష్ణ నటన డైలాగ్స్, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సరస్సు చుట్టూనే కథ తిరగడం నిదానంగా సాగే సన్నివేశాలు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆకట్టుకుంటున్న ‘నల్లమల’ టీజర్
‘బిగ్ బాస్’ ఫేమ్ అమిత్ తివారి, యాంకర్ భానుశ్రీ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'నల్లమల'. ఈ మూవీకి రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు దేవ కట్టా విడుదల చేశాడు. 'నల్లమల' అటవీ ప్రాంతంలో స్వచ్ఛమైన ప్రేమకథగా.. భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన ‘ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే..’ సాంగ్ రిలీజై మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. కాగా తెలుగులో ఎన్నో మంచి చిత్రాల్లో నెగెటివ్ పాత్రలు పోషించిన అమిత్ హీరోగా ఎటువంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి. -
‘రిపబ్లిక్’మూవీ ట్విటర్ రివ్యూ
సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ సినిమా నేడు( అక్టోబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. పొలిటికల్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. జిల్లా కలెక్టర్‌గా సాయి తేజ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించనున్నారు దేవా కట్టా. ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. Deva Katta thwacks the system and the society with #Republic. Great Climax!! @devakatta @IamSaiDharamTej 👏🏻👌🏻 — Vineel Dutt Syed (@vineeldutt21) October 1, 2021 #Republic Overall A Disappointing Political Thriller! Movie had a few good sequences and the dialogues were pretty good but the direction was weak. Production quality and editing were big negatives for the film. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) September 30, 2021 ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద సినిమా తీశాడని, విశాఖ వాణిగా రమ్యకృష్ణ అదరగొట్టేసిందని, సినిమా హిట్ అంటూ సాయి ధరమ్ తేజ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. వ్యవస్థలోని లోటుపాట్లని దేవకట్టా తనదైన శైలిలో చక్కగా చూపించాడని ప్రసంశిస్తున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అని కామెంట్స్ చేస్తున్నారు. Review & Ratting #Republic : Hard Hitting political drama .., Not a regular commercial entertainer. 👍 Negatives : Screenplay & Editing Positives : SDT ., jagapathi Babu .., Ramyakrishna & writing (2.75/5) https://t.co/pltnTSv72Y — Inside talkZ (@Inside_talkZ) October 1, 2021 #Republic already received very good reports from the celeb premieres. It’s time for audience verdict. Releasing in theatres tomorrow. pic.twitter.com/rK14UjXthe — Aakashavaani (@TheAakashavaani) September 30, 2021 #Republic First half is Amazing. I can see @devakatta in every scene. Not even a single unnecessary scene pic.twitter.com/3AAJDBoyvL — pradyumna reddy (@pradyumnavicky) October 1, 2021 #Republic is one of the finest political tale.. told in telugu… hatsoff to @devakatta 👌🏽👌🏽👌🏽 — Gautam (@gauthamvarma04) October 1, 2021 Just watched #Republic best movie in recent times.... Enduku bro ee negative reviews @venkyreviews cinema chusi mathladu !! — Master (@Master_PSPK) September 30, 2021 -
‘నల్లమల’ అడవుల్లో అంతర్యుద్ధం..గెలించిందెవరు?
అమిత్ తివారి, భానుశ్రీ హీరో,హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘నల్లమల’.రవిచరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. ‘1980 జూలై 23, ఇరాన్-ఇరాక్ యుద్ధం మొదలయ్యే ముందు రోజులు ఇవి. అప్పుడప్పుడే నల్లమల అడవుల్లో అంతర్యుద్ధం మొదలైంది’ అనే మాటలతో ఈ మూవీ టీజర్ మొదలైంది. ప్రతి సన్నివేశంలో అమిత్ నటన ఆకట్టుకునేలా ఉంది. ధికారం కోసం నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే సంఘటనలు.. అందమైన అడవిలో స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాకట్టా మాట్లాడుతూ. ఈ మూవీలోని ఏమున్నావే పిల్ల పాటను నేను నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదు అని అసూయ పడ్డాను. అమిత్‌ను మొదటిసారి చూసినప్పుడే ఇంత మంచి యాక్టర్‌వి ఎందుకు అంత తక్కువగా కనిపిస్తున్నావ్ అని అన్నాను. మంచి ఫుడ్ చాలా అరుదుగా దొరుకుతుందన్నట్టుగా అనిపించింది.ఇంత మంచి క్యాస్టింగ్‌ను పెట్టుకోవడంతోనే సినిమా సక్సెస్‌కు మొదటి మెట్టు పడ్డట్టు అయింది.ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’అని అన్నారు. దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నాతో ఈ సినిమా చేసినందుకు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసిన నిర్మాత ఆర్ఎమ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు దేవా కట్టా గారంటే చాలా ఇష్టం. టీజర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఓ రెండు విషయాలు చెబుతాను. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే ఈ కథ. తరువాత సినిమా గురించి చాలా విషయాలు చెబుతాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు. -
డబ్బింగ్‌కే పదిహేను రోజులు పట్టింది
‘‘రిపబ్లిక్’ పక్కా కమర్షియల్ మూవీ కాదు.. డిఫరెంట్ మూవీ.. రియల్ స్టోరీ ఆధారంగా దేవ కట్టాగారు ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు 22 రోజులు పని చేశాం. అయితే డబ్బింగ్ చెప్పడానికి మాత్రం 15 రోజుల సమయం పట్టింది. అంటే.. డైరెక్టర్‌గారు ఎంత పర్ఫెక్షన్ కోరుకున్నారో అర్థం చేసుకోవచ్చు’’ అని ఐశ్వర్యా రాజేశ్ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేశ్ చెప్పిన విశేషాలు. ► కరోనా సమయంలో ఓ రోజు దేవ కట్టాగారు ఫోన్ చేసి, ‘రిపబ్లిక్’ స్క్రిప్ట్ గంట పాటు చెప్పారు. హైదరాబాద్ వచ్చి ఆయన్ని కలిశాక ఐదారు గంటల పాటు కథ చెప్పారు. హీరో, హీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్స్, దాని ప్రాధాన్యతలేంటి? అని చూస్తారాయన. ఈ చిత్రంలో మైరా అనే ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తాను. రొటీన్‌గా సాంగ్స్ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్ మధ్య లవ్‌ట్రాక్ ఉండదు. మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. సినిమాలో లవ్ ప్రపోజ్ చేసే సీన్ కూడా ఉండదు. ► సినిమా అనేది మన జీవితాల్లో ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అందుకే మనం సినిమా చూసినప్పుడు ఏదో ఒక పాయింట్‌కు కనెక్ట్ అవుతుంటాం. అలాంటి ఓ బలమైన సినిమా ద్వారా సమాజానికి అవసరమైన ఓ విషయాన్ని వివరిస్తూ తెరకెక్కించారు దేవ కట్టా. సాయితేజ్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. తన కెరీర్లో ‘రిపబ్లిక్’ బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. ► ఇప్పుడున్న హీరోయిన్స్‌లో సమంతగారంటే ఇష్టం. పెర్ఫార్మెన్స్ అయినా, గ్లామర్ రోల్స్ అయినా చక్కగా చేస్తారు. అనుష్కగారంటే ఇష్టం. సౌందర్యగారంటే ఎంతో అభిమానం. ప్రస్తుతం తెలుగు కథలు వింటున్నాను. త్వరలోనే కిరణ్ రెడ్డిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను. తమిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను. -
‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’
Director Deva Katta About His Movies: ‘ప్రస్థానం’(2010) మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ దేవా కట్టా. ఆ తర్వాత ఇదే సినిమాలను 2019లో హిందీలో తెరకెక్కించి బాలీవుడ్లో సైతం గుర్తింపు పొందారు. అలా వైవిధ్యమైన కోణంలో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం పొలిటికల్ జానర్లో రిపబ్లిక్ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ పోషించగా నటి రమ్యకృష్ణ పవర్ఫుల్ మహిళ పాత్రలో అలరించనున్నారు. ఈ మూవీ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ ఈ నేపథ్యంలో రిపబ్లిక్ ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ దేవాకట్టా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిపబ్లిక్ మూవీ గురించి ముచ్చటించాడు. అంతేగాక ఆయన వ్యక్తిగత విషయాలపై కూడా ప్రస్తావించాడు. ఈ మేరకు ప్రస్తుతం తన దగ్గర పలు ఆసక్తికర స్క్రిప్ట్స్ ఉన్నట్లు చెప్పాడు. ‘నా దగ్గర ప్రస్తుతం 6 నుంచి 7 కథలు ఉన్నాయి. అందులో రెండు కథలు చాలా బలమైనవి, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నీ కొత్త పాయింట్స్‌తోనే కథలు రాశాను. చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ వాటిని ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఒక్కొసారి ఆ సినిమాలు తీయకుండానే చనిపోతానేమోనని భయం కూడా వేస్తుంటుంది. అందుకే రిపబ్లిక్ విడుదలైన తర్వాత మూడు నెలల్లోపు నా సినిమాలను మొదలుపెడతా. ఆ రెండు కథలను జనాలకు అందించకపోతే నా జీవితానికి అర్థమే లేదు. అన్నీ కొత్త పాయింట్స్ తోనే కథలు రాశాను. ఓటీటీలో పోరాటం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుందని నాకు తెలుసు. వచ్చే అయిదేళ్ల వరకు నాన్ స్టాప్‌గా సినిమాలు తీసి ఈ కథలు పూర్తయిన తర్వాత ఓటీటీ కోసం పనిచేయడంపై ఆలోచిస్తా’అంటూ చెప్పుకొచ్చాడు. -
‘రిపబ్లిక్’ ఫస్ట్‌లుక్: 74 ఏళ్లుగా ఆ భ్రమలోనే ఉంటున్నాం
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటికల్ మూవీని తెరకెక్కించిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న ఇటీవల చిత్ర యూనిట్ తెలిపింది. ఈ నేపథ్యంలో గురువారం రిపబ్లిక్ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ మెగా పవర్ స్టార్ రామచరణ్ తేజ్‌ను విడుదల చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు దేవా కట్టా ట్విటర్ వేదికగా ఈ పోస్టర్ షేర్ చేశాడు. ‘డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు’ అంటూ స్కెచ్ వేసిన తేజ్ ఫొటోను ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో తేజ్ సరసన హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు కిలక పాత్రలు పోషిస్తుండగా రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన వంటి తదితరులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావులు కలిసి నిర్మిస్తున్న చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. “డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు” ; ABHI and his perspective from #REPUBLIC.#RepublicFirstLook #RepublicOnJune4th@IamSaiDharamTej @devakatta @aishu_dil @IamJagguBhai @meramyakrishnan #ManiSharma pic.twitter.com/jAmAiifyUz — dev katta (@devakatta) March 25, 2021 చదవండి: ఇంటివాడు కాబోతున్న సాయ్ తేజ్.. మేలో పెళ్లి! -
రిపబ్లిక్కి ముహూర్తం
సాయితేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటికల్ మూవీని తెరకెక్కించిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మాతలు. ఈ సినిమాని జూన్ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా జె. భగవాన్, జె. పుల్లారావు మాట్లాడుతూ – ‘‘సాయితేజ్ ఇప్పటివరకు చేసిన చిత్రాలకు భిన్నంగా మా ‘రిపబ్లిక్’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం. సుకుమార్, సంగీతం: మణిశర్మ. -
విజేతలే ప్రపంచాన్ని నడిపిస్తారు
విన్నర్స్ రన్ ది వరల్డ్.... విజేతలే ప్రపంచాన్ని నడిపిస్తారు. ఈ డైలాగ్ శుక్రవారం దర్శకుడు దేవా కట్టా విడుదల చేసిన ‘ఇంద్రప్రస్థం’ (వర్కింగ్ టైటిల్) చిత్రం థీమ్ పోస్టర్లోనిది. దేవా కట్టా రచయితగా, దర్శకునిగా చేస్తున్న తాజా చిత్రం ఇది. ‘‘ఒకప్పటి మంచి స్నేహితులు, రాజకీయ ప్రత్యర్థులుగా మారి 30 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిన ఇద్దరి నాయకుల ప్రయాణం ప్రధానాంశంగా కాల్పనిక సన్నివేశాలతో తయారవుతున్నదే నా సినిమా. ఇద్దరు రాజకీయ దిగ్గజాల స్నేహానికి, రాజకీయాల్లో వారి శత్రుత్వానికి, ఆ ఇద్దరికీ వారి అనుచరులు ఇచ్చే గౌరవానికి సమాన ప్రాధాన్యం ఇచ్చే సినిమా ఇది’’ అన్నారు దేవా కట్టా. ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షా.వి, తేజ.సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్‌కు బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సురేశ్ బొబ్బిలి అందించారు. ప్రస్తుతం దేవా కట్టా సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 14వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. -
వైఎస్సార్, బాబు స్నేహంపై వెబ్ సిరీస్.. వివాదం
‘‘మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుగార్ల స్నేహం, రాజకీయ వైరంపై 2017లోనే ఓ ఫిక్షనల్ స్టోరీ రాసి, రిజిస్టర్ కూడా చేయించాను. అయితే నా కాన్సెప్ట్‌ను వేరే వాళ్లు తస్కరించారు. చట్టపరంగా వాళ్లు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని దర్శకుడు దేవా కట్టా అన్నారు. ‘ప్రస్థానం, ‘వెన్నెల, ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాలతో దర్శకుడిగా తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. మంగళవారం దేవా కట్టా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. వైఎస్, చంద్రబాబుల స్నేహం, రాజకీయ వైరాన్ని బేస్ చేసుకుని ఓ సిరీస్ రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వచ్చింది. (చదవండి : మరో వెబ్ సిరీస్‌లో జగపతి బాబు) ఈ వార్త నేపథ్యంలో దేవా ఓ వ్యక్తిపై తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గాడ్ ఫాదర్’ సినిమా స్ఫూర్తితో వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుగార్ల స్నేహం, రాజకీయ వైరంపై మూడు భాగాలుగా స్క్రిప్ట్ రెడీ చేశాను. ఆ తర్వాత దాన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్లోకి మార్పు చేసి, నా ఐడియాను పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వివరించాను. గతంలో నా స్క్రిప్ట్ తస్కరించిన ఓ వ్యక్తి ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. కానీ ఈసారి అలా కానివ్వను’’ అన్నారు దేవా కట్టా. కాగా దేవా కట్టా ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు? అనే చర్చ మొదలైంది. కాసేపటికి ఆ నిర్మాత విష్ణు ఇందూరి అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘నేను డైరెక్టర్ రాజ్, ‘చదరంగం’ (వెబ్ సిరీస్) గురించి మాట్లాడడంలేదు. విష్ణు ఇందూరి గురించి చెబుతున్నాను. 2015 డిసెంబర్లో ఎన్టీఆర్ బయోపిక్ గురించి చర్చించడానికి విష్ణు ఇందూరి, నేను కలిశాం’ అని దేవా ట్వీట్ చేశారు. (చదవండి : అడ్డంగా దొరికిన వర్మ, ఆగిన ‘మర్డర్’!) దేవా నాకేం చెప్పలేదు: విష్ణు ఇందూరి ‘‘2015లో ఓ రీమేక్ కోసం దేవా కట్టాని కలిశాను. అప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ఐడియాని బేసిక్ స్క్రీన్‌ప్లేతో తనకు చెప్పాను. ఆ ఐడియా తనకు నచ్చింది. అంతేకానీ ఎన్టీఆర్ బయోపిక్ గురించి తను నాకేం చెప్పలేదు’’ అని విష్ణు ఇందూరి ట్వీట్ చేశారు. -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
-
కొత్త సినిమా ప్రస్థానం
‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు సాయితేజ్. ప్రస్తుతం ‘ప్రస్థానం’ చిత్రదర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో తన నూతన చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్. జగపతిబాబు పవర్ఫుల్ రోల్ చేయనున్నారు. జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేసి, స్క్రిప్ట్ అందించగా, నటుడు పవన్ కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దేవ కట్టా మాట్లాడుతూ– ‘‘ఎగ్జయిట్మెంట్ కలిగించే అద్భుతమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్ దత్. -
సంజయ్ దత్‌కు లీగల్ నోటీసులు!
సాయికుమార్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం. 2010లో దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్లో రీమేక్ అయ్యింది. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన దేవా కట్టానే ఈ సినిమాను తెరకెక్కించారు. సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాపై వివాదం తెరమీదకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ షీమారు ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ ప్రస్థానం రీమేక్ రైట్స్ తమవద్ద ఉన్నాయంటూ వాదిస్తున్నారు. ఈ మేరకు సంజయ్ దత్‌కు లీగల్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయాన్ని సంజయ్ దత్తో గతంలోనే చర్చించామని అయినా సంజు బాబా అవేవి పట్టించుకోకుండా సినిమాను రూపొందించారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ప్రస్థానం దర్శక నిర్మాతలు స్పందించాల్సి ఉంది. -
ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగటం లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస సినిమాలతో హల్చల్ చేసిన ఈ సుప్రీం హీరో తరువాత డీలా పడిపోయాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో కెరీర్ కష్టాల్లో పడింది. ఇటీవల చిత్రలహరితో కాస్త పరవాలేదనిపించినా సూపర్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ఈ సినిమా తరువాత దేవ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వెన్నెల, ప్రస్థానం సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దేవాకట్టా తరువాత ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలతో డిజాస్టర్లు ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్ వచ్చింది. తాజా దేవ కట్టా సాయి ధరమ్‌కు ఓ లైన్ వినిపించాడట. పూర్తి సీరియస్ మోడ్‌లో యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ కథ సాయి ధరమ్ తేజ్‌కు నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని చెప్పాడట. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితేగాని ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. -
బాహుబలి ప్రీక్వెల్
డిజిటల్ మాధ్యమంలో నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త షోలతో ముందుకొస్తోంది. సొంతంగా సినిమాలనూ రిలీజ్ చేస్తోంది. ఈ ఏడాది ఏకంగా ఎనిమిది సినిమాలు, ఒక సిరీస్‌తో రానున్నట్టు పేర్కొంది. రాజమౌళి సూపర్ హిట్ ఫ్యాంటసీ చిత్రం ‘బాహుబలి’ ప్రీక్వెల్ నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్‌గా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సిరీస్‌లో నటించే వారిని తాజాగా అనౌన్స్ చేసింది. శివగామిగా మృణాల్ ఠాకూర్, స్కందదాస్గా రాహుల్ బోస్, అతుల్ కులకర్ణి, అనూప్ సోనీ వంటి నటులు ఈ సిరీస్‌లో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ సిరీస్‌ను దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయనున్నారు. -
బాహుబలి నిర్మాతల భారీ ప్రాజెక్ట్
బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్కా మీడియా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది. బాహుబలి తరువాత రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అదే సమయంలో బుల్లితెర మీద బాహుబలి స్థాయిలో ఓ భారీ టీవీ సీరియల్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సీరీస్‌ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారట. ఇప్పటికే ప్రస్థానం ఫేం దేవ కట్టా ఫైనల్ కాగా ఓ హిందీ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ భారీ వెబ్ సీరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
ప్రస్థానం ప్రారంభం
అబ్బా.. బాలీవుడ్ సినిమాలు భలే ఉంటాయిరా బాబు! మన టాలీవుడ్లో అలాంటి సినిమాలు రావడం తక్కువ అని కొందరు అంటుంటారు. కానీ ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుంది. రీసెంట్ టైమ్స్‌లో అయితే మన తెలుగు సినిమాలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. అందుకు మన ‘బాహుబలి’ చిత్రమే నిదర్శనం. అంతెందుకు ఇప్పుడు చూడండి. తెలుగు సినిమాలు ‘ప్రస్థానం, టెంపర్, అర్జున్‌రెడ్డి’ బీటౌన్‌లో రీమేక్ అవుతున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’కు టీమ్ కొబ్బరికాయ కొట్టారు. గురువారం హిందీ ‘ప్రస్థానం’ మొదలైంది. తెలుగులో డైరెక్ట్ చేసిన దేవా కట్టానే దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్, మనీషా కోయిరాల, అలీ ఫజల్, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు జాకీ ష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. పదేళ్ల క్రితం హిందీ చిత్రం ‘కార్తూస్’లో కలిసి నటించిన సంజయ్, మనీషా, జాకీ మళ్లీ ఇప్పుడు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్‌లో నటిస్తుండటం విశేషం. ‘‘ఫస్ట్ డే షూట్లో సంజయ్‌దత్ పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దేవా కట్టా. -
సంజయ్ దత్ 'ప్రస్థానం'..!
భూమి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, తన నెక్ట్స్ సినిమాల కథ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హీరో ఇమేజ్ ను పక్కన పెట్టిన వయసుకు, లుక్ కు తగ్గ పాత్రలో కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే భూమి సినిమా తరువాత ఓ తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సంజూ భాయ్. చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఓ చిన్న సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. దర్శకుడిగా దేవ కట్టా కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన చేసిన అప్పట్లో వర్క్ అవుట్ కాలేదు. ఇన్నేళ్ల తరువాత తిరిగి ఆ ప్రయత్నాలు ప్రారంభించాడు దేవ కట్టా. ఈ రీమేక్ లో సాయికుమార్ పాత్రలో సంజయ్ నటించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించాలని భావిస్తున్నాడు సంజయ్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
తెలుగు సినిమా రీమేక్‌లో సంజయ్‌దత్
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జైలు నుంచి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంజయ్ దత్ ఇటీవలే భూమి చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా తరువాత ఓ తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సంజూ భాయ్. చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఓ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. దర్శకుడి దేవ కట్టా కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ప్రస్థానం రిలీజ్ సమయంలోనే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన ఉందని ప్రకటించాడు దర్శకుడు. ఇన్నేళ్ల తరువాత ఆ మాట నిలబెట్టుకోబోతున్నాడు. త్వరలోనే సంజయ్ దత్ హీరోగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
వెండితెరపై మరో 'ప్రస్థానం'
రెండు సినిమాలతోనే దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు దేవాకట్టా. తొలి సినిమా వెన్నెలతో ఆకట్టుకున్న దేవాకట్టా తరువాత ప్రస్థానం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలు కూడా దేవాకట్టా దర్వకత్వంలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించారు. సాయికుమార్, శర్వానంద్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ప్రస్థానం దర్శకుడితో పాటు శర్వానంద్ కెరీర్ ను కూడా మలుపు తిప్పింది. ప్రస్థానం సినిమా తరువాత అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు దేవాకట్టా. నాగచైతన్య హీరోగా తెరకెక్కించిన ఆటోనగర్ సూర్యతో పాటు, మంచు హీరోగా తెరకెక్కిన డైనమేట్ సినిమాలకు డిజాస్టర్ టాక్ రావటంతో ఈ దర్శకుడి కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో దేవాకట్టాకు బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు శర్వానంద్. తన కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకుడి కోసం రిస్క్ చేయడానికి రెడీ అంటున్నాడు. -
ఈ షార్ట్ ఫిల్మ్ ఎందుకు చూడాలంటే..
ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ఏమిటో.. దాని ఆవశ్యకత ఏమిటో తెలియజేస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు దేవాకట్ట 'డైయింగ్ టు బి మీ ఒక షార్ట్ ఫిలింను విడుదల చేశాడు. ఇందులో ప్రముఖ పాప్ సింగర్ స్మిత ముఖ్యపాత్ర పోషించారు. బాగా విద్యావంతురాలై ఉండి, ఉద్యోగం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇంట్లోనే ఉంచాలన్న భర్త ఆలోచనతో సతమతమయ్యే మహిళగా ఆమె కనిపించింది. తాను ఆర్థిక సంకెళ్ల మధ్య ఉన్నానంటూ బాధపడుతుంది. చివరకు, అతడి అభిప్రాయంతో విభేదించి తనను స్వేచ్ఛగా వదిలేయమని చెప్పి వెళ్తుంది. 'ఒక మహిళ తన జీవిత నియంత్రణ తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు మాత్రమే ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినట్లు' అని చెప్పడమే ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం. 'స్వేచ్చగా జీవించండి.. స్వేచ్చగా జీవించనీయండి' అనే వాక్యంతో ఈ రెండు నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రం ముగుస్తుంది. ఈ వీడియో ముగుస్తుండగా.. దేశ జనాభాలో మహిళలు 50శాతం ఉన్నారని.. వారిలో 70శాతం మహిళలు గృహిణిలుగా పనిచేస్తున్నారని, కేవలం పది శాతంమంది మహిళలు మాత్రం సంపాదిస్తున్నారని, అది దేశ సంపదలో ఒకశాతం మాత్రమే గణాంకాలు వెల్లడించాడు దర్శకుడు. -
గోపిచంద్ 'మహా ప్రస్థానం'
'లౌక్యం' సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన గోపిచంద్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. జిల్ సినిమాతో స్టైలిష్ హీరోగా మారిన ఈ మ్యాన్లీ స్టార్, ప్రస్తుతం ఎయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో మంచి సక్సెస్ సాధించిన రవికుమార్ చౌదరి గోపిచంద్ సినిమాతో మరో సక్సెస్ మీద కన్నేశాడు. రవికుమార్ చౌదరి సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు రెడీ అవుతున్నాడు గోపిచంద్. 'వెన్నెల', 'ప్రస్థానం' లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 'ఆటోనగర్ సూర్య', 'డైనమైట్' లాంటి వరుస ఫెయిల్యూర్స్ తరువాత, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు దేవ కట్టా. తన కెరీర్‌ను మలుపు తిప్పిన 'ప్రస్థానం' సినిమా తరహాలో 'మహా ప్రస్థానం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్థానానికి కొనసాగింపు కాకపోయినా దాదాపు అదే తరహా కథా కథనాలతో నడుస్తుందని చెపుతున్నాడు. మహా ప్రస్థానంలో గోపిచంద్ డాన్ తరహా పాత్రలో కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యే సక్సెస్ ట్రాక్ ఎక్కిన గోపిచంద్‌కు ఈ ప్రయోగం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
డైనమైట్ .. భలే.. భలే... కొత్త సినిమాలు గురూ!
కొత్త సినిమాలు గురూ! ఈ యాక్షన్ సినిమా చూస్తూ కళ్లు తిప్పామంటే పళ్లు రాలతాయి... అంత స్పీడులో బ్రేకుల్లేకుండా పరుగెడుతుంది ఈ స్క్రీన్ ప్లే. ఇంకొక కామెడీ సినిమా చూస్తూ పళ్లు బిగపట్టకపోతే కళ్లూడతాయి నవ్వుతో... అంతగా బ్రేకు ఇవ్వకుండా మరీ గిలిగింతలు పెడుతుందీ స్టోరీ లైన్. మొత్తానికి ఈ వారం సినిమా స్కోపు డబులైంది. ఆకట్టుకున్న ఈ సినిమాలు డబ్బులు తెస్తాయి. ఈ శ్రావణంలో మన సినిమాకి మంచి రోజులూ, మంచి సినిమాకి వెలుగు జిగేళ్లూ ప్రాప్తమయ్యాయి. క్లాసూ మాసూ తేడా లేకుండా... దేవ కట్టా, మారుతి కట్టలు తెంచుకుని మరీ గంతులేశారు. డైనమైట్ యాక్షన్ బిట్లు భలే భలేగా ఆకట్టుకున్నాయి. భలే భలే కామెడీ బిట్లు డైనమైట్లా పేలాయి. దర్శకుడు శ్రీను వైట్ల తరహా వినోదభరిత సినిమాలకూ, రచయిత కోన వెంకట్ బాక్సాఫీస్ మంత్రమైన స్క్రీన్‌ప్లే విధానానికీ తెలుగు సినిమా బందీగా మారి కొన్నేళ్ళయింది. ఈ మధ్యే అడపాదడపా కొన్ని ఫ్యామిలీ కథలు, కొన్ని హార్రర్ - కామెడీలు అందుకు భిన్నంగా అలరిస్తున్నాయి. అయితే, వీటిలోనూ వినోదం కామనే. ఇప్పుడున్న ఈ ట్రెండ్లకు భిన్నంగా పూర్తి ఛేజింగ్ ఫార్ములా యాక్షన్ సినిమా తీస్తే? అలా వచ్చిందే - ‘డైనమైట్’. వైవిధ్యాన్ని ఆశ్రయించారు నట, నిర్మాత విష్ణు. ఇంతకీ కథేంటి? శివాజీ కృష్ణ (మంచు విష్ణు) డిజిటల్ మార్కెటింగ్ చేసే వ్యక్తి. అన్యాయం ఎదురైతే, ఎదిరించి పోరాడే తత్త్వమున్న మనిషి. ఆ క్రమంలో అతను అనుకోకుండా అనామిక (ప్రణీత)కు దగ్గరవుతాడు. ఆమె ‘చానల్ 24’ సి.ఇ.ఓ రంగనాథ్ (పరుచూరి వెంకటేశ్వరరావు) కూతురు. హీరో, హీరోయిన్లు ప్రేమలో పడీ పడగానే కథలో కుదుపు. దుండగులు కొందరు హీరోయిన్ను కిడ్నాప్ చేస్తారు. నేరస్థులను వెంటాడే క్రమంలో హీరోయిన్ తండ్రి ఇంటికి వెళతాడు హీరో. ఆయన దగ్గరున్న కీలకమైన వీడియో తాలూకు మెమొరీ కార్డ్ కోసం దుండగులు హీరోయిన్ను కిడ్నాప్ చేశారన్నమాట. అక్కడ జరిగిన కాల్పులు, ప్రతికాల్పుల్లో ఆయన చనిపోతాడు. దీని వెనక ఎవరో పెద్దలున్నారని హీరోకూ అర్థమైపోతుంది. కథ ముదిరి, పాకానపడుతుంది. కిడ్నాప్ చేసిన దుండగుల నుంచి హీరోయిన్ను హీరో తప్పిస్తాడు. అలాగే, దుండగులు తెచ్చిన వీడియో టేప్ మెమొరీకార్డ్ను కూడా సాధిస్తాడు. అయితే, ఆ కార్డ్ ఓపెన్ కాదు. అందులో ఏముందన్న సస్పెన్స్ కొనసాగుతుంది. కథ అక్కడ నుంచి కేంద్రంలో ఉన్న కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రిషిదేవ్ (జె.డి. చక్రవర్తి) దాకా వెళుతుంది. హీరో - హీరోయిన్లను చంపడానికి కూడా మంత్రి వెనకాడడు. ఇంతకీ ఆ కార్డ్‌లోని వీడియోలో ఉన్నదేమిటి, మంత్రికీ దానికీ సంబంధం ఏమిటీ అన్నది ఈ కాన్స్పిరసీ థ్రిల్లర్ మిగతాపార్ట. తమిళ కథ... తెలుగు యాక్షన్... ‘ఢీ’, ‘దేనికైనా రెఢీ’ లాంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు సాధించిన హీరో విష్ణు ఈసారి ట్రాక్ మార్చి, ఇలా యాక్షన్ బాట పట్టారు. రొటీన్‌కు భిన్నమైన ప్రయత్నం కాబట్టి అభినందించాలి. తమిళ చిత్రం ‘అరిమ నంబి’, దర్శక - రచయిత ఆనంద్ శంకర్ దానికి రాసుకున్న కథ - ఈ ‘డైనమైట్’కు ఆధారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు కొన్ని కొత్త సీన్లు కలుపుకొని, దర్శకుడు కొత్తగా వండి వడ్డించారు. ‘ప్రస్థానం’ ద్వారా చాలా పేరు తెచ్చుకున్న దేవ కట్ట ఈ కథను స్టయిలిష్‌గా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నించారు. యాక్షన్ ప్రధాన చిత్రం కాబట్టి స్టంట్ మాస్టర్ విజయన్ దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా సినిమా మొత్తాన్నీ తన చేతుల మీదుగా నడిపించారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న హీరో విష్ణు చేత థ్రిల్స్ బాగా చేయించారు. విష్ణు కూడా యాక్షన్ సన్నివేశాలకు బిలీవబుల్‌గా ఉన్నారు. డ్యాన్స్‌లకు పడిన కష్టమూ తక్కువేమీ కాదు. ప్రణీత అందంగా కనిపిస్తూ, యాక్షన్ సీన్లూ కష్టపడి చేశారు. జె.డితో విలనీ వెరైటీగా అనిపిస్తుంది. సందర్భం, సంభావ్యతల పని లేకుండా, మాస్ కోసం సినిమాలో ప్రత్యేక నృత్యగీతం పెట్టారు. హీరో, హీరోయిన్ల మధ్య కలర్‌ఫుల్ డ్యూయెట్లూ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాలకు కీలకం. ఆ పని చిన్నా బాగా చేశారు. కెమేరా వర్క్ కూడా భేష్. రెండు గంటల 22 నిమిషాల ఈ సినిమా హీరోయిన్ కిడ్నాప్ నుంచి పట్టాల మీద కెక్కి, వేగంగా నడుస్తుంటుంది. జనం ఆ మూడ్‌లో లీనమైపోతారు. ఫలితంగా, లోటుపాట్లేమైనా ఉన్నా గుర్తించే తీరిక, గుర్తుపెట్టుకొనే ఓపిక ఉండవు. ఆఖరి దాకా టెంపోలో సాగడంతో సినిమా ఎంతసేపటిగా చూస్తున్నామనే ఫీలింగే రాదు. అది సినిమాకు శ్రీరామరక్ష. యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకూ, మాస్కూ నచ్చే విషయం. వెరసి, సమష్టి కృషితో తెరపై ఇది అవుటండ్ అవుట్ యాక్షన్ దట్టించిన డైనమైట్. దర్శకుడు దేవ కట్ట భలే.. భలే తెలుగు తెరపై అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం కామన్. వాళ్ళకు విలన్ నుంచి ఇబ్బందులు ఎదురవడం కూడా కామనే. కొన్నిసార్లు... ఆ ప్రేమకూ, పెళ్ళికీ అడ్డంకి హీరోయిన్ తండ్రే కావడం మరీ కామన్. ఈ ఫార్ములా కథకు మతిమరుపనే పాయింట్‌తో కాస్తంత కొత్తదనం చేరిస్తే? దర్శకుడు మారుతి రాసుకున్న ‘భలే.. భలే మగాడివోయ్’ కథ అలాంటిదే! ఈ కథేంటి? శ్రీమతి, శ్రీఆంజనేయు లు (నరేశ్ - సితార) దంపతుల బిడ్డ లక్కరాజు అలియాస్ లక్కీ(నాని). మనవాడు మైండ్ ఆబ్సెంట్కి యూత్ ఐకాన్. మరో సైంటిస్ట్ పాండురంగారావు (మురళీశర్మ). ఆయన కూతురు కూచిపూడి డ్యాన్సర్ నందన (‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్యా త్రిపాఠీ). లక్కీని అల్లుడిగా చేసుకుందామనుకున్న టైమ్‌లో ఆయనకు ఈ ‘మతిమరపు మేళం’ సంగతి అర్థమై, పెళ్ళి కుదరదంటాడు. ఇంతలో పరధ్యానంలో చేసిన ప్రతి పొరపాటునూ ఏదో ఒక సామాజిక సేవకూ, మంచి పనికీ లింక్ చేస్తూ, హీరోయిన్ ప్రేమను పొందుతాడు హీరో. కూతురు ప్రేమిస్తున్నది తాను వద్దనుకున్న సంబంధం తాలూకు కుర్రాడినే అని తెలియక హీరోయిన్ తండ్రి కూడా ఓ.కే. అనేస్తాడు. ఇంతలో అసలు సంగతి హీరోకు అర్థమైపోతుంది. ఇక, అక్కడ నుంచి అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కలసి హీరో ఆడే నాటకం. మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ అజయ్ (నటుడు అజయ్) ఎలాగైనా హీరోయిన్ను పెళ్ళి చేసుకోవాలని చూస్తుంటాడు. ఈ మొత్తం ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ తరహా ఎపిసోడ్ ఏయే మలుపులు తిరిగింది, చివరకు హీరో - హీరోయిన్ల ప్రేమ ఎలా సక్సెసైందన్నది మిగతా సినిమా. నేచురల్ యాక్టింగ్ ఆ మధ్య ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్న తరహా ప్రయత్నం చేసిన హీరో నాని ఈసారి ‘మతిమరపు’ పాయింట్‌తో జనం ముందుకొచ్చారు. కామెడీ పండించడానికి మంచి స్కోపున్న విషయమిది. దాన్ని దర్శకుడు బాగానే వాడుకున్నారు. సహజంగా ప్రవర్తించినట్లుండే నాని తరహా నటన ఈ పాత్రకు మరో ప్లస్. కథాంశం చాలా చిన్నది కాబట్టి, ఎక్కువగా సీన్లు రాసుకొని, వాటితో నడిపించడం మీదే దర్శక - రచయితలు ఆధారపడ్డారు. ఆ పరిస్థితుల్లో నాని వినోదంతో సినిమాను ముందుకు నడిపే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. లావణ్యా త్రిపాఠీ చూడడానికి బాగుంది. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ మంచి క్యారెక్టర్ యాక్టర్‌నని ఋజువు చేసుకున్నాడు. అజయ్ విలనీ సరేసరి. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మలయాళ మ్యూజిక్ డెరైక్టర్ గోపీ సుందర్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) సంగీతం సినిమాకు మరో బలం. త్యాగరాయ కీర్తన ‘ఎందరో మహానుభావులు...’ను అనుకరిస్తూ, కథకూ, హీరో క్యారెక్టరైజేషన్‌కూ తగ్గట్లుగా సాహిత్యం మార్చుకొని, అదే ట్యూన్లో చేసిన ప్రయోగం బాగుంది (రచన రామజోగయ్య శాస్త్రి). రిచ్ ఫ్రేమింగ్స్తో నిజార్ షఫీ కెమేరా వర్క్ భేష్. ‘ముద్ర’కు దూరంగా.. ఫ్యామిలీస్‌కి దగ్గరగా.. హీరోకున్న మతిమరపు పాయింట్‌ను టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే చైల్డ్‌హుడ్ ఎపిసోడ్‌లోనే దర్శకుడు చెప్పేశారు. కానీ, ప్రేక్షకులు మర్చిపోతారనో ఏమో, ఫస్టాఫ్‌లో గంటకు పైగా అలాంటి సంఘటనలతో నడిపారు. అయితే, అవన్నీ వినోదం నింపే ఎపిసోడ్సే. చివరకొచ్చేసరికి అల్లుడే మామను జయించి, ఒప్పించినట్లు కాకుండా, మామే అల్లుడిని చాలాకాలంగా గమనిస్తూ, ఓ.కె. చెప్పినట్లు చూపడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. మొత్తం మీద, ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ లాంటి చిత్రాలతో ఒక ముద్ర వేయడమే కాకుండా, తెలియకుండానే తన మీద ఒక రకం ముద్ర వేయించుకున్న దర్శకుడు మారుతికి ఈ సినిమా ఒక పెద్ద రిలీఫ్. రెండర్థాల మాటలతో పని లేకుండా, క్లీన్ ఎంటర్టైనర్ను కూడా అందించగలనని ‘భలే.. భలే.. మగాడివోయ్’తో ఆయన ప్రూవ్ చేసుకున్నట్లయింది. తీరిక, ఓపిక తగ్గిన నవతరం ప్రేక్షకులు కోరుకుంటున్నదీ కాసేపు నవ్వుకోవడమే కాబట్టి, ఫ్యామిలీస్ ఈ సినిమా చూసి ‘భలే భలే.. సినిమావోయ్’ అంటే ఆశ్చర్యం లేదు. దర్శకుడు మారుతి తెర వెనుక ముచ్చట్లు ►‘డైనమైట్’ చిత్రం ఏడాది క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘అరిమ నంబి’కి రీమేక్. తమిళ సినిమా విడుదలైన నాలుగు రోజులకే దాని గురించి తెలిసి, రీమేక్ రైట్స్‌కి పోటీ ఎదురైంది. తమిళ నిర్మాత ఎస్. థానుకి, మోహన్‌బాబుకి మధ్య అనుబంధం వల్ల విష్ణుకు రైట్స్ దక్కాయి. ► ఈ చిత్రానికి మొదట ‘ఎదురీత’ అని టైటిల్ పెడదామనుకున్నారు. కానీ, హీరో క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, ‘డైనమైట్’ టైటిల్ పెట్టాలన్నది విష్ణు ఆలోచన. యూనిట్ మొత్తానికి నచ్చడంతో చివరికి దాన్నే ఫైనలైజ్ చేశారు. ► తమిళ ఒరిజినల్‌కి ‘డ్రవ్ు్స’ శివమణి సంగీత దర్శకుడు. మ్యూజిక్ డెరైక్టర్‌గా అదే ఆయన తొలి సినిమా. తెలుగులో పాటలు అచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిన్నా అందించారు. ► షూటింగ్‌కి ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేశారు. ఎక్కడెక్కడ తీయాలో లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని న్యాచురల్ లొకేషప్స్లో, సెట్స్ వేసి తీశారు. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. 65 రోజుల్లో పూర్తి చేసేశారు. ► మొత్తం ఏడు ‘రెడ్ కెమెరా’లు వాడారు. యాక్షన్ సీక్వెన్సెస్‌కి ఐదు, టాకీకి రెండు. ► చేజింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ విష్ణు డూప్ లేకుండా చేశారు. విష్ణు సినిమాకు ఫైట్ మాస్టర్ విజయన్ పనిచేయడం ఇదే మొదటిసారి. ఫైట్స్ టైవ్‌ులో విష్ణుకి చిన్న గాయాలయ్యాయి. వాటి తాలూకు మచ్చలు ఈ సినిమాకి సంబంధించిన తీపి గుర్తులంటారు విష్ణు. ►‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడు మారుతి డెరైక్టర్ కాక ముందు ‘బిబా సీడ్స్’ కంపెనీకి ప్రోమో చేసిచ్చారు. అప్పుడే మొక్కల పెంపకం నేపథ్యం కథ ఆలోచనొచ్చింది. అదే ఈ సినిమాకి వాడారు. ►మారుతికి కూడా ఏదైనా ఒక పనిలో పడితే మిగతా విషయాలు మర్చిపోతూంటాడు. ఆ మతిమరుపు డోస్ పెంచి హీరో క్యారెక్టైరె జేషన్ డిజైన్ చేస్తూ స్టోరీ లైన్ అల్లుకున్నారు. ఫస్ట్‌హాఫ్ రెడీ కాగానే నానీకి వినిపిస్తే ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ►‘మరోచరిత్ర’లోని భలే భలే మగాడివోయ్ పాట మారుతికిష్టం. నాలుగేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పటికి కథ లేదు. ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అని పెట్టారు. ►ఈ సినిమాలో నాని ఉపయోగించే మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ ‘భలే భలే మగాడి వోయ్’ పాట. దాన్ని ఇలా రింగ్‌టోన్ పెట్టాలని అనుకోలేదు. ఎడిటింగ్ టైమ్‌లో తీసుకున్న డెసిషన్ ఇది. ►‘హల్లో హల్లో’ అనే పాట మినహా ఈ సినిమా మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరించారు. ‘హల్లో హలో’్ల పాట మాత్రం గోవాలో తీశారు. వర్కింగ్ డేస్ 50 రోజులు ►హీరోయిన్ ఫాదర్ పాత్రకు ‘మిర్చి’ సంపత్ లేదా మురళీ శర్మ అనుకున్నారు. ఫ్రెష్ ఫీల్ ఉంటుందని శర్మను ఎంపికచేశారు. మహేశ్‌బాబు ‘అతిథి’లో విలన్‌గా పరిచయమయ్యారు. ►ఓ రోజు టీవీలో ‘నాయిగళ్ జాగిరతై’ తమిళ సినిమా చూస్తున్నారు మారుతి. ఆ విజువల్స్ బాగా నచ్చాయి. కెమేరామ్యాన్ నిజార్ షఫీకదే తొలి సినిమా. ఆయన్ని ఈ సినిమాకు పెట్టారు. -
సెప్టెంబర్ 4న రాబోతున్న డైనమైట్
-
విష్ణు బ్రేవ్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది!
- దేవా కట్టా యూఎస్‌లో పదిహేనేళ్లు ఇంజినీరింగ్ లైఫ్.. యూఎస్ సిటిజన్‌షిప్. నో టెన్షన్. హ్యాపీ లైఫ్. కానీ, సినిమాల మీద ఉన్న ప్యాషన్‌తో దేవా కట్టా హైదరాబాద్ వచ్చేశారు. సక్సెస్, ఫ్లాప్... ఏదైనా సరే ఇక్కడే ఉంటానంటున్నారు. మంచు విష్ణు హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘డైనమైట్’ ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా దేవా కట్టాతో జరిపిన ఇంటర్వ్యూ... ♦ ‘డైనమైట్’ ఏ తరహా చిత్రం? హాలీవుడ్ చిత్రాలు ‘ఎనిమీ ఆఫ్ ది స్టేట్’, ‘మిషనల్ ఇంపాజిబుల్’ వంటి వాటిల్లో కథలో అసలు ప్లాట్ మొదలయ్యాక పరుగు మొదలువుతుంది. ‘డైనమైట్’ అలాంటి పరుగుతో సాగే ప్లాట్‌తో ఉంటుంది. హై టెంపోతో సాగే మంచి థ్రిల్లర్ మూవీ. ♦ తమిళ చిత్రం ‘అరిమా నంబికి’ ఇది రీమేక్ కదా. మరి, రీమేక్ సినిమా చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్‌గా వేరే రైటర్ రాసిన కథతో సినిమా తీసినప్పుడు ఎలా ఉంటుందో... రీమేక్ చేసినప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. తమిళ చిత్రంలోని కథావస్తువును మాత్రమే తీసుకుని చాలా మార్పులు చేసి, ఈ సినిమా చేశాం. వాస్తవానికి నేను రీమేక్ సినిమా చేద్దామనుకోలేదు. కానీ, విష్ణు ‘అరిమా నంబి’ చూడమంటే, కొంచెం అనిష్టంగానే చూశాను. నేనెలాంటి ఫార్మట్‌తో అయితే సినిమా చేద్దామనుకుని కథ రెడీ చేస్తున్నానో, అచ్చంగా అదే ఫార్మట్లానే ఆ సినిమా ఉంది. రైటర్ ఒక కథ ఇచ్చినప్పుడు, దాన్ని మనకు కావల్సినట్టుగా ఎలా మార్చుకుంటామో అలా మార్చి, తీశాం. ♦ ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశం? హీరో క్యారెక్టర్ నాకు పర్సనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఈ సినిమా చేయాలనుకున్నాను. సినిమాలోని పాయింట్ చాలా కొత్తగా ఉంది. మన కరెంట్ లైఫ్‌స్టయిల్‌ని ప్రతిబింబించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ♦ విష్ణు క్యారెక్టర్ గురించి...? కాలేజీ పూర్తి చేశాక, ఓ రెండు, మూడేళ్లు జాబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే కుర్రాడి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి సమస్యను తన సమస్యగా భావించి, ముందుకు వెళ్లే పాత్ర ఇది. విష్ణు ‘బ్రేవ్ యాటిట్యూడ్’ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. ఈ క్యారెక్టర్ ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుంది. ♦ ఈ సినిమా కోసం విష్ణు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. టాటూలు వేయించుకున్నారు. ఆయన కెరీర్‌కి ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఇది మంచి యాక్షన్ మూవీ. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. క్యారెక్టరైజేషన్ చాలా స్టయిలిష్‌గా ఉంటుంది కాబట్టి, టాటూ వేయించాం. గడ్డం మెయిన్టైన్ చేయించాం. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో విష్ణు చేసిన పాత్రలతో పోలిస్తే ఎక్కువ నటనకు అవకాశం ఉన్న పాత్రను ఇందులో చేశారు. ఫిజికల్‌గా తనను చాలా శ్రమపెట్టిన సినిమా ఇది. సో... కచ్చితంగా విష్ణుకి ఎప్రీసియేషన్ లభిస్తుంది. యాక్చువల్‌గా ‘ఆటోనగర్ సూర్య’ 1990లకు సంబంధించిన సినిమా. దాన్ని ప్రాపర్‌గా తీయకపోవడంతో పాత లుక్‌లో వచ్చింది. ‘ప్రస్థానం’ సినిమా అంత స్టయిలిష్‌గా ఆ సినిమా ఉండదు. కంటెంట్ బాగునప్పటికీ, ఓ పాత సినిమా చేశాం అనే ఫీలింగ్‌లో ఉన్నాను. అందుకే, ‘డైనమైట్’ స్టయిలిష్‌గా ఉండాలనుకున్నాను. ♦ తమిళంలో విక్రమ్‌ప్రభు, తెలుగులో విష్ణు- ఇద్దరిలో ఎవరు బాగా చేశారు? తమిళ కథకు తగ్గట్టు విక్రమ్ ప్రభు నటించారు. ఆ కథలో మార్పులు చూసి, టెంపో పెంచాం. ఈ కథకు విష్ణు పూర్తి న్యాయం చేశాడు. ఆ సినిమాకు అతను కరెక్ట్. ఈ సినిమాకి విష్ణు కరెక్ట్. ♦ జేడీ చక్రవర్తి గురించి చెబుతారా? తమిళ వెర్షన్లో విలన్‌గా జేడీయే చేశాడు. తెలుగులో కూడా తనే చేస్తే బాగుంటుందనుకున్నాను. విష్ణు కూడా జేడీనే సజెస్ట్ చేశాడు. సెకండాఫ్‌లో హీరో, విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ♦ ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీయా? యాక్షన్ ఉంటుంది. ఈ చిత్రం నిడివి రెండు గంటల ఎనిమిది నిమిషాలు ఉంటుంది. అందులో యాక్షన్ నిడివి పదిహేను నుంచి పద్ధెనిమిది నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే, రెండు గంటలూ యాక్షన్ చూపిస్తే, బోర్ కొట్టేస్తుంది. ఈ చిత్రంలో క్యూట్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. జీవితంలో మనకు కనిపించే అన్ని కోణాలూ ఈ చిత్రంలో కనిపిస్తాయి. ♦ ‘ఆటోనగర్ సూర్య’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ మంచి సినిమాలే. కానీ, అనుకున్న స్థాయికి చేరుకోకపోవడంపై ఏమైనా బాధ ఉందా? నాకసలు ఎలాంటి పశ్చాత్తాపాలూ లేవు. ఎందుకంటే, ఏ సినిమా అయినా నేను మనసు పెట్టే చేశాను. ‘ఆటోనగర్ సూర్య’ తర్వాత యూఎస్ వెళ్లి, కథలు రాసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పటికి మూడు, నాలుగు కథలు రెడీ అయ్యాయి. నేను సినిమాలను వదులుకునే ప్రసక్తే లేదు. అది అసత్య ప్రచారం ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వారు ‘ఆటోనగర్ సూర్య’కు 25 కోట్లు బడ్జెట్ అయ్యిందని అసత్య ప్రచారం చేశారు. తొమ్మిదిన్నర కోట్లలోనే ఆ సినిమా పూర్తి చేశాను. ఒక దర్శకుడికి హిట్ ఎంత ముఖ్యమో, బడ్జెట్‌పరంగా ఎఫిషియంట్ అనిపించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ సినిమా విడుదల సమయంలో నా కళ్ల ముందే ఎక్కువ బడ్జెట్ చెప్పినా, బిజినెస్ స్ట్రాటజీలో భాగమని ఊరుకున్నాను. కానీ, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఎక్కువ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇలా లేనిపోనివి ప్రచారం చేయడం వల్ల డెరైక్టర్ ఎఫర్ట్‌ని లూఠీ చేసినట్లు అవుతుంది. ‘వెన్నెల’ను 60 రోజులు, ‘ప్రస్థానం’ను 68 రోజుల్లో, ఇప్పుడు ‘డైనమైట్’ని 56 రోజుల్లో తీశాను. నా ఏ సినిమాకీ ఎక్కువ రోజులు తీసుకున్నది లేదు. ఆ విధంగా దర్శకుడిగా నా ఎఫిషియన్సీని నిరూపించుకున్నాను. నావైపు ఉన్న నిజాన్ని బయటపెట్టాలనుకుని ఇప్పుడీ అసత్య ప్రచారం గురించి స్పందించాను. -
మేకింగ్ ఆఫ్ మూవీ -డైనమైట్
-
బరిలోకి దిగితే...
డైనమైట్ లాంటి కుర్రాడు బరిలోకి దిగితే ఇక అతనికి ఎదురేముంది...? ఆ కుర్రాడు ఎవరితో, దేని కోసం యుద్ధం చేశాడు...? అనేది తెలియా లంటే ‘డైనమైట్’ చూడాల్సిందే. మంచు విష్ణు హీరోగా నటిస్తూ, 24 ఫ్రేమ్స్ పతాక ంపై దేవా కట్టా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత కథానాయిక. జేడీ చక్రవర్తి ప్రతినాయకునిగా నటించారు. ఇటీవల విష్ణు, ప్రణీత, 100 మంది డ్యాన్సర్లు పాల్గొనగా ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో ఓ పాట చిత్రీకరించారు. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో విష్ణు, జేడీ, రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా చిత్రీకరించిన ఫైట్ హైలైటని దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. -
ఈ కుర్రాడు భలే చాకు గురూ!
అతను చాకు లాంటి కుర్రాడు.. ఇంకా చెప్పాలంటే డైనమైట్ అంత పవర్ఫుల్ అన్నమాట. ఈ శక్తిమంతమైన పాత్రను పోషిస్తూ, దేవ కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘డైనమైట్’. ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరిగింది. విష్ణు, జేడీ చక్రవర్తి, రెండువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా సన్నివేశాలు తీశారు. దీంతో టాకీపార్ట్ పూర్తయ్యింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం వాయిస్ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ప్రచార చిత్రాన్నీ, వేసవికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. -
డిఫరెంట్ డైనమైట్
చెవి పోగు,90 చేతి పొడవునా టాటూ, కొత్త హెయిర్ స్టయిల్.. ఇలా తాజా చిత్రంలో మంచు విష్ణు సరికొత్తగా కనిపించనున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయన హీరోగా నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘డైనమైట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నానని విష్ణు చెబుతూ - ‘‘నా పాత్ర లుక్, కథానుగుణంగా ‘డైనమైట్’ అయితే బాగుంటుందని దాన్నే ఖరారు చేశాం. ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ ఉన్నాయి. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉంది. అన్ని వర్గాలవారినీ అలరించే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దేవా కట్టా తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. -
అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను :దేవా కట్టా
‘‘అఖిల్‌కి ఓ మంచి ప్రేమకథ చెప్పాను. తనకు నచ్చింది. వేరే దర్శకుల దగ్గర కూడా అఖిల్ రెండు కథలు విన్నారు. ఏ సినిమా ముందు ఉంటుందో చెప్పలేను’’ అని దేవా కట్టా చెప్పారు. నాగచైతన్య, సమంత జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఆటోనగర్ సూర్య’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు టాక్ తర్వాత ఈ చిత్రంలోని పన్నెండు నిమిషాల సన్నివేశాలను కత్తిరించి, నిడివి తగ్గించారు. నిడివి తగ్గిన తర్వాత మంచి ఆదరణ లభిస్తోందని దేవా కట్టా చెప్పారు. ఈ చిత్రంలోని సంభాషణలకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రజలను ప్రభావితం చేసే కథలతో సినిమాలు తీయాలనుకుంటానని, సహజత్వానికి దూరంగా సినిమాలు చేయనని దేవా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆకాంక్షను సమంత వెలిబుచ్చిన నేపథ్యంలో, ఆమెతో ‘ఏ మాయ చేశావె’వంటి ప్రేమకథా చిత్రం చేయాలనుకుంటున్నా అని తెలిపారు -
దేవకట్టాపై రాజమౌళి ప్రశంసలు
యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ వ్యక్తిని అద్భుతంగా చిత్రీకరించిన దేవకట్టా ధైర్యానికి అభినందనలు అంటూ హిట్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఆటోనగర్ సూర్య చిత్రంలో ఆయన డైలాగుల్లో పంచ్ అదిరిపోయిందని, ముఖ్యంగా సమంతతో 'పిల్లలు మాత్రం వాడి పోలికతోనే పుడతారు' అని చెప్పించిన డైలాగు తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ఆ తరహా ట్రిమ్మింగ్ చాలా అవసరమని, గతంలో కొంతమంది దర్శకులు కూడా అలాగే చేసేవారని గుర్తు చేశారు. అయితే.. అల్లుడుశ్రీను చిత్రం ఆడియో విడుదల సందర్భంగా తాను ఠాగూర్ సినిమాకు బదులు స్టాలిన్ అని చెప్పానంటూ అందుకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కూడా చెప్పారు. దటీజ్ రాజమౌళి!! Appreciate @devakatta for his guts for glorifying an Individual who fights against the union. His dialogues pack a punch.Samantha's "pillalu — rajamouli ss (@ssrajamouli) June 29, 2014 Mathram vaadi polikatho pudathaaru" is my personal favourite. The trimming was essential and good the makers did it early on.. — rajamouli ss (@ssrajamouli) June 29, 2014 -
'ఆటోనగర్ సూర్య'ను పవన్ కాదన్నాడు!
-
సినిమా రివ్యూ: ఆటోనగర్ సూర్య
నటీనటులు: అక్కినేని నాగచైతన్య, సమంత, సాయికుమార్, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ల భరణి, జీవా, బ్రహ్మానందం, వేణుమాధవ్, అజయ్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్ సంగీతం: అనూప్ రూబెన్స్ కెమెరా: శ్రీకాంత్ నారోజ్ నిర్మాత: కె. అచ్చిరెడ్డి మాటలు, దర్శకత్వం: దేవా కట్టా పాజిటివ్ పాయింట్స్: నాగ చైతన్య ఫెర్ఫార్మెన్స్ మాటలు నెగిటివ్ పాయింట్స్: కథ, కథనం వయెలెన్స్ మ్యూజిక్ 'మనం' చిత్రం తర్వాత నాగచైతన్య, సమంతల క్రేజి కాంబినేషన్ లో వచ్చిన 'ఆటోనగర్ సూర్య' విడుదలకు అనేక అడ్డంకులు ఎదుర్కోంది. గత కొద్ది రోజులుగా వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ చిత్రం జూన్ 27 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెన్నెల, ప్రస్ధానం చిత్రాలతో ఆకట్టుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తాజాగా 'ఆటోనగర్ సూర్య' చిత్రం తెలుగు ప్రేక్షకులను సంతృప్తి పరిచిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం. చిన్నతనంలోనే ఓ రైలు ప్రయాణంలో తల్లి, తండ్రులను కోల్పోయిన సూర్య.. విజయవాడలో తన మేనమామ (సాయి కుమార్) వద్దకు చేరుకుంటారు. అయితే తన మేనమామ కూడా ఆదరించకపోవడంతో ఓ అనాధగా మారిన సూర్యను ఆటోనగర్ లో ఓ మెకానిక్ పెంచి పెద్ద చేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా.. తన తల్లితండ్రుల మరణానికి కారణం మేయర్ అని తెలుసుకుంటాడు. ఆటోనగర్ లోని అన్యాయాలను, అక్రమాలను ఎదురించే క్రమంలో 16 ఏళ్లకే సూర్య జైలు కెళుతాడు. జైలు నుంచి విడుదలైన సూర్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఆటోనగర్ అన్యాయాలను, అక్రమాలను ఏవిధంగా ఎదుర్కొన్నాడు. ఆటో నగర్ లో ఎలాంటి మాఫియా కార్యక్రమాలు జరుగుతున్నాయి? తన మేనమామ ఆదరణకు సూర్య నోచుకోకపోవడానికి కారణమేంటి? తన తల్లి తండ్రుల మరణానికి మేయర్ ఎలా కారణమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఆటో నగర్ సూర్య'. నటీనటుల ఫెర్ఫార్మెన్స్: నాగచైతన్య యాంగ్రీ యంగ్ మ్యాన్ గా సూర్య పాత్రలో నాగచైతన్య కనిపించాడు. పలు సన్నివేశాల్లో పాత్ర పరిధి మేరకు ఎమోషన్స్ పలికించడంలో సఫలమయ్యాడు. మనం చిత్రంలో క్లాస్ ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న నాగచైతన్య.. సూర్య పాత్ర ద్వారా మాస్ హీరోగా మెప్పించగల స్టార్ గా ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకున్నాడు. కథ, కథనంలో ఉన్న లోపాలను మరుగున పరిచే విధంగా నాగచైతన్య తన వంతు న్యాయం చేశాడు. మాస్ ఆడియెన్స్ గుర్తుంచుకునే విధంగా నాగ చైతన్య కనిపించాడు. సమంత సూర్య మరదలిగా సిరి పాత్రలో సమంత కనిపించింది. కథలో పలు క్యారెక్టర్ల డామినేషన్ కారణంగా సిరి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయింది. అయితే తనకు లభించిన కొన్ని సన్నివేశాల్లో సమంత మెప్పించింది. తండ్రి (సాయి కుమార్)నుద్దేశించే 'నాన్నా నీ ముఖం చూస్తే అసహ్యం వేస్తుంది' అనే ఓ సీన్ తోపాటు మరికొన్ని సీన్లలో ఒకే అనిపించడంతోపాటు.. 'సురా..సురా' అనే పాటలో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సమంతకు తండ్రిగా, నాగచైతన్యకు మేనమామగా, యూనియన్ లీడర్ గా పలు షేడ్స్ ఉన్న కార్యెక్టర్ ను సాయి కుమార్ పోషించాడు. ఇలాంటి పాత్రలు సాయి కుమార్ కెరీర్ లో కొత్తేమి కాదు.. తనకు లభించిన పాత్రను అవలీలగా పోషించడంలో సాయి కుమార్ సఫలమయ్యాడు. విలన్ పాత్రల్లో 'చక్రవాకం' మధు, జయప్రకాశ్, అజయ్ లకు రొటిన్ పాత్రలే. బ్రహ్మనందం, వేణుమాధవ్, మాస్టర్ భరత్ ల కామెడీ అంతగా మెప్పించలేకపోయింది. సంగీతం: అనూప్ రూబెన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంతగానే ఉంది. 'సురా సురా' పాట తప్ప గుర్తుండిపోతుంది. మిగితా పాటలు అంతాగా ఆకట్టుకునేలా లేవు. దర్శకత్వం: వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో విమర్శకుల మెప్పు పొందిన దేవా కట్టా బెజవాడ ఆటోనగర్ నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే కథలో పట్టు లేకపోవడం, కథనం కూడా సరైన పంథాలో సాగకపోవడం కొంత నిరాశ కలిగించే విషయం. కథ, కథనంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. అయితే ఈచిత్రంలో మాటల్ని తూటాల్ల పేల్చడంలో దేవా కట్టా సఫలమయ్యారని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లు మితీ మిరడం కారణంగా కథ అదుపు తప్పిందనే భావన కలుగుతుంది. సెకాండాఫ్ లో కథపై క్లారిటీ లేకపోవడం కారణంగా చాలా గందరగోళం నెలకొంది. భారీ అంచనాతో ఈచిత్రానికి వెళ్లే ప్రేక్షకుడికి హింసే ప్రధాన అంశంగా ఎదురుపడటంతో నిరాశే మిగిలుతుందని చెప్పవచ్చు. ట్యాగ్: విడుదల కాకపోతే ఓ మంచి జ్ఞాపకం! Follow @sakshinews -
ఆటోనగర్ సూర్య మూవీ స్టిల్స్, పోస్టర్స్
-
'ఆటో నగర్ సూర్య' మొత్తానికిలా వచ్చేస్తున్నాడు!
-
న్యూ టాలెంట్‌ని ప్రోత్సాహిస్తున్న నాగ్
-
‘ఆటోనగర్ సూర్య’ఆడియో వేడుక
-
మాటకు మాట... దెబ్బకు దెబ్బ...
‘‘‘నా పేరు సూర్య.. ఆటోనగర్ సూర్య. నా ప్రపంచంలో మాటకు మాట... దెబ్బకు దెబ్బే సమాధానం. ఇంకా నా క్యాస్ట్ ఏంటో మీకు అర్థం కాలేదు కదూ.. నాది మోటర్ క్యాస్ట్. మనిషి బరువుని, బాధను మోసుకెళ్లే క్యాస్ట్’’... డైలాగ్ పవర్‌ఫుల్‌గా బావుంది కదూ. దేవా కట్టా మంచి దర్శకుడే కాదు, మంచి డైలాగ్ రైటర్ కూడా అని మరోమారు రుజువు చేసేలా ఉందీ డైలాగ్. ఇలాంటి శక్తిమంతమైన డైలాగులు ‘ఆటోనగర్ సూర్య’లో చాలా ఉన్నాయట. నటునిగా నాగచైతన్యలోని కొత్తకోణం ఈ సినిమా అని చిత్రం యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ‘తడాఖా’తో మాస్‌కి చేరువైన చైతూ... ఈ సినిమాతో మాస్ ప్రేక్షకుల అభిమాన హీరోగా అవతరించడం ఖాయమని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జనవరి 31న ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ఇది. ‘ఏమాయచేశావె’ తర్వాత మళ్లీ చైతూ, సమంత కలిసి నటించారు. వారి కెమిస్ట్రీ యువతరాన్ని ఆకట్టుకుంటుంది. అనూప్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్. మా సంస్థల నుంచి వచ్చిన గత చిత్రాలకు మించి ఈ సినిమా ఉంటుంది. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, కళ: రవీందర్. -
అత్యంత శక్తిమంతంగా ఆటోనగర్ సూర్య
దేవా కట్టా తెరకెక్కించిన ‘ప్రస్థానం’ దేశంలో జరిగిన కొన్ని నిజజీవిత కథలకు అద్దం పట్టింది. తొలి సినిమా ‘వెన్నెల’కు పూర్తి భిన్నంగా ‘ప్రస్థానం’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు దేవా కట్టా. ఆయన దర్శకత్వంలో ముచ్చటగా రాబోతున్న మూడో సినిమా ‘ఆటోనగర్ సూర్య’. వాస్తవికతకు అద్దం పట్టే ఈ టైటిల్‌ని బట్టి... ఆయన ఎంచుకున్న కథాంశం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ద్వారా అక్కినేని నటవారసుడు నాగచైతన్యను శక్తిమంతమైన పాత్రలో చూపించనున్నారు దేవా. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.అచ్చిరెడ్డి నిర్మాత. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘సామాజిక అంశాలను స్పృశిస్తూ, పూర్తి వాణిజ్య విలువలతో దేవా కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య పాత్ర చిత్రణ చాలా భిన్నంగా ఉంటుంది. ఇటీవల చైతూ, బాలీవుడ్ తార కిమాయాలపై రాజు సుందరం నేతృత్వంలో మూడు రాత్రుల పాటు ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించాం. దీంతో షూటింగ్ కంప్లీట్ అయింది. అతి త్వరలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, జీవా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్, నిర్మాణం: మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్. -
దేవా కట్టా డైరెక్షన్లో అక్కినేని అఖిల్?
హైదరాబాద్: అక్కినేని వంశం నుంచి మరో వారసుడి తెరగ్రేటానికి రంగం సిద్ధమవుతోంది. 'కింగ్' నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ వెండి తెరకు పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్ తొలి సినిమాకు దర్శకుడు ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 'అత్తారింటికి దారేటి' సినిమాతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అఖిల్ఉ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని ఇంతకుముందు ఊహాగానాలు వచ్చాయి. అయితే వీటిని అఖిల్ తోసిపుచ్చాడు. తాజాగా దేవా కట్టా పేరు తెరపైకి వచ్చింది. అఖిల్ అరంగ్రేటం సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని ఆయన దక్కించుకున్నారని ఫిలిమ్‌నగర్ వర్గాల సమచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. వచ్చే ఏడాదిలో అఖిల్ సినిమా ఉంటుందని నాగార్జున ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అఖిల్ తొలి సినిమాకు దర్శకుడెవరో కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశముంది. మరోవైపు నాగ చైతన్య హీరోగా దేవా కట్టా తెరకెక్కించిన 'ఆటోనగర్ సూర్య' సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
నాకిది థ్రిల్లింగ్ మూమెంట్
సినిమాలు చేసే విషయంలో నాగచైతన్య యమ స్పీడు మీదున్నారు. చకచకా సినిమాలు చేస్తూ... అటు స్టార్‌గా, ఇటు యాక్టర్‌గా తన తడాఖా చూపించే పనిలో ఉన్నారు. దేవా కట్టా దర్శకత్వంలో చైతూ నటిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. ఇక తన ఫ్యామిలీ స్టార్లందరూ కలిసి నటిస్తున్న ‘మనం’ సినిమా కొత్త షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో మొదలు కానుంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం, డి.రామానాయుడు నిర్మించనున్న ‘సింగ్ వర్సెస్ కౌర్’ తెలుగు రీమేక్... మొదలు కావాల్సి ఉన్నాయి. ఇలా... క్షణం తీరిక లేకుండా దూసుకుపోతున్నాడు ఈ అక్కినేని అందగాడు. నేడు నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను చేస్తున్న సినిమాలు, పాత్రల గురించి మాట్లాడుతూ -‘‘నా కెరీర్లో నేనెంతో ఇష్టపడి, కష్టపడి చేస్తున్న సినిమా ‘ఆటోనగర్ సూర్య’. నా పాత్రను దేవాకట్టా తీర్చిదిద్దిన తీరు వండర్. నా కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కె.అచ్చిరెడ్డి. ఒక ఐటమ్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 27 నుంచి నాలుగు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరిస్తారు. అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. త్వరలోనే పాటలను కూడా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘మనం’ సినిమా గురించి చెబుతూ -‘‘తాతయ్యతో, నాన్నతో తెరను పంచుకోవడం అద్భుతమైన అనుభవం. హీరోగా నాకు చాలా థ్రిలింగ్ మూమెంట్ ఇది. విక్రమ్ కుమార్ చాలా గొప్పగా సినిమాను తీస్తున్నారు. ఏ మాయ చేశావె, ఆటోనగర్ సూర్య చిత్రాల తర్వాత సమంత నాకు పెయిర్‌గా నటిస్తోంది. డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో తాజా షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తున్నాం. పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది’’ అని తెలిపారు.