'బాహుబలి' ప్రారంభానికి ముందు..! | Baahubali Before The Beginning, novel trilogy | Sakshi
Sakshi News home page

'బాహుబలి' ప్రారంభానికి ముందు..!

Published Wed, Jan 18 2017 12:37 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

'బాహుబలి' ప్రారంభానికి ముందు..! - Sakshi

'బాహుబలి' ప్రారంభానికి ముందు..!

దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన భారీ విజువల్ వండర్ బాహుబలి. ఓ ప్రాంతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించగలదని నిరూపించిన ఈ సినిమా, ప్రస్తుతం సరికొత్త రూపాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బాహుబలి కామిక్ బుక్స్, గేమ్స్ విడుదల కాగా, సాహితీ ప్రియుల కోసం త్వరలో నవల రూపంలో బాహుబలి పాఠకుల ముందుకు రానుంది.

ఈ విషయాన్ని చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ తొలి నవల ముఖ చిత్రాన్ని కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. మూడు భాగాలుగా రిలీజ్ అవ్వనున్న ఈ సీరీస్లో తొలి భాగాన్ని 'ద రైజ్ ఆఫ్ శివగామి' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి కథ ప్రారంభానికి ముందు జరిగిన పరిణామాలను, శివగామి రాజ్యపాలనను ఈ నవల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఆనంద్ నీలకంఠన్ రాసిన ఈ నవల, వెస్ట్ లాండ్, గ్రాఫిక్స్ ఇండియా సంస్థలు పబ్లిష్ చేస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement