
దేవకట్టాపై రాజమౌళి ప్రశంసలు
యూనియన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ వ్యక్తిని అద్భుతంగా చిత్రీకరించిన దేవకట్టా ధైర్యానికి అభినందనలు అంటూ హిట్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఆటోనగర్ సూర్య చిత్రంలో ఆయన డైలాగుల్లో పంచ్ అదిరిపోయిందని, ముఖ్యంగా సమంతతో 'పిల్లలు మాత్రం వాడి పోలికతోనే పుడతారు' అని చెప్పించిన డైలాగు తనకు ఎంతగానో నచ్చిందన్నారు.
ఆ తరహా ట్రిమ్మింగ్ చాలా అవసరమని, గతంలో కొంతమంది దర్శకులు కూడా అలాగే చేసేవారని గుర్తు చేశారు. అయితే.. అల్లుడుశ్రీను చిత్రం ఆడియో విడుదల సందర్భంగా తాను ఠాగూర్ సినిమాకు బదులు స్టాలిన్ అని చెప్పానంటూ అందుకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కూడా చెప్పారు. దటీజ్ రాజమౌళి!!
Appreciate @devakatta for his guts for glorifying an Individual who fights against the union. His dialogues pack a punch.Samantha's "pillalu
— rajamouli ss (@ssrajamouli) June 29, 2014
Mathram vaadi polikatho pudathaaru" is my personal favourite. The trimming was essential and good the makers did it early on..
— rajamouli ss (@ssrajamouli) June 29, 2014