బాహుబలి నిర్మాతల భారీ ప్రాజెక్ట్‌ | Baahubali Producers Web Series With Deva Katta | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 30 2018 10:25 AM | Last Updated on Sat, Jun 30 2018 3:18 PM

Baahubali Producers Web Series With Deva Katta - Sakshi

బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్కా మీడియా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది.  బాహుబలి తరువాత రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఓ సినిమాను ప్లాన్‌ చేశారు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అదే సమయంలో బుల్లితెర మీద బాహుబలి స్థాయిలో ఓ భారీ టీవీ సీరియల్‌ను నిర్మిస్తున్నారు.

తాజాగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్‌ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్‌ సీరీస్‌ రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సీరీస్‌ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారట. ఇప్పటికే ప్రస్థానం ఫేం దేవ కట్టా ఫైనల్‌ కాగా ఓ హిందీ డైరెక్టర్‌, తెలుగు డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ భారీ వెబ్‌ సీరీస్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement