అత్యంత శక్తిమంతంగా ఆటోనగర్ సూర్య
అత్యంత శక్తిమంతంగా ఆటోనగర్ సూర్య
Published Mon, Dec 2 2013 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
దేవా కట్టా తెరకెక్కించిన ‘ప్రస్థానం’ దేశంలో జరిగిన కొన్ని నిజజీవిత కథలకు అద్దం పట్టింది. తొలి సినిమా ‘వెన్నెల’కు పూర్తి భిన్నంగా ‘ప్రస్థానం’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు దేవా కట్టా. ఆయన దర్శకత్వంలో ముచ్చటగా రాబోతున్న మూడో సినిమా ‘ఆటోనగర్ సూర్య’. వాస్తవికతకు అద్దం పట్టే ఈ టైటిల్ని బట్టి... ఆయన ఎంచుకున్న కథాంశం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ద్వారా అక్కినేని నటవారసుడు నాగచైతన్యను శక్తిమంతమైన పాత్రలో చూపించనున్నారు దేవా. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.అచ్చిరెడ్డి నిర్మాత.
ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘సామాజిక అంశాలను స్పృశిస్తూ, పూర్తి వాణిజ్య విలువలతో దేవా కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య పాత్ర చిత్రణ చాలా భిన్నంగా ఉంటుంది. ఇటీవల చైతూ, బాలీవుడ్ తార కిమాయాలపై రాజు సుందరం నేతృత్వంలో మూడు రాత్రుల పాటు ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించాం. దీంతో షూటింగ్ కంప్లీట్ అయింది. అతి త్వరలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, జీవా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్, నిర్మాణం: మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్.
Advertisement
Advertisement