Sivagami
-
శివగామి పాత్రలో బాలీవుడ్ మోడల్
బాహుబలి దేశ విదేశాల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ థాకూర్ కనిపించనున్నారట. సిల్వర్ స్క్రీన్‌పై రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించిన పాత్రలో ఉత్తరాది అందాల నటి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. శివగామి పాత్రలో మృణాల్ కనిపించటం ఖరారయ్యిందన్న ప్రచారం జరుగుతుంది. కుంకుమ్ భాగ్య సీరియల్లో బుల్ బుల్ పాత్రలో ఆకట్టుకున్న మృణాల్.. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ 30లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సీరీస్‌ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు. -
బాహుబలి నిర్మాతల భారీ ప్రాజెక్ట్
బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్కా మీడియా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది. బాహుబలి తరువాత రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అదే సమయంలో బుల్లితెర మీద బాహుబలి స్థాయిలో ఓ భారీ టీవీ సీరియల్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సీరీస్‌ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారట. ఇప్పటికే ప్రస్థానం ఫేం దేవ కట్టా ఫైనల్ కాగా ఓ హిందీ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ భారీ వెబ్ సీరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
త్వరలో సెట్స్ మీదకు బాహుబలి ప్రీక్వెల్
తెలుగు సినిమా మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డలు సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో నిర్మించటమే కాదు అదే స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించి సినిమా ఘనవిజయం సాధించేందుకు తమవంతుగా కష్టపడ్డారు. తాజాగా బాహుబలి 2 చైనాలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ సందర్బంగా తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్న నిర్మాతలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్వరలో బాహుబలికి ప్రీక్వెల్‌ను నిర్మించనున్నట్టుగా తెలిపారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆన్లైన్ సీరీస్‌గా ఈ ప్రీక్వెల్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు రెడీ సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న మాహిష్మతి సెట్‌తో పాటు మరికొన్ని సెట్స్‌ను రూపొందించి శివగామి చిన్నతనం నుంచి జరిగే కథతో ఈ ప్రీక్వెల్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీక్వెల్‌లో అంతా కొత్త నటీనటులు కనిపించనున్నారు. ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది లాంటి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇప్పటికే ఆనంద్ నీలకంఠన్ ద రైజ్ ఆఫ్ శివగామి పేరుతో బాహుబలికి ముందు జరిగే కథను నవలగా విడుదల చేశారు. ఇప్పటికే బాహుబలి థీమ్‌తో వచ్చిన కామిక్ బుక్స్, ఏనిమేషన్ సిరీస్, మర్చెంట్ డైస్‌లకు మంచి ఆదరణ లభించటంతో ఆన్లైన్ సిరీస్ కూడా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. -
అది నా తప్పే.. చింతిస్తున్నాను: రాజమౌళి
ముంబై: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అందరికి తెలిసిన విషయమే. చిత్రంలోని ఒక్కొక్క పాత్రకు ఊపిరిపోసిన నటీనటులపై కూడా ప్రశంసల జల్లు కురిశాయి. అలాంటి పాత్రల్లో ముఖ్యమైనది శివగామి. అయితే ఈ పాత్రకు తొలుత శ్రీదేవిని తీసుకోవాలని రాజమౌళి భావించిన సంగతి తెలిసిందే. ఆమె పలు డిమాండ్లు చేయడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని ఓ సందర్భంలో రాజమౌళి వ్యాఖ్యానించారు. దీనిపై తన తాజా చిత్రం ‘మామ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి స్పందించారు. తానేమీ ప్రత్యేకమైన డిమాండ్లు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ ఇంటర్వూలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. జరిగిన దానికి చింతిస్తున్నట్లు చెప్పారని ఆంగ్ల వెబ్సైట్ ఒకటి పేర్కొంది. అయితే ఇంటర్వూలో ఏ మీడియా సంస్ధ తీసుకుందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆ అంశాన్ని బహిరంగ వేదికపై బయటపెట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అది తప్పేనని.. దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. నటి శ్రీదేవి అంటే తనకు అపారమైన గౌరవముందని చెప్పారు. ‘మామ్’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి మాట్లాడుతూ.. రాజమౌళి అలా అన్నారంటే తాను నమ్మలేకపోతున్నానని.. వాస్తవానికి తాను బాహుబలి చిత్రానికి ఎలాంటి డిమాండ్లు చేయలేదని చెప్పారు. ‘బాహుబలి’ గతమని.. దానిపై ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని.. తాను గతంలోనూ ఎన్నో పాత్రలు వద్దనుకున్నానని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. -
సీరియల్ శివగామిగా సీనియర్ హీరోయిన్
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్, బుల్లితెరపై సత్తా చూపిస్తున్నాడు. భారీ గ్రాఫిక్స్ తో హిందీలో రూపొందుతున్న ఆరంభ్ సీరియల్ కు కథ అందిస్తున్నాడు విజయేంద్ర ప్రసాద్. దాదాపు బాహుబలి తరహా కథా కథనాలతో రూపొందుతున్న ఈ సీరియల్ లో సౌత్ బ్యూటీ కార్తీక దేవసేన గా నటిస్తోంది. తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలో టెలికాస్ట్ కానున్న ఈ సీరియల్ లో శివగామి తరహా పాత్ర కూడా ఉంది. ఈ పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా మూవీ ఫేం మధుబాల నటిస్తోంది. ఈ విషయాన్ని మధుబాల స్వయంగా ప్రకటించింది. చిత్ర దర్శకుడు గోల్డీ బెహన్, ఆయన భార్య సోనాలి తో ఉన్న స్నేహం కారణంగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సీరియల్ లో నటించేందుకు అంగీకరించానంది మధుబాల. -
మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..
చిన్నారి మహేంద్ర బాహుబలిని కాపాడే క్రమంలో మాహిష్మతిని వీడిన శివగామి.. నదిలోనే ప్రాణాలు విడిచినట్లు సినిమాలో చూస్తాం. అయితే, నిజంగానే శివగామి చనిపోతుందా? లేక తిరిగొస్తుందా? ట్విస్టులతో కూడిన రాజమౌళి సినిమాలు చూశాక ప్రేక్షకులకు ఇలాంటి సందేహాలురాక మానవు! సాక్ష్యం కావాలంటే రమ్యకృష్ణ కొత్త సినిమా ‘మాతంగి’ ట్రైలర్‌పై నెటిజన్ల కామెంట్లు చూడొచ్చు! ‘మాహిష్మతి నుంచి వెళ్లిపోయిన శివగామి.. మళ్లీ మాతంగిగా వచ్చింది..’ అని కొందరు, ‘ఆవిడ(రమ్య) ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలర’ని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ప్రేక్షకుల్లో బాహుబలి ఫీవర్ చల్లారకముందే.. రమ్యకృష్ణ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కూతురి సెంటిమెంట్‌తోపాటు క్షుద్రశక్తులతో పోరాటాన్ని ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ‘మాతంగి’లో రమ్య లీడ్‌రోల్ పోశించింది. సీనియర్ నటుడు జయరాం హీరోగా, కన్నం తమరక్కుళం దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో మిర్చి సంపత్, అక్షర కిషోర్, ఏంజిలీనా అబ్రహామ్లతోపాటు దివంగత ఓమ్పురిలు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. తెలుగు డబ్బింగ్‌కు వెన్నలకంటి మాటలు రాశారు. జూన్‌లో విడుదలకానున్న ‘మాతంగి’ ట్రైలర్ శనివారం విడుదలైంది.. -
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
-
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
చెన్నై: రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యం రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది. ఇక రాణికి విశ్వాసపాత్రుడిగా, బానిసగా కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు సమాధానం దొరికింది. అయితే థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది..! సినిమా విరామంలో స్నాక్స్, డ్రింక్స్ తీసుకుని థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులు తెరపై కనిపిస్తున్న దృశ్యం చూసి షాకయ్యారు. శివగామి (రమ్యకృష్ణ) పక్కన కట్టప్ప (సత్యరాజ్) కూర్చుని రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇదేంటి రాజమాతతో బానిస ఇంత చనువుగా ఉండటం ఏంటి? అంటూ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇవ్వగా ఆమె తీసుకుని మురిసిపోతోంది. ప్రేక్షకులు అయోమయంలో ఉండగానే ఇది పోతిస్ యాడ్ అంటూ తెరపై కనిపిస్తుంది. ఇది వ్యాపార ప్రకటన అని తెలిశాక ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దేశ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ టెక్స్టైల్ బ్రాండ్ కోసం రమ్యకృష్ణ, సత్యరాజ్‌లతో యాడ్ రూపొందించారు. ఇందులో వీరిద్దరూ రాజు, రాణిగా కనిపిస్తారు. రమకృష్ణ బాహుబలి సినిమాలో మాదిరిగా అదే వేషధారణతో కనిపించగా, సత్యరాజ్ మాత్రం ఈ సినిమాలో పాత్రకు భిన్నంగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి రాచఠీవిలో కనిపిస్తాడు. మొత్తానికి ఈ యాడ్ చూసిన ప్రేక్షకులు అయోమయానికి గురికావడంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
ఫ్యాన్స్‌కు శివగామి థ్యాంక్స్
శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2 సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. సినిమాలో రాజమాత శివగామి దేవిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ, తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. ' ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్‌లతో పాటు ఫోన్ చేసి, మేసేజ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు నేను ఉన్న ఈ పొజిషన్‌కు మీ ప్రేమ, ఆదరణే కారణం. జై మాహిష్మతి' అంటూ ట్వీట్ చేసింది రమ్యకృష్ణ. ఈ శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2 సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్ లను చెరిపేస్తూ ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓవర్ సీస్ లోనూ సత్తా చాటుతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1000 కోట్ల వసూళ్ల సాధించటం కాయంగా కనిపిస్తోంది. I thank each and everyone who have taken the effort to call me, message me and wish me through my FB page and twitter a BIG THANK YOU.... — Ramya Krishnan (@meramyakrishnan) 29 April 2017 Love you all...without your love, affection and support I wouldn't be where I am today, I am so overwhelmed....Jai Mahishmathi.. — Ramya Krishnan (@meramyakrishnan) 29 April 2017 -
బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..!
-
బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..!
బాహుబలి 2 రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన స్టిల్స్, సీన్స్ హడావిడి మొదలైంది. లీకువీరులు సినిమా రిలీజ్‌కు ముందే బాహుబలి 2కు సంబంధించిన సీన్స్‌ను సోషల్ మీడియాలో పెట్టేశారు. అయితే వీటిలో బాహుబలి ఇంటర్వెల్ సీన్ అంటూ సర్క్యూలేట్ అవుతున్న వీడియో ఒకటి ఆసక్తికరంగా మారింది. శివగామి గెటప్ లో రమ్యకృష్ణ కనిపిస్తున్న ఈ వీడియో ఏడాది కింద టీవీలలో వచ్చిన ఓ యాడ్‌కు సంబంధించిందని తెలిసి ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. బాహుబలి తొలిభాగం ఫీవర్ నడుస్తున్న సమయంలో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పాత ఈ వీడియోనే బాహుబలి 2 ఇంటర్వల్ సీన్ లీక్ అంటూ సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
'బాహుబలి' ప్రారంభానికి ముందు..!
దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన భారీ విజువల్ వండర్ బాహుబలి. ఓ ప్రాంతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించగలదని నిరూపించిన ఈ సినిమా, ప్రస్తుతం సరికొత్త రూపాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బాహుబలి కామిక్ బుక్స్, గేమ్స్ విడుదల కాగా, సాహితీ ప్రియుల కోసం త్వరలో నవల రూపంలో బాహుబలి పాఠకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ తొలి నవల ముఖ చిత్రాన్ని కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. మూడు భాగాలుగా రిలీజ్ అవ్వనున్న ఈ సీరీస్‌లో తొలి భాగాన్ని 'ద రైజ్ ఆఫ్ శివగామి' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి కథ ప్రారంభానికి ముందు జరిగిన పరిణామాలను, శివగామి రాజ్యపాలనను ఈ నవల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఆనంద్ నీలకంఠన్ రాసిన ఈ నవల, వెస్ట్ లాండ్, గ్రాఫిక్స్ ఇండియా సంస్థలు పబ్లిష్ చేస్తున్నాయి. Very happy to announce our novel trilogy, Baahubali - Before The Beginning, authored by @itsanandneel,published by @Westland & @GraphicIndia— Arka Mediaworks (@arkamediaworks) 18 January 2017The cover of the first book from the series, The Rise Of Sivagami, will be revealed on the 20th of January, 2017, at @ZEEJLF. pic.twitter.com/FxNdfD7hET— Arka Mediaworks (@arkamediaworks) 18 January 2017 -
శివగామికి మరో పవర్ఫుల్ రోల్!
రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా మరోసారి సత్తా చాటిన రమ్యకృష్ణకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘థానా సెరంధ కూటం’లో రమ్యకృష్ణకు మరో విశిష్టమైన కీలక పాత్ర దక్కింది. దేవుడు లేడనే నాస్తికత నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ కామెడీ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల మీడియాకు లీక్ అయ్యాయి. దీనిని బట్టి ఈ సినిమా షూటింగ్లో రమ్యకృష్ణ ఇప్పటికే చేరినట్టు తెలుస్తోంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన కీర్తిసురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ, సెంథిల్, నిరోషా లాంటి తారాగణంతో కూడిన ఈ సినిమాలో రమ్యకృష్ణది కీలక పాత్ర అని వినిపిస్తోంది. బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు గతంలో కథనాలు రాగా, వాటిని చిత్రయూనిట్ కొట్టిపారేసింది. వేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, సూర్య ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘సింగం-3’ రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది. -
'శివగామి' మూవీ స్టిల్స్
-
కమల్‌తో శివగామి?
విశ్వనటుడికి శివకామి అర్ధాంగిగా మారనున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి రావడం తాజా వార్తే అవుతుంది. విశ్వనటుడంటే కమలహాసన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు శివగామి అన్నా నటి రమ్యక్రిష్ణ అని గుర్తు చేయనక్కర్లేదు. ఎందుకంటే బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు అంతగా జీవం పోసి ఆ చిత్రానికి వెన్నుముకగా నిలిచిన నటి రమ్యక్రిష్ణ. ఇంతకు ముందు ఇలానే పడయప్పా చిత్రంలో రజనీకాంత్‌కు ప్రతినాయకిగా దీటుగా నటించి నీలాంబరిగా ప్రాచుర్యం పొందారు. నిజానికి రమ్యక్రిష్ణ తమిళం కంటే తెలుగులోనే అధిక చిత్రాలు చేశారు.అయితే పడయప్పా చిత్రంలో నీలాంబరి పాత్ర అంతకంటే అధికంగా ప్రాచుర్యం పొందారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ నటీమణులు ఇప్పటికీ నీలాంబరి లాంటి పాత్ర చేయాలని ఆశ పడుతుండడం ఆ పాత్రలో రమ్యక్రిష్ణ ఎంతగా ఒదిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక పంచతంత్రం చిత్రంలోనూ కమలహాసన్‌తో పోటీపడి నటించారు. ఆ చిత్రంలో నటి సిమ్రాన్ హీరోయిన్ అయినా రమ్యక్రిష్ణ పాత్రకే ప్రాధాన్యత ఉంటుంది.ఆ చిత్రం 2002లో విడుదలైంది.14 ఏళ్ల తరువాత ఈ శివగామి కమల్‌తో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంచలన నటికి విశ్వనటుడి నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. కమలహాసన్ నటించనున్న తాజా చిత్రానికి మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు.ఇందులో కమల్‌కు భార్యగా నటి రమ్యక్రిష్ణను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. మరో విశేషం ఏమిటంటే ఇదే చిత్రంలో కమలహాసన్‌కు కూతురిగా ఆయన కూతురు, క్రేజీ హీరోయిన్ శ్రుతిహసన్ నటించనున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్‌ను అమెరికాలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నటి రమ్యక్రిష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. ఏదేమైనా బాహుబలి చిత్రం తరువాత ఈ ప్రౌడకు మరింత క్రేజ్ పెరిగిందన్నది నిజం. ఇప్పటికే నాగార్జునతో నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నటించి తన సత్తాను మరో సారి చాటుకున్న రమ్యక్రిష్ట త్వరలో తన భర్త క్రిష్ణవంశీ దర్శకత్వంలో రుద్రాక్ష అనే తెలుగు చిత్రంలో నటించడానికి తయారవుతున్నారు. మరో పక్క బాహుబలి-2లోనూ నటిస్తూ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా బిజీగా ఉన్నారు. -
శివగామిపై అతిలోకసుందరి ఆశపడ్డారా?
చిత్రపరిశ్రమలో అతిలోకసుందరి అనగానే కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యేది నటి శ్రీదేవినే. ఒకప్పుడు భారతీయ సినీపరిశ్రమ చేతనే బ్రహ్మాండ నటి అనిపించుకున్న శ్రీదేవి కథానాయికగా మంచి హైప్లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు కామా పెట్టారు. కాగా సుదీర్ఘ విరామం తరువాత ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో నటించి విజయం సాధించారు.మళ్లీ చిన్న గ్యాప్ తరువాత తాజాగా తమిళంలో విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న పులి చిత్రంలో రాణిగా వెండితెరపైకి రానున్నారు. కాగా ఇటీవల విడుదలై అద్భుతాలు సృష్టించిన బాహుబలి చిత్రంలో రమ్యక్రిష్ణ పోషించిన శివగామి పాత్రను శ్రీదేవి చేయాల్సింది. ముందుగా ఆమెనే ఈ పాత్రకు ఎంపిక చెయ్యాలనుకున్నారు.అయితే శ్రీదేవి అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో శివకామి పాత్ర రమ్యక్రిష్ణను వరించింది. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర పండడంతో ఇప్పుడు బాహుబలి-2 లో శ్రీదేవి నటించాలని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయాన ఆ చిత్ర దర్శకుడు రాజమౌళినే వెల్లడించినట్లు చిత్ర వర్గాల సమాచారం. అయితే బాహుబలి-2లో అతిలోకసుందరి నటించే అవకాశం లేదని తెలుస్తోంది.అయితే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందాన ఏమో రాజమౌళి తలచుకుంటే శ్రీదేవిని నటింపజేయనూ వచ్చు అంటోంది ఒక వర్గం. -
విశ్వరూపం చూపిన రమ్యకృష్ణ
'బాహుబలి' సినిమా మొదటి సీన్ లో రమ్యకృష్ణ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వాటర్ ఫాల్స్ నేపథ్యంలో ఆరడుగుల, ఆరు ప్యాక్ ల హీరో ప్రభాస్ శివుడిగా ఎంట్రీ ఘనంగా కనపడుతుంది. ఎవ్వడంట ఎవ్వడంట పాట. ఆ తర్వాత పాల జలపాతాల నేపథ్యంలో మిల్కీబ్యూటీ తమన్నా.. అవంతికగా దర్శనం ఇస్తుంది. కట్టప్పగా సత్యరాజ్, అస్లాంఖాన్ పాత్రలో సుదీప్ ఎంట్రీలు కూడా స్క్రీన్ నిండుగా ఉంటాయి.. మాహిష్మతి రాజ్య వైభవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. విలన్ పాత్రధారి రానాకు కూడా దర్శకుడు రాజమౌళి బుల్ ఫైట్ తో మంచి ఎంట్రీ ఇచ్చారు. ఇక దేవసేన పాత్రలో అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే. సంకెళ్లు, చింపిరి జుట్టుతో ఆమె మేకప్ గుండెలను పిండేసేలా ఉంటుంది. శివుడు, అవంతికల మధ్య రొమాన్స్ బాగా పండింది. అంతలోనే తన కార్యాన్ని పూర్తి చేస్తానని శివుడు అవంతికకు మాట ఇవ్వడం, అతడి జుట్టు ఎగురుతుండగా ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ లో శివగామిగా రమ్యకృష్ణ తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శిస్తుంది. మమతల తల్లి పాట ఇక్కడే వస్తుంది. మనోహరి పాటలో నోరా ఫతేహి, స్కార్లెట్ విల్సన్ హొయలొలికించారు. కాలకేయ యుద్ధానికి దారితీసే పరిస్థితులు, కుర్చీ కోసం కొట్లాటలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఆ తర్వాత వస్తాయి. కాలకేయ యుద్ధం సినిమా మొత్తానికి హైలైట్. వీఎఫ్ఎక్స్ వాళ్ల పనితనానికి ఇది మచ్చుతునక. అనుకున్న సమయం కంటే ఎందుకు ఎక్కువ పట్టిందనేది ఈ యుద్ధం చూస్తే అర్థమవుతుంది. సుదీర్ఘంగా సాగే ఈ యుద్ధంలో అనేక మలుపులు, ట్విస్టులు ఉంటాయి. యుద్ధం చివర్లో బిజ్జలదేవగా నాజర్, శివగామిగా రమ్యకృష్ణ నటనలో విశ్వరూపం చూపిస్తారు.