అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను :దేవా కట్టా | Deva Katta narrates a love story to Akhil Akkineni | Sakshi
Sakshi News home page

అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను :దేవా కట్టా

Published Fri, Jul 4 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను  :దేవా కట్టా

అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను :దేవా కట్టా

 ‘‘అఖిల్‌కి ఓ మంచి ప్రేమకథ చెప్పాను. తనకు నచ్చింది. వేరే దర్శకుల దగ్గర కూడా అఖిల్ రెండు కథలు విన్నారు. ఏ సినిమా ముందు ఉంటుందో చెప్పలేను’’ అని దేవా కట్టా చెప్పారు. నాగచైతన్య, సమంత జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఆటోనగర్ సూర్య’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు టాక్ తర్వాత ఈ చిత్రంలోని పన్నెండు నిమిషాల సన్నివేశాలను కత్తిరించి, నిడివి తగ్గించారు. నిడివి తగ్గిన తర్వాత మంచి ఆదరణ లభిస్తోందని దేవా కట్టా చెప్పారు. ఈ చిత్రంలోని సంభాషణలకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రజలను ప్రభావితం చేసే కథలతో సినిమాలు తీయాలనుకుంటానని, సహజత్వానికి దూరంగా సినిమాలు చేయనని దేవా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆకాంక్షను సమంత వెలిబుచ్చిన నేపథ్యంలో, ఆమెతో ‘ఏ మాయ చేశావె’వంటి ప్రేమకథా చిత్రం చేయాలనుకుంటున్నా అని తెలిపారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement